Friday, 24 April 2026

Blog

తూర్పు గోదావరి

తుని ఘటనపై హోం మంత్రి సీరియస్

తునిలో విద్యార్థినిపై అత్యా చారయత్నం ఘటనపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించామన్నారు. పోలీసులు తక్షణమే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారని వెల్లడించారు. నేరం చేసినవారు ఏ పార్టీవారైనా, ఏ కులమైనా, మతమైనా సహించేది లేదని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

నాగర్‌కర్నూల్

స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులలో మళ్ళీ ఉత్కంఠ..!

వెల్దండ అక్టోబర్ 22, :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 న రాష్ట్ర కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది రెండు వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈనెల 17 న ప్రభుత్వం నిర్ణయించిన గడువు తెలిసిందే. సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఈనెల 23 న జరగనున్న కేబినెట్ మీటింగ్ కీలకమైనది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 జెడ్పిటిసి, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 1 జడ్పిటిసి స్థానం, 32 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఎంపీటీసీ ,జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు గుసగుసలు కార్యకర్తలలో మొదలయ్యాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ వద్ద శ్రీ వెంగమాంబ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అభివృద్ధికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో కోటి రూపాయలతో శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా మొదటి అడుగు శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయం ఉదయగిరి లోని ఉదయగిరి కోట శ్రీ రంగనాయకుల దేవాలయం, ఘటిక సిద్దేశ్వరం దేవాలయాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆనం సహకారం మరువలేనిది అని, దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి కావడం అదృష్టమన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రచించి, ఆ విధంగా ముందుకు వెళ్లి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, గిరి నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, ఉండేలా గురువారెడ్డి, ఆంజనేయులు రెడ్డి,ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

జగన్ పుట్టుకతోనే నేరస్థుడు*

మంగళగిరి అక్టోబర్ పున్నమి ప్రతినిధి, విశాఖపట్నం *జగన్ పుట్టుకతోనే నేరస్థుడు* *జగన్ నేర నటననే వైసీపీ నాయకులు నేర్చుకున్నారు* *జగన్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ నేరాలు చేస్తాడు, నేరస్థులను ప్రోత్సహిస్తాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపాడు గ్రామంలో ప్రపంచానికే విజ్ఞాన దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టి, తాము సుద్ధపూసలమని, ఏమీ తెలియదన్నట్టు నాటకాలాడారు. వైసీపీ సర్పంచ్ గోవిందప్ప రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారని అబద్ధం చెప్పాడని ఆరోపించాడు. మరుసటి రోజు మాజీ మంత్రి నారాయణస్వామి, వైసీపీ నేత కరుణాకర్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా పేరుతో డ్రామాలాడారు. సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ పరిశీలనలో గోవిందయ్య దొరికిపోవడంతో వారి నాటకం బట్టబయలైంది. ఏమీ ఎరగనట్టు ధర్నా చేయడం, నటించడంలో వైసీపీ నాయకులకు సాటి లేరు. బాబాయ్ ని చంపించి చంద్రబాబునాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసురరక్త చరిత్ర అని కమల్ హాసన్ ను మించి జగన్ యాక్టింగ్ చేశాడు. జగన్ కమల్ హాసన్ మించి యాక్టింగ్ చేస్తే.. జగన్ మించిన యాక్టింగ్ చేసిన వ్యక్తి గోవిందప్ప ..అంబేద్కర్ విగ్రహాన్ని కి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ గోవిందప్ప ను జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు..? రాష్ట్రంలో వైసీపీ పోకడలు అతి జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డాడు. దళితులు నా మేనమామలు అంటూనే గత ఐదేళ్లు దళితుల గొంతులు కోశారు. జగన్ తన కారుతో రోడ్లపై దళితుల తలలు తొక్కించుకుంటూ వెళ్లాడు. జగన్ పుట్టుకతోనే నేరస్థుడు. తన సొంత బాబాయిని చంపి చంద్రబాబుపై నెట్టాలని చూశాడు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చి, ఈ పని కూటమి ప్రభుత్వానిదని నమ్మబలుకు ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి నేరస్థుల ముఠా గురించి చాంతాడంత చెప్పవచ్చు. వైసీపీ నాయకులది టెర్రరిస్టుల స్వభావం. రాజకీయ ముసుగు వేసుకుని చేయరాని పనులన్నీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులు అవినీతిపరులుగా మిగిలిపోతున్నారు. ఈ టెర్రరిస్టు పార్టీలో ఎవరూ ఉండొద్దని సూచిస్తున్నాను. జగన్ వింత రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనను వైసీపీ నాయకులు ఒర్వలేకపోతున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలను తరిమేశారు. కూటమి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది. దేశ-విదేశాల్లో రాష్ట్ర గౌరవాన్ని పెంచింది. చంద్రబాబు, లోకేష్, మంత్రివర్గం దేశ-విదేశాల్లో తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తున్నారు. వైసీపీ నాయకులు అది చూసి కడుపు మంటతో కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను కులచిచ్చుగా పెట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. హత్య చేసిన హరిశ్చంద్రప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తోంది. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. గంజాయి ముఠాలతో సంబంధాలు పెట్టుకుంటోంది, వారికి సంఘీభావం తెలుపుతోంది. గోవిందప్ప, జగన్ లాంటి వ్యక్తులు చేసే ఆకృత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లి మాణిక్యరావు పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

దుబాయ్: యూఏఈలో తొలి రోజు పర్యటన ప్రారంభించిన సీఎం చంద్రబాబు.*

*దుబాయ్: యూఏఈలో తొలి రోజు పర్యటన ప్రారంభించిన సీఎం చంద్రబాబు.* • తొలిరోజు మొత్తంగా ఐదు సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి బృందం. • దుబాయ్, అబుదాబిల్లోని భారత ఎంబసీకి చెందిన రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ. • దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీ లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ లతో సమావేశమైన సీఎం • దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చ • గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిధ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ లో రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన సీఎం • గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ డేటా హబ్ ను 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి • ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడి • ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపిన ముఖ్యమంత్రి • యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రత్యేక చర్చ. • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని వెల్లడించిన సీఎం • అలాగే యూఏఈ లో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చ. • ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను కోరిన సీఎం చంద్రబాబు. • సీఎంతో భేటీలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు. *చంద్రబాబు, ముఖ్యమంత్రి* • ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. • భారతదేశం బ్రాండును ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. • ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదు. • రెండు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణం.

విశాఖపట్నం

ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి*

*ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి* *మద్యం దుకాణాల్లో సురక్ష యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలి* *జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర* అనకాపల్లి, అక్టోబర్ 22: సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల మరియు ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్కొన్నారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖల పురోగతి పై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, మాడుగుల, పెందుర్తి, చోడవరం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కె సూర్యనారాయణ రాజు తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండ చూడాలన్నారు. అవసరానికి మించి ఇసుక అవసరం అయితే మరికొన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చెయ్యాలని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి ఎం శ్రీనివాస్ కి ఆదేశించారు. 1 నుండి 3 వరకు గల ఇసుక రీచ్ లలో ఎడ్ల బండి మరియు ట్రాక్టర్ ల సహాయం తో వాళ్ల సొంత అవసరలకు ఇసుకను తరలించుకోవ చ్చని తెలిపారు. దానికి అనుగునంగా జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి పై నా తెలిపినటువంటి ఇసుక రీఛాలు 44 ఉన్నాయని ఇంచార్జి మంత్రి కి తెలియజేసారు. ఎక్సయిజ్ శాఖ పై ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ఎ పి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిగేలా చూడాలని మరియు జిల్లాలో ఇప్పటికే నిర్మూలించిన బెల్ట్ షాపులను పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి వి. సుధీర్ కు ఆదేశించారు. వినియోగదారుడు తన యాండ్రైడ్ మొబైల్ లో ఎ.పి ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మద్యం కొనుగోలు చేసుకునే ముందు మద్యం సీసా పై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకొని మద్యం సీసా అసలుదో, నకిలీదో నిర్దారించుకొని మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలని మద్యం ప్రియులకు మంత్రి పిలుపునిచ్చారు. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు మరియు తరలింపును అర్ధరాత్రి పూట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు, ఇంచార్జి మంత్రి స్పందిస్తూ ఈ గ్రావెల్ మాఫియాను అరికట్టాలాసంటే ఒక్క గనుల మరియు భూగర్భ శాఖ సరిపోదు గనుక రెవెన్యూ మరియు పోలీస్ శాఖ లను సమన్వయ పరిచి. ఈ సమస్య కు పరిష్కరింస్తామని తెలియజేశార. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఇంచార్జి మంత్రి మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, డి అర్యో వై సత్యనారాయణ రావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ లు షేక్ అయిషా, వి వి రమణ, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి సుదీర్, జిల్లా భూగర్భ గనులు శాఖ అధికారి ఎం శ్రీనివాస్, నీటి పారుదల శాఖ డి ఈ ఈ త్రినాధ్. వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మెన్లు పీలా గోవిందా సత్యన్నారాయణ, మళ్ళా సురేంద్ర బాబు, బత్తుల తాతయ్య బాబు, కె విజయ్ కుమార్, డి సి ఎం ఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎన్ ఏ డి – బాజీజంక్షన్ రోడ్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభంపశ్చిమ నియోజకవర్గ ఎం.ఎల్.ఎ ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు సూచన మేరకు రహదారి అభివృద్ధి పనులు వేగవంతం

విశాఖపట్నం, అక్టోబర్ 22: ఎన్ఏడి కొత్తరోడ్డు ఆల్ఫా హోటల్ నుండి బాజీజంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాజీజంక్షన్ కొబ్బరిబొండాలు షాప్ వెనుక నుండి ఎన్ ఏ డి కొత్తరోడ్డు సులభకంప్లెక్స్ వరకు ఉన్న ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి గుంతలు, రాళ్లతో ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు సూచన మేరకు, జివిఎంసి నిధులు మంజూరు చేయించేందుకు 90వ వార్డ్ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బొమ్మిడి రమణ చొరవ తీసుకున్నారు. ఆ మార్గం వాడుకలోకి రావడం కోసం ఆక్రమణకు గురైన రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలను క్లియర్ చేయించేందుకు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటన నిర్వహించారు. పర్యటనలో పాల్గొన్న వారు: 90వ వార్డ్ ప్రెసిడెంట్ శరగడం అరుణ్ మాజీ వార్డ్ ప్రెసిడెంట్ యలమంచిలి ప్రసాద్ టౌన్ ప్లానింగ్ ఏ సి పి రామలింగేశ్వర రెడ్డి సర్వేయర్ కుమార్ స్వామి ఇంజనీరింగ్ విభాగం డి ఈ వెంకటలక్ష్మి వర్క్ సూపర్వైజర్ సోమేశ్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ బుచ్చిబాబు 91వ వార్డ్ ప్రెసిడెంట్ సత్తిరాజు టీడీపీ నాయకులు నరవ అనూష, మార్కెటింగ్ డైరెక్టర్ ఉప్పాటి శివ, జే ఎన్ టి యు ఉప్పిలి రామకృష్ణ , 51 బూత్ ఇంచార్జి శ్రీను పట్నాయక్, తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతల సతీష్, యూత్ సెక్రటరీ బావరాజు సతీష్, బీసీ సెల్ ప్రెసిడెంట్ నమ్మి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యలతో NAD పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*నందిగామ రైతుబజార్ ఆకస్మిక తనిఖీ*

నందిగామ పట్టణంలో, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి రైతు బజార్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా, కూరగాయల వ్యర్థాలను మున్సి పాలిటీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ లోనే వేసేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. లేకపోతే దుర్వాసన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ తనిఖీలో రైతుబజార్ ఈవో రవికుమార్, సూపర్వైజర్ శ్రీహరి, అన్నం బుచ్చిబాబు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*నందిగామ సీఐ మైనర్లకు కౌన్సిలింగ్ – గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్ తనిఖీలు*

నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద నందిగామ సీఐ నాయుడు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయం గుర్తించి, వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జీవితానికి ప్రమాదం కలిగించొచ్చు,” అని అన్నారు. అలాగే, తల్లిదండ్రులను అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు అప్పగించ కూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టి నట్టు తెలిపారు. పౌరుల్లో అవగాహన పెంచేందు కు ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని నందిగామ పోలీసులు పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

“స్కూటీపై రోడ్డు సమస్యలపై పర్యవేక్షణ: ప్రజల సమస్యలపై నేరుగా స్పందించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య”

నందిగామ వార్డుల్లో రోడ్డు సమస్యలపై నేరుగా పర్యవేక్షణ చేపట్టిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యురాలైన తంగిరాల సౌమ్య, తన నియోజకవర్గంలోని పలు వార్డుల్లో నెలకొన్న రోడ్డు సమస్య లను స్వయంగా పరిశీలించేం దుకు స్కూటీపై విహరించారని విశ్వసనీయ సమాచారం. స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదు లను గమనించిన ఆమె, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై నేరుగా మార్గదర్శనం చేశారు. సామాన్య ప్రజల మధ్యనుండి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె స్వయంగా పర్యవేక్షణ చేయడం ప్రజల్లో మంచి స్పందనను కలిగించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.