Friday, 24 April 2026

Blog

E-పేపర్

ఎస్ వి కి అసత్యప్రచారాల ముఠా పై కఠిన చర్యలు తీసుకోండి –తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి

ఎస్ వి కి అసత్యప్రచారాల ముఠా పై కఠిన చర్యలు తీసుకోండి –తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా SP శ్రీ కునుగులి ధీరజ్ గారిని ఈ రోజు ఉదయం 12 గంటలకు జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర మరియు జనసేన సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగాకలిశారు.. ఈ సందర్బంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పార్టీ అని చెప్పి పార్టీకి నష్టం కలిగించే వారిమీద మరియు ప్రత్యక్షంగా fb ఐడిలతో మరియు fake లతో పార్టీకి నష్టంకలిగేలా నాయకుల మీద అసత్య ఆరోపణలతో వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రకాల ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది, గతంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులు కూడా SP గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.. SP గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి.. నివేదిక తెప్పించుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, పగడాల వెంకటేష్, ఆనాల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

💰మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కోట్లు విడుదల* *విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్*

రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) నిధులు రూ.98.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్న భోజనంతోపాటు వంట ఖర్చు, గుడ్డు ధరకు సంబంధించి రూ.25.64 కోట్లు, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రూ.28.43 కోట్లు, వంట కార్మికుల గౌరవ వేతనం రూ.44.73 కోట్లు కలిపి మొత్తం రూ.98.3 కోట్లు విడుదల చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిధులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏప్రిల్, జూన్, జులై వరకు, వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు విడుదల చేశామని వివరించారు. వంట కార్మికుల గౌరవ వేతనం నెలకు రూ.రెండు వేలు చెల్లిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి చొప్పున నిధులను భరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్రంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే నిధులను భరించి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నది. ఇంటర్మీడియెట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్ ఉన్నది…

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ గాంధీ సెంటర్ వద్ద రోడ్లపై వర్షపు నీరు నిల్వసమస్య

నందిగామ గాంధీ సెంటర్ మరియు నందిగామలోని పరిసర ప్రాంతాల్లో వార్డుల్లో అకాల వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిల్వవుతోంది. రోడ్లు సమతుల్యంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి, బయటకు వెళ్లే మార్గం లేకుండా ఉంది. ఈ కారణంగా వాహనదారులు, పాదచారులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. అదేవిధంగా, నిలిచిపోయిన నీటి కారణంగా దోమల పెరుగుదలతోపాటు ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్లపై నిలిచిపోయిన నీరు తొలగించే చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి నీరు సులభంగా వెళ్లిపోయే విధంగా డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలని నందిగామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

జోగులాంబ గద్వాల

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. గడువు ముగిసినా మత్స్య సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ నిలదీత వీలైనంత త్వరగా మిగిలిన 21 జిల్లాల్లో మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం దీంతో కోర్టు ధిక్కరణ కింద మరోసారి పిటిషన్ వేసిన ముదిరాజు సంఘం నాయకులు మరోసారి విచారించి, కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా..

ఎన్ టి ఆర్ జిల్లా

పెనుగంచిప్రోలులో వివాహ రిసెప్షన్ కు హాజరైన జనసేన యువ నాయకుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్

పెనుగంచిప్రోలు GSR ఫంక్షన్ హాల్‌లో, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొమ్ముకూరి ఆదినారాయణ కుమారుని వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొని, నూతన వధూవరులకు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మల్లికార్జునరావు ని పరామర్శించిన రాజోలు టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య

మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నీటి సంఘం అధ్యక్షులు రాపాక మల్లికార్జునరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నరూ ఈ రోజు రాజోలు టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి అమూల్య తో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరు చిన్నబాబు రాజు, తాటిపాక సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి రత్నమాల, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గోనిపాటి రాజు, చింతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో వైద్యం పొందిన సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, బాధితుల వైద్య ఖర్చుల కోసం ₹3,03,593 మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబం ధించిన చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి

ప్రభుత్వ బాలికల వసతి గృహ బాలిక పై జరిగిన అత్యాచారం ఘటన పై ASWO ను సస్పెండ్ చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ముందు సీపీఐ – మహిళ సమాఖ్య ధర్నా సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి* సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు (రాజమండ్రి -అక్టోబర్ – పున్నమి ప్రతినిధి) సంక్షేమ హాస్టల్ లో విద్యనభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరుతూ సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గు చేటు అని ఆయన అన్నారు సంక్షేమ హాస్టల్ లో బాలికలకు రక్షణ కొరవడిందని అన్నారు. బాలిక ఫిర్యాదు చేసేంతవరకు హాస్టల్ hwo, aswo కనీస విచారణ చేపట్టకపోవడం దారుణం అన్నారు.ఘటన పరిశీలిస్తే అనేక అనుమానలు కలుగుతున్నాయని కాబట్టి ఘటన పై సమగ్ర విచారణ జరపాలని, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ పై అధికారాల నిఘా కొరవడిందని ఆవేదన వ్యక్తం రాజమండ్రి Aswo స్థానికంగా వుండరని సోమవారం aswo ను సస్పెండ్ చేయాలని మరొక సారి ధర్నా పెడతామని మా పోరాటం ఆగదని అన్నారు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అయాన డిమాండ్ చేశారు ఈ ఘటనలో hwo, aswo నిర్లక్ష్యం కనపడుతుందని ఆమె అన్నారు ఇంకా ఈ కార్యక్రమo లో సీపీ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐటీయూసీ నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరావు, జట్ల లేబర్ యూనియన్ కార్యదర్శి సప్ప రమణ, aiyf జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యురాలు సేపని రమణమ్మ, టీ నాగేశ్వరావు, ఎస్ నాగమణి జట్ల సంఘం అధికార బాడీ నల్ల రామారావు, పి దేముడు బాబు, రెడ్డి వెంకటరావు బాలకృష్ణ ప్రజానాట్య మండలి ఉమ, మున్సిపల్ నాయకులు డి దుర్గమ్మ, కాకి శారద, పోలమ్మ, గురి తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : ప్రజల భవిష్యత్తే ధ్యేయంగా హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా కనుమరుగైన చెరువులకు జీవం పోస్తూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లైఫ్ సేవర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శివ నేత ఈ సందర్బంగా మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పుట్టినరోజుని తెలంగాణ ప్రజలు, డిఆర్ఎస్ మరియు హైడ్రా బృందలు పండగల జరుపుకుంటున్నాయని శివ నేత తెలియజేశారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.