Friday, 24 April 2026

Blog

అనకాపల్లి

బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేసి, రాజయ్యపేట మత్స్యకారులపై నిర్బందం అపాలి, సిపిఎం.

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, గంగమ్మ తల్లి ముద్దు అంటూ గత 38 రోజులుగా శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తున్న మత్యకారుల కు అండగా పూడిమడక గ్రామంలో గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము , పూడిముడక శాఖ కార్యదర్శి చాపల తాతయ్య, మండల కమిటీ సభ్యులు కె సోమునాయుడు మాట్లాడుతూ రాజయ్యపేట వద్ద 1270 ఎకరాల్లో అత్యంత కాలుష్యకారక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది దీన్ని నిరసిస్తూ మత్స్యకారులు శాంతియుత ఆందోళన చేస్తున్న మత్యకార గ్రామంలో సెక్షన్ 30 , పోలీస్ పికెట్లు పెట్టి ప్రజానీకాన్ని భయభ్రాంతులను గురిచేస్తున్నారు, పోరాటానికి మద్దతు తెలుపుతున్న నాయకులను నిర్బంధిస్తున్నారు, గతంలో తెలుగుదేశం బల్క్ డ్రగ్ పార్క్ ని తీవ్రంగా వ్యతిరేకించింది అధికరంలోకి వచ్చిన తర్వాత నిర్బంధం ప్రయోగించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది, సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్యకారులకు కాలుష్య కారక పరిశ్రమ లు పెట్టి మత్య వృత్తి కి దూరం చేస్తున్నారు, మత్స్యకారులకు స్థానిక పరిశ్రమల్లో పనులు కల్పించడం లేదు దీంతో మరింత దుర్భర పరిస్థితుల్లోకి మత్స్యకారులు నెట్ట బడుతున్నారు ప్రభుత్వం పోలీసు నిర్బంధం ఎత్తివేసి ప్రజాబిస్టం మేరకు బల్క్ డ్రగ్ పార్కు ప్రతిపాదనలు విరమించుకోవాలని, మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మత్యకార గ్రామాలందరూ మద్దతు తెలియజేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో కృష్ణ , అమ్మోరు, గంటల రావు , రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

వర్షానికి సైతం లెక్కచేయకుండా..! జనవాణి కార్యక్రమం..!!

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా యలమంచిలి, నియోజకవర్గం లో ఉదయం నుండి వర్షం కురుస్తున్నా జనవాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై తమ వినతులను శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ కు అందజేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావడంతో కొన్ని వినతులను అక్కడకక్కడే పరిష్కరించి మరి కొన్ని వినతులను పరిశీలనకు తీసుకోవడం జరిగిందని, వర్షం వచ్చినా లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు జన వాణిని కి హాజరు కావడం జరిగిందని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి రైల్వే స్టేషన్ లో..! సీనియర్ డివిజనల్ మేనేజర్ సమావేశం..!!

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : విజయవాడ డివిజన్, సీనియర్ డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ నరేంద్ర వర్మతో సమావేశం జరిగింది. మీటింగ్ కి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు టౌన్ లీడర్ పిట్టా దాసు బాబు, మరియు శివ శంకర్, (రిటైర్ సర్వీస్ మ్యాన్ ఇండియన్ ఆర్మీ ) రిటైర్ సర్వీస్ మ్యాన్ సైనిక అసోసియేషన్, స్టేషన్ కన్సల్టెంట్ సభ్యులు ఆడారి జగన్నాథ్ మాస్టర్ కి రిటైర్డ్ పెన్షనర్ల సంఘం నాయకుడు మరియు ప్రయాణీకుల సంఘం కార్యదర్శి జయంత్ కమలాకర్ మరియు శర్మ కి మరియు సీనియర్ రిటైర్డ్ ఆర్మీ పిళ్ళా నాగేశ్వరావు, టివియస్ ప్రకాష్, ఆర్ యస్ నాయుడు, గుమ్మెళ్లగోవిందరావు, కారే త్రినాధ్, మేరుగు అప్పలనాయుడు, తదితరులు, మరియు ఇతర ప్రముఖ లందరూ పాల్గొన్నారు.

అనకాపల్లి

పాడి రైతులకు..! అవగాహన సదస్సు..!!

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సు మరియు ఉచిత పశు వైద్య శిబిరం మేనేజర్ కూండ్రపు శేషు ప్రారంభించారు, పరవాడ మండలం పి బోనంగి గ్రామం హెరిటేజ్ పాడి రైతులకు హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు ఆ గ్రామంలో వెటరినరీ క్యాంపు రైతులు అందరితో మాట్లాడి ఈ హెరిటేజ్ డైరీ లో పాలు పోసిన అందరికీ రైతుకి ఉచితంగా మందులు అందజేశారు, హెరిటేజ్ డైరీ పాడి రైతులు పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ 50 రూపాయలకు అందించబడును తెలిపారు అంతేకాకుండా హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న ప్రతి గ్రామములో పశువులకు కృత్రిమ గర్భధారణ అందరికీ అందుబాటులో ఉంటావని తెలిపారు అంతేకాకుండా ఈరోజు ఆ గ్రామంలో లో హెరిటేజ్ డైరీ డాక్టర్ హేమసుందర్ గారు చేతుల మీదుగా పాడి 31 పశువులకు డి వార్మింగ్ చేయబడును, పాడి రైతు చేయడం జరిగింది, అందరితో మాట్లాడి పాడి రైతులు కష్టాలను తెలుసుకున్నారు హెరిటేజ్ డైరీ జిల్లాలో అన్ని డైరీలు కంటే ఎక్కువ రేటు చెల్లిస్తుందని అదేవిధంగా హెరిటేజ్ డైరీ కి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు యాక్సిడెంట్ లో చనిపోతే రెండు లక్షలు సహజ మరణానికి 50,000 రూపాయలు హెరిటేజ్ డైరీ కుటుంబం నామినికి అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెట్నరీ అసిస్టెంట్ సి హెచ్ రాము పాల సంఘం అధ్యక్షుడు ఎల్లపు శివ రమణ సతీష మొదలైన పాడి రైతులు పాల్గొన్నారు.

జనగాం

ఉచిత బోధనా సామాగ్రి పంపిణీ:ఎంఈఓ ,శంకర్ రెడ్డి

సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము ———————————— జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్ జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీమతి గోలి మాళవిక గారు ఆమె కూతురు నైరా పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు వివిధ రకాల భోధనా అభ్యసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద పిల్లల కోసం, వారిలో చదువు నాణ్యత కోసం ప్రోత్సాహం కల్పించడం సంతోషకరమన్నారు. మాళవిక గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసిన మెటీరియల్ పిల్లలకు ప్లేవే మెథడ్ తో పాటు బోధనా అభ్యసన ప్రక్రియలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాళవిక గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమక్షంలో మా పాప జన్మదినాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులకు సహాయం చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల బోధనాభ్యాసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడు హరీష్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, చాడ రవి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అమతుల్ ఆలియా, అన్నపూర్ణ, హిమబిందు, భగవాన్ రెడ్డి, నరసింహులు,షఫీ అహమ్మద్, శ్రీనివాస్, రహత్ సుల్తానా, పర్వీన్, తాజద్దీన్, శాంతి, శాంతా, రాజేశ్వర్, ఫ్లోరి ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో బంగారు పతకాలు..! సాధించిన అచ్యుత జూనియర్ కళాశాల విద్యార్థినిలు..!! ” మేఘనా బ్లెస్సీ” ” లయా జెస్షిక “

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం : అచ్యుత జూనియర్ కళాశాల, అచ్యుతపురం విద్యార్థిని బి. మేఘనా బ్లెస్సీ, మరియు బి లయా జెస్షిక లు ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సబ్బవరం లో నిర్వహించబడిన పోటీలలో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించి కళాశాలకు గౌరవాన్ని తెచ్చిపెట్టారు. విద్యార్థినులు అద్భుత ప్రదర్శనను గుర్తిస్తూ డీఈఓ అనకాపల్లి మద్దిలి వినోద్ బాబు, కరస్పాండెంట్ పల్లి శేషగిరి రావు, మరియు ప్రిన్సిపాల్ రాజన సత్యనారాయణ, మేఘనా బ్లెస్సీని, లయా జెస్షికలను, అభినందించారు. వీరువురి విజయంతో ప్రేరణ పొందిన విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించాలని వారు ఆకాంక్షించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థినులు మేఘనా బ్లెస్సీకి మరియు లయా జెస్షిక లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

జనగాం

జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత బోధనా సామాగ్రి :శంకర్ రెడ్డి ,ఎంఈఓ

సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఔన్నత్యము ————————————– జనగామ, అక్టోబర్23,పున్నమి న్యూస్: జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జనగామలో ఈరోజు విద్యార్థులకు వివిధ రకాల బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీమతి గోలి మాళవిక గారు ఆమె కూతురు నైరా పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు వివిధ రకాల భోధనా అభ్యసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు పేద పిల్లల కోసం, వారిలో చదువు నాణ్యత కోసం ప్రోత్సాహం కల్పించడం సంతోషకరమన్నారు. మాళవిక గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసిన మెటీరియల్ పిల్లలకు ప్లేవే మెథడ్ తో పాటు బోధనా అభ్యసన ప్రక్రియలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాళవిక గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమక్షంలో మా పాప జన్మదినాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులకు సహాయం చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు వివిధ రకాల బోధనాభ్యాసన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడు హరీష్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, చాడ రవి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అమతుల్ ఆలియా, అన్నపూర్ణ, హిమబిందు, భగవాన్ రెడ్డి, నరసింహులు,షఫీ అహమ్మద్, శ్రీనివాస్, రహత్ సుల్తానా, పర్వీన్, తాజద్దీన్, శాంతి, శాంతా, రాజేశ్వర్, ఫ్లోరి ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి కే రఘునాథ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోల్ అనగా కుప్ప రాసి సమూహం అని ఏదైనా ఒక మోల్ పదార్థము 6.022×10²³ అణువులు గాని పరమాణువులు కల్గి,ఉంటాయని,అదేవిదంగాఒక మోల్ వాయువు 22.4 లీటర్ ల గణపరీమానాన్ని కల్గి ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎక్స్టెంపుర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమారావు డాక్టర్ శంకర్, డాక్టర్ కొసరి సంతోష్, సుధాకర్ గారు, సురేందర్, కిషన్, అబ్దుల్లా మస్జార్ శ్రావన్య ,ఉజ్మా తపస్సు, డాక్టర్ నహీదా, దివ్య మొదలగువారు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా… అనంతసాగరం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) .

భారీ వర్షాల కారణంగా అనంతసాగరం మండల లోనీ ముస్తాపురం, పాతాళపల్లి గోవిందంపల్లి, ఉప్పలపాడు,చిలకలమర్రి గ్రామలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన ను రైతులు తెలిపారు.అనంతరం తమ సమస్యను వినతిపత్రం ద్వారా తహసీల్దార్ జయవర్ధన్ గారికి తెలియజేయడం జరిగింది.రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సుమారు వేయి ఎకరాల పంట నష్టం జరిగిందని,చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.ష్టపోయిన రైతుకు ఎకరాకు 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారిలో కౌలు రైతు ఎక్కువ ఉన్నారని నష్టంపరిహారం చెల్లించపోతే మండలంలో ఉండే రైతులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామి అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి అండగా నిలుస్తున్నది సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గాడి సుధాకర్,జక్రయ్య,రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి,మండల కార్యదర్శి సత్తార్, వెంకట రాజు,మస్తాన్, మాలకొండయ్య, మద్దులూరు వెంకటేశ్వర్లు,ప్రసాద్, సురేష్ , పెంచలయ్య,జయమ్మ,మోహన్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

తెలంగాణ

పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలన్న : డైరెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి చెప్పారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చౌడంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సందర్శించారు. డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల పత్తి రైతులు ఉన్నారని,నల్గొండ జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.