Friday, 24 April 2026

Blog

విశాఖపట్నం

జగన్మోహన్ రెడ్డి పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫైర్.*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*: విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో *జగన్మోహన్ రెడ్డి పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫైర్.* *ఎంపీ కలిశెట్టి అప్పలcనాయుడు మాట్లాడుతూ* పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్ట్రిప్ట్ ప్రసంగం చూసాం…అన్ని అవస్తవాలే మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుడు తో పాటు తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి. విశాఖలో డేటా సెంటర్ పై ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. కత్తులు పట్టుకున్నవారికి కంప్యూటర్ కోసం ఏమి తెలుసు. డేటా సెంటర్ కు మీరు శంకుస్థాపన చేస్తే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు. విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్ కి ఇష్టం ఉందా లేదా చెప్పాలి. జగన్ సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు ను ఘోరంగా అవమానించారు. జగన్ లా చంద్రబాబు వన్ టైమ్ సి ఎం కాదు ఫోర్త్ టైమ్ సీఎం. హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు..అక్కడ అభివృద్ధి బాబు చలవే ఈ విషయాన్ని ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..అటు బిఆర్ ఎస్ నేతలు ఒప్పుకుంటున్నారు. పరిపాలన రాజధాని పేరుతో వైసిపి నేతలు విశాఖను దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వ నాశనం అయింది. చంద్రబాబు ను చూసి ఏపీకి పెట్టుబడులు వస్తుంటే రావద్దని మెయిల్స్ పెడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. మద్యం పై మాట్లాడే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదు ఈ సమావేశంలో బ్రహ్మ రాజు, అశోక్ , పి జయరాజ్ జాన్, తదితరులు పాల్గొన్నారు,

E-పేపర్

అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

ఇచ్చోడ మండలం బోరిగామ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని,లబ్ధిదారులు,అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. పాల్గొన్నఅధికారులు,గ్రామస్తులు,తదితరులు.

E-పేపర్

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రథమ చికిత్స సిపిఆర్ పై అవగాహన

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో బొమ్మల సత్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రథమ చికిత్స, సీపిఆర్ పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాన్ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యురాలు నెరవాటి హాస్పిటల్ ప్రముఖ స్త్రీ ప్రసూతి వ్యాధి నిపుణురాలు డాక్టర్ అరుణ కుమారి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఆరోగ్యం మరియు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు రెడ్ క్రాస్ సభ్యురాలు మాజీ రోటరీ ఇన్నర్ విల్ చైర్పర్సన్ శ్రీమతి వసుంధర ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెడ్ క్రాస్ క్లైమేట్ ఆక్షన్ బృందం సభ్యులు, రెడ్ క్రాస్ DFO సమీ తదితరులు సహకరించారు వసుంధర మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో విద్యార్థులకు అవగాహన కల్పించే అన్ని సామాజిక అంశాలకు తన తోడ్పాటును అందిస్తానన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ మరియు నెరవాటి హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఇతర స్వచ్చంద సహకారం కూడా తీసుకొని నంద్యాల జిల్లా ప్రజలకు సిపిఆర్ ప్రధమ చికిత్స అవగాహన కల్పించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు సందర్భంగా డాక్టర్ బాబన్ ని డాక్టర్ అరుణకుమారి ని వసుంధర ని కళాశాల ఉపాధ్యాయులు సత్కరించారు

విశాఖపట్నం

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి …..నాగ శేషు రాష్ట్ర సహాయ కార్యదర్శి

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి …..నాగ శేషు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అదనపు యాప్లు రద్దు చేయాలి, ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదాన్ని రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగ శేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు అనగా 23 అక్టోబర్ న జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన అంగన్వాడి యూనియన్ విశాఖ జిల్లా రెండవ మహాసభకు ముఖ్య అతిథిగా నాగ శేషు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు గడిచిన ఏడు సంవత్సరాలుగా వేతనాలు పంచకుండా ప్రభుత్వం తీవ్ర ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అంగన్వాడీ పథకాన్ని ప్రజల్లో గొప్పగా చెబుతూ, దాంట్లో పనిచేస్తున్న అంగన్వాడీలకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వేతనాల పెంపుదల కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటం దేశానికి ఆదర్శం అన్నారు. 2023 లో జరిగిన 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఫలితంగా సాధించిన ఎనిమిది జీవో లతోపాటు వేతనాల పెంపకం మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖ జిల్లాలో జరగబోతున్న 18వ సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మహాసభ 32 మందితో జిల్లా కమిటీ, 19 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నది. అధ్యక్షురాలుగా ఎల్ . దేవి , ప్రధాన కార్యదర్శిగా కే వెంకటలక్ష్మి, కోశాధికారిగా ఆర్ శోభారాణి, గౌరవ అధ్యక్షులుగా పి. మణి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కే.పద్మావతి, అడిషనల్ జనరల్ సెక్రెటరీగా కే బృందావతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్. ఈశ్వరమ్మగార్లను ఎన్నుకోవడం జరిగింది.

యాదాద్రి భువనగిరి

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్23,(పున్నమి ప్రతినిధి): చౌటుప్పల్ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు ఏడవ తరగతి (2001 – 2007),సంవత్సర విద్యార్థులు.ఈ నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించుకున్నారు.వారు చదువుకున్న నాటి జ్ఞాపకాలను,ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క విద్యా బోధనలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ రెడ్డి,మురళీధర్ రావు,సత్తయ్య,సత్యవతి,సరళ,మాట్లాడుతూ తమను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పిలిచి సత్కరించినందుకు,అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మల్లికార్జున్,ఖాసిం,శ్రావణ్,సికిందర్,నవీన్,జగదీష్,ప్రవీణ్,అబ్బాస్,జావిద్,ఇమ్రాన్,శ్రీను,సాయిరాం,చందన,ఊర్మిళ,అప్ష,శ్రావణి,తదితరులు,పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా గుబ్బల ఫణి కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గుబ్బల ఫణి కుమార్ని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఐదుగురు డైరెక్టర్లను ప్రకటించింది. ఈ డైరెక్టర్ల జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన ఒకరికి అవకాశం లభించడం విశేషం

విశాఖపట్నం

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు* *జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్

*మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు* *జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్* *విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది.* *ఈ సమావేశంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన వివరాలను అధికారుల నుండి జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.* *ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ మరియు క్వాంటిటీ లలో అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు, హెడ్మాస్టర్లు ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారము విద్యార్థులకు భోజనం అందిస్తున్నది లేనిది తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. వైద్యాధికారులు స్కూల్స్ ని తనిఖీ చేసి విద్యార్థులకు అవసరమైన ఐరన్ టాబ్లెట్స్ తో పాటు అవసరమైన వారికి ఇతర మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు స్థానిక పి హెచ్ సి వైద్యాధికారుల సమన్వయంతో విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలన్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని డిఎం సివిల్ సప్లై అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నాణ్యమైన వెజిటబుల్స్ సేకరించాలని, మెనూ ప్రకారం మాత్రమే భోజనాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే కోడిగుడ్లను మొదటి వారంలో నీలం రంగు స్టాంపును, రెండవ వారంలో పింకు రంగు స్టాంపును మూడవ వారంలో పచ్చ రంగు స్టాంపును నాలుగో వారంలో బ్రౌన్ కలర్ స్టాంపును వినియోగించాలన్నారు. బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువులను నిలువ చేసే రూముల్లో పరిశుభ్రత పాటించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.* *ఈ సమావేశంలో విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.జగదీశ్వరరావు, డి ఎస్ ఓ. భాస్కర రావు, పి డి., డి ఆర్ డి ఎ లక్ష్మీపతి, FCI అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.*

Blog

నంద్యాల బ్లడ్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రభాస్ జన్మదిన వేడుకలు, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులు

సినీ నటుడు ప్రభాస్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ఆయన అభిమానులు గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. నంద్యాలలోని బ్లడ్‌ సెంటర్‌ నందు అభిమానులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ అభిమానులు మానవత్వం చాటుకుంటూ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తం అవసరమున్న వారికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. అనంతరం అభిమానులంతా కలిసి కేక్‌ కట్‌ చేసి తమ అభిమాన నటుడి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభాస్ అభిమానులైన చిన్న అన్న, భవానీ శంకర్‌, హాజీ సలీమ్‌, నాగార్జునుడు, శ్రీను, మల్లి, భాషా తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు సేవా కార్యక్రమాలతో తమ ఆరాధ్య నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం పట్ల పలువురు ప్రశంసించారు.

తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో….*

*మెగా జాబ్ మేళా* శ్రీకాళహస్తి నియోజకవర్గం తేదీ 25/10/2025 శనివారం *సమయం* ఉదయం:8:30 గంటల నుండి *వేదిక* శనివారం, శ్రీకాళహస్తిలోని కొత్త కోనేరు వీధి నందుగల విక్రమ్ డిగ్రీ కాలేజీలో విద్యార్హతలు: 10వ తరగతి- పోస్ట్ గ్రాడ్యుయేట్(PG) వరకు మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి APSSDC కమాండ్ కంట్రోల్- 7989509540,8919889609,9988853335

విశాఖపట్నం

ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే విడుదల చేయాలి*.*సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్

*ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే విడుదల చేయాలి*.*సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు సెప్టెంబర్ 24 నుండి ఓపి అక్టోబర్ 10 నుండి ఎమర్జెన్సీ సేవలు అన్ని బంద్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పరవాడలో సిఐటియు సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య సేవలు బంద్ కావడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అత్యవసర సేవలు కూడా బంద్ కావడంతో రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా 2700 కోట్లు బకాయి పెట్టిందన్నారు. యాక్సిడెంట్ కేసులు, గర్భిణీలు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేదలకు అందని దక్షగా మారుతుందని అన్నారు.ప్రైవేటీకరణ విధానాలను ఇప్పటికైనా మానుకోవాలని ప్రభుత్వాన్ని గనిశెట్టి హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవలను మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కర్రీ పోతి నాయుడు, పి చిన్నారావు, దూళి దేముడు, వై వెంకటరమణ, ఎస్.అప్పలరాజు, కొల్లు రాము తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.