Friday, 24 April 2026

Blog

విశాఖపట్నం

నగర వ్యర్థాల పారవేయడంపై నిత్య పర్యవేక్షణకు డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం.

నగర వ్యర్థాల పారవేయడంపై నిత్య పర్యవేక్షణకు డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం. * నియంత్రణ చర్యల దిశగా “షీ” టీమ్స్ తనిఖీలు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: వ్యర్థాల పారవేయడాన్ని నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలు, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత ద్వారా నిత్య పర్యవేక్షణ జరుగుతోందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డ్రోన్ల ద్వారా సేకరించిన దృశ్యాలను సిటి ఆపరేషన్ సెంటర్ (COC) లో AI సహాయంతో విశ్లేషిస్తున్నామని, ఆ ఆధారంగా జీవీఎంసీ “షీ” టీమ్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నాయని, జరిమానాలు విధించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నామని గురువారం ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. బుధవారం రాత్రి 4వ జోన్ పరిధిలోని పూర్ణా మార్కెట్ నుంచి కనకమహాలక్ష్మి ఆలయ జంక్షన్ వరకు డ్రోన్, AI ఆధారిత పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో టౌన్ కోత రోడ్ నుండి కనకమహాలక్ష్మి ఆలయం వరకు ఉన్న ఫుట్‌పాత్‌ల వెంట అధికంగా వ్యర్ధాలు పేరుకుపోయినట్లు గమనించామని, ఆ ప్రాంతంలోని దుకాణదారులలో చాలామంది డస్ట్‌బిన్‌లు వినియోగించకపోవడం గుర్తించామని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లు, కాలువలలో వ్యర్ధాలు వేయడాన్ని అరికట్టేందుకు జీవీఎంసీ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. డ్రోన్లు, AI సాంకేతికత ద్వారా వ్యర్ధాలు వేస్తున్న వ్యక్తులు లేదా వ్యాపారులను గుర్తించి, షీ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ చర్యల్లో భారీ జరిమానాలు విధించడం, ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడం, అవసరమైన అమలు చర్యలు చేపట్టడం ఉంటుందని కమిషనర్ తెలిపారు. నగర పరిశుభ్రతను కాపాడటంలో వ్యాపారులు, ప్రజల సహకారం అత్యంత అవసరమని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి మరియు పౌరులు తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఉపయోగించి, వ్యర్ధాలను కేవలం నిర్ణీత సేకరణ వాహనాలకే అప్పగించాలని సూచించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పత్రికా ప్రకటన ద్వారా కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కండలేరు జలాశయం స్పిల్ వే ను పరిశీలించిన సోమిరెడ్డి

కండలేరు జలాశయం స్పిల్ వే ను పరిశీలించిన సోమిరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయం స్పిల్ వే ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటికే 60 టీఎంసీలు నీరు నిల్వ ఉండటంతో ఆయన స్పిల్ వే ను పరిశీలించారు. స్పిల్ వే నుంచి అవుట్ ఫ్లో వెళ్లే మార్గం లేకపోవడంతో డ్యాం క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. కండలేరు డ్యామ్ లోకి నీటి ప్రవాహం పెరిగి అత్యవసర పరిస్థితిలో స్పిల్ వే గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కింద నున్న గ్రామాల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. స్పిల్ వే నుంచి నీరు వెళ్లే మార్గం 12 కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందని, అందులో 560 మీటర్లు ఫారెస్ట్ లో తీయాల్సి ఉందని అందుకు రూ.95 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సోమిరెడ్డికి వివరించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధుల సాధన కోసం కృషి చేస్తానని ఈ సందర్బంగా సోమిరెడ్డి పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో నీటిపారుదల శాఖను మూత వేయడంతో ఈ దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు.

తిరుపతి

AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢

📢 *AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢 ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) సర్వే గడువు పొడిగింపు! ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేందుకు మరో అవకాశం లభించింది. ✅ సర్వే గడువు పొడిగింపు తేదీ: నవంబర్ 5, 2025 ముఖ్య వివరాలు: *🏠 పథకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G)* *👩‍🌾 ఎవరు అర్హులు: ఇళ్లు లేని పేద కుటుంబాలు.* *🏢 ఎక్కడ దరఖాస్తు చేయాలి: సమీప గృహనిర్మాణ శాఖ AE కార్యాలయం.* *📄 అవసరమయ్యే పత్రాలు: కుటుంబ వివరాలు, ఆదాయ ధృవపత్రం, మరియు ఆధార్ కార్డు.* *🎯 ప్రభుత్వ లక్ష్యం: 2029 నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు.* 💬 స్థల కేటాయింపు: *గ్రామాల్లో: 3 సెంట్లు* *పట్టణాల్లో: 2 సెంట్లు* వెంటనే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండలంలో పాడేరు చెరువు పరిశీలన

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) ఇరిగేషన్ ఈ ఈ రవికుమార్, డి ఈ సురేష్, ఏఈ యాసిన్, బాలసుబ్రహ్మణ్యం లు పాడేరు చెరువు తూము గుండా వృథాగా పోతున్న నీటిని పరిశీలించారు. నీటి వృథాను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువు నీటిని సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా చెరువు అధ్యక్షుడు స్వర్ణ రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ యరగర్ల మనోహర్, సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య, సర్పంచ్ గుమ్మ వెంకటేశ్వర్లు మరియు రైతులు పాల్గొన్నారు.

నిర్మల్

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* లో *అంతర్జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవం.*మోల్ డే*

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి కే రఘునాథ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోల్ అనగా కుప్ప రాసి సమూహం అని ఏదైనా ఒక మోల్ పదార్థము 6.022×10²³ అణువులు గాని పరమాణువులు కల్గి,ఉంటాయని,అదేవిదంగాఒక మోల్ వాయువు 22.4 లీటర్ ల గణపరీమానాన్ని కల్గి ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎక్స్టెంపుర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమారావు డాక్టర్ శంకర్, డాక్టర్ కొసరి సంతోష్, సుధాకర్ గారు, సురేందర్, కిషన్, అబ్దుల్లా మస్జార్ శ్రావన్య ,ఉజ్మా తపస్సు, డాక్టర్ నహీదా, దివ్య మొదలగువారు పాల్గొన్నారు.

నిర్మల్

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* లో *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవం.*మోల్ డే*

*గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా* ఈరోజు *అంతర్జాతీయ రాష్ట్రాన శాస్త్ర దినోత్సవాన్ని *మోల్ డే* గా రసాయన శాస్త్ర విభాగం తరఫున జరపడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి కే రఘునాథ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోల్ అనగా కుప్ప రాసి సమూహం అని ఏదైనా ఒక మోల్ పదార్థము 6.022×10²³ అణువులు గాని పరమాణువులు కల్గి,ఉంటాయని,అదేవిదంగాఒక మోల్ వాయువు 22.4 లీటర్ ల గణపరీమానాన్ని కల్గి ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎక్స్టెంపుర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ భీమారావు డాక్టర్ శంకర్, డాక్టర్ కొసరి సంతోష్, సుధాకర్ గారు, సురేందర్, కిషన్, అబ్దుల్లా మస్జార్ శ్రావన్య ,ఉజ్మా తపస్సు, డాక్టర్ నహీదా, దివ్య మొదలగువారు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గా ప్రకాష్ కుమార్

శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గా ప్రకాష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.వారు తిరుపతి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న డి.గోపిని ఉన్నత అధికారులు బదిలీ చేయగా ఆ స్థానం లో ప్రకాష్ కుమార్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా వన్ టౌన్ పరిధిలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వన్ టౌన్ సీఐ తెలిపారు.స్టేషన్ సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు బీఎస్పీ నిరసన

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ని అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఘన ఆందోళన జరిగింది. భారీ వర్షం కూడా ఆందోళనకారులను నిలిపిపోకపోయింది; బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు దృఢంగా నిరసన వ్యక్తం చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బూసి జాన్ మోషే మాట్లాడుతూ, ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా పేద వర్గాల విద్యార్థులకు వైద్య విద్యకు చేరుకునే అవకాశాలు తగ్గిపోతాయని, ప్రభుత్వ వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పెడతుందని హెచ్చరించారు. ఇది సామాజిక సమానత్వం, అర్హతా ఆధారిత విద్యకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. బీఎస్పీ పార్టీ ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, విద్యార్థులు, పేద విద్యార్థుల హక్కులు కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పి. గన్నవరం బీఎస్పీ అధ్యక్షుడు తాడి రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక మీడియా, ప్రజల మధ్య ఈ సమస్యను ఉంచి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయంపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. బీఎస్పీ పార్టీ భవిష్యత్తులో కూడా పేద విద్యార్థుల సంక్షేమం కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షిస్తూ నిరంతరం ప్రజాస్వామ్య సాధనాల ద్వారా పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చింది. ఈ ఆందోళనలో భాగంగా జిల్లా, మండల నాయకులు మరియు కార్యకర్తలు ప్రభుత్వ విధానంపై తమ నిరసనతో పాటు విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సంకల్పాన్ని ప్రదర్శించారు. బీఎస్పీ పార్టీ ఈ అంశంపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తూ, నిరసన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ప్రకటించింది.

నాగర్‌కర్నూల్

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన..జిల్లా కలెక్టర్

కల్వకుర్తి, అక్టోబర్ 23,ప్రభుత్వ ఆసుపత్రిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది రికార్డ్లను సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా లేదా అనేది రికార్డుల ద్వారా పరిశీలించారు. మందుల నిల్వలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారో, ఏ రకమైనటువంటి వ్యాధులతో వస్తున్నారో వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగుల చికిత్సకు సరిపడ మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

అనకాపల్లి

బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేసి, రాజయ్యపేట మత్స్యకారులపై నిర్బందం అపాలి, సిపిఎం.

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, గంగమ్మ తల్లి ముద్దు అంటూ గత 38 రోజులుగా శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తున్న మత్యకారుల కు అండగా పూడిమడక గ్రామంలో గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము , పూడిముడక శాఖ కార్యదర్శి చాపల తాతయ్య, మండల కమిటీ సభ్యులు కె సోమునాయుడు మాట్లాడుతూ రాజయ్యపేట వద్ద 1270 ఎకరాల్లో అత్యంత కాలుష్యకారక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది దీన్ని నిరసిస్తూ మత్స్యకారులు శాంతియుత ఆందోళన చేస్తున్న మత్యకార గ్రామంలో సెక్షన్ 30 , పోలీస్ పికెట్లు పెట్టి ప్రజానీకాన్ని భయభ్రాంతులను గురిచేస్తున్నారు, పోరాటానికి మద్దతు తెలుపుతున్న నాయకులను నిర్బంధిస్తున్నారు, గతంలో తెలుగుదేశం బల్క్ డ్రగ్ పార్క్ ని తీవ్రంగా వ్యతిరేకించింది అధికరంలోకి వచ్చిన తర్వాత నిర్బంధం ప్రయోగించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది, సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్యకారులకు కాలుష్య కారక పరిశ్రమ లు పెట్టి మత్య వృత్తి కి దూరం చేస్తున్నారు, మత్స్యకారులకు స్థానిక పరిశ్రమల్లో పనులు కల్పించడం లేదు దీంతో మరింత దుర్భర పరిస్థితుల్లోకి మత్స్యకారులు నెట్ట బడుతున్నారు ప్రభుత్వం పోలీసు నిర్బంధం ఎత్తివేసి ప్రజాబిస్టం మేరకు బల్క్ డ్రగ్ పార్కు ప్రతిపాదనలు విరమించుకోవాలని, మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి మత్యకార గ్రామాలందరూ మద్దతు తెలియజేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో కృష్ణ , అమ్మోరు, గంటల రావు , రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.