Thursday, 23 April 2026

Blog

విశాఖపట్నం

మహిళల భద్రత కోసం శక్తి యాప్

మహిళల భద్రత కోసం శక్తి యాప్ విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ,; పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ వి. చిన్నబాబు పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్‌లో, అలాగే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ జిలానీ వేపగుంటలోని Ortus కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినులతో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్” గురించి విద్యార్థులకు వివరించి, ప్రమాదస్థితుల్లో ఈ యాప్ ఎలా వెంటనే సహాయం అందిస్తుందో అవగాహన కల్పించారు. అదనంగా, మహిళలు తమ భద్రతకు పాటించాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలు గురించి సూచనలు అందించారు. పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ముందుకు కూడా కొనసాగుతాయని తెలిపారు.

విశాఖపట్నం

32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణముకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *దక్షిణనియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* *30వార్డు పరిధిలో 40.04లక్షల జీవీఎంసీ నిధులతో కొత్త జాలారిపేట వద్ద పలు అభివృద్ధి పనులకు మరియు 32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణముకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు* *కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సౌత్ ఇన్చార్జి సుధాకర్ గారు కార్పొరేటర్లు శ్రీమతి అప్పల రత్నం గారు, శ్రీ కందుల నాగరాజు గారు* *శంకుస్థాపన చేసిన పనుల వివరాలు* *30వార్డ్ పరిధిలో 11లక్షల నిధులతో కోడిపంధేల వీధి వద్ద CC డ్రెయిన్ల మరమ్మతులు* *30 వార్డ్ పరిధిలో కోడిపంధేల వీధిలో 10.61లక్షల నిధులతో దెబ్బతిన్న CC రోడ్ల మరమ్మత్తులు* *30వార్డ్ పరిధిలో 10.45లక్షల నిధులతో కొత్త జాలరిపేట వద్ద SW డ్రెయిన్ మరమ్మతులు* *30 వార్డు పరిధిలో 4.36 లక్షల నిధులతో తాడివీధి వద్ద కాంపౌండ్ వాల్ & బయటి ఫ్లోరింగ్ మరమ్మతులు* *30 వార్డు పరిధిలో లో వివిధ ప్రదేశాలలో ఫుట్‌పాత్ గ్రేటింగ్‌లు మరియు కవర్ స్లాబ్‌ల ఫిక్సింగ్ పనులు నిమిత్తము* *32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణము* కార్యక్రమంలో ఎమ్మెల్యేశ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందనీ, నియోజకవర్గములో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తామని చెప్పాము, ఆ విధంగా ముందుకు వెళుతున్నామని పలికారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలు గమనించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని అన్నారు.రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు, ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని అన్నారు. దక్షిణ నియోజకవర్గం ఓల్డ్ సిటీ అని , డ్రైనేజీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అధికంగా ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు స్థానిక నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో అద్భుత పరిపాలన విశాఖ ప్రజలు చూడబోతున్నారని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పాలన సాగిస్తున్నారనీ, వారి ఆదేశాల మేరకు ప్రజలకు దగ్గరగా సేవలు అందించేందుకు పనిచేస్తున్నామనీ గుర్తుచేశారు. గూగుల్ వంటి పది సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయినీ తెలిపారు. స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్ ,మెట్రో వస్తే విశాఖ రూపురేఖలు మారనున్నాయినీ అన్నారు.గూగుల్ ను విశాఖపట్నం తీసుకువచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలిపారు.రానున్న రోజుల్లో విశాఖ పేరు ప్రపంచ పటంలో నెంబర్ వన్ గా మారుమ్రోగనుంది, ఇది విశాఖ ప్రజల అదృష్టం నీ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ గారు, జోన్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారు, అధ్యక్షులు శ్రీమతి యజ్ఞశ్రీ,, శ్రీ రమణ గారు, శ్రీ అర్జున్ గారు, కూటమి సీనియర్ నాయకులు, వివిధ విభాగాల కూటమినేతలు , కార్యకర్తలు ,జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు….

కర్నూలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సర్వజన వైద్యశాలకు విల్ చైర్ మరియు ఎయిర్ బేడ్ విరాళం

కర్నూలు పున్నమి ప్రతినిధి *కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళం* *ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ :-* కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శ్రీ M. రమేశ్ గారి తల్లి అయిన రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి జ్ఞాపకార్థంగా ఆసుపత్రికి వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళంగా అందజేశారు. సామాజిక సేవా దృక్పథంతో ఆసుపత్రికి ఈ పరికరాలు అందజేయడం పట్ల మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు. ఈ విరాళంగా అందిన పరికరాలను ఎమర్జెన్సీ విభాగాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిఎస్‌ఆర్‌ఎంఓ, డా.వెంకటరమణ, శ్రీ M.రమేశ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో అధ్వానంగా అరుంధతివాడ రహదారి

-మా గ్రామంలో వెంటనే సిమెంట్ రోడ్డు వేయించండి’:గ్రామస్తుల విజ్ఞప్తి -బురదమయమైన మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు; వ్యాధులు ప్రబలే ప్రమాదం చిట్వేలి: అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి) చిట్వేలి అరుంధతి వాడలోని రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి రోడ్లు పూర్తిగా పాడై, బురదమయంగా మారాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోడ్డు పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలు, వృద్ధులు ఈ దారిలో నడవాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. బురదమయంగా ఉన్న రహదారిలో దోమలు వృద్ధి చెంది, ప్రజలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై వెంటనే అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏరియా శ్రేయస్సు దృష్ట్యా గ్రామాన్ని పరిశీలించి, వెంటనే సిమెంట్ రోడ్డు వేయించాలని వారు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

కాల మాన పరిస్తులకు దర్పణం నాటకం – పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి

కాల మాన పరిస్తులకు దర్పణం నాటకం – పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: నాటకాలు కాల మాన పరిస్తులకు దర్పణం పడతాయని ఆదరించి ప్రోత్సహించాలని పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్ లో డా. శంఖ బ్రత బాగ్చి రసజ్ఞ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి 4 రోజుల పాటు జరిగే బహు భాషా నాటకోత్సవాలు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ నాటకాలు సమాజ పరిస్తులకు దర్పణంగా నిలుస్తాయన్నారు. వీటిని ఆదరించి ప్రోత్సహిస్తే తరాలు మారినా సమాజ ఘటనలు ప్రతి ఫలింప జేస్తాయన్నారు. నిర్వాహక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా వేమలి త్రినాథ్ రావు మాట్లాడుతూ కళాభారతి లో జరిగే నాటకోసవాలు ప్రవేశం ఉచితం అన్నారు. ఈ బహు భాషా నాటకోత్సవాలు ను ఆదరించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో హేమ వెంకటేశ్వరి కూడా పాల్గొన్నారు.

Blog

ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ మహాసభకు మంత్రి ఫరూక్ ఆహ్వానం

నంద్యాల స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగనున్న ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ మహాసభకు మరియు ఏపీ ఎమ్మార్పీఎస్ 12 వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి విజయోత్సవ మహాసభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మధు పాల్గొన్నారు

విశాఖపట్నం

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు* *జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్*

*మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు* *జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్* *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది.* *ఈ సమావేశంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన వివరాలను అధికారుల నుండి జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.* *ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ మరియు క్వాంటిటీ లలో అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు, హెడ్మాస్టర్లు ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారము విద్యార్థులకు భోజనం అందిస్తున్నది లేనిది తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. వైద్యాధికారులు స్కూల్స్ ని తనిఖీ చేసి విద్యార్థులకు అవసరమైన ఐరన్ టాబ్లెట్స్ తో పాటు అవసరమైన వారికి ఇతర మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు స్థానిక పి హెచ్ సి వైద్యాధికారుల సమన్వయంతో విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలన్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని డిఎం సివిల్ సప్లై అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నాణ్యమైన వెజిటబుల్స్ సేకరించాలని, మెనూ ప్రకారం మాత్రమే భోజనాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే కోడిగుడ్లను మొదటి వారంలో నీలం రంగు స్టాంపును, రెండవ వారంలో పింకు రంగు స్టాంపును మూడవ వారంలో పచ్చ రంగు స్టాంపును నాలుగో వారంలో బ్రౌన్ కలర్ స్టాంపును వినియోగించాలన్నారు. బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువులను నిలువ చేసే రూముల్లో పరిశుభ్రత పాటించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.* *ఈ సమావేశంలో విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.జగదీశ్వరరావు, డి ఎస్ ఓ. భాస్కర రావు, పి డి., డి ఆర్ డి ఎ లక్ష్మీపతి, FCI అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.*

ఎన్ టి ఆర్ జిల్లా

*69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభం — ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లాంఛనంగా ప్రారంభించారు*

జగ్గయ్యపేట మండలం చిలకలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్ పోటీలను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థైర్యం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. “తల్లికి వందనం” పథకం కింద ప్రతి పిల్లవాడు, పిల్లవాడు ప్రయోజనం పొందుతుండడం గత ప్రభుత్వంతో పోల్చితే ముఖ్యమంత్రి విద్య పట్ల ఆసక్తిని మరియు భవిష్యత్ తరాల పట్ల ఉన్న దృష్టికోణాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు. తరువాత ప్రారంభ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహం గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా విభాగాధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

తెలంగాణ

సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలన్న : కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి గుర్తించిన స్థలంలో సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెం వద్ద ఉన్న సర్వే నంబర్ 214 లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదించగా, మొత్తం 25 ఎకరాల స్థలంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టెందుకు గాను సరిహద్దులను నిర్ధారించి మ్యాప్ తో సహా పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ పవన్, మిర్యాలగూడ తహసిల్దార్ సురేష్ తదితరులు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభం — ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లాంఛనంగా ప్రారంభించారు*

జగ్గయ్యపేట మండలం చిలకలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ నందిగామ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్ పోటీలను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మరియు మానసిక స్థైర్యం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. “తల్లికి వందనం” పథకం కింద ప్రతి పిల్లవాడు, పిల్లవాడు ప్రయోజనం పొందుతుండడం గత ప్రభుత్వంతో పోల్చితే ముఖ్యమంత్రి విద్య పట్ల ఆసక్తిని మరియు భవిష్యత్ తరాల పట్ల ఉన్న దృష్టికోణాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు. తరువాత ప్రారంభ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహం గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా విభాగాధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.