Friday, 24 April 2026

Blog

తిరుపతి

జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో శ్రీకాళహస్తి పట్టణంలో ని విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు శనివారం నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 బహుళ జాతీయ కంపెనీల లో 800 లకు పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇంటర్యూ లు నిర్వహించబడునని, నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.అలాగే గతంలో కూడా అనేక పర్యాయములు శ్రీకాళహస్తిలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజనులకు అండగా ఉంటాం — జనసేనాని బొబ్బేపల్లి

మనుబోలు (పున్నమి అక్టోబర్ 23): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త జనసేనాని బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలం గొట్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీని పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన కాలనీ నివాసులను కలుసుకుని వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. వాళ్లలో ఇంకా కొంతమందికి ఉచిత గ్యాస్ సౌకర్యం అందలేదని స్థానికులు వివరించగా, ఆ అంశాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పథకాల ద్వారా పరిష్కారం కల్పిస్తామని బొబ్బేపల్లి తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించారని, అయితే ఆ వ్యవస్థ ప్రజలకు ఎంత ఉపయోగపడిందో ఇప్పటికీ ప్రశ్నార్థకమేనని ఆయన వ్యాఖ్యానించారు. “ఇప్పటికీ వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, రైతులు నిలదొక్కుకోవాలన్నా, యువత భవిష్యత్తు మెరుగుపడాలన్నా — ఒక బలమైన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం” అని జనసేనాని బొబ్బేపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల నరసింహ, పారిచెర్ల శరత్, సందూరి శ్రీహరి, పోట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ – మంత్రి ఎన్ఎండి ఫరూక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా విద్యార్థినీ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, రుచిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నంద్యాల డీఈవో జనార్ధన్ రెడ్డి , మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉర్దూ డిఐ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సుమారు రూ. 18.47 కోట్లతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన

సుమారు రూ. 18.47 కోట్లతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: నగర అభివృధ్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ 6వ జోన్ (గాజువాక) లోని 72, 74, 76, 86 వార్డులలో జీవీఎంసీ నిధుల నుండి సుమారు 1847.07 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రతో పాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. 72 వార్డు పరిధిలోని చిన్న గంట్యాడ, శ్రీనగర్ ప్రాంతాలలో సిసి రోడ్లు, సి సి కాలువలు, కల్వర్టులు నిర్మాణానికి సుమారు రూ. 87.20 లక్షలు, 74 వ వార్డు పరిధిలోని దయాల్ నగర్, అంబేద్కర్ కాలనీ, వియ్యపువానిపాలెం, పెద్ద కోరాడ, దల్లివానిపాలెం, టి జి ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, సి సి కాలువలు, కల్వర్టులు రిటర్నింగ్ వాల్స్ నిర్మాణానికి సుమారు రూ. 217.95 లక్షలు, 76 వార్డు పరిధిలోని నడిపూరు డైరీ కాలనీ, గాంధీనగర్, రిక్షా కాలనీ, పరిసరాల ప్రాంతాలలో వి ఆర్ సి సి కాలువలు, తారు రోడ్లు నిర్మాణానికి సుమారు రూ. 445.99 లక్షలు, 86వ వార్డు పరిధిలోని చిన్నయాతపాలెం, భారత నగర్, రిక్షా కాలనీ, కూర్మం పాలెం తదితర ప్రాంతాలలో సుమారు రూ. 295.93 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శాసనసభ్యులతో కలిసి శంకుస్థాపన చేశామన్నారు. అనంతరం గాజువాక శాసనసభ్యులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక అభివృద్దే నా ప్రధమ కర్తవ్యం అని, రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని, గాజువాకలోని అన్ని ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగా సుమారు రూ. 18.47 కోట్లతో గాజువాక జోన్ లోని 72, 74, 76, 86 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు,ఆయా వార్డుల కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, ఎ . జె.స్టాలిన్, తిప్పల వంశీ రెడ్డి, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీరు, కార్యనిర్వహక ఇంజినీరు, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం

సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అమరావతి, అక్టోబరుపున్నమి ప్రతినిధి:పూర్వోదయ పధకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్ పై గురువారం ఎపి సచివాలయంలో నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశమై చర్చించారు.ఈసందర్భంగా నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ ముందుందని పూర్వోదయ పధకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగాపోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.అదే విధంగా రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పధకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్దం చేసుకోవాలని సిఎస్ విజయానంద్ కు ఆయన సూచించారు.అనంతరం విశాఖపట్నం,అమరావతి,తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవతంగా ముందుకు తీసుకువెళ్ళడం తోపాటు అనేక నూతన ప్రాజెక్టులు,పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు,పధకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరుగుతోందని కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యంకు విజ్ణప్తి చేశారు. కాగా పూర్వోదయ అనేది దేశ తూర్పతీరంలోని ఆంద్రప్రదేశ్,ఒడిస్సా,పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్,బీహార్ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పధకం.ఇది సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వనరులను ఉపయోగించుకోవడం,కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం,ఉపాధిని సృష్టించడం మరియు స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం ద్వారా తూర్పు భారతదేశాన్ని జాతీయ పురోగతికి కీలకమైన చోదకంగా మార్చాలనే లక్ష్యంతో పూర్వోదయ పధకాన్ని చేపట్టడం జరిగింది.దీనిద్వారా పెద్దఎత్తున రహదారులు వంతెనలు,విమానాశ్రయాలు,విద్యుత్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది.ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి,పారిశ్రామికాభివృద్ధికి మరింత దోహద చేస్తాయి.అంతేగాక పూర్వోదయ విద్యా మరియు నైపుణ్య-అభివృద్ధి సంస్థలను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.అర్హత కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి ఐఐటి ఇతర నైపుణ్య-శిక్షణా కేంద్రాల్లో సామర్థ్య విస్తరణ కూడా దోహదపడుతుంది. పూర్వోదయ పథకం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు,ఉద్యోగ అవకాశాలు,నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుంది.అంతేగాక పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం తోపాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం, మత్స్య సంపద వంటి రంగాల్లో విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది.సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశం అంతటా ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది.మెరుగైన కనెక్టివిటీ మరియు పారిశ్రామిక సామర్థ్యం తూర్పు రాష్ట్రాలను ఎగుమతులు మరియు స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంచుతాయి. అదే విధంగా తూర్పు భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వైపు పూర్వోదయ ఒక ముఖ్యమైన ముందడుగా చెప్పవచ్చును.సమానమైన వృద్ధిని సృష్టించడం మరియు తూర్పు భారత దేశాన్ని శక్తివంతమైన ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.మౌలిక సదుపాయాలు,విద్య మరియు ఆర్థిక సాధికారతలో కొనసాగుతున్న పెట్టుబడులతో 2047 నాటికి వికసిత్ భారత్ అనగా అభివృద్ధి చెందిన భారతదేశంగా మారే ప్రయాణంలో పూర్వోదయ పధకం తూర్పు తీర ప్రాంతంలో ఒక కీలక పాత్ర పోషించనుంది. ఈసమావేశంలో నీతి ఆయోగ్ అదనపు సిఇఓ పార్ధసారధి రెడ్డి,రాష్ట్ర ఆర్దిక,ప్రణాళికల శాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఆర్ధికశాఖ కార్యదర్శి వినయ్ చంద్,ప్రణాళికాశాక జెఎస్ అనంత శంకర్,నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి జి.గణేశ్ కుమార్ పాల్గొన్నారు.

Blog

సబ్జెక్టు పరమైన విధ్య తొ పాటు ప్రస్తుత టెక్నాలజీ కాలం లో కంప్యూటర్ విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలి

నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హై స్కూల్ నందు పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ప్రాక్టీస్ మెటీరియల్ ను సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎమ్) తరుపున ఆవిష్కరణ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సిఈడిఎమ్ డైరెక్టర్ కే. యాఖూబ్ బాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని సిఈడిఎమ్ ఆధ్వర్యంలో ప్రచురితమైన పదవ తరగతి ఉర్దూ మాధ్యమం ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను ఆవిష్కరించారు. తదనంతరం సిఈడిఎమ్ అసోసియేట్ మునీర్ అహ్మద్ తన ప్రసంగం లో మైనారిటీ విద్యార్థుల విద్యా పరం, గ్రూప్, డి. ఎస్. సి, టేట్ పోలీస్, తదితర ఉద్యోగాలు సాధించటకు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు అన్నారు ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో విద్యార్థులకు సబ్జెక్టు వారి బోధన తొ పాటు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు.. త్వరలో స్థానిక ఉర్దూ భవన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ తరుపున కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి మంచి ఫ్యాక్టల్టీ తొ ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభం చేస్తామన్నారు.. స్కూల్, కాలేజీ విద్యార్థులు సాయంత్రానికి తమ కు అనుకూలంగా ఉన్న టైమ్ లో కంప్యూటర్ శిక్షణ తరగతుల కు హాజరు కావచ్చు అన్నారు.. రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన ముగ్గురు పదవ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు 11 నవంబర్ జాతీయ విద్య దినోత్సవం నాడు ఉర్దూ అకాడమీ ద్వారా పది వేలు, మెడల్, ప్రశంస పత్రాలు అందచేయటం కొరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. క్రమ శిక్షణ తొ రెగ్యులర్ గా పాఠశాల కు వచ్చి ఉన్నత విద్య అభ్యసించి తమ భవిష్యత్తు ను ఉజ్వలమైన భవిష్యత్తు గా మలుచుకొవాలన్నారు జిల్లా విద్యా శాఖ అధికారీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మరియు రాష్ట్ర మైనార్టీలకు మంచి మనసున్న నాయకులు ఫరూక్ గారు ఉండడం అదృష్టం అన్నారు.. క్రమశిక్షణతో చదువు కొనసాగించాలని విద్యార్థుల ను కోరారు సిఈడిఎమ్ డైరెక్టర్ యాఖూబ్ బాష మాట్లాడుతూ గత సంవత్సరం వరకు రెండు నెలలు పరీక్షలు ఉన్నాయి అనగా ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేసేవారు కానీ ఈ విద్యా సంవత్సరం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి గారి ప్రత్యేక చేరువతొ ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ ను పబ్లిక్ పరీక్షల 6 నెలల ముందు పంపిన చేయడం మంచి శుభ పరిణామం అన్నారు.. నవంబర్ 5 వ తేదీ లోపల రాష్ట్రం లోని ప్రతి ఉర్దూ ఉన్నత పాఠశాల వరకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేయుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ తరుపున రాష్ట్ర కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్, నంద్యాల జిల్లా అధ్యక్షరాలు షమీమ్ బాను, నంద్యాల లో సిఈడిఎమ్ రీజనల్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండూ, మూడు ర్యాంకులు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఉర్దూ అకాడమీ ద్వారా 5 వేల బదులు పది వేలు, మెడల్ ప్రశంస పత్రం అందచేయీలని మంత్రి కి వినతి పత్రం అందజేశారు తదనంతరం నంద్యాల మండలం, మహానంది మండలంలోని పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు సిఈడిఎమ్ ఉచిత ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ రేంజ్ అస్ముద్దీన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లాహ, తెలుగుదేశం పార్టీ ప్రముఖ మైనారిటీ నాయకులు చాబోలు ఇలాయస్, ఉర్దూ ఉపాధ్యాయలు, పెద్ద సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు..

విశాఖపట్నం

డాక్టర్ల నిర్లక్ష్యం … నిండు గర్భిణీ ప్రసవంలో నిర్లక్ష్యం… పసికందు మృతి….

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: డాక్టర్ల నిర్లక్ష్యం … నిండు గర్భిణీ ప్రసవంలో నిర్లక్ష్యం… పసికందు మృతి…. అగనంపూడి వైద్య విధాన్ పరిషత్ డాక్టర్ల నిర్వాకం…. వీళ్ళు మారరా… నిండు ప్రాణమంటే అంత చులకన… అధికారుల నిరక్ష్యానికి చర్యలు తీసుకునే నాథుడే లేడా…. ఏమిచేయ్యలేని స్థితిలో కుటుంబం… సకాలంలో స్పందించని వైద్య బృందం…. పురటాలకి రక్తశ్రావం అవుతున్న నడిపించి స్కానింగ్ కు తీసుకువెళ్లినట్టు చెబుతున్న బంధువులు…. పోయిన ప్రాణం ఎలాగా తిరిగి రాదు మాకు జరిగిన అన్యాయం వేరే ఒకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో మా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని బాలింత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు..

యాదాద్రి భువనగిరి

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్23,(పున్నమి ప్రతినిధి): చౌటుప్పల్ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు ఏడవ తరగతి 2001 – 2007 సంవత్సర విద్యార్థులు.ఈ నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించుకున్నారు.వారు చదువుకున్న నాటి జ్ఞాపకాలను,ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క విద్యా బోధనలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ రెడ్డి,మురళీధర్ రావు,సత్తయ్య,సత్యవతి, సరళ,మాట్లాడుతూ తమను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పిలిచి సత్కరించినందుకు,అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మల్లికార్జున్,ఖాసిం,శ్రావణ్,సికిందర్,నవీన్,జగదీష్,ప్రవీణ్,అబ్బాస్,జావిద్,ఇమ్రాన్,శ్రీను,సాయిరాం, సమీన,చందన,ఊర్మిళ,శ్రావణి,తదితరులు,పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాజయ్యపేట మత్స్యకారులకు అండగా నిలుద్దాం! * లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన వాసుపల్లి

రాజయ్యపేట మత్స్యకారులకు అండగా నిలుద్దాం! * లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన వాసుపల్లి * సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బల్క్ డ్రగ్స్ పార్కును వ్యతిరేకిస్తూ నక్కపల్లి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. స్థానికులకు ఒప్పించి వారి ఆమోదంతోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని జగనన్న మాటగా డిమాండ్ చేస్తున్నట్లు వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. ఆసీలమెట్టలో గల పార్టీ కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులు, మత్స్యకార నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి మత్స్యకారుడిగా తన వాళ్ళు ఎక్కడ ఉన్నా.. అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్ను వ్యతిరేకిస్తూ రాజయ్య పేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు. స్థానికులను ఒప్పించి వారి ఆమోదంతోనే కంపెనీలు ఏర్పాటు చేయాలనీ గుర్తు చేశారు. ఇది జగనన్న మాటగా చెబుతున్నాం అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో వందలాదిమంది పోలీసులను దించడం కూటమి సర్కార్ సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారులన్నీ దిగ్బంధం చేయడం పిరికి బంద చర్యగా ఆయన అభివర్ణించారు. సంఘీభావం తెలిపే నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. వారం రోజులగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని తుత్తునియలు చేస్తూ వైఎస్సార్సీపీl అండగా నిలిచి, మేమున్నామని భరోసా ఇచ్చిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహ న్రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ అగ్ర నేతలు గ్రామాన్ని ఇటీవల సందర్శించారనీ పేర్కొన్నారు. డ్రగ్ పరిశ్రమ ఆపే వరకు మత్స్యకారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైయస్సార్సీపీ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ వార్డు అధ్యక్షులు, సినియర్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blog

ఆకుమల్ల రహీమ్ సేవలకు గుర్తింపుగా కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు

వార్షికోత్సవ సందర్భముగా విజయవాడ లోనీ తుమ్మల్లపల్లి కళాక్షత్రం లో జరిగిన కార్యక్రమం లో దేశం కోసం, సమాజం కోసం, జాతి కోసం మంచి సేవలు చేసిన ముస్లిం వ్యక్తులని, సంస్థ లను కొందరిని గుర్తించి ఆల్ మదద్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ ఆకుమల్ల రహీమ్ సేవలను గుర్తించి కంపెనీన్శిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అనే అవార్డు తొ సన్మానించి మెమంటోను, సర్టిఫికెట్ ను ఇంతియాజ్ ఐఏఎస్ మాజీ మరియు మోటివేషన్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ చేతుల మీదుగా అందించి సత్కరించడం జరిగింది అని ఆకుమల్ల రహీమ్ తెలిపారు. మా సేవలను గుర్తించి అవార్డు ఇచ్చి గౌరవించినందుకు కంపెనీన్శిప్ గ్రూప్ సభ్యులందరికి ధన్యవాదములు తెలుపుతూ సమాజహితం కొరకు సేవలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని ప్రోత్సహించే విధముగా చేయడం వలన భవిష్యత్ లో ఇంకా ఎక్కువ ఉత్సహం తొ సేవలు అందించడానికి ఉపయోగ పడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో N MD ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ పర్సనల్ సెక్రటరీ టీ డి జనార్దన్ గుంటూరు ఈస్ట్ MLA నసీర్ అహమ్మద్ మాజీ ఐఏఎస్ ఇంటియాజ్ బ్రదర్ సిరాజ్ కంపెనీన్శిప్ ఫౌండర్ షబ్బీర్ మరియు వారి టీమ్ సభ్యులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.