Friday, 24 April 2026

Blog

హైదరాబాద్

సోను ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు

పున్నమి ప్రతినిధి ఘట్కేసర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను (ప్రశాంత్) ని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అయన మాట్లాడుతూ శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూన్న గాయపడిన వ్యక్తిపై దాడి జరగడం అత్యంత దారుణం అని అన్నారు. బాధితుడి ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్

పోలీస్ అమర వీరులకి నివాళులు అర్పించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి పోలీసు అమరవీరుల దినం సందర్భంగాతెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సంధర్భముగా రేవంత్ వారి త్యాగాలను స్మరించుకుని, సమాజ భద్రతలో వారి సేవలను కొనియాడి, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో అమరులైన పలువురు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు అనాధలు కాదని వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని రేవంత్ భరోసా ఇచ్చారు అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇంటి జాగా, ఆర్థిక సహాయంతో పాటు వారి బిడ్డల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ద్వారా వారికి నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమరుల కుటుంబ సభ్యులకి తెలియజేసారు

విశాఖపట్నం

జర్నలిస్టుల సేవా స్ఫూర్తికి నాంది – ఎమ్మెస్సార్ ప్రసాద్ ఆధ్వర్యంలో “నగరంలో నేడు”వాట్సాప్ గ్రూప్ విజయవంతం

సమాచారం, సహాయం, స్నేహం – మూడు విలువలతో ముందుకు సాగుతున్న మానవతా వేదిక విశాఖపట్నం, అక్టోబర్ 22: జర్నలిస్టుల మధ్య పరస్పర సహకారం, సేవాభావం పెంపొందించాలన్న లక్ష్యంతో ఎమ్మెస్సార్ ప్రసాద్ ప్రారంభించిన వాట్సాప్ గ్రూప్ నగరంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోంది. ఈ గ్రూప్ ద్వారా ప్రెస్ మీట్లు, సమావేశాలు, వార్తలకు సంబంధించిన సమాచారం వెంటనే అందించబడుతోంది, జర్నలిస్టులు ఎదుర్కొనే వ్యక్తిగత లేదా వృత్తిగత సమస్యలపై తక్షణ స్పందన లభిస్తోంది, అవసరమున్న వారికి సహాయం, సహకారం, మానసిక మద్దతు అందించబడుతోంది. ప్రతి రోజు తన కృషి, సమయాన్ని వెచ్చిస్తూ ఎమ్మెస్సార్ ప్రసాద్ జర్నలిస్టుల మధ్య ఒకతాటిపైకి తీసుకువచ్చే వేదికను నిర్మించగలిగారు. ఆయన పిలుపుతో ముందుకు వచ్చిన సభ్యులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, గ్రూప్ దినదినం అభివృద్ధి చెందుతోంది. సహాయం చేయడం ఆయనకో అలవాటు కాదు — అది ఆయన స్వభావం” అని సభ్యులు ప్రశంసించారు. సహాయ సహకారాల మార్గంలో తనదైన ప్రత్యేకత చాటుకున్న ఎమ్మెస్సార్ ప్రసాద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండి తన సేవా పరిధిని మరింత విస్తరించాలనే ఆకాంక్షను సభ్యులు వ్యక్తం చేశారు.

హైదరాబాద్

పట్టణ ప్రాంత పెదలకి శుభవార్త, జి ప్లస్ 1 తరహా లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం, మారనున్న మురికి వాడల రూపు రేఖలు, రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌర సంభంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం పున్నమి ప్రతి నిధి పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో శర వేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల పై బుధవారం నాడు మంత్రిగారు సచివాలయం లోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లోనివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామని అన్నారు. కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీవో ఎంస్ నె 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. 🔸పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరత ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. 🔸పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశాామని తెలిపారు. 🔸రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక , అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 🔸 అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారు. వీరికి ఆర్ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ .5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. *పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే….* జి+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో , 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి, ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలని, 🔸ఈ ఇంటి నిర్మాణం ఆర్ సిసి స్లాబ్ తో ఉండాలని, ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు డిఇఇ (హౌసింగ్)అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. *నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లింపు…* మొదటి అంతస్తు – రూఫ్ లెవల్ వరకు నిర్మాణం అయితే రూ. 1 లక్ష , అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ – రూఫ్ వేసిన తరువాత రూ.1 లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్ లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయిన పిదప రూ.2 లక్షలను, ఇంటి నిర్మాణపు పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పేద‌వాళ్ల ఇంటికోసం ఐదు ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని అన్నారు. 🔸గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని దీనిని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రాంత పెదలకి శుభవార్త, జి ప్లస్ 1 తరహా లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం, మారనున్న మిరికి వాడల రూపు రేఖలు, రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌర సంభంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని సత్కరించిన జాలెం సుబ్బారావు

పి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖామంత్రి నిమ్మల రామానాయుడుని బుధవారం కల్సి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో బుధవారం జాలెం సుబ్బారావు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ్ని కల్సి పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతీ సామాన్య కార్యకర్తకు సముచిత గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్నీ విషయాలను మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లినట్లు జాలెం తెలిపారు. జాలెం సుబ్బారావుతో పాటుగా పెదలంక గ్రామ సర్పంచ్ తాళ్ళ నాగరాజు, తెదేపా యూనిట్ ఇంచార్జ్ కోళ్ళ సురేష్, న్యాయవాది బిరుదుగంటి రవి తదితరులు మంత్రి నిమ్మల రామానాయుడ్ని కల్సిన వారిలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

అమలాపురం హోటల్స్ పై దుష్ప్రచారం ఖండించిన చాంబర్ ఆఫ్ కామర్స్

అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వర ప్రసాద్ ఆద్వర్యంలో అమలాపురం కోకస్ లాడ్జి లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప , తేలు, వంటివి కాదని వీడియో కూడా నిజమైనది అని ఎవరు ధ్రువీకరించలేదని, అవాస్తవం అని ఆయన అన్నారు. అతను బిర్యానీ తిని మృతి చెందలేదని, బ్లెడ్ క్లాట్ అవడం వలన హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగిందని మృతుడి తండ్రి , బంధువులు కూడా తెలిపారని, అలాగే వైద్యులు కూడా గత మూడు నెలలుగా అతని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడని,అతను అనారోగ్య సమస్యలతో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడని, ధ్రువీకరించారు అన్నారు, సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా, కాదా అని నిర్ధారించుకుని షేర్ చేయాలని అన్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎటువంటి కంప్లైంట్లు రాలేదని దృవీకరించారు, ఈ ఘటనపై హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ అవాస్తవాలు షేర్ చేయడం వలన హోటల్ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి గంగాధర్ తన కుమారుడు అనారోగ్యం కారణం వల్లనే చనిపోయాడని, తల్లిదండ్రులు చెప్తుంది నికరమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తన కుమారుని మృతిని వ్యక్తిగత కారణాలతో ప్రచారం చేయవద్దని, ఇలాంటి వార్తలని వైరల్ చేయటం సరికాదన్నారు. దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కొమ్మూరి వెంకటాచలప్రసాద్, చాంబర్ సలహాదారులు నల్లా పవన్ కుమార్, హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కోకా రాంబాబు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి (విష్ణు శ్రీ రెస్టారెంట్), గారపాటి వంశీ,(జీకే రెస్టారెంట్ ) బాలూ (గణపతి రెస్టారెంట్ ), సురేష్ నాయుడు (హ్యాపీ రెస్టారెంట్), D.నాయుడు (గ్రీన్ పార్క్) చిక్కం గణేష్ (బొండం బాబాయ్ హోటల్ ), హరిబాబు (తారా రెస్టారెంట్) మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

E-పేపర్

రామి రెడ్డి ధ్వజా రెడ్డి కువైట్ పర్యటనకు విచ్చేసిన శుభ సందర్బంగా కువైట్ ఎయర్ పోర్ట్ లో కలసి పుస్ప గుచ్చం అందించి స్వాగతం పలికిన వడియరాజుల సామాజిక వర్గం

తేదీ 22-10-2025న గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు( YSR CP)రైల్వే కోడూరు MPP అయినటువంటి రామి రెడ్డి ధ్వజా రెడ్డి కువైట్ పర్యటనకు విచ్చేసిన శుభ సందర్బంగా కువైట్ ఎయర్ పోర్ట్ లో కలసి పుస్ప గుచ్చం అందించి స్వాగతం పలికిన వడియరాజుల సామాజిక వర్గం. మరియు నాయకులు మహేష్ రెడ్డి వెంకటరెడ్డి పల్లి,బత్తల లక్ష్మయ్య సారమారిపోడు,అశోక్, తుమ్మకుండ,అవలకుండ వెంకటేష్, వత్తలూరు ఎల్లయ్య, వెంకటేశు,రవి ఉప్పరపల్లి కొయ్యి బాలాజి మరియు పార్టీ నాయకులు.

E-పేపర్

-: పత్రిక ప్రకటన:- 22/10/25 *భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి*… *సిపిఎం పార్టీ ,రైతు సంఘం డిమాండ్* _____________________

భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంటలు నీటి మునిగిన ముస్తాపురం, పాతాళపల్లి, గోవిందంపల్లి, ఉప్పలపాడు గ్రామాలో ఉండే పొలాలను సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించడం జరిగింది.రైతులు నాయకుల ముందర కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట, వేరు శనగ పంట పూర్తిగా నీట మునిగినాయని ఈ వర్షాల కారణంగా ఎకరాకు 40 వేల రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు.ప్రభుత్వం వెంటనే రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ తడిసిన ధాన్యాని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అన్నారు.అనంతసాగరం మండల లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలో కేవలం అధికార పార్టీ వారు చెప్పిన వారికే కొనుగోలు చేస్తున్నట్లు, తమ ధాన్యం కొనాలని రైతు అడిగితే మీరే మిల్లర్ లతో మాట్లాడుకోవాలని లేకుంటే దళారులకు అమ్ముకోవాలని చెబుతున్నారని, కొనుగోలు కేంద్రాలో లోడు ధాన్యం ఎత్తడానికి కమిషన్లు అడుగుతున్నారని తమ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వారికి సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జక్రయ్య,నాగులూరు వెంకటేష్, రైతు సంఘం అనంతసాగరం మండల అధ్యక్షుడు నరసింహ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.