Friday, 24 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో వైద్యం పొందిన సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, బాధితుల వైద్య ఖర్చుల కోసం ₹3,03,593 మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబం ధించిన చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి

ప్రభుత్వ బాలికల వసతి గృహ బాలిక పై జరిగిన అత్యాచారం ఘటన పై ASWO ను సస్పెండ్ చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఐ – మహిళ సమాఖ్య ధర్నా సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి* సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు (రాజమండ్రి -అక్టోబర్ – పున్నమి ప్రతినిధి) సంక్షేమ హాస్టల్ లో విద్యనభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరుతూ సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గు చేటు అని ఆయన అన్నారు సంక్షేమ హాస్టల్ లో బాలికలకు రక్షణ కొరవడిందని అన్నారు. బాలిక ఫిర్యాదు చేసేంతవరకు హాస్టల్ hwo, aswo కనీస విచారణ చేపట్టకపోవడం దారుణం అన్నారు.ఘటన పరిశీలిస్తే అనేక అనుమానలు కలుగుతున్నాయని కాబట్టి ఘటన పై సమగ్ర విచారణ జరపాలని, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ పై అధికారాల నిఘా కొరవడిందని ఆవేదన వ్యక్తం రాజమండ్రి Aswo స్థానికంగా వుండరని సోమవారం aswo ను సస్పెండ్ చేయాలని మరొక సారి ధర్నా పెడతామని మా పోరాటం ఆగదని అన్నారు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అయాన డిమాండ్ చేశారు ఈ ఘటనలో hwo, aswo నిర్లక్ష్యం కనపడుతుందని ఆమె అన్నారు ఇంకా ఈ కార్యక్రమo లో సీపీ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐటీయూసీ నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరావు, జట్ల లేబర్ యూనియన్ కార్యదర్శి సప్ప రమణ, aiyf జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యురాలు సేపని రమణమ్మ, టీ నాగేశ్వరావు, ఎస్ నాగమణి జట్ల సంఘం అధికార బాడీ నల్ల రామారావు, పి దేముడు బాబు, రెడ్డి వెంకటరావు బాలకృష్ణ ప్రజానాట్య మండలి ఉమ, మున్సిపల్ నాయకులు డి దుర్గమ్మ, కాకి శారద, పోలమ్మ, గురి తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : ప్రజల భవిష్యత్తే ధ్యేయంగా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా కనుమరుగైన చెరువులకు జీవం పోస్తూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లైఫ్ సేవర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శివ నేత ఈ సందర్బంగా మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పుట్టినరోజుని తెలంగాణ ప్రజలు, డిఆర్ఎస్ మరియు హైడ్రా బృందలు పండగల జరుపుకుంటున్నాయని శివ నేత తెలియజేశారు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పొన్నాడ సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన గొల్లపల్లి సూర్యరావు

ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యరావు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.*

తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.* మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ. ఆందోళన చేసేవాళ్లను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించిన పోలీసులు. నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం. నారాయణరావుది సూసైడ్‌ కాదంటున్న కుటుంబ సభ్యులు. నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపణ. రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే ఇవాళ ఉదయం 7గంటలకు సూసైడ్‌ చేసుకున్నాడని సీఐ చెప్పాడు. ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేందటున్న కుటుంబ సభ్యులు.

పల్నాడు

నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) గారు

నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) . ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బంది.

పల్నాడు

నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) . garu

నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) . ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బంది.

తిరుపతి

నాయుడుపేట వద్ద బస్సులో చెలరేగిన మంటలు

నాయుడుపేట పట్టణ పరిధిలోగల తాళాయపాడు గ్రామం వద్ద గురువారం ఉదయాన్నే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుపేట నుంచి తిరుపతికి వెళుతున్న ట్రావెల్ బస్సు తాళాయిపాడు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

తిరుపతి

శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్*

*శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్* జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.జనశ్రేణులందరూ కూడా పై కార్యక్రమంలో తప్పక పాల్గొ ని, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం తెలుపవలసిందిగా కోరుచున్నాము. *సత్యమేవ జయతే* *జై జనసేన* *జైహింద్* *అంజూరు చక్రధర్* *ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి* *జనసేన పార్టీ* *శ్రీకాళహస్తి*

నాగర్‌కర్నూల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి

వెల్దండ ,అక్టోబర్ 24,: వెల్దండ మండల పరిధిలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి చెందింది. వెల్దండ మండల కేంద్రానికి చెందిన రైతు ఆలూరి లాలయ్య కు చెందిన పాడి గేదెలు బుధవారం రాత్రి తాడు తెంపుకొని రోడ్డుమీదికి వచ్చింది. హైవేపై దర్గా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక గేదె అక్కడికక్కడే చెందిందిచెందింది. మరో గేదే తీవ్ర తీవ్ర గాయాల పాలై లేవలేని స్థితిలో ఉంది. రైతు ఆలూరి లాలయ్య కుటుంబం పాడి గేదెలపై ఆధారపడి జీవిస్తున్నారు. మృతి చెందిన పాడి గేదె కుచిన్న లేగ దూడ ఉన్నది గేద చనిపోవడంతో ఆ రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రూ. 90 వేల విలువగల గేదె మృతి చెందినందున ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందజేయాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ ఘటన గురించి రైతు వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.