Thursday, 23 April 2026

Blog

అమరావతి

*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.* *స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం.. నవంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.* *క్లస్టర్‌ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం.. స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.* *పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌*

తిరుపతి

గురువారం గురుదక్షిణా మూర్తికి ప్రత్యేక అభిషేకములు

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నందు గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి గురువారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకములు,హారతులు,దూప దీప నైవేద్యాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులు,పుర ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔸లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కలిగిరి అక్టోబర్ 23న వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, వరుడు జస్వంత్‌ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, లెక్కల వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా కొంత సమయం ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని వరుడును ఆశీర్వదించారు.

తిరుపతి

రాష్ట్ర స్థాయి అండర్ 17 బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక

శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్.వి డిగ్రీ కళాశాల నందు జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది.శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన గా బాలుర విభాగంలో 5 మందిని బాలికలు విభాగంలో 5 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఈ ఎంపిక పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు భార్గవి ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి సమీక్ష

పున్నమి ప్రతినిధి : 23/10/2025 ఆలంపల్లి దుర్గేష్ రోజు ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ (క్యాంపు ఆఫీస్ )లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రెవిన్యూ, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్,ఆర్ టీసి, ఇరిగేషన్, మున్సిపల్,అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి

అన్నమయ్య

ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని నిరుపేదలకు ఇవ్వండి

-చిట్వేల్ తహసిల్దార్‌ను కలిసి ఆదేశాలిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు -అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తహసిల్దార్ హామీ చిట్వేలి, అక్టోబర్ 23(పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేలి మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలుగా మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు గురువారం తహసిల్దార్‌ను కలిసి ఆదేశాలు ఇచ్చారు.కస్తూరి విశ్వనాథ నాయుడు చిట్వేలి మండలంలోని మాలెమాపురం గ్రామపంచాయతీ ఈడిగపల్లి గ్రామస్థులతో కలిసి స్థానిక తహసిల్దార్ గారిని కలిసి ఈ సమస్యను ప్రస్తావించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని నిరుపేదలైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. -తహసిల్దార్ సానుకూల స్పందన దీనిపై తహసిల్దార్ సానుకూలంగా స్పందించారు. “రేపే నేను ఆ గ్రామాన్ని సందర్శిస్తాను. ఎక్కడైతే ఆక్రమణకు గురైందో ఆ ప్రదేశానికి వెళ్లి వెంటనే గుర్తిస్తాను. మీరు చెప్పినట్లుగా ఎవరైతే అర్హులు ఉంటారో వారిని గుర్తించి తప్పకుండా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాము,” అని తహసిల్దార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ మరియు మండలంలోని ముఖ్య నాయకులు, ఈడిగపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

E-పేపర్

ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది

పున్నమి ప్రతినిధి } ఆలంపల్లి దుర్గయ్య 23/10/2025 ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది . స్థానిక తలాటి స్వామి పెద్దకొడుకు తలాటి హరిబాబు కొడుకు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, స్వామి అనే వ్యక్తి బైకు పైన ముగ్గురు పిల్లలు ఉన్నారు స్వామి ఇద్దరి కొడుకులు తన తమ్ముడి కొడుకు ఒకరు తన కుటుంబంతో కలిసి ఒక పెళ్లికి వెళ్తుండగా, వారి బైక్‌ను వెనక నుండి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, స్వామికి మరియు అతని చిన్న కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముద్విన్ గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

E-పేపర్

స్పాట్ న్యూస్

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూ గో జిల్లా…. కొయ్యలగూడెం మండలం. జగన్నాధపురం జాతీయ రహదారిపై రెండు బైక్లు ఎదురెదురుగా డి…. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు….. ఇద్దరు పరిస్థితి విషమం.. 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. End

తిరుపతి

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా గురువారం సాంస్కృతిక కళా ప్రాంగణం వద్ద తిరుపతికి చెందిన వినూత్న అకాడమీ అండ్ ఆర్ట్స్ వారిచే నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది.శివపార్వతుల నృత్యం,స్వామి రారా అంటూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాణాఅధికారి టి.బాపిరెడ్డి దంపతులు,దేవస్థానం అధికారులు సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

విప్లవం వర్ధిల్లాలి

సిపిఐ (మావోయిస్టు పార్టీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విప్లవోద్యమంపై, పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగిన రాజ్యం చేతిలో, ప్రజల త్యాగాల విప్లవోద్యమ నిర్మాణాలు, సమూలంగా నిర్మూలించబడుతున్న నేటి విధ్వంసకర దుస్థితిలో.. ఉద్యమకారులు జీవించి ఉండడం (ప్రాణాలతో బయటపడడం) కూడా ఒక విజయంగా భావించే అనివార్యమైన ఒక విపత్కర పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఉద్యమ నాయకత్వాలే తప్పా, మరెవ్వరూ కాదు! ఎందుకంటే సామాజిక, ఆర్థిక అసమానతలకు నిలయమైన ఈ దేశంలో ఉన్నంత అనుకూల విప్లవ పరిస్థితి, మరే దేశంలోనూ లేదు కాబట్టి! ఇక మానవ సమాజాన్ని శ్రామిక కోణంలోనూ, వర్గ దృక్పథంతోనూ విశ్లేషించే విముక్తి చేసే, ఒక అద్భుతమైన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు, స్థల కాలాలకు అన్వయించి, ప్రజలను చైతన్యం చేయడంలో విప్లవ నాయకత్వాలు విఫలమయ్యాయి కాబట్టి! 1925 లో కమ్యూనిస్టు పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, పార్టీల్లో అతివాదుల ఆలోచన విధానాల సెక్టేరియన్ చర్యల ఫలితాలే, ఈ దేశంలో అనేక సార్లు విప్లవ ఉద్యమాలు బలహీనం అవ్వడానికి, విఫలం అవడానికి ప్రధాన కారణాలు! ఇలాంటి ఈ దుస్థితుల్లో, నేడు ఉద్యమ సహచరులు బహిరంగ జీవితంలోకి రావడం అంటే (లొంగిపోవడం), అది విప్లవ ద్రోహం కాదు! ఇంతకాలం వాళ్ళు ఉద్యమ జీవితంలో, చావుతో సవాల్ చేసి బతికినవాళ్లు. నేడు చావుకు భయపడి వాళ్ళు బయటకు రావడం లేదు! అయితే లొంగిపోతున్న విధానంలో కొన్ని సంఘటనలు, వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశాలుగా ఉండవచ్చు. వాటిని విడిగా చర్చించుకోవాలే తప్పా, అవే ప్రధాన అంశాలు కాదు! ఏదిఏమైనా ఈ పరిస్థితుల్లో ఉద్యమ సహచరులు బహిరంగ జీవితంలోకి రావడం, విప్లవ ద్రోహం ఎంత మాత్రం కాదు! ఈ లొంగిపోవడం అనే బాధాకరమైన ఈ పనిని, విప్లవద్రోహం అని అంటున్న వాళ్ళు, మరి ఇన్నేళ్ళ ఆ ఉద్యమ సహచరుల కాంట్రిబ్యూషన్ను వీళ్ళు ఎందుకు గుర్తించరు? అలా గుర్తించనప్పుడు, ఈ నిందారోపణలు చేసే హక్కు నాయకత్వానికి గానీ, ఈ కుహనా విప్లవ మేధావులకు గానీ లేదు! నిజంగా బయట ఉన్న ఈ సామాజిక విప్లవ మేధావులకు ప్రజల పట్ల, వారి జీవన వికాసం పట్ల ఏమాత్రం బాధ్యత ప్రేమ ఉన్నా.. అనివార్య పరిస్థితుల్లో లొంగిపోతున్న వీళ్ళందర్నీ కలిసి, ఉద్యమ పార్టీలతో, ప్రజాసంఘాలతో ఒక ఐక్య ఉద్యమ కార్యాచరణ కమిటీని నిర్మించి, ఈ ప్రత్యామ్నాయ ఉద్యమ వేదిక ద్వారా, నమ్ముకున్న ప్రజలకు, మేమున్నాం అని, ఒక భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత, ఈ బుద్ధి జీవుల మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది, ఈ విధమైన ప్రయత్నాన్ని. కానీ ఈ పని వీళ్ళు చేయకుండా, బయటకు వస్తున్న విప్లవకారుల మీద, నిస్సిగ్గుగా దుర్మార్గంగా ఈ విధమైన నిందారోపణలు చేయడం, అత్యంత హేయమైన చర్య.. విప్లవం వర్ధిల్లాలి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.