Friday, 24 April 2026

Blog

E-పేపర్

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళా శాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ బాధ్యులు, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో 23-10-2025 గురువారం నాడు కోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ యస్ఆర్ కాలనీ నందు మధ్యాహ్నం 3:30 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ కార్యక్రమానికి మండలంలోని వైయస్సార్సీపి కార్యకర్తలు, జడ్పీటీసీలు,సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరు హాజరుకావలసినదిగా ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు.

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా , చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళా శాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ బాధ్యులు, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో 23-10-2025 గురువారం నాడు కోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ యస్ఆర్ కాలనీ నందు మధ్యాహ్నం 3:30 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ కార్యక్రమానికి మండలంలోని వైయస్సార్సీపి కార్యకర్తలు, జడ్పీటీసీలు,సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరు హాజరుకావలసినదిగా ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు.

E-పేపర్

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున రైల్వే కోడూరు మండలం అక్టోబర్, 22 ( ఈరోజు పత్రిక ప్రతినిధి ): గత మూడు రోజులగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా రైల్వే కోడూరు మండలం, అనంతరాజుపేట గ్రామం, బి సీ కాలనీ నుండి అరుంధతి వాడకు పోవు దారిలో చెట్టు పడిపోవడం వలన గ్రామ ప్రజలకు ఏర్పడిన అంతరాయం వలన, గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకున్న ఎంపీటీసీ బండారు మల్లికార్జున వెంటనే అక్కడికి చేరుకొని చెట్లను స్వయంగా తొలగించారు. సమస్యను పరిష్కరించిన బండారు మల్లికార్జున కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు హర్షం వెలుబుచ్చారు.

E-పేపర్

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున రైల్వే కోడూరు మండలం అక్టోబర్, 22 ( ఈరోజు పత్రిక ప్రతినిధి ): గత మూడు రోజులగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా రైల్వే కోడూరు మండలం, అనంతరాజుపేట గ్రామం, బి సీ కాలనీ నుండి అరుంధతి వాడకు పోవు దారిలో చెట్టు పడిపోవడం వలన గ్రామ ప్రజలకు ఏర్పడిన అంతరాయం వలన, గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకున్న ఎంపీటీసీ బండారు మల్లికార్జున వెంటనే అక్కడికి చేరుకొని చెట్లను స్వయంగా తొలగించారు. సమస్యను పరిష్కరించిన బండారు మల్లికార్జున కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు హర్షం వెలుబుచ్చారు.

E-పేపర్

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున

కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున రైల్వే కోడూరు మండలం అక్టోబర్, 22 ( ఈరోజు పత్రిక ప్రతినిధి ): గత మూడు రోజులగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా రైల్వే కోడూరు మండలం, అనంతరాజుపేట గ్రామం, బి సీ కాలనీ నుండి అరుంధతి వాడకు పోవు దారిలో చెట్టు పడిపోవడం వలన గ్రామ ప్రజలకు ఏర్పడిన అంతరాయం వలన, గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకున్న ఎంపీటీసీ బండారు మల్లికార్జున వెంటనే అక్కడికి చేరుకొని చెట్లను స్వయంగా తొలగించారు. సమస్యను పరిష్కరించిన బండారు మల్లికార్జున కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు హర్షం వెలుబుచ్చారు.

అన్నమయ్య

గుండాల కోన ఏరు వద్ద సబ్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

-భారీ వర్షాల దృష్ట్యా వాగులు, వంకల వైపు వెళ్లొద్దు: ప్రజలకు భావన హెచ్చరిక -ప్రమాదాలు నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం చిట్వేల్, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో, రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రమాదాలను అంచనా వేసేందుకు సబ్ కలెక్టర్ భావన బుధవారం ఓబులవారిపల్లి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ముఖ్యంగా బాలిరెడ్డిపల్లి మీదుగా ప్రవహిస్తున్న *గుండాల కోన ఏరు* ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు.సబ్ కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీమతి యామిని రెడ్డి కూడా ఉన్నారు. -ప్రమాదాల పట్ల అప్రమత్తత ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు, వంకల్లో నీటి శాతం పెరుగుతోందని తెలిపారు. “ఇలాగే వర్షాలు కొనసాగితే వాగులు పొంగి పొర్లుతాయి. వై.కోట, బాలిరెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్లకూడదు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి” అని హెచ్చరించారు. -వాహనదారులకు ప్రత్యేక సూచన ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. -అనవసర ప్రయాణాలు వద్దు ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని, ఈ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు, సెక్రటరీ సురేష్ ఆర్ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి , స్థానికులు జీవీ రెడ్డి తో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం హోటల్స్ పై దుష్ప్రచారాన్ని ఖండించిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు : బోనం

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ ఆద్వర్యంలో అమలాపురం కోకస్ లాడ్జి లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం వర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఒక యువకుడు బిర్యానీ తిని మృతి చెందాడని ఒక అవాస్తవమైన వార్త సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, బిర్యానీలో వచ్చింది మండ్రకప్ప , తేలు, వంటివి కాదని వీడియో కూడా నిజమైనది అని ఎవరు ధ్రువీకరించలేదని, అవాస్తవం అని ఆయన అన్నారు. అతను బిర్యానీ తిని మృతి చెందలేదని, బ్లెడ్ క్లాట్ అవడం వలన హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగిందని మృతుడి తండ్రి , బంధువులు కూడా తెలిపారని, అలాగే వైద్యులు కూడా గత మూడు నెలలుగా అతని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడని,అతను అనారోగ్య సమస్యలతో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడని, ధ్రువీకరించారు అన్నారు, సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా, కాదా అని నిర్ధారించుకుని షేర్ చేయాలని అన్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఎటువంటి కంప్లైంట్లు రాలేదని దృవీకరించారు, ఈ ఘటనపై హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ అవాస్తవాలు షేర్ చేయడం వలన హోటల్ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి గంగాధర్ తన కుమారుడు అనారోగ్యం కారణం వల్లనే చనిపోయాడని, తల్లిదండ్రులు చెప్తుంది నికరమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తన కుమారుని మృతిని వ్యక్తిగత కారణాలతో ప్రచారం చేయవద్దని, ఇలాంటి వార్తలని వైరల్ చేయటం సరికాదన్నారు. దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కొమ్మూరి వెంకటాచలప్రసాద్, చాంబర్ సలహాదారులు నల్లా పవన్ కుమార్, హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కోకా రాంబాబు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి (విష్ణు శ్రీ రెస్టారెంట్), గారపాటి వంశీ,(జీకే రెస్టారెంట్ ) బాలూ (గణపతి రెస్టారెంట్ ), సురేష్ నాయుడు (హ్యాపీ రెస్టారెంట్), D.నాయుడు (గ్రీన్ పార్క్) చిక్కం గణేష్ (బొండం బాబాయ్ హోటల్ ), హరిబాబు (తారా రెస్టారెంట్) మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గుంజన నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి

-వరద ప్రభావాన్ని వెంటనే తెలియజేయండి; సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలి చిట్వేల్, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని గుంజన నది పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చిట్వేల్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.ఇటీవలి భారీ వర్షాల కారణంగా గుంజన నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, వరద ప్రభావం కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. -అత్యవసర సమాచారంపై దృష్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే తమకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. సమాచారం అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా చిట్వేల్ సచివాలయం, పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు పంచాయతీ తరఫున ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఉప సర్పంచ్ తెలిపారు. గుంజన నది ప్రవాహం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య

చిట్వేల్ లోతట్టు ప్రాంతాల్లో ఎంపీడీవో ఆకస్మిక పర్యటన

-యల్లంరాజు చెరువు గట్టు, గుంజనేరు ఉద్ధృతి పరిశీలన; ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: శ్రీనివాసులు సూచన చిట్వేల్, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో భారీ వర్షాల ప్రభావంతో తలెత్తే పరిస్థితులను అంచనా వేసేందుకు ఎంపీడీవో శ్రీనివాసులు బుధవారం లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల భద్రత, ఆస్తి నష్టం నివారణ లక్ష్యంగా ఆయన చెరువులు, కుంటలు, నదుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. -యల్లంరాజు చెరువు పరిస్థితి సమీక్ష రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన యల్లంరాజు చెరువును ఆయన సందర్శించారు. అక్కడ నీటి మట్టం, చెరువు గట్టుల స్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. మైలపల్లి, రాచపల్లి ప్రాంతాల వద్ద ఉన్న అలుగువంక ఉద్ధృతిని గమనించి, ముంపు ప్రమాదాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. -ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలకు హెచ్చరిక ముఖ్యంగా గుంజనేరు నది ప్రవాహం ప్రభావం చూపే అవకాశం ఉన్న తుమ్మకొండ మరియు నగిరిపాడు గ్రామ పంచాయతీల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సూచించారు. -ముందస్తు జాగ్రత్తలపై ఎంపీడీవో ఆదేశాలు ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందస్తుగా ఆహార పదార్థాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.అలాగే, మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కి చేరవేయాలి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అవసరమైన యంత్రాలు (పంపులు, జె.సి.బి.లు వంటివి), సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.ఈ పర్యటనలో ఎంపీడీవో వెంట డిప్యూటీ ఎంపీడీవో రమణ, సీనియర్ సహాయకుడు సుబ్బారాయుడు పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ సునీల్‌కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీ

-ప్రజా సేవలో మర్యాద, కేసుల్లో వేగం తప్పనిసరి: జిల్లా ఎస్పీ -పాత స్టేషన్‌కు తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశాలు చిట్వేల్, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బుధవారం రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ నిర్వహణ తీరు, రికార్డులు, నమోదైన కేసుల పురోగతి వివరాలతో పాటు సిబ్బంది సంక్షేమ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా రెండు అంశాలపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో మర్యాదపోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా, వినయంతో వ్యవహరించాలని, ప్రజా సేవలో సౌమ్యత పాటించడం తప్పనిసరని సూచించారు.కేసుల విచారణ వేగం నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరిత న్యాయం అందించడంలో ఆలస్యం చేయకూడదని ఆదేశించారు.చిట్వేల్ పోలీస్ స్టేషన్ భవనం పాతది కావడంతో, దానికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. అలాగే, నేరాలకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో సమయానికి, ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు.జిల్లా సరిహద్దులో ఉండే ఈ స్టేషన్ పరిధిలోని అనుంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిరంతర తనిఖీలు చేపట్టి, అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక శక్తులను అరికట్టాలని ఆదేశించారు.సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ , వారి వ్యక్తిగత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్, చిట్వేల్ ఎస్ఐ జి. నవీన్ బాబు తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.