Friday, 24 April 2026

Blog

E-పేపర్

-: పత్రిక ప్రకటన:- 22/10/25 *భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి*… *సిపిఎం పార్టీ ,రైతు సంఘం డిమాండ్* _____________________

భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంటలు నీటి మునిగిన ముస్తాపురం, పాతాళపల్లి, గోవిందంపల్లి, ఉప్పలపాడు గ్రామాలో ఉండే పొలాలను సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించడం జరిగింది.రైతులు నాయకుల ముందర కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ తడిసిన ధాన్యాని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అన్నారు.అనంతసాగరం మండల లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలో కేవలం అధికార పార్టీ వారు చెప్పిన వారికే కొనుగోలు చేస్తున్నట్లు, తమ ధాన్యం కొనాలని రైతు అడిగితే మీరే మిల్లర్ లతో మాట్లాడుకోవాలని లేకుంటే దళారులకు అమ్ముకోవాలని చెబుతున్నారని, కొనుగోలు కేంద్రాలో లోడు ధాన్యం ఎత్తడానికి కమిషన్లు అడుగుతున్నారని తమ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వారికి సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జక్రయ్య,నాగులూరు వెంకటేష్, రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకి శిక్షణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (ఆర్.జి.ఎస్.ఏ.) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు జత చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికీ, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ లలన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అందించేందుకు తగిన ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.

కాకినాడ

కాకినాడ జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గారు

ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి • జిల్లాలో ప్రసూతి మరణాలపై ఎప్పటికప్పుడు మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహించాలి • పిఠాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి శ్రీదుర్గ ప్రసూతి మరణంపై తక్షణం నివేదిక పంపించండి • కాకినాడ జిల్లా కలెక్టర్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి @pawankalyan వీడియో కాన్ఫరెన్స్ • శ్రీదుర్గ మరణంపై విచారం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన శ్రీమతి దొండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన ఘటనపై సమీక్ష నిర్వహించారు. ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్ గా నిలవాలని.. ఆ దిశగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహణ గురించి ఆరా తీశారు. ప్రసూతి మరణాలు సీరియస్ గా తీసుకోవలసిన అంశమనీ, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యుల బృందంతో సమగ్రంగా విచారణ చేసి కారణాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. శ్రీమతి శ్రీదుర్గ ప్రసూతి మరణంపై, పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ఆసుపత్రులపై వైద్యులు, ఇతర సిబ్బంది తమ విశ్వాసాల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించి – ప్రభుత్వ ఆసుపత్రులను వ్యక్తిగత విశ్వాసాల ప్రచారానికి వేదికలుగా చేయకూడదన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్ల గారు

అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఈనెల 23 నుంచి 25 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు 24 గంటలు పని చేసేలా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల… నెల్లూరు, అక్టోబర్ 22 : తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అన్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు భారీ నుండి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తూ..ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, టామ్ టామ్ లేదా మైకుల ద్వారా (public address system) ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాల (shelters) ను గుర్తించి తరలించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ , విపత్తు నిర్వహణ (అగ్నిమాపక) తదితర శాఖల అధికారులు, వారి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అలాగే అధికారులు అందరూ జిల్లా కేంద్రం / వారు పనిచేసే స్థానంలోనే అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు ఆగిపోయే వరకు సెలవులు మంజూరు చేయమన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24/7 పనిచేసే విధంగా కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి అందులో షిఫ్ట్ సిస్టం లో పని చేసే విధంగా సిబ్బందిని నియమించామన్నారు. ప్రజల నుండి కంట్రోల్ రూమ్ కి కాల్స్ వచ్చిన వెంటనే తగు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైన వాటర్ లాగింగ్ ఉంటే వెంటనే ఆ నీటిని క్లియర్ చేయాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా ఉండాలన్నారు. చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్ద సిబ్బందిని ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు తెలియచేయాలన్నారు. *కంట్రోల్ రూమ్ నెంబర్లు:* **👉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, నెల్లూరు కంట్రోల్ రూమ్ : 0861 2331261, 7995576699** *భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజలకు చేసిన సూచనలు* : 👉భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలి* 👉నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 👉 భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి* 👉భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు* 👉వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద ఉండరాదు* 👉నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 👉భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం. 👉 పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 👉అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయండి *వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..* 👉*తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు* 👉 *తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.* 👉 *విద్యుత్ లైన్ కు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు.* 👉*విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.* 👉*పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.* 👉*ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..* 👉 *బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.* 👉 *కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.* 👉 *చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.* 👉 *ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు..* 👉 *గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.* *👉ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.* 👉 *ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను.* *👉వర్షం పడుతున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.* 👉 *కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.* *👉ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి JLM, ALM, LM లేదా AE దృష్టికి తీసుకెల్లాలి.*

అమరావతి

తొలి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు భేటీలు

దుబాయ్ ( పున్నమి ప్రతినిధి) తొలి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు భేటీలు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్ తో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు. దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరిన సీఎం చంద్రబాబు… ఆసక్తి కనబర్చిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్. సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని… లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలనే ఆలోచనలతో ఉన్నామని వివరించిన సీఎం. రాష్ట్రంలో త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్టు వివరించిన సీఎం. రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులకు చెప్పిన ముఖ్యమంత్రి. వైద్యారోగ్య రంగంలో పెట్టుబడుల పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఆసక్తి. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చిన బుర్జిల్. వైద్యారోగ్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ అనే విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పిన ముఖ్యమంత్రి. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజటలీకరణ ప్రాజెక్టును పైలెట్ గా చేపట్టినట్టు వివరించిన చంద్రబాబు. వైద్యారోగ్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పై అనుభవం కలిగిన బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న బుర్జిల్ సంస్థ.

అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు*

*ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు* *ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను అందుకోవడమే లక్ష్యం* *విద్యారంగ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్* *ఆస్ట్రేలియా (బ్రిస్బేన్) పున్నమి ప్రతినిధి *విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్ లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని, ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్‌, రోబోటిక్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్ లర్ మార్క్ హార్వే, క్వీన్స్ ల్యాండ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ కమిషనర్ మిచైల్ మాథ్యూస్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ గార్బియేల్ ట్రూన్, స్టడీ క్వీన్ ల్యాండ్ అడిషనల్ డైరెక్టర్ స్టెఫానీ హంటర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ మెరైన్ బయోలజీ, ఆక్వాకల్చర్ ప్రొఫెసర్ క్యాల్ జెంజర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్ ల్యాండ్ ప్రొ వైస్ ఛాన్స్ లర్ రెన్ యూ, సిక్యూ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మీనూ ఇస్సార్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ సెంటర్ డైరెక్టర్ (క్వాంటమ్ సిస్టమ్స్) ఆండ్రూ రైట్, స్ట్రాటజీ మేనేజర్ శరవణన్, ఎడ్యుకేషన్ క్వీన్స్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డంకెన్ మెక్ కెల్లర్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్.*🌨️

*🌨️ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్.*🌨️ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య.. కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ 🌨️ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ 🌨️ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం..🌨️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 🌨️

అమరావతి

నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు రూ. 250 కోట్లు విడుద‌ల*

అమ‌రావ‌తి అక్టోబర్ పున్నమి ప్రతినిది *నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు రూ. 250 కోట్లు విడుద‌ల* *త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్లు చెల్లించేందుకు చ‌ర్య‌లు* *వెంట‌నే ఆందోళ‌న విర‌మించాలని యాజ‌మాన్య సంఘాల వారికి ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి* డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్వ‌ర్క్‌) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. నిధుల చెల్లింపుల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆర్థిక శాఖా మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో చ‌ర్చించారు. అనంత‌రం చ‌ర్య‌ల్లో భాగంగా నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. అలాగే త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్ల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ తెలిపారు. రోగుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య‌ సేవ‌ల్ని కొన‌సాగించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల ఆసోసియేష‌న్, ఇత‌ర సంఘాల ప్ర‌తినిధుల‌ను సౌర‌భ్ గౌర్ కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం త‌న‌ని క‌లిసిన ప‌లువురికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్ని వివ‌రించారు.

తెలంగాణ

ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే,తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె ధాన్యం సేకరణ పై పౌర సరఫరాలు సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్ లో సమీక్షించారు.

భక్తి

ఉదయగిరి, సీతారామంజనేయ స్వామి వారి విగ్రహ పూజ గణంగాజరిగింది

గౌరవ అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు.. వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..! వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవారి నిధులతో కోటి రూపాయల వ్యయంతో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వేదమంత్రాల మధ్య భక్తులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని, ధూపదీప నైవేద్యం కోసం కూడా శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, అంకినపల్లి ఓబుల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.