Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మల్లు గుంట గిరిజన కాలనీలో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వెంకటాచలం (పున్నమి, అక్టోబర్ 22):- వెంకటాచలం మండలం మల్లు గుంట గిరిజన కాలనీని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీవ్ర వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ — “గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మీకు ఏవైనా అవసరాలు ఉన్నా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెలియజేయండి. ప్రభుత్వం పేద గిరిజనులకు అండగా ఉంటుంది” — అని తెలిపారు. అలాగే, గత ప్రభుత్వ కాలంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారిని అట్టడుగు స్థాయిలోంచి పైకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణి భవాని, నాయుడు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

భక్తి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభం

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వామి ఆలయం నందు నిత్య బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాన్ని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆలయ అధికారులు, ప్రధాన ఆర్చకులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి,ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కరుణా గురుకుల్, అభిషేక గురుకుల,నిరంజన్ గురుకుల్ పర్యవేక్షకులు నాగభూషణం,పౌరోహితుడు అర్థగిరి,టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మల్లు గుంటలో జనసైనికుల పర్యటనలు

మల్లు గుంట గిరిజన కాలనీలో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు వెంకటాచలం (పున్నమి, అక్టోబర్ 22):-వెంకటాచలం మండలం మల్లు గుంట గిరిజన కాలనీని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీవ్ర వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ —“గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మీకు ఏవైనా అవసరాలు ఉన్నా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెలియజేయండి. ప్రభుత్వం పేద గిరిజనులకు అండగా ఉంటుంది” — అని తెలిపారు. అలాగే, గత ప్రభుత్వ కాలంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారిని అట్టడుగు స్థాయిలోంచి పైకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణి భవాని, నాయుడు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాజకీయలకు అతీతంగా కాపు వన సమారాధన.. ఎమ్మెల్యే పంతం నానాజీ..

ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చే నెల నవంబర్ 16, కార్తీక మాసం ఆఖరి ఆదివారం కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సంఘ పెద్దలు పంతం నానాజీ గారు స్పష్టం చేశారు. స్థానిక ఆర్టీవో ఆఫీస్ రోడ్ లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో సంఘ గౌరవ అధ్యక్షులు బసవా ప్రభాకర్ రావు గారు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకమాస కాపు వన సమారాధన కమిటీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జీవితకాల సభ్యులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు నాయకులు పాల్గొనాలి అని ఈ కార్తీక వన భోజన సమావేశంలో రాజకీయ ఉపన్యాసాలు ఉండకుండా చూడాలి అని పిలుపునిచ్చారు. సంఘ కార్యవర్గం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్పు చేయాలని నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు అయితే నూతన ఆలోచనలు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

అభయ క్షేత్రంలో అన్నదానం చేసిన ఉన్నo దంపతులు

తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: తోట్టంబేడు మండల ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు దంపతుల కుమారుడు ఉన్నo చెంచు చరణ్ సాయి పుట్టినరోజు సందర్భంగా రేణిగుంట లోని అభయ క్షేత్రం నందు 200 మంది వికలాంగులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా . అభయ క్షేత్రం నిరవహుకులు మాటలాడుతూ.. పుట్టినరోజును ప్రతి ఒక్కరూ వృధా చేయకుండా ఇటువంటి దాన ధర్మాలు చేయడం వారికి వారి కుటుంబానికి శ్రీరామరక్షగా ఉంటుందని ఉన్నo చెంచు చరణ్ సాయి ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలను పొంది ఆ శ్రీకాళహస్తీశ్వరస్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల కృప ఉన్నo కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉన్న వాసనాయుడు ఆయన సతీమణి ఉన్న నిర్మల, కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి, అబ్దుల్ నవీన్ పాల్గొన్నారు.

సినిమా

అక్టోబర్ 25న ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్న “మైండ్ గేమ్”

పున్నమి ప్రతినిధి @ నెల్లూరు కప్ప మురళి సమర్పణలో కూసుపాటి శ్రీలక్ష్మి నిర్మించిన చిత్రం మైండ్ గేమ్. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 23 థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల్లూరు రైన్ స్క్వేర్ లో 11 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన చిత్రం ఈనెల 25వ తేదీన ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్నది. శ్రీరామ్, మిధునప్రియ హీరో హీరోయిన్లుగా, వాసు, మహేంద్ర, డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, శ్రీహరి, శ్రీనివాస్, శ్రీను ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జబర్దస్త్ అప్పారావు, ఉప్పల బాలు, హరి, మురళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆసక్తి కలిగిన కథాంశంతో దర్శకులు కిషోర్ శ్రీకృష్ణ రూపొందించారు. డిఓపి ఏబిసిడి బాలు, పాటలు ప్రవీణ్ కుమార్, కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: శ్రీ కిషోర్ శ్రీకృష్ణ.

నిర్మల్

లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు

భైంసా: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సు *లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అల్లాడి సురేష్ గారు (సైక్రియాట్రిస్ట్) విద్యార్థులతో మాట్లాడుతూ — ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల ఆలోచన, సమతుల ఆహారం, మరియు వ్యాయామం మానసిక ప్రశాంతతకు మూలస్తంభాలని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన సదస్సును రసాయనశాస్త్రం, ఇంగ్లీష్, జంతుశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి కార్యక్రమంలో అధ్యాపకులు, డాక్టర్ బీమా రావు,రవికుమార్ డాక్టర్ శంకర్ ఎ రాజు, డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

జనగాం

ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నాది…..*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 22.10.2025* *రైతుల పంటలకు సాగు నీరు అందించేందుకు ప్రతినిత్యం తాపత్రయపడుతున్నాను…..* *అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రెండు పంటలకు సాగు నీరు…..* *2ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 1400కోట్లు మంజూరు….* *ఒక్క ఏడాదిలో అభివృద్ధి పనులు ప్రజల కళ్ల ముందు ఉంటాయి…..* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక అభివృద్ధి నిధులు మంజూరు…..* *అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి…..* *రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…..* *రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు….* *ఈ సీజన్ నుండి మద్దతు ధరతో పాటే బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ….* *కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి…..* *రైతు పక్షపాతిగా ఉంటూ ప్రజా సంక్షేమానికి, మహిళా సంక్షేమనికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.* రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్, మంగలి బండ తండా, జాఫర్ గూడెం, వెల్ది గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక అభివృద్ధి నిధులను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చానని తెలిపారు. గడిచిన 2ఏళ్లలోనే 1400కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఏడాదిలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల కళ్ళ ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు. ఒక్క రఘునాథపల్లి మండలంలోనే ప్రతీ తండాకు పక్కా రోడ్డు ఉండాలని 30కోట్లతో అన్ని తండాలకు బిటీ రోడ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నీడిగొండ, ఫతేషాపూర్, మాదారం మీదుగా ఖిలాషపూర్ వరకు 6కోట్లతో బిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి కాలువల వెంట, రిజర్వాయర్ల వెంట తిరుగుతూ అధికారులతో మాట్లాడుతూ కాలువలు తీయించడం, మారమ్మత్తు పనులు చేయించడం, సిసి లైనింగ్ చేయించడం వల్ల ఈ రోజు అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథపల్లి, లింగాల ఘనపూర్ మండలాలకు రెండు పంటలకు సాగు నీరు అందించగలుగుతున్నామని అన్నారు. యాసంగిలో కూడా పటేల్ గూడెం చెరువు నింపి రఘునాథపల్లి రైతులకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ప్రజలందరూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్లినింగ్ మిషన్, మయిస్చర్ మిషన్, త్రాగు నీరు, విద్యుత్ లైట్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కల్లానికి వచ్చిన ధన్యంలో ఒక్క గింజ కూడా తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు అడిగితె తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోతె మిల్లర్లు కనీసం 2వేలు కూడా పెట్టారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనడం లేదని వెల్లడించారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి 2389రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వారం రోజుల లోపలనే జమ కానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొవాలని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని కోరారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డివో, డిఆర్ డివో, తహసీల్దార్, ఎంపిడివో, ఏఈవో, డిపిఎం, ఎపిఎం, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నొక్కేసి నీతులా జగన్ రెడ్డిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఫైర్

సీపీఎస్ ఉద్యోగులకు సంబందించిన కంట్రిబ్యూషన్ సొమ్మును, జిపీఎఫ్ సొమ్మును వాడుకోవడమే కాకుండా అడుగడుగునా ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బకొట్టి వారి మధ్య చీలికలు తెచ్చిన మీరు, కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధివిధానాలపై అడిగే హక్కు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డిఏ పై గంటా నూకరాజు స్పందించారు. అనుభవశీలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎంతో ముందు చూపుతో అడుగులు వేసే నాయకుడు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల రూపకల్పనే ద్యేయంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యోగుల ప్రొవిడెండ్ ఫండ్, కంట్రిబ్యూషన్ సొమ్మును, చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాచుకున్న సొమ్ములను వాడుకొని పాలన సాగించిన మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని అన్నారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డిఏల విషయంలో చంద్రబాబు సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. ఒకరోజు డిఏ ను ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తే అధికారంలో ఉండగా ఒక్క డిఏ కూడా ఇవ్వని జగన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఐదేళ్ల పాటు ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్న విషయాన్ని మర్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన సందర్భాలు లేవని అది ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. పదవీవిరమణ అయితే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వయసును పెంచిన సంగతి మర్చారా..? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగ సంఘాలను పొగిడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విశ్వరూపం బయటపడిందని అన్నారు. సాక్ష్యాత్ గురువులనే మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనులని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. డిఏలు, పీఆర్సీ, మెడికల్ బిల్లులు, ఈఎల్స్, సీపీఎస్ కంట్రిబ్యూషన్ ను ఎగ్గొట్టడం.. జీతాలు, పెన్షన్స్ కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడం వంటి దుశ్చర్యలు ఉద్యోగులు మర్చిపోరని గంటా నూకరాజు అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరి పంటకు తీవ్ర నష్టం

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్నె 22: నెల్లూరు లో వరి పంట నష్టం. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో వరి కోత దశలో ఉండగా ఈవర్షాలతో 2387.5 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. 890 మంది రైతులు ఇప్పటి వరకు నష్ట పోయారు. నష్టబోయిన రైతులకు వరికి, వేరుశనగకు హెక్టారుకు రూ. 15 వేలు పరిహారం ఉంటుందని వివరించారు. మరో కొన్ని రోజులు వర్షాలు ఉండడంతో పంట నష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధి ) అక్టోబర్ 22:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.