Thursday, 23 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు*

*రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు* పున్నమి ప్రతినిధి: • నిధులు మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి అభ్యర్ధనకు తక్షణ స్పందన • భక్తుల సౌకర్యార్ధం 7 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రహదారి నిర్మాణం కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి ఏడు వారాల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోందని, రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 216 జాతీయ రహదారి నుంచి ఏటిగట్టు మీదుగా 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి తక్షణం నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు.

తెలంగాణ

టెన్ ఫీజు షెడ్యూల్ విడుదల ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడి

పున్నమి అబ్దుల్లాపూర్మెట్ మండలం అక్టోబర్ 23 తెలంగాణలూ పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ షెడ్యూల్ను ప్రక టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఎగ్జామ్ ఫీజు స్కూల్ హెడ్ మాస్టర్లకు చెల్లించాలని తెలిపిం ది. హెంచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేసి ఆ వివరాలు నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 29 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేం దుకు అవకాశం కల్పించారు.

తిరుపతి

ఘనంగా రాజసాబ్ ప్రభాస్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో పాన్ ఇండియా రెబల్ స్టార్, రాజసాబ్ ప్రభాస్ 46వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలలో భాగంగా మొదటగా వారు సూపర్ బజారు కూడలి వద్ద బాణాసంచా కాల్చి, కేకును కట్ చేసి సంబరాలు చేసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్ పాకెట్స్ పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో సూర్య చౌదరి, రాము, కిషోర్,గంగాధరం దిలీప్, ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీజేపీ లో అసెంబ్లీ కన్వీనర్ ల వ్యవస్థ ముగిసింది: అడబాల

బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం జిల్లా లో ఉన్న బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్ ల వ్యవస్థ సమయం ముగిసింది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక నుంచి జిల్లా లో ఏ అసెంబ్లీ బీజేపీ కి కన్వీనర్లు, కో కన్వీనర్ లు ఉండరని, ఆ వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హౌసింగ్ లబ్ది దారుల వివరాలు నమోదుకు నవంబర్ 5 వరకు లాస్ట్

ఉదయగిరి మండలం పరిధిలోని 17 పంచాయతీలలో 905 హౌసింగ్ లబ్ది వివరాలు నమోదుకు నవంబర్ 5వ తేది లోగా ఆవాజ్ యాప్ లో నమోదు చేయాలనీ ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు గురువారం ఉదయగిరి లోని శ్రీ శక్తీ భవనంలో హౌసింగ్ సచివాలయం సిబ్బందితో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రతీ పంచాయితీకీ ఒక వ్యక్తిని కేటాయించాలని , వారు లబ్ధి దారుల వివరాలు నమోదుకు frs , జీయో ట్యా గిం గ్ తో వివరాలు తీసుకోవాలని సూచించారు

ఎన్ టి ఆర్ జిల్లా

*వడ్డె ఓబన్న సేవలు ఎనలేనివి – వడ్డెర్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో వడ్డె ఓబన్న విగ్రహావి ష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కు అంగరక్షకుడు, సైన్యాధ్యక్షుడు గా సేవలందిం చిన వడ్డె ఓబన్న వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తదితరులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభలో బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వడ్డె ఓబన్న యోధుడిగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే రామరాజగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వడ్డెర్ల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ, యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ వడ్డె ఓబన్న త్యాగం వడ్డెర్ల సమాజా నికి ప్రేరణగా నిలుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తు న్నట్టు అన్నారు. కేడీసీసీబ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు జోరుగా ముందడు గు వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు విశిష్ట నేతలు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు హాజరై విగ్రహానికి పూలమాలలు కూర్చుతూ నివాళులు అర్పించి ఘనంగా జరుపుకున్నారు.

E-పేపర్

ఆర్ధిక సహాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్,రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు శ్రీ క్యామ మల్లేష్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామ వాస్తవ్యులు దేవరకొండ వాణి – సత్యనారాయణ గార్ల కూతురు స్పూర్తి వివాహం సందర్భంగా వారికి 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్,రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు శ్రీ క్యామ మల్లేష్

తిరుపతి

తొట్టంబేడు మండలంలో సహాయచర్యలు చేపట్టిన యంత్రాంగం

తొట్టంబేడు అక్టోబర్ 23, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని పంచాయతీ పరిధిలో ఎల్ఇసి కాలనీ, ఈదులగుంట కాలనీ, బంగారమ్మ కాలనీ, బీడీ కాలనీల్లో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి చేడంతో ఈ సమస్యను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తెసుకుని రావడంతో సమాచారం అందుకున్న ఎంపీడీవో సురేంద్రనాథ్, తొట్టంబేడు తాసిల్దార్ భారతి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జెసిబి ఏర్పాటు చేసి వర్షపు నీరును నిలవకుండా కాలువకు వెళ్లే విధంగా చేశారు. ప్రభుత్వ సిబ్బంది మండలంలో ఎక్కడ ఎటువంటి అవాంతరనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలలో వర్షం సైతం లెక్కచేయకుండా ఇంచార్జ్ ఈవోపీఆర్డి భార్గవ్ , వీఆర్వో దినేష్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య లు కాలనీలలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందుబాటులో ఉంటున్నారు.

తిరుపతి

తుఫాన్ తాకిడికి నష్టపోయిన గిరిజనులకు ఆదుకోండి –ఎ.పి. గిరిజన సలహా మండలి సభ్యులు సుబ్బయ్య

శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెదేపా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులు సుబ్బయ్య గురువారం నాడు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి జిల్లా గిరిజన అధికారిని కలిసి నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కారణంగా లోతట్టు ప్రాంతాల గిరిజనులకు ముప్పు ఉందని గిరిజనుల గురించి వివరించి వారికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించి వారిని ఆదుకోవాలని వారిని తక్షణమే సాయం చేసి పునరావాసం కల్పించి ఆదుకోగలరని వర్షాలకు పనులన్నీ ఆగిపోవడం వలన కూలీకి పోతే గాని గడవని పరిస్థితి గిరిజనులదని వాళ్లకి తక్షణమే ఆర్థిక సహాయం అందజేసి వారికి పునరావాసం కల్పించాలని వారిని అధికారికంగా ఆదుకోవాలని. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య గిరిజన అధికారికి విజ్ఞప్తి చేయడం జరిగినది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

రోడ్డుపై మహిళ ప్రసవం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది

(పున్నమి )ప్రతినిధి ఆలంపల్లి దుర్గయ్య 23/10/2025 రోడ్డుపై మహిళ ప్రసవం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అయ్యింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.