Thursday, 23 April 2026

Blog

జోగులాంబ గద్వాల

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన కార్యక్రమం.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) నేటి సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న బాల్య వివాహాలను మరియు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూర్ మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ రంజిత్ రెడ్డి, స్టేషన్ సమక్షంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల విద్యార్థులకు కలిగే నష్టాలను, అభివృద్ధికి కలిగే అవరోధాలను స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ మాస్టర్ శ్రీ రంజిత్ రెడ్డి, పాఠశాల శ్రీ ఏ సోమ శేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీ రాములు దయాల్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ నర్సింహులు మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉత్తనూరు శ్రీమతి విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

పశువులకు గాలికూంటూ వ్యాధినివారణ టీకా.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పుర పాలిక పరిధి శాంతి నగర్ లో పశువులకు గురువారం గాలికూంటూ వ్యాధినివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పశువైద్య, పశుసంవర్ధక శాఖ మండల డాక్టర్.జి .స్వరూప రాణి మాట్లాడుతూ గాలికుంటూ వ్యాధి వచ్చిన పశువులలో నోటిలో,గిట్టల మధ్యలో పుండ్లు కావటం చోంగ కారటం, పశువు మేత తినకపోవటం,జ్వరం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయని,ఈ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుచేసి చికిత్స అందంచాలని,ప్రతి రోజు నోటిని గిట్టలని పోటాష్యామ్ పర్మాంగానేట్ లోషన్ తో కడగాలని,వ్యాధి సోకిన పశువుకు జొన్న సంకటి,జావా,వంటివి త్రాగిచాలని ఆయన అన్నారు. పాడి పశువులలో ఈ వ్యాధి వలన పాలు తగ్గిపోవటం,చూడి పశువులు ఈసుకపోవటం అపుడప్పుడు మరణాలు కూడా సంభవిచటం జరుగుతుందని,గాలి కుంటూ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లపశువులు, ఆవులు, ఎద్దులు, కోడెలు 73, గేదెలు, దూడలు 362 మొత్తం 435 పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వీ ఎల్ ఓ వర ప్రసాద్, ఎల్ ఎస్ ఏ లతీఫ్, ఓ ఎస్ వెంకటమ్మ, కృష్ణ, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా,ఇటిక్యాల మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అనిరుద్, సూపర్వైజర్, పీహెచ్‌సీ సిబ్బందితో వివరాలు సేకరించిన కలెక్టర్, పీహెచ్‌సీలో ఓపీ సంఖ్య మరియు డెలివరీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రంగారెడ్డి

తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్ఆ రోజే చీరల పంపిణీ

తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్ ఆ రోజే చీరల పంపిణీ హైద్రాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ ప్రారంభించనుంది. బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీరలు పండుగ నాటికి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడ్డాయి. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న చీరలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మహిళలకు సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్‌లో తయారైన రూ.800 విలువ గల నాణ్యమైన చీరలు అందించనున్నారు.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయ హుండీ లెక్కింపు.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయము నందు 92 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ జిల్లా శ్రీయుత సహాయ కమీషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా ఆదాయం రూ.50,76,149-00. శ్రీ స్వామి వారి హుండీ ద్వారా ఆదాయం రూ.9,97,016-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా ఆదాయం రూ.5,248-00 మొత్తం హుండీ ఆదాయం రూ. 60,78,413-00 వచ్చినది. ఫారిన్ కరెన్సీ US డాలర్లు 5, OMAN 100, 1/2, మిశ్రమ బంగారు 34 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. మిశ్రమ వెండి 447 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ. శ్రీమతి A.దీప్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చక & సిబ్బంది పాల్గొన్నారు.

రంగారెడ్డి

*”ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”*

*”ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే-గొప్ప పట్టుదల,అంకుఠిత దీక్ష అవసరమవుతాయి.”* *”మనసులో ఆలోచన అనే వాకిలి తెరచుకుంటేనే ప్రశాంతత లభిస్తుంది.”* *”హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది.”* *”జీవితంలో ఆనందం,సంతోషం,* *సంతృప్తి,విజయం అనేవి మనం* *ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి.”* *”మోసంతో వచ్చే విజయం కన్నా నిజాయితీగల ఓటమే గౌరవంగా ఉంటుంది.”* “*మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మనవెంటే ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు.”* * మి చిరునవ్వు తో * మిత్రుడు * ఆలంపల్లి దుర్గేష్ * నక్కర్త మేడిపల్లి

తెలంగాణ

*హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ ఇద్దరు కొడుకులు మృతి*

నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 23, ( పున్నమి ) : హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ బైక్ ఢీకొట్టిన సంఘటనలో ఇరువురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడెం గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది యాచారం మండలం ఎస్సై మధు తెలిపిన వివరాలు ప్రకారం కడ్తాల్ మండలం ముద్వేల్ గ్రామానికి చెందిన తలతి అభిరామ్ ఆర్తి (9,)అబిరం (5) సంవత్సరాలు గల ఇద్దరు చిన్నారులు తన తండ్రి ద్విచక్ర వాహనంపై మాలువైపు వెళుతున్నారు ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని తమలోని గేటు సమీపంలో ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది దీంతో ఇద్దరు చిన్నారులకు బలంగా గాయాలయి అక్కడికక్కడే మృతి చెందారు యాచారం మండల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు చెప్పలేని కానివి దీంతో ముద్విన్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి

రంగారెడ్డి

ప్రవేట్ స్కూల్ నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి తీరని అన్యాయం విద్యార్థినికి జరిగిన ప్రమాదం పై స్పందించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం

ప్రవేట్ స్కూల్ నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి తీరని అన్యాయం 🫵 విద్యార్థినికి జరిగిన ప్రమాదం పై స్పందించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం 🙏 న్యాయం కోసం, సహాయం కోసం ఎదురుచూస్తున్న బాలిక కుటుంబం విషయం:- గ్రామం- మాదాయ పల్లి, మండలం- తలకొండపల్లి, జిల్లా- రంగారెడ్డి కి చెందిన మదిగట్ల పద్మ w/o గోవర్ధన్ గార్ల కూతురు ప్రసన్న సమీప గ్రామమైన వెల్జాల్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది మాదాయ పల్లి నుండి వెల్జల్ గ్రామానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మాదాయ పల్లి నుండి ఎలాంటి వాహన సౌకర్యం లేనందున మాదాయ పల్లి నుండి వెల్జల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సమయానికి తీసుకువెళ్లి తీసుకురావడానికి బులోరో వాహనాన్ని మాట్లాడుకున్నాము గడచిన( 3 ) మూడు సంవత్సరాల నుండి ఇదే వాహనంలో ప్రయాణం చేస్తున్నారు కాగా గడచిన తేదీ 16/ 10/ 2025 రోజున సాయంత్రం స్కూలు నుండి తిరిగి వెళ్లే దారిలో వాహనాన్ని రోడ్డు సైడ్ కి నిలిపివేయడం జరిగింది ఈ క్రమంలో వెల్జాల్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల మెగా శ్రీ సాయి విద్యాలయానికి సంబంధించిన బస్సు అతివేగంతో వచ్చి ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనకాల నుండి ఢీకొట్టడంతో ఆ వాహనంలో ఉన్న మద్దిగట్ల ప్రసన్న కి చెయ్యి విరిగిపోవడం జరిగింది ఈ విషయం పైన ప్రైవేటు పాఠశాలల నిర్వహణను చూసుకుంటున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యం పైన గాని బస్సు పైన గాని ఎలాంటి చర్యలు తీసుకోకుండా గత పది రోజుల నుండి కాలయాపన చేస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి మద్దతుగా ఉన్నారు మరియు మా సమస్యని ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ మా సమస్యను పట్టించుకోవడం లేదు దయచేసి నా కూతురికి జరిగిన అన్యాయానికి నాపైన నా కూతురి పైన దయవుంచి న్యాయం చేయగలరని కోరుతూ ఇట్లు ఒక నిరుపేద రైతు

విశాఖపట్నం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా రాజీవ్‌నగర్‌ శ్రీ సత్య సాయి భజన మండలి లో పరిమళించిన సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు*

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా రాజీవ్‌నగర్‌ శ్రీ సత్య సాయి భజన మండలి లో పరిమళించిన సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు* భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా, 2024 సంవత్సరం డిసెంబర్ నేలనుండి ప్రతి నెలా 23 వ తేదీన విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవా విభాగం విశాఖ జిల్లా లోని ప్రతి సత్య సాయి సమితి అందు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితికి చెందిన రాజీవ్‌నగర్ శ్రీ సత్య సాయి భజన మండలి ద్వారా రాజీవ్ నగర్ శివాలయం అందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన వేడుకలను శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవా విభాగం (పురుష మరియు మహిళా) సమన్వయకర్తలు శ్రీ ఆర్.ఏ.నాయుడు & శ్రీమతి కె.ఈశ్వరి సమన్వయపరిచారు. ముందుగా ఉదయం విశాఖ జిల్లా వేదం బృందం శ్రీ సుబ్రహ్మణ్యం గారి మార్గదర్శకతలో రుద్రపారాయణం చేశారు. అనంతరం ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులచే విశ్వ మానవ కళ్యాణం, విశ్వ శాంతి కోసం నామసంకీర్తన జరిగింది. అనంతరం శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు సేవా కార్యక్రమాల లో భాగంగా కొత్త బట్టలు ( చీర, దుప్పటి, లుంగీ సెట్ ), భోజన ప్యాకెట్లు, మజ్జిగ లను యాతపాలెం, రాసలమ్మ కాలనీ, దువ్వాడ, రాజీవ్ నగర్ కు చెందిన 216 పేద కుటుంబాలకు ప్రేమతో అంద చేశారు. అనంతరం నారాయణ సేవ ద్వారా 300 మందికి భోజన ప్రసాదం అందచేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా పదాధికారుల శ్రీమతి సోమేశ్వరి, శ్రీమతి అపర్ణ, శ్రీ సత్య సాయి సేవా సమితి-విశాఖ సిటీ కన్వీనర్ శ్రీ సాయి కుమార్, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ జి. రామకృష్ణ, శ్రీ కె.వి.ఎస్. జోగారావు, శ్రీ ఎ.వి. శ్రీనివాస్, శ్రీ జి.వి. ప్రసాద్ తదితరులు,సేవాదళ సభ్యులు, భక్తులు మరియు యువత పాల్గొన్నారు. ప్రతీ నెలా నిర్వహించే ఈ కార్యక్రమాలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశమైన “ప్రేమ – సేవ – ఐక్యత”భావాన్ని మరింత విస్తరింపజేసి, నవంబర్ 2025 శత వర్ష జన్మదిన మహోత్సవానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.

విశాఖపట్నం

మహిళల భద్రత కోసం శక్తి యాప్

మహిళల భద్రత కోసం శక్తి యాప్ విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ,; పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ వి. చిన్నబాబు పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్‌లో, అలాగే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ జిలానీ వేపగుంటలోని Ortus కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినులతో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్” గురించి విద్యార్థులకు వివరించి, ప్రమాదస్థితుల్లో ఈ యాప్ ఎలా వెంటనే సహాయం అందిస్తుందో అవగాహన కల్పించారు. అదనంగా, మహిళలు తమ భద్రతకు పాటించాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలు గురించి సూచనలు అందించారు. పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ముందుకు కూడా కొనసాగుతాయని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.