Friday, 24 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో భారీ వర్షానికి జలమయమైన రహదారులు

అల్పపీడనం కారణంగా గురువారం రాజోలు గ్రామంలో భారీ వర్షం కురియడంతో రహదారులు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ రేవు జ్యోతి తెలిపారు. గ్రామ పంచాయతీ తరపున సిబ్బందిని నియమించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల నుంచి వర్షపు నీటిని తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. రవాణాకు ఆటంకం లేకుండా చేశారు.

విశాఖపట్నం

5వ జోన్ లో నవంబరు 6 న బహిరంగ వేలం – జివిఎంసి జోనల్ కమిషనర్ బి. రాము.

5వ జోన్ లో నవంబరు 6 న బహిరంగ వేలం – జివిఎంసి జోనల్ కమిషనర్ బి. రాము. విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 5వ జోన్ పరిధిలోని ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు నవంబరు 6 వ తేదీన ఉదయం 11 గంటలకు 5వ జోన్ (జ్ఞానాపురం) జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని జోనల్ కమిషనర్ బి.రాము గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. మహా విశాఖ నగర పాలక సంస్థ, జ్ఞానాపురం, జోన్-5, పరిధిలోని వార్డు నెం.40 నుండి 63 వరకు ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపములు, రోడ్డు సైడ్ మార్కెట్ల కు తేది 06-11-2025 ఉదయం 11.00 లకు జ్ఞానాపురం లో 5వ జోనల్ కార్యాలయము నందు దిగువ తెలిపిన వివరాలు ప్రకారం బహిరంగ వేలము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వార్డు నెం.60 లో గుల్లల పాలెం షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణము నెం. 22,23,24,28,46,47,57, అశోక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణం నెంబర్ 1,2,3 మరియు ములగాడ షాపింగ్ కాంప్లెక్సు లో దుకాణము నెం.03 , ప్రకాష్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణము నెం.05 , గుల్లల పాలెం హాకర్ జోన్ షాప్ లో బ్లాక్-ఎ లో 1 నుండి 20 షాప్ లకు , బ్లాక్-బి లో 21 నుండి 38 షాప్ లకు మూడు సంవత్సరాల కాల పరిమితి వరకు అలాగే వార్డు నెం 51 (కొత్త వార్డు) లోని మాధవ స్వామి కళ్యాణ మండపం నకు మూడు సంవత్సరాల కాల పరిమితి వరకు, మార్కెట్లలో గుల్లలపాలెం దుకాణము, రోడ్ పక్కన మార్కెట్లకు (హాకర్ మండలం) ఒక సంవత్సరం కాల పరిమితి వరకు వేలం పాట జరుగునని 5వ జోన్ జోనల్ కమిషనర్ తెలిపారు. కావున ఆసక్తి గల వారు వేలం పాటలో పాల్గొనేటప్పుడు వేలంపాటకు సంబంధించి ధరావత్తు మొత్తం డి.డి రూపంలో తీసుకురావాలని, ఎస్.సి రిజర్వుడు కేటగిరి వారు సంబంధిత కుల ధృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుందని, వేలం పాటలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఆధార్, పాన్ కార్డు కలిగి ఉండాలని, తదుపరి పూర్తి వివరణ కొరకు జోన్-5, జ్ఞానాపురం కార్యాలయము పని దినములలో పర్యవేక్షకులను సంప్రదించవచ్చునని జోనల్ కమిషనర్ తెలియజేశారు

విశాఖపట్నం

ఐటీ విశ్వనగరంగా విశాఖ*- *విశాఖకు క్యూ కడుతున్న మరిన్ని ఐటి కంపెనీలు* – *కొల్లు రవీంద్ర* ( ఎక్సైజ్ మంత్రివర్యులు )

*ఐటీ విశ్వనగరంగా విశాఖ*- *విశాఖకు క్యూ కడుతున్న మరిన్ని ఐటి కంపెనీలు* – *కొల్లు రవీంద్ర* ( ఎక్సైజ్ మంత్రివర్యులు ) విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: గాజువాక తెలుగుయువత ఆధ్వర్యంలో విద్యార్ధులకు గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం చారిత్రాత్మకం పై అవగాహన కార్యక్రమం గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు గారు, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు గారు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా *కొల్లు రవీంద్ర* గారు మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు తెచ్చిన ఘనత చంద్రబాబు, లోకేష్ లదే అని యువతకు 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఇకనుండి రాష్ట్రంలో ఉండే యువత వేరే రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్ళనవసరం లేదని, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని తెలిపారు. విద్యావంతులైన యువకులు దీనిని అర్థం చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి మీ సహకారాలు ఎంతో అవసరమని తెలిపారు. మరొక ముఖ్య అతిథి గాజువాక MLA *పల్లా శ్రీనివాసరావు* గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి కృషితో, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఐటీలో విశాఖను విశ్వనగరంగా మారబోతోందని, 30 ఏళ్లలో హైదరాబాద్ ఐటీ సాధించిన అభివృద్ధిని విశాఖ 10 ఏళ్లలోనే అందుకోబోతోందని కొనియాడారు టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. సిఫీ.. వంటి ఐటీ కంపెనీలను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు గారు.. లోకేష్ గారికే దక్కుతుంది. రాబోయే 20 ఏళ్లలో విశాఖను ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రీజియన్ గా చేయాలని వీరిద్దరూ కృత నిశ్చయంతో ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్,ఏపీ గ్రీనింగ్ ఎండ్ బ్యూటీఫికేషన్స్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, గాజువాక కూటమి కార్పొరేటర్లు బోండా జగన్, రౌతు శ్రీనివాస్, లేళ్ళ కోటేశ్వరరావు, బొడ్డు నరసింహ పాత్రుడు, కూటమి సీనియర్ నాయకులు, తెలుగుయువత అధ్యక్షులు మానపురం గణపతి,ప్రధాన కార్యదర్శి వియ్యపు నరేష్, భార్గవ్, అప్పలరాజు, సాయి, టేకేటి అప్పలరాజు, సుధీర్ రెడ్డి, దాసరి గణేష్, గంతకోరు శీను, కాలేజీ విద్యార్థులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పల్నాడు

ఈ నెల 27 న మాచర్ల నియోజకవర్గం సీఎం చంద్రబాబు గారు వస్తున్నారు

ఈ నెల 27న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో Julakanti Brahmananda Reddy గారి తనయుడు Julakanti Goutham Reddy గారి వివాహ రిసెప్షన్ కి ఆంధ్రప్రదేశ్ CM శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు శ్రీ నారా లోకేష్ గారు హాజరవనున్నారు

తిరుపతి

మల్లెమడుగు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మల్లెమడుగు రిజర్వాయర్ నిండడంతో పదిగేట్లు ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.గురువారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి నీటి విడుదల వల్ల ప్రాజెక్టు దిగువన గల గ్రామాలకు ఏమైనా ముప్పు ఉందా అని అధికారులతో సమీక్షించారు.ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుకి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.297 కోట్లతో రిజర్వాయర్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేపు గన్నవరపు శ్రీనివాసరావు పర్యటన వివరాలు

డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజవర్గం నాయకులకు కార్యకర్తలకు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నమస్కారం 24/10/25 తేదీ ఉదయం 8:00 గంటలకు మామిడికుదురు మండలం నగరం గ్రామం మరియు మధ్యాహ్నం 2:00 గంటలకు మొగలికుదురు గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణను వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం జరుగును.కావున ఈ కార్యక్రమానికి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్స్,రాష్ట్ర మరియు జిల్లా,నియోజకవర్గ,మండల కార్యదర్శిలు సంయుక్త కార్యదర్శిలు అనుబంధ విభాగ అధ్యక్షులు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్సులు, గ్రామ శాఖ అధ్యక్షులు,తాజా మాజీ ప్రతినిధులు ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,నియోజవర్గ నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అని గన్నవరపు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు

విశాఖపట్నం

సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను అడ్డుకుంటాం . వామ పక్ష పార్టీల హెచ్చరిక .

సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను అడ్డుకుంటాం . __ వామ పక్ష పార్టీల హెచ్చరిక . విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి :, పెద గంట్యాడ శివారులో ఏర్పాటు కానున్న అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని వామ పక్ష పార్టీలు స్పష్టం చేసాయి. అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ గురువారం పెద గంట్యాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు .ధర్నా నుద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ , సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు , సిపిఐ ( ఎం ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు , సిపిఐ ఎం.ఎల్ ప్రజా పోరు నాయకులు దేవా మాట్లాడుతూ పెద గంట్యాడ శివారులో అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు జరిగితే గాజువాక నియోజక వర్గం అంతా బూడిద మయం అవుతుందని , ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల ఈ ప్రాంత మంతా తీవ్ర కాలుష్యం తో నిండి పోయి ప్రజలంతా అనారోగ్యానికి గురి అయ్యారని అన్నారు . ఐక్య ఉద్యమాల ద్వారా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఎదుర్కొంటామని అన్నారు. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ ను తక్షణమే నిలిపి వేయాలని, లేని పక్షం లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు . అనంతరం వామ పక్ష పార్టీల ప్రతినిధి బృందం పెద గంట్యాడ తహసీల్దార్ అమలకు వినతి పత్రం అందజేశారు . ఇంకా ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్యాంజనేయ ,జిల్లా సమితి సభ్యులు జి.ఆనంద్ , జి. రాంబాబు , కె.అచ్యుత రావు , పల్లేటి పోలయ్య , పెద పూడి దుర్గా రావు , సిపిఎం నాయకులు ఎం.రాంబాబు , సంతోషం , డి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

30వార్డు పరిధిలో 40.04లక్షల జీవీఎంసీ నిధులతో పలు శంకుస్థాపనలు

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* దక్షిణనియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* *30వార్డు పరిధిలో 40.04లక్షల జీవీఎంసీ నిధులతో కొత్త జాలారిపేట వద్ద పలు అభివృద్ధి పనులకు మరియు 32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణముకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు* *కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సౌత్ ఇన్చార్జి సుధాకర్ గారు కార్పొరేటర్లు శ్రీమతి అప్పల రత్నం గారు, శ్రీ కందుల నాగరాజు గారు* *శంకుస్థాపన చేసిన పనుల వివరాలు* *30వార్డ్ పరిధిలో 11లక్షల నిధులతో కోడిపంధేల వీధి వద్ద CC డ్రెయిన్ల మరమ్మతులు* *30 వార్డ్ పరిధిలో కోడిపంధేల వీధిలో 10.61లక్షల నిధులతో దెబ్బతిన్న CC రోడ్ల మరమ్మత్తులు* *30వార్డ్ పరిధిలో 10.45లక్షల నిధులతో కొత్త జాలరిపేట వద్ద SW డ్రెయిన్ మరమ్మతులు* *30 వార్డు పరిధిలో 4.36 లక్షల నిధులతో తాడివీధి వద్ద కాంపౌండ్ వాల్ & బయటి ఫ్లోరింగ్ మరమ్మతులు* *30 వార్డు పరిధిలో లో వివిధ ప్రదేశాలలో ఫుట్‌పాత్ గ్రేటింగ్‌లు మరియు కవర్ స్లాబ్‌ల ఫిక్సింగ్ పనులు నిమిత్తము* *32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణము* కార్యక్రమంలో ఎమ్మెల్యేశ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందనీ, నియోజకవర్గములో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తామని చెప్పాము, ఆ విధంగా ముందుకు వెళుతున్నామని పలికారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలు గమనించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని అన్నారు.రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు, ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని అన్నారు. దక్షిణ నియోజకవర్గం ఓల్డ్ సిటీ అని , డ్రైనేజీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అధికంగా ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు స్థానిక నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో అద్భుత పరిపాలన విశాఖ ప్రజలు చూడబోతున్నారని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పాలన సాగిస్తున్నారనీ, వారి ఆదేశాల మేరకు ప్రజలకు దగ్గరగా సేవలు అందించేందుకు పనిచేస్తున్నామనీ గుర్తుచేశారు. గూగుల్ వంటి పది సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయినీ తెలిపారు. స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్ ,మెట్రో వస్తే విశాఖ రూపురేఖలు మారనున్నాయినీ అన్నారు.గూగుల్ ను విశాఖపట్నం తీసుకువచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలిపారు.రానున్న రోజుల్లో విశాఖ పేరు ప్రపంచ పటంలో నెంబర్ వన్ గా మారుమ్రోగనుంది, ఇది విశాఖ ప్రజల అదృష్టం నీ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ గారు, జోన్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారు, అధ్యక్షులు శ్రీమతి యజ్ఞశ్రీ,, శ్రీ రమణ గారు, శ్రీ అర్జున్ గారు, కూటమి సీనియర్ నాయకులు, వివిధ విభాగాల కూటమినేతలు , కార్యకర్తలు ,జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు….

రంగారెడ్డి

కాంగ్రెస్ హయాంలోనే బస్తీల అభివృద్ధి: కె ఎల్ ఆర్*

రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో ప్రతీ హస్తం పార్టీ నాయకుల పాత్ర ఉండాలని సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలు, పెళ్లీలకు రాలేకపోతున్నాను మళ్లీ వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చి కలుస్తాను. ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు అని కేఎల్ఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులు, ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని కిచ్చెన్న కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.బి ఆర్ ఎస్ హయాంలో బస్తీ ప్రజలను పట్టించుకోలేదన్నారు. బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పేదవాడు కొనే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న గులాబోని గూబ గుయ్యుమనేలా ప్రజాతీర్పు ఇవ్వాలని ఓటర్లకు కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్రకు వైసీపీ నేతల కుట్ర*

👉🏻 *తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్రకు వైసీపీ నేతల కుట్ర* *‘ఏపీ సురక్షా యాప్’ – మద్యం పారదర్శకతకు కొత్త యుగం* 👉🏻 *విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ₹1.30 లక్షల కోట్లు పెట్టుబడి, నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయం చంద్రబాబు నాయుడు విజన్, నారా లోకేష్ కృషి ఫలితంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్* – రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు – రాష్ట్ర మైనింగ్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర *విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి :* గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర మైనింగ్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు వైసీపీ నకిలీ మద్యం దందా, గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. *తాడేపల్లి ప్యాలెస్‌ – కల్తీ మద్యం కుట్రకు కేంద్రం* “నకిలీ మద్యం కుట్రకు కేంద్రం తాడేపల్లి ప్యాలెస్‌” అని పల్లా శ్రీనివాసరావు గారు దుయ్యబట్టారు. జనార్ధన్‌రావు–జోగి రమేష్ చిన్ననాటి స్నేహాన్ని దుర్వినియోగం చేసి సెప్టెంబర్ 23న తాడేపల్లిలో కుట్ర పన్నారని, తదుపరి రోజు ఆఫ్రికాకు వెళ్లాల్సిన జనార్ధన్‌రావును మద్యం కల్తీ కేసులో చిక్కించారని ఆయన పేర్కొన్నారు. జనార్ధన్‌రావు చెప్పినట్టే, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే ఇబ్రహీంపట్నం, మొలకలచెరువులో కల్తీ మద్యం తయారైంది. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతో ఈ కుట్ర పన్నారు,” అని ఆయన వివరించారు. *జగన్ ముఠా అవినీతి బహిర్గతం – ఆఫ్రికా కనెక్షన్లు బట్టబయలు* “వైసీపీ పాలనలో రూ.3,500 కోట్ల లిక్కర్ మాఫియా నడిచింది. జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్ రిపోర్టులు నిర్ధారించాయి. ఆ అవినీతి సొమ్ముతో వైసీపీ నేతలు ఆఫ్రికా, దుబాయ్ దేశాల్లో వ్యాపారాలు ప్రారంభించారు. జగన్ బినామీలు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలో ‘రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్’ పేరిట కల్తీ మద్యం తయారుచేసిన కంపెనీని అక్కడి ప్రభుత్వం సీజ్ చేసింది ఇది రికార్డుల్లో ఉంది,” అని చెప్పారు. *సిట్ విచారణ – వైసీపీ కుట్రలకు బహిరంగ సాక్ష్యం* మద్యం కుట్ర వెనుక ఉన్న వైసీపీ నాయకుల బండారం బయటపడుతోంది. దానిపై నాలుగు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసాం. ఎవరు నిందితులైనా, ఎవరైనా కుట్ర చేసినా తగిన శిక్ష తప్పదు అని మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న దాసరి పల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్రనాయుడు లను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇది ప్రభుత్వ–పార్టీ నిబద్ధతకు నిదర్శనం. వైసీపీ తమ మాఫియాను కప్పిపుచ్చేందుకు మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవాలు బయటపడ్డాయి,” అన్నారు. *‘ఏపీ సురక్షా యాప్’ – మద్యం లో పారదర్శకతకు కొత్త యుగం* మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో “ఏపీ సురక్షా యాప్”ను లాంచ్ చేశారు. గాజువాక పాత సెంటర్‌లో ర్యాలీ నిర్వహించి, దగ్గరలోని మద్యం షాపులో ప్రజలకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. ప్రతి మద్యం బాటిల్‌ను యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను పరిశీలించే విధానం ప్రజల్లో విశ్వాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 3 లక్షల బెల్ట్ షాపులు నడిచాయి. ఇప్పుడేమో వాటిని మూసివేశాం. మద్యం కల్తీపై రూ.5 లక్షల వరకు జరిమానా, కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. విశాఖ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడలో నూతన ల్యాబ్‌లు ఏర్పాటు చేసాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల ENA టెస్టులు నిర్వహిస్తున్నాం. డిస్టిలరీలు, డిపోలు, షాపులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయి,” అని మంత్రి రవీంద్ర తెలిపారు. *గూగుల్ 1.30 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖకు చరిత్రాత్మక గౌరవం* విశాఖపట్నం అభివృద్ధి దిశగా చరిత్ర సృష్టించే దశలో ఉంది. గూగుల్ రూ.1.30 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు విశాఖ భవిష్యత్తును మార్చే సంస్కరణ. గూగుల్ సీఈవో స్వయంగా విశాఖను ‘భారతదేశంలో అద్భుత నగరం’గా అభివర్ణించారు,” అని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. డేటా సెంటర్ వస్తుందంటే దాన్ని చుట్టూ వందల కంపెనీలు వస్తాయి. వచ్చే 10 సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలే మారిపోతాయి. భారతదేశ చరిత్రలో అతి వేగంగా అభివృద్ధి చెందే నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. ఈ దిశలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి వల్లే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజం రాష్ట్రానికి వచ్చింది అని అన్నారు. *విశాఖ – ప్రపంచ గ్లోబల్ మ్యాప్‌లో సరికొత్త గుర్తింపు* విశాఖలో ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా, గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ మ్యాప్‌లో స్థానం సంపాదిస్తుందని పల్లా గారు పేర్కొన్నారు. విపక్షాలు గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. వైసీపీకి అభివృద్ధి పట్ల ఆసక్తే లేదు. గూగుల్ ప్రాజెక్టుపై అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది కేవలం అభివృద్ధిని ఆపడం కాదు, రాష్ట్ర పరువును బజారుకీడ్చడమే అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. *ప్రపంచానికి AI, ఇంటర్నెట్ కనెక్టివిటీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్* నాడు తండ్రి మైక్రోసాఫ్ట్ తెస్తే, నేడు తనయుడు గూగుల్ తెచ్చాడు” అని పల్లా గారు పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మంత్రి నారా లోకేష్ గారి కృషిని అభినందిస్తుంటే వైసీపీ మాత్రం ఫేక్ ప్రచారంలో మునిగిపోయింది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో గ్లోబల్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. ఆ విధానాలకు ఆకర్షితమై గూగుల్ విశాఖకు వచ్చింది అన్నారు. పక్క రాష్ట్రాలు మన రాష్ట్రానికి గూగుల్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. లోకేష్ గారి విజన్ వల్లే గూగుల్ మన రాష్ట్రానికి వచ్చింది. వైసీపీ నేతలు తలలు పట్టుకుని, పెట్టుబడులు రావడాన్ని తట్టుకోలేక అవహేళన చేస్తున్నారు అని అన్నారు. *గూగుల్ క్లౌడ్ – ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్‌గా విశాఖ* గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్ ను విశాఖలో 15 బిలియన్ డాలర్ల (₹1.30 లక్షల కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఇది కేవలం డేటా సెంటర్ కాదు, ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రం. సబ్‌సీ గేట్వే ద్వారా గూగుల్ ఇప్పటికే సముద్ర గర్భంలో అమర్చిన కేబుల్లతో విశాఖను ప్రపంచ నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తుంది,” అని పల్లా గారు వివరించారు. దీంతో విశాఖ AI, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా ఆపరేషన్స్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, హౌసింగ్ రంగాల్లో 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. *వైసీపీ ఫేక్ ప్రచారం – అభివృద్ధి అడ్డుకునే రాజకీయాలు* వైసీపీ నేతలు గూగుల్ రాకపై అసత్యాలు చెబుతున్నారు. ఒకసారి ‘మాది ఘనత’ అంటారు, మరోసారి ‘ఉద్యోగాలు రావు’, ‘డేటా సెంటర్ కాదు గోదాం’ అంటారు. గూగుల్‌లో ఎన్ని ‘ఓ’లు ఉంటాయో కూడా తెలియని వారు ఇప్పుడు గూగుల్ గురించి మాట్లాడుతున్నారు,” అని పల్లా గారు ఎద్దేవా చేశారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.