Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ భూమి పూజ

ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో భక్తుల జయజయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి… ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన గుండెమడకల గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు… కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం : మంత్రి ఆనం గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది : మంత్రి ఆనం ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు.. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను : మంత్రి ఆనం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ భూమి పూజ

ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో భక్తుల జయజయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి… ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన గుండెమడకల గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు… కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం : మంత్రి ఆనం గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది : మంత్రి ఆనం ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు.. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను : మంత్రి ఆనం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…..

విశాఖపట్నం

ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు

ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విశాఖ క్రీడాకారిణిలు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* ఖేలో ఇండియా అస్మిత పెన్ కాక్ సిలాట్ విమెన్స్ లీగ్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నాడు సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ లో జరిగింది. ఈ లీగ్ లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం కు చెందిన దాదాపు 150 మంది క్రీడాకారిణీలు పాల్గొన్నారు. ఈ లీగ్ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన DSNLU ప్రస్తుత VC ప్రొఫెసర్.D. సూర్య ప్రకాశరావు గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం ఇటువంటి లీగ్ లు నిర్వహించడం ద్వారా వారిని మరింత దృఢంగా తయారుచేయవచ్చని పేర్కొన్నారు. ఈ లీగ్ ను డా ఆడారి కిషోర్ కుమార్ గారి అధ్యక్షతన మాస్టర్ వెంకట్ తదితరులు అద్భుతంగా నిర్వహించడం జరిగింది గౌరవ అతిథులుగా విచ్చేసిన ఉత్తరాంధ్ర పెన్ కాక్ సిలాట్ చీఫ్ పాట్రాన్ గురు దయమయ గారు మాట్లాడుతూ ఇది భారత ప్రభుత్వం చే గుర్తించబడిన ఆట కావున విద్యార్థులు కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.సౌత్ జోన్ పెన్ కాక్ సిలాట్ అధ్యక్షులు P. మనోజ్ సాయి గారు మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణి లకు ఇది ఒక గొప్ప అవకాశం అని మార్షల్ ఆర్ట్స్ ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది” అని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ మరియు ఇంటెలిజెన్స్ కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడగల సన్యాసిరావు గారు మాట్లాడుతూ ” ఆడపిల్లలు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ స్థైర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. DSNLU స్పోర్ట్స్ పీడీ M. మంగ రాజు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ భాగ్య లక్ష్మీ గారు కూడా పాల్గొన్నారు. ఈ లీగ్ లో విశాఖ బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

విశాఖపట్నం

పిటిషన్ కమిటీ మీటింగ్

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* గౌరవ *టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు* ఈరోజు పిటిషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కమిటీ సభ్యులతో కలిసి వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ *కె. రఘురామ కృష్ణరాజు*. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఎమ్మెల్యేలు *విష్ణుకుమార్ రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్*, వైద్య, ఆరోగ్య శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….కలిగిరి సర్కిల్ సీఐ వెంకటనారాయణ.

కలిగిరి, అక్టోబర్ 22 :(పున్నమి ప్రతినిధి ):// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. బంగాళాఖాతం లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీనివల్ల భారీ వర్షాలు పడతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణకోరారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాల ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

జనగాం

పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యం : ఇన్ఫోసిస్ రాపాక.స్వాతి నాగరాజు*

సమాజంలో పేదరిక నిర్మూలన కేవలం విద్య తోనే సాధ్యం అని ఇన్ఫోసిస్ సంస్థ సేవా విభాగం మమత’ *కోఆర్డినేటర్ రాపాక స్వాతి* అన్నారు. మంగళవారం ఉదయం జనగామ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు తమ సంస్థ తరఫున మూడు కంప్యూటర్లు వితరణ చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సునంద అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వాతి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద తమ సంస్థ చేపట్టిన వితరణ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థ లు ప్రత్యేకించి బాలికలు చదివే సంస్థల కు కంప్యూటర్స్ వితరణ చేస్తున్నట్లు తెలిపారు. తన జన్మభూమి పై గల మమకారం తో తమ నాన్నగారు పుర ప్రముఖులు ఫజ్జూరి జయహరి కోరిక మేరకు ఈ కళాశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం *కోఆర్డినేటర్ స్వాతి భర్త రాపాక నాగరాజు మాట్లాడుతూ* ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నాయకురాలు సుధా నారాయణ మూర్తి ప్రోత్సాహంతో మన ప్రాంతంలో ఇప్పటివరకు పల్లగుట్ట, ములుగు, పాలకుర్తి, చిల్పూర్, రాయపర్తి పాఠశాలలకు కంప్యూటర్స్ వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో విశిష్ఠ అతిథి గా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు మాట్లాడుతూ స్వాతి దంపతుల సేవా నిరతి, జన్మభూమి పై గల ప్రేమ ను అభినందించారు. ఈ ప్రాంతంలో మరిన్ని పాఠశాలలకు తమ సేవలు విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు గట్టు వెంకన్న, పురప్రముఖులు అరుగుల శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్ర గుప్త, బిజ్జల నవీన్, పి. నసింహారావు, గట్టు శ్రీనివాస్, ఆర్ . జగదీష్, మాశెట్టి సంతోష్, కళాశాల లెక్చరర్లు ఎస్. కృష్ణయ్య, వి. సంతోషి, సిహెచ్. ప్రభావతి, ఎన్. కృష్ణవేణి, జి. సిందూజ తదితరులు పాల్గొన్నారు

జనగాం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

స్టేషన్ ఘన్పూర్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఐకెపి సెంటర్ల లోనే ధాన్యం కొనుగోల్లు జరపాలని మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని అన్నారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2389, రెండవ గ్రేడ్ ధాన్యానికి రూ.2369 ల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే ఒక క్వింటాలు రూ. 500 బోనస్ వారం రోజుల్లోనే జమ కానున్నాయని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో VOA లు శ్రీలక్ష్మి, జయశ్రీ, కృష్ణ లీల, వివో అధ్యక్షులు మందపురం సునీత, పల్లె యాకలక్ష్మీ, వారాల సునీత, నాయిని రజిత, MD రుక్సానా, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలయోగి స్టేడియంలో దీపావళి చెత్త ఎవరి బాధ్యత..?

అమలాపురం, అక్టోబరు 22(పున్నమి ప్రతినిధి) : డబ్బులు వసూలు చేసుకున్నారు.. క్లీనింగ్ మరిచారు… బాలయోగి స్టేడియంలో దీపావళి చెత్త ఎవరి బాధ్యత..? ఇబ్బంది పడుతున్న వాకర్స్…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అడుగుకో గుంత… అతుకుల బొంత

అక్టోబర్ చేజర్ల. పున్నమి ప్రతినిధి *అవస్థలు పడుతున్న భక్తులు, ప్రజలు* *గతంలో తూతూ మంత్రంగా గుంతలకు ప్యాచ్ మరమ్మతులు* *ప్యాచీలు వేసిన కొద్ది రోజులకే బయటపడ్డ గుంతలు, బురదమయంగా మారిన రోడ్డు* *కనీస ప్రభుత్వ నాణ్యత తారుణి కూడా ఉపయోగించకుండా, సక్రమమైన పద్దతిలో మరమ్మతులు చేపట్టలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు* *తక్షణమే ప్రభుత్వ నాణ్యత తారుణి, కంకరుని ఉపయోగించి మరమ్మతులు చేపట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు* *డబుల్ లేన్ రోడ్డు వేయాలంటూ ప్రజల వేడుకోలు* (నెల్లూరు–పెంచలకోన) : ఆదూరుపల్లి నుంచి కొలపనాయుడు పల్లి, దాచూరు మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి వెళ్ళే రహదారి నరక దారిగా మారుతుంది. ఆ దారి మీద వెళ్లాలంటే అమ్మో ఆ రోడ్డుపై ప్రయాణించడం కష్టమేనని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రహదారులను చూసి ప్రయాణిస్తున్న ప్రజలు ఈ రహదారి అడుగుకో గుంత… అతుకుల బొంతగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదూరుపల్లి నుంచి గోనుపల్లి వరకు రహదారి అంతా గుంతలతో దారుణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రహదారి గుండా ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏర్పడిన గుంతలకు ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్యాచ్ ల పనులతో మరమ్మత్తులు చేపట్టారు… కానీ ఒప్పంద కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా చిన్నచిన్న ప్యాచ్ వర్క్ లు చేసి, కనీస ప్రభుత్వ నాణ్యత గల తారు కూడా ఉపయోగించలేదని, వారు వేసిన ప్యాచీలు చిన్నపాటి వర్షానికే తారంతా కొట్టుకుపోయి, రోడ్డంతా బురద మయంగా మారింది, వాహన చోదకులు ఆ బురదలో చిక్కుకుని కుయ్యో మొర్రో ఇవేం ప్యాచీలయ్యా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు… ప్యాచీలు వేసిన కొద్ది రోజులకే మళ్లీ గుంతలు బయటపడడమే కాకుండా సక్రమమైన పద్దతిలో మరమ్మతులు చేపట్టలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ భక్తులు ఈ మార్గం ద్వారా పెంచలకోన దేవాలయం, వాటర్ ఫాల్స్ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వెళ్తుంటారని ప్రజలు అంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారిపై మట్టి, జారుడు పరిస్థితులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. నెల్లూరు నుంచి పెంచలకోనకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి గుండానే వెళ్లాల్సి ఉంది. అయితే ఈ రహదారి మార్గాన వెళ్ళే కార్లుతో పాటు ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడడమే కాకుండా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్ ల పనుల కంటే ఆ గుంతలే నయం అన్నట్లుగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, పెంచలకోనకు వెళ్ళే రహదారి అయిన ఆదూరుపల్లి నుంచి గోనుపల్లి వరకు తక్షణమే ప్రభుత్వ నాణ్యత తారుని, కంకరని ఉపయోగించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే డబుల్ లేన్ రోడ్డు వేస్తే భక్తులతో పాటు ప్రజలు ఆ రహదారిన వెళ్ళే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవములు

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం రూరల్ మండలం పాత బండారులంక శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించారు, ముందుగా, విఘ్నేశ్వరుడు కి కొండా దుర్గా సాయి ప్రకాష్ దంపతులుచే అష్ట ద్రవ్య అభిషేకం లు తో ప్రారంభించి మూల విరాట్ విగ్రహాలకు, నూతన వస్త్రాలు, పూల ದಂಡలు వేసి ఈ కార్తీక మాసం నెల రోజులు మా ఆలయానికి విచ్చేసి మమ్ములను అనుగ్రహముచాలని కోరుట అనంతరం ప్రసాద్o వితరణ జరిగినದಿ ,శ్రీ శైలంమాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురువు సత్యనారాయణ గారు పురోహితం చేయగా, దర్మకర్త పిచ్చిక వెంకన్న శ్రీమతి ఇందిరాదేవి ,చింతా అత్తిలింగం శ్రీమతి వీరభద్రమని , చింతా శంకర మూర్తి,శ్రీమతి చంద్రకళ, లక్కీoశెట్టి నాగ మల్లేష్రావు భ్రమరాంబ, పడవల తాతారావు దంపతులు, కొండా శ్రీనివాసరావు దంపతులు, యు.లింగమూర్తి దంపతులు, చింతా ఉమా దంపతులు, గొల్ల మల్లేష్ రావు దంపతులు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.