Friday, 24 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వాతావరణం అప్డేట్ఆం ధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ఆదేశం అమరావతి, అక్టోబర్ 22 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో పాటు ఎపిఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శ్రీ కె విజయానంద్ మాట్లాడుతూ, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం కారణంగా రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపధ్యంలో అన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని, దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సహయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లలో సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీ విజయానంద్ సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మేరకు సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రజలకు సహయం అందించేందుకు కంట్రోల్ రూమ్లలో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. వాయుగుండం ప్రభావం వల్ల ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్, రవాణా వంటి సదుపాయాలు కల్పించడంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా అవాంతరం ఏర్పడితే తక్షణమే వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని శ్రీ కె. విజయానంద్ ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పటికప్పుడు కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ వాయుగుండం ప్రభావం ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో అధికంగా ఉంటుందని తెలియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఎండీ లోతేటి శివశంకర్ ను సీఎస్ శ్రీ కె.విజయానంద్ ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేలా అవసరమైన సామాగ్రితో పాటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సీఎస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను సీఎస్ కు వివరించారు.

తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం ముశ్రంపల్లి, జెకె అన్నారం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలని, ఈ విషయంలో రైతులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

జోగులాంబ గద్వాల

అంబులెన్స్లను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న 108, 102 అంబులెన్స్ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు. రికార్డులు, వైద్య పరికరాలు పరిశీలించి, ఆక్సిజన్, మెడికల్, ఎక్విప్మెంట్ మెడిసిన్స్, అట్రోఫీన్ ఆక్సిటోసిన్, ఎమర్జెన్సీ డ్రగ్స్ తనిఖీ చేశారు. జిల్లా కోఆర్డినేటర్ డి రత్నమయ్య మాట్లాడుతూ అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంటావని 108 కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి తక్షణమే స్పందించి క్షతగాత్రులను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరవేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నరసింహులు, పైలెట్ ఈదన్న, కెప్టెన్ భార్గవ్ మరియు హైమద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తుఫాన్ కారణంగా తొట్టంబేడు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: భారత వాతావరణ శాఖ (IMD) ఆధారంగా 20.10.2025 నుండి 25.10.2025 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పరిస్థితిని పర్యవేక్షించుటకు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారు తేదీ 20.10.2025 నుండి 25.10.2025 వరకు తొట్టంబేడు మండల తహశీల్దార్ కార్యాలయంలో వర్ష పరిస్థితులను పర్యవేక్షించుటకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి విధులు కేటాయించబడి ఆదేశాలుజారీచేయబడినాయి. పి. భారతీ శ్రీకాళహస్తి విభాగం – తొట్టంబేడు మండలం తేది సమయం ఉద్యోగి పేరు హోదా ఫోన్ నెం. నంబర్ 20.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి. దినేష్, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 9491998202 20.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, మణి వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100 21.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు ఎం. బాలాజీ, దనమ్మ టైపిస్టు, వీఆర్‌ఏ 8985342883 21.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు కె. రవి, అనిల్ వీఆర్ఓ, వీఆర్‌ఏ 9866853859 22.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు బి.నారాయణ,హరి ఎస్‌ఏ, వీఆర్ఓ, వీఆర్‌ఏ 9701383437 22.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు ఎన్. కన్నయ్య, రమణయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 8008898100 23.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు కె. గోపీనాథ్ రెడ్డి, అదిలక్ష్మి వీఆర్ఓ, వీఆర్‌ఏ 9652445876 24.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు చైతన్య, సుందరయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 6303503927 25.10.2025 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 వరకు మనసా, భవాని ఓ.ఎస్‌, వీఆర్‌ఏ 7032989391 25.10.2025 రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు సి. శంకరయ్య, కె. గున్నయ్య వీఆర్ఓ, వీఆర్‌ఏ 9014926162 విధుల్లో లోపం కనపడిన ఏమైనా నిర్లక్ష్యం తగిన చర్యలు తీసుకోబడునని జిల్లా పరిపాలనాధికారి సూచించారు. కంట్రోల్ రూమ్ నంబర్: 2491077046 తహసీల్దార్ కార్యాలయ సంప్రదింపు నెం. 8919025988

తిరుపతి

అక్కుర్తి ఎస్టీ కాలనీలో వర్షపు నీరు తొలగింపు

తుఫాను ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షానికి శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి ఎస్టీ కాలనీ జలమయం అయింది.ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కృష్ణయ్య వెంటనే స్పందించారు.క్రేన్ సాయంతో ఎస్టీ కాలనీలో నిల్వ ఉన్న వర్షపు నీటిని దారి మళ్లించారు.కాలనీలో వర్షను నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేశారు.ఇందుకు స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో వీఆర్వో సుబ్రహ్మణ్యం,పంచాయతీ కార్యదర్శి విజయకృష్ణ, వీఆర్ఏ పుల్లయ్య,ఎం.శివ, హేమంత్,వెంకటేష్, శంకరయ్య,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

మూసివేసిన బార్డర్ చెక్పోస్ట్.

జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు మూసి వేసిన అధికారులు. కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగు పూయించిన ఆర్టిఏ అధికారులు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆర్కే రోజా

మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా కుటుంబ సమేతంగా బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.ముందుగా వారిని ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో APRO రవి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తుని ఘటనపై హోం మంత్రి సీరియస్

తునిలో విద్యార్థినిపై అత్యా చారయత్నం ఘటనపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించామన్నారు. పోలీసులు తక్షణమే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారని వెల్లడించారు. నేరం చేసినవారు ఏ పార్టీవారైనా, ఏ కులమైనా, మతమైనా సహించేది లేదని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

తూర్పు గోదావరి

తుని ఘటనపై హోం మంత్రి సీరియస్

తునిలో విద్యార్థినిపై అత్యా చారయత్నం ఘటనపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించామన్నారు. పోలీసులు తక్షణమే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారని వెల్లడించారు. నేరం చేసినవారు ఏ పార్టీవారైనా, ఏ కులమైనా, మతమైనా సహించేది లేదని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

నాగర్‌కర్నూల్

స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులలో మళ్ళీ ఉత్కంఠ..!

వెల్దండ అక్టోబర్ 22, :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 న రాష్ట్ర కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది రెండు వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈనెల 17 న ప్రభుత్వం నిర్ణయించిన గడువు తెలిసిందే. సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఈనెల 23 న జరగనున్న కేబినెట్ మీటింగ్ కీలకమైనది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 జెడ్పిటిసి, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 1 జడ్పిటిసి స్థానం, 32 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఎంపీటీసీ ,జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు గుసగుసలు కార్యకర్తలలో మొదలయ్యాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.