Thursday, 23 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేపు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

ది.24.10.2025 వ తేదీ శుక్రవారం నాడు గల పర్యటన వివరములు.ఉదయం 10.00 గంటలకు మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామం నందు పంచాయతీ దగ్గరలో వినాయకుని గుడి కల్వర్టు వద్ద రూ 60 లక్షల రూపాయలతో 1.350 కి.మీ మేర నిర్మించే గెద్దాడ రింగ్ రోడ్ కు భూమి పూజ చేస్తారు. ఉదయం 11.30 గంటలకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో పర్యటించి అగస్టిన్ కాలనీ మరియు ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. సాయంత్రం 04 గంటలకు ONGC వారి నిధులతో గుడిమెల్లంకలో రూ 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న మరో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అగ్రిమెంటు కొరకు ONGC ED సంతనుదాస్ గారిని రాజమండ్రిలో కలవనున్నారు.అని ఒక ప్రకటనలో తెలిపారు

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కే నాగేంద్రప్ప

నంద్యాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ‘రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం గురువారం నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ ఆగస్టు 5న ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నదన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోగా, సమస్యలు చెబితే వారిని ద్రోహులుగా ముద్రవేశాయని విమర్శించారు. ఇప్పుడు ఏడాది దాటినా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై సుమారు ₹35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే, ప్రభుత్వం బకాయిలు తీర్చడమే కాక ఉద్యోగులకు గృహ కల నెరవేరుతుందని సూచించారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ చర్చలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో కాకుండా, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు నాలుగేళ్లుగా రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు నరేంద్ర, సహాధ్యక్షుడు జమాలయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి రాజశేఖర్‌, సభ్యులు రాజశేఖర్‌, సతీష్‌కుమార్‌ రెడ్డి, ఆరిఫ్‌, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

చించినాడ గోదావరి బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను కాపాడిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సిబ్బంది

భీమవరం ప్రాంతానికి చెందిన ఒక మహిళ వీరవాసరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకున్న సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఆమె చించినాడ బ్రిడ్జి వద్దకు చేరుకుని గోదావరి నదిలోకి దూకడానికి ప్రయత్నించారు. అదే సమయంలో, NH-216 పై హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు హోంగార్డు P.శ్రీనివాస్ ఆ దృశ్యాన్ని గమనించారు. ఆయన వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి, ఆమె దగ్గరకు వెళ్లి, బ్రిడ్జిపై నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆమెను చాకచక్యంగా అడ్డుకుని, సురక్షితంగా రక్షించారు. అనంతరం, హోంగార్డు శ్రీనివాస్ ఈ విషయాన్ని సదరు మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునే వరకు ఆమెను అక్కడే ఉంచి, ధైర్యం చెప్పారు. అనంతరం, ఆమెను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. చాకచక్యంగా వ్యవహరించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన హోంగార్డు

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పవేదిక కొత్త సభ్యత్వాలు

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పవేదిక కొత్త సభ్యత్వాలు మరియు జిల్లాలో మిగతా కమిటీల నియామకాలు పూర్తి చేయుటకు జిల్లాలో ప్రజాసంకల్ప వేదిక ను గడపగడపకు తీసుకువెళ్ళడానికి కార్యాచరణను రూపొందించడానికి నిన్న ఈరోజు జిల్లాకమిటీ రివ్యూ మీటింగ్ రాజమండ్రి గోరక్షణ పేటలో జిల్లా ఇంఛార్జి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. End

Blog

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం…

వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలిదశలో ఐదు మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికీ ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసిపి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసిపి కౌన్సిలర్లు మాట్లాడుతూ… పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని మెడికల్ కళాశాలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు.ఈ ఉద్యమానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్ లు సాదిక్ బాష, సమ్మద్, ఆరీఫ్ నాయక్, కలామ్ ,బాషా, తమీమ్, మజీద్, వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్ మున్నయ్య కన్నమ్మ లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తి శంకర్, దండే సుధాకర్, గన్ని కరీం, మాజీ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రానా, జుబేర్, చాంద్ బి, కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

ముప్పు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురుస్తున్న విస్తార వర్షాలు నేపథ్యంలో గురువారం ఏర్పేడు మండలంలోని పంగూరు మరియు జంగాలపల్లి పంచాయతీలలో ఎమ్మెల్యే బొజ్జల పర్యటించారు.పంచాయతీల పరిధిలోని చెరువులను పరిశీలించి ఏర్పేడు మండల ఎమ్మార్వో,ఎంపిడిఓ,ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వర్షాల కారణంగా చెరువులు ఎలాంటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*ముప్పాళ్ళ గ్రామాభివృద్ధికి సీఎం నారా చంద్రబాబునాయుడు నుండి ₹2 కోట్ల నిధుల మంజూరు*

నందిగామ, గురువారం నందిగామ నియోజక వర్గంలోని ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ₹2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇటీవల నందిగామ పర్యటనలో భాగంగా ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ — “దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందిన ముప్పాళ్ళ గ్రామానికి అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రెండు కోట్ల నిధులను మంజూరు చేసినందుకు సీఎం కు హృదయపూర్వక ధన్య వాదాలు. గ్రామ ప్రజలసంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సదు పాయాలు, శానిటేషన్, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముప్పాళ్ళ గ్రామ ప్రజలు సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని హర్షిస్తూ, తమ గ్రామ అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

*హలో మాల చలో ఢిల్లీ*….. *నవంబర్ 26 ఢిల్లీ జంతర్ మంతర్* ….

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ మాల మహానాడు సోదర సోదరీమణులకు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి మాల మహానాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు కుల బాంధవులందరికీ నవంబర్ 26 వ జరగబోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న రాజ్యాంగ హక్కుల సభలో మాలలం భారీగా పాల్గొలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలుపాలన్నారు. మాలల ఐక్యత చాటి చూపాలని సూచించారు. గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్క మాల మహానాడు సోదరీ సోదరీమణులు భారీ ఎత్తున తరలివచ్చి ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. జై భీమ్ జై మాల మాలల ఐక్యత వర్ధిల్లాలి అని జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి పిలుపునిచ్చారు.

E-పేపర్

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం…

వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలిదశలో ఐదు మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికీ ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసిపి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసిపి కౌన్సిలర్లు మాట్లాడుతూ… పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని మెడికల్ కళాశాలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు.ఈ ఉద్యమానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్ లు సాదిక్ బాష, సమ్మద్, ఆరీఫ్ నాయక్, కలామ్ ,బాషా, తమీమ్, మజీద్, వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్ మున్నయ్య కన్నమ్మ లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తి శంకర్, దండే సుధాకర్, గన్ని కరీం, మాజీ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రానా, జుబేర్, చాంద్ బి, కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కాకినాడ

ఆదిత్య డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు.

ఆరోగ్యకరమైన అలవాట్లే వ్యాధులను దూరం చేస్తాయి … డాక్టర్ అడబాల మాధవి, గైనకాలజిస్ట్ (పున్నమి ప్రతినిధి) – అక్టోబర్ 23,2025, కాకినాడ. స్థానిక ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల జాతీయ సేవా పథకం మరియు కాకినాడ ఐడిఏ సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ నివారణ మరియు బాలిక ల సాధారణ సమస్యల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు తెలిపారు. క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలలో భాగంగా యుక్తవయస్సులో బాలికలకు రొమ్ము క్యాన్సర్ నివారణ మరియు మహిళల సాధారణ సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ నాయుడు అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా ఐ డి ఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ముఖ్యఅతిథిగా ఆత్మీయ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అడబాల మాధవి విచ్చేశారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు మాట్లాడుతూ ఈ విధమైన అవగాహన కార్యక్రమాలు చాలా అవసరమని, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలపై ప్రసంగించారు. ముఖ్య అతిధి డాక్టర్ మాధవి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ ​రొమ్ము కణజాలంలో కణాలు అసాధారణంగా మరియు అదుపులేకుండా పెరగడం వలన ఏర్పడే కణితి (గడ్డ) రొమ్ము క్యాన్సర్. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించవచ్చు అని వివరించారు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ,హార్మోన్ థెరపీ,టార్గెటెడ్ థెరపీ వంటి అంశాలతో పాటు, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు స్త్రీ సంబంధమైన సాధారణ వ్యాధుల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ , ఐ డి ఏ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు టి తేజేశ్వరరావు, డి అశ్విని మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.