Friday, 24 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవ తీర్మానంతో పూర్తయిన సిద్ధాశ్రమ కొత్త కార్యవర్గ ఎన్నికలు

నరసన్నపేట మండలం కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద ఉన్న సిద్ధాశ్రమంలో కొత్త కార్యవర్గ ఎన్నికలు ఆధ్యాత్మిక వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. ఆశ్రమ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పొట్నూరు కృష్ణారావు గారు అధ్యక్షుడిగా, చింతు చినప్పన్న ఉపాధ్యక్షుడిగా, తమడాన శ్రీనివాసరావు కార్యదర్శిగా, నాయుడు గణేష్ సహాయ కార్యదర్శిగా, అలాగే ఉట్ల సురేష్ కుమార్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఈ ఎన్నికలను పర్యవేక్షించి, సజావుగా పూర్తి చేశారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించినందుకు స్థానికులు మరియు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆశ్రమం మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షించారు.

విశాఖపట్నం

కోడి గుడ్డు పెట్టలేదు, పొదగనులేదు – గాజువాక లో మంత్రి, కొల్లు. రవీంద్ర

విశాఖ, గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) తెలుగు దేశం పార్టీ మంత్రి కొల్లు రవీంద్ర గాజువాక టిడిపి కార్యాలయంలో జరిగిన పత్రికాసమావేశంలో మాట్లాడుతూ — “చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఆయన ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. “కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రంగంలోనూ పునర్నిర్మాణం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాత్ర చాలా గొప్పది, ఆయన గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నారు” అని ఆయన వివరించారు. అలాగే మాజీ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ — “గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కోడి గుడ్డూ పెట్టలేదు… పొదగ లేదు… రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసి ప్రజలను దారిద్య్రంలోకి నెట్టింది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

రంగారెడ్డి

పోలీసింగ్ పనితీరును ప్రజల నమ్మకం సంతృప్తి అంశాల ఆధారంగా బేరీజు వేయాలి

పున్నమి అక్టోబర్ 22 అబ్దుల్లాపూర్ మెట్టు మండలం: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దృఢమైన పోలీసింగ్ వ్యవస్థ చట్టాన్ని నిర్భయంగా పక్షపాత వైఖరి లేకుండా న్యాయం వైపు అడుగులు వేస్తూ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రతి పోలీసు అధికారి క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీతో పనిచేయాలని ఎల్.బి.నగర్ జోన్ డిసిపి అనురాధ అన్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల అమలు కోసం ఆమె హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు గౌడ్,పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై విలువైన పలు అంశాలపై వారికి సూచనలు అందించారు. ప్రాథమిక పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అందులో భాగంగా బీట్ సహారా, కనిపించే పోలీసింగ్, నిఘ, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, నేర గుర్తింపు, ప్రజాశాంతి భద్రత, సమాజంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆమె సూచించారు. పోలీసింగ్ విజయాన్ని కేవలం నేర గణాంకాలను కులమానంగా తీసుకోకుండా పోలీసులపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం సంతృప్తి వీటిని బేరీజు వేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేరాల నివారణ, దర్యాప్తు పరిపాలన సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీస్ వ్యవస్థపైవారికి నమ్మకాన్ని కలిగించాలన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై డీసీపీ అనురాధ సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి. – లయన్ జె.వెంకుబాబు (ఆముదాలవలస – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆముదాలవలస అధ్యక్షులు జలుమూరు.వెంకటేశ్వరులు (వెంకుబాబు) అన్నారు. స్థానిక అశోక పబ్లిక్ పాఠశాలలో, వివిధ పాఠశాలలకు చెందిన ఎనభై మంది విద్యార్థులకు పీస్ పోస్టర్ పోటీలను నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం అధ్యక్షులు లయన్ జె. వెంకుబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, అందులో భాగముగానే ఈ రోజు విద్యార్థులకు ప్రపంచ శాంతిపై అవగాహన కల్పించామన్నారు. ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, అప్పుడే నిర్ధేశించుకున్న స్థానానికి చేరుకుంటామని, ప్రపంచం శాంతిగా ఉంటె, ఎటువంటి అనైతిక ఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ముందుగా శాంతి ప్రతిజ్ఞ చేస్తారని గుర్తుచేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ సహకారంతో మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చెప్పి, మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమానికి సహకరించిన పాఠశాల అధినేత విటి.చౌదరికు ధన్యవాదాలని, ప్రతీ విద్యార్థి ఒక మొక్కను నాటి, భావితరానికి మార్గదర్శిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆముదాలవలస కార్యదర్శి బి.సునీత, కోశాధికారి పొన్నాడ రోషిణి, సభ్యులు కుప్పిలి.సత్యన్నారాయణ, తమ్మన సంతోష్, తమ్మన కీర్తి, పొట్నూరు సురేష్, రత్నాకర్, అశోక పబ్లిక్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..! ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించిన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..! శ్రీవారి ట్రస్టు ద్వారా నిధులను సమకూర్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..! మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

దుత్తలూరు 22 :పున్నమి ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ వద్ద శ్రీ వెంగమాంబ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అభివృద్ధికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో కోటి రూపాయలతో శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా మొదటి అడుగు శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయం ఉదయగిరి లోని ఉదయగిరి కోట శ్రీ రంగనాయకుల దేవాలయం, ఘటిక సిద్దేశ్వరం దేవాలయాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆనం సహకారం మరువలేనిది అని, దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి కావడం అదృష్టమన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రచించి, ఆ విధంగా ముందుకు వెళ్లి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, గిరి నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, ఉండేలా గురువారెడ్డి, ఆంజనేయులు రెడ్డి,ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

మూల విరాట్ దర్శనం రాష్ట్రపతి గారు

ఇలా మూల విరాట్ దర్శనం రాష్ట్రపతి గారు దర్శనం చేసుకున్నారు కాబట్టి మనకి చూసే ఆ భాగ్యం కలిగింది బాగా చూడండి ఇలాంటి ఫోటో మళ్ళీ రాకపోవచ్చు స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఇల్లాలి వీరుడే వీరమణి కంటుడే స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

విశాఖపట్నం

ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్

*🌨️.*🌨️ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య.. కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ 🌨️ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ 🌨️ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం..🌨️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 🌨️

ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ ప్రెస్ మీట్: YCP ప్రకటన

YCP అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీనిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించనున్నారు. మెడికల్ కాలేజీలను PPPకి అప్పగించొద్దంటూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై మాట్లాడనున్నారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పాటుర్, నకిలీ మద్యం, కాకినాడ సెజ్ భూములపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్

జన్మదినాన అన్నదానం మంచి ఆలోచనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి.సింధూర అన్నారు. నరసన్నపేట మండలం, పిన్నింటిపేటకు చెందిన గుంతు.వనిత జన్మదినం సందర్భంగా, నగరంలో నిస్సహాయులకు అన్నవితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగముగా పేదలకు ఆహారాన్నందించి డా. పైడి.సింధూర మాట్లాడుతూ జన్మదినం రోజున పది మంది ఆకలి తీర్చటం హర్షణీయమని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెయ్యటం ఆనందంగా ఉందన్నారు. వేడుకలను నిరుపేదల మధ్య జరుపుకోవాలనే ఆలోచన గొప్పదని, ఈ కార్యక్రమానికి పరోక్షముగా సహాయమందించిన పొడుగు.చరణ్ కు, నేటి దాతలు గుంతు.లక్ష్మణ్, గుంతు.వనిత దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం నగరంలో పలు ముఖ్య కూడలిలో అభాగ్యులకు లయన్స్ క్లబ్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ ఆహారాన్నందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఫ్రొఫెసర్ డా.విష్ణు మూర్తి, నైట్ షెల్టర్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.