Thursday, 23 April 2026

Blog

తెలంగాణ

తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 95,436 దరఖాస్తులు

పున్నమి ప్రతినిధి: 24/10/2025 ఆలంపల్లి దుర్గయ్య తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 95,436 దరఖాస్తులు గతంతో పోలిస్తే భారీగా 37 వేలు తగ్గిన దరఖాస్తుల సంఖ్య .. పెరిగిన 218 కోట్ల ఆదాయం గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ..పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారుల ఆందోళన తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి 95,436 దరఖాస్తులు దాఖలైనట్లు వెల్లడించిన ఎక్సైజ్ శాఖ అధికారులు గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయిన దరఖాస్తుల సంఖ్య దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం రాబట్టిన ప్రభుత్వం అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించిన ఎక్సైజ్ శాఖ గడువు పెంచడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పట్ల, నేడు విచారణ జరపనున్న హై కోర్టు

యాదాద్రి భువనగిరి

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్టపై కోకా కోలా యాడ్స్

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గయ్య 23/10/2025 పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్టపై కోకా కోలా యాడ్స్ యాదాద్రి గుట్టపై ప్రైవేట్ యాడ్స్ ఏంటి అంటూ భక్తుల ఆగ్రహం ఈవో, డీఈవో విదేశీ టూర్లలో ఉన్నారు.. ఇంచార్జ్ ఈవో అందుబాటులో లేడు, దీనిపై నాకేం తెలియదు అంటూ ఏఈవో నిర్లక్ష్యపు సమాధానాలు

కర్నూలు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా

బిగ్ బ్రేకింగ్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన బస్సు 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దూకి గాయాల పాలవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది* ఈ బస్సులో 40 మంది పైగా ఉండటంతో 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది*

ఖమ్మం

గో రక్షకుల మీద దాదుల పై బీజేపీ నిరసన -ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు

ఖమ్మం, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి): గోమాత రక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గోరక్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మెడ్చెల్ జిల్లా ఘట్కేసర్ వద్ద గోరక్షకుడు సోను (ప్రశాంత్)పై ఎంఐఎం గుండాలు తుపాకీ కాల్పులు జరిపిన ఘటనకు వ్యతిరేకంగా గురువారం ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాత మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు. గోరక్షకులు సమాజ సేవలో నిమగ్నమై ఉంటే వారిపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, గోరక్షకుల భద్రతకు చట్ట పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు. జిల్లాలో గో సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసి, అక్రమ రవాణా, గోవుల హత్యలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. గోశాలలకు మేత, నీరు, వైద్య సేవలు వంటి ప్రాథమిక సదుపాయాలు అందించాలని డిమాండ్‌ చేశారు. గోమాత రక్షణ కేవలం ధార్మిక కర్తవ్యం కాక, సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వినతిని స్వీకరించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

హైదరాబాద్‌, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి): డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ను తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తి చేయాలని, ఇప్పటికే 35 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైకోర్టు తీర్పు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్, వరంగల్‌లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి, రామగుండం పాత థర్మల్ స్టేషన్‌ను తొలగించేందుకు అనుమతి మంజూరు చేసింది.

తెలంగాణ

అనాధగా మిగిలిపోయిన బాలికకు ధైర్యం చెప్పిన : కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయి అనాధగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్ కు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు. మాడుగుల పల్లి మండలం ఆగామోత్కూర్ కు చెందిన తండ్రి,కొడుకులు పున్న సాంబయ్య, శివమణిలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా ఇదివరకే తల్లి ని కోల్పోయిన చిన్నారి నిత్య, తండ్రి, సోదరుడిని కూడా కోల్పోవడంతో అనాధగా మిగిలిపోయింది. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసిల్దార్ కార్యాలయంలో నిత్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని అన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేములపల్లి,మాడుగులపల్లి తహ సిల్దార్లు హేమలత, సరోజ పావని, డిప్యూటీ తహ సిల్దార్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది…చాక్లెట్ పరిశ్రమ స్థాపించండి*

*ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి* *రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది…చాక్లెట్ పరిశ్రమ స్థాపించండి* *అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు* *అబుదాబి, అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-* యూఏఈలోని రెండోరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలోని వివిధ పారిశ్రామికవేత్తలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏయే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మస్దార్, అగ్తియా గ్రూప్, లులు గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్టిమెంట్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీని ముఖ్యమంత్రి కోరారు. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని అపెక్స్, మస్దార్ సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈ క్రమంలో బ్యాటరీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులపై అపెక్స్ ప్రతినిధులు చర్చించారు. సూపర్ కెపాసిటర్స్ రంగంలో పేరొందిన అపెక్స్ సంస్థను ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని అపెక్స్ ప్రతినిధులను సీఎం కోరిన మీదట…సూపర్ కెపాసిటర్ ప్రొడెక్ట్సును పంపేందుకు అపెక్స్ ప్రతినిధులు అంగీకరించారు. ఇక ఆతిథ్య రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని ఎపెక్స్ సంస్థను సీఎం ఆహ్వానించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్‌, బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని మస్దార్ సీఈఓను చంద్రబాబు ఆహ్వానించారు. ఇక అగ్తియా గ్రూప్ సీఈఓతో సల్మీన్ అలమేరీ, లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీతో జరిపిన వేర్వేరు భేటీల్లో ఫుడ్ ప్రాసెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ రెండు సంస్థలను సీఎం ఆహ్వానించారు. ఏపీలో కోకో ఉత్పత్తి బాగుంటుందని… తమ దగ్గర చాక్లెట్ పరిశ్రమ పెట్టే అంశంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అగ్తియా గ్రూప్ కు సూచించారు. అలాగే గల్ఫ్ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలను తీసుకుని విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించారు.

తెలంగాణ

టెన్ ఫీజు షెడ్యూల్ విడుదల ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడి

పున్నమి అబ్దుల్లాపూర్మెట్ మండలం అక్టోబర్ 23 తెలంగాణలో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ షెడ్యూల్ను ప్రక టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఎగ్జామ్ ఫీజు స్కూల్ హెడ్ మాస్టర్లకు చెల్లించాలని తెలిపిం ది. హెంచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేసి ఆ వివరాలు నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 29 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేం దుకు అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖలో జిసిసి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి*

*బుపా సీఓఓ బిజల్ సెజ్ పాల్ తో మంత్రి నారా లోకేష్ భేటీ* *విశాఖలో జిసిసి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి* ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్): బ్రిటీష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ & ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్, దినేష్ కంతేటి (హెడ్, ఎంటర్ ప్రైజ్ ఇంటిలిజెన్స్)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుపా సీఓఓ బిజల్ సెజ్ పాల్ మాట్లాడుతూ… లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్ లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోమ్ లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

పార్టీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై మీడియాలో సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

దుబాయ్ పు న్నమి ప్రతినిధి: * పార్టీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై మీడియాలో సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. * పరిణామాలపై అసంతృప్తి వివిధ అంశాలపై నేతల బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు.. • ఈ అంశాలపై దుబాయ్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. • ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివాదానికి కారణమైన ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని సీఎం చంద్రబాబుకు చెప్పిన పల్లా శ్రీనివాస్.. • వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని పల్లాకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. • యూఏఈ నుంచి వచ్చాక పార్టీలో ఘటనలు నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని చెప్పిన చంద్రబాబు.. • రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి.. • పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా పాజిటివ్ నెస్ దెబ్బతీసేలా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వారిని ఇక ఉపేక్షించేది లేదన్న సిఎం.. • ఏవైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని ఇలా బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్న సీఎం చంద్రబాబు.. • బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయ పడిన సిఎం.. • దుబాయ్ నుంచి సిఎం ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల మీటింగ్ ను రద్దు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.