Friday, 24 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జన్మదినాన అన్నదానం మంచి ఆలోచనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి.సింధూర అన్నారు. నరసన్నపేట మండలం, పిన్నింటిపేటకు చెందిన గుంతు.వనిత జన్మదినం సందర్భంగా, నగరంలో నిస్సహాయులకు అన్నవితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగముగా పేదలకు ఆహారాన్నందించి డా. పైడి.సింధూర మాట్లాడుతూ జన్మదినం రోజున పది మంది ఆకలి తీర్చటం హర్షణీయమని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెయ్యటం ఆనందంగా ఉందన్నారు. వేడుకలను నిరుపేదల మధ్య జరుపుకోవాలనే ఆలోచన గొప్పదని, ఈ కార్యక్రమానికి పరోక్షముగా సహాయమందించిన పొడుగు.చరణ్ కు, నేటి దాతలు గుంతు.లక్ష్మణ్, గుంతు.వనిత దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం నగరంలో పలు ముఖ్య కూడలిలో అభాగ్యులకు లయన్స్ క్లబ్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ ఆహారాన్నందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఫ్రొఫెసర్ డా.విష్ణు మూర్తి, నైట్ షెల్టర్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులో భారత మత్స్యకారుల పట్టివేత… ఆందోళనలో కుటుంబ సభ్యులు

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో, 13 అక్టోబర్ 2025 న వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు అనుకోకుండా బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులోకి ప్రవేశించడంతో, ఆ దేశ కోస్ట్ గార్డు సిబ్బంది వారిని 22 అక్టోబర్ తెల్లవారుజామున 2 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులకు సాయంత్రం ఈ సమాచారం తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన విజయశంకర్ ఫణి, బీజేపీ ధార్మిక సెల్ నాయకుడు, మత్స్యకారుల నాయకులతో కలిసి స్థానిక ఎంపీ భరత్ ని కలుసుకున్నారు. తరువాత ఈ సంఘటన వివరాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ కి మరియు జనసేన పార్టీ నాయకుడు పంచకర్ల సందీప్ కి ఫోన్ ద్వారా తెలియజేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయశంకర్ ఫణి మాట్లాడుతూ, “మన మత్స్యకారులు కేవలం వేటకు వెళ్లి అనుకోకుండా సరిహద్దు దాటారు. వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు బంగ్లాదేశ్ అధికారుల నుండి ఎటువంటి అధికారిక సమాచారం భారతదేశానికి అందలేదు,” అని తెలిపారు. ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ అధికారుల సహాయం కోసం వేడుకుంటున్నారు. తీర ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

తిరుపతి

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది:

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 21 అక్టోబర్ న ప్రారంభించిన రెండు కార్యక్రమాలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది: 1. మెప్మా ఆధ్వర్యంలో ” మన మిత్ర ” WhatsApp సేవలు 2. ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ఈ రెండు సేవలు ఉచితంగా, స్వయంసహాయక సంఘ (SHG) మహిళల ప్రయోజనార్థం ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచబడ్డాయి. R.P లు గా మీరు అవగాహన సృష్టించడంలో ముందుండే చాంపియన్లు కావున, అందరు రిసోర్స్ పర్సన్లు ఈ WhatsApp సేవలు మరియు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీని అందరు SHG మహిళల కుటుంబాల వరకు చేరే విధంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. నవంబర్ 1వ తేదీ నాటికి కింది రెండు లక్ష్యాలను సాధించాలి: 1. ప్రతి SHG గ్రూపు నుండి, ముఖ్యంగా నాయకులు/SLF OB సభ్యులు, తమ స్మార్ట్‌ఫోన్‌లలో మన మిత్ర WhatsApp సేవలను ఒక్కసారి ఉపయోగించి, అభిప్రాయం ఇవ్వాలి. 2. స్మార్ట్‌ఫోన్ కలిగి వున్న ప్రతి SHG సభ్యురాలు ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నవంబర్ 2025 నెలకు డిజిటల్ లిటరసీ కోర్సు చూడడం ప్రారంభించాలి. వీటిని వుపయోగించడంలో సహాయంగా వుండడానికి యూజర్ మాన్యూవల్ ను మీకు పంపడం జరిగింది. అందరు SHG మహిళలు వీటిని వుపయోగించే విధంగా R.P లు అందరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మిషన్ డైరెక్టర్ , మెప్మా

హైదరాబాద్

అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్

పున్నమి ప్రతి నిధి దేశవ్యాప్తంగా అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 2020-21 నాటి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 43.7% తో దేశంలో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 37.2% తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం వినియోగం, రుణాలు, క్రెడిట్ సదుపాయాల విషయంలో కూడా ఈ రెండు రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం వ్యక్తిగత అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా ఎక్కువగా ఉండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుపతి

బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజక వర్గం పరిధి లోనీ గుండెమడకల గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వాగతించారు

గుండె మడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయులు సందర్శించారు జయజయ ధ్వానాలు వేద పండితులు తో మంత్రోచ్చారణ శాస్తోతంగ నిర్వహించిన హోమం భూమి పూజ కార్యక్రమల్లో ఆనం రామనారాయణరెడ్డి తో పాటు స్థానిక నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ పార్లమెంటు సభ్యుడు జి.వి. హర్షకుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు – పి. వి వి సత్యనారాయణ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : మాప్రియతమ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఆమలాపురం నియోజకవర్గ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు గౌరవనీయులు జి.వి. హర్షకుమార్ గార్కి పి.వి.వి. సత్యనారాయణ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రజల అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవచేసిన మీ నాయకత్వం ప్రజల హృదయాలను గెలుచుకుంది. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలో మీరు చూపిన కృషి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల మీ అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది అని పి.వి.వి. సత్యనారాయణ అన్నారు. మీ రాజకీయ ప్రయాణం ప్రజాసేవకు ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను చూపిన నాయకుడిగా మీరు అందరి హృదయాలలో స్థానం సంపాదించారు. సద్భావన, సహనం, మరియు సేవా మానసికత మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకతను తెచ్చాయి. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలని కోరుకునే మీరు, నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మీ జన్మదినం సందర్భంగా భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, శాంతి, విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించి, ప్రజల ఆశీర్వాదాలను అందుకోవాలని కోరుకుంటున్నాము. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌ. శ్రీ జి.వి. హర్షకుమార్ గార్కి మీ ప్రేమ అభిమాని పి.వి.వి. సత్యనారాయణ (ONGC Tatipaka Refinery)

తిరుపతి

శ్రీకాళహస్తి లో కార్తీక మాసం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా గాలిగోపురం ఎదురుగా గల సాంస్కృతిక కళావేదిక యందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.అందులో భాగంగా రాగ రస ఝరీ డాన్స్ & మ్యూజిక్ అకాడమీ తిరుపతి వారిచే నృత్య ప్రదర్శనలు,పాటకచేరీలు నిర్వహించడం జరిగింది.ఈ ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి.కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NR కృష్ణారెడ్డి దంపతులు మరియు ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

ఖమ్మం

పత్తి రైతులకి ఊరట -పాలేరు నియోజకవర్గం లో సిసి ఐ పత్తి కొనుగోలు కేంద్రం ని ప్రారంభం చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో మొట్టమొదటి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయపాలెం మండలం గోల్‌తండలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ భాగ్యలక్ష్మి కాటన్‌ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీ బాయి గారు, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఆర్డీవో నర్సింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్అ రెడ్డి అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో సీసీఐ ద్వారా పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఏదైనా జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రతి సీసీఐ కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రైతుల పొలాల వద్దే తేమ శాతం పరీక్షించేలా తేమ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రైతులు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధానం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ సెషన్‌లో పత్తి మద్దతు ధర పెంపుపై చర్చించి, రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,అధికారులు తెలిపారు.

తిరుపతి

దుబాయ్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కి స్వాగతం పలికిన ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్.

విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో జరుగు ఇండస్ట్రియల్ ప్రమోషన్ మీట్ కొరకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించుటకు మూడు రోజులు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి పలికిన తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మరియు శ్రీకాళహస్తి కి చెందిన ఉన్నం చైతన్య నాయుడు,దుబాయ్ ఎన్ఆర్ఐ వింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ నందు చేరుకోని ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22 న డాక్టర్ గుడ్లూరు మయూర్ జన్మదినం సందర్భంగా నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం విదితమే.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.