Friday, 24 April 2026

Blog

విశాఖపట్నం

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదు లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదు ~ ప్రఖర్ జైన్, ఎండీ, ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ.

విశాఖపట్నం

విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు!

విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు! `రాష్ట్ర వ్యాప్తంగా చర్చ `ఇరువుర్ని బదిలీ చేసిన ప్రభుత్వం *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* రెవెన్యూ శాఖను ఒక కుదుపు కుదిపేసిన విశాఖ ‘పప్పు, ఉప్పు’ రచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. విశాఖ డీఆర్వోపై ఫర్యాదు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాయడంపై రెవెన్యూ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్‌ మర్యాదలు చూసే కీలకమైన శాఖగా పేరుంది. ఆ శాఖ పరిధిలోని భూములు, ఇతరత్రా వ్యవహారాల సంగతి పక్కన పెడితే.. ఈ ప్రోటోకాల్‌ పేరుతో జరిగే ఆ శాఖ పరిధిలోని కిందిస్థాయి కార్యాలయాల నుంచి జరిపే అనధికార వసూళ్లు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. దీనికి విశాఖ రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న తాజా పరిణామాలే నిదర్శనం. శ్రీకాకుళం నగరంలో ఉంటున్న తన కుటుంబానికి ఇక్కడి రెవెన్యూ అధికారుల ద్వారా కిరాణా సరుకులు సరఫరా చేయించుకుంటున్న డీఆర్వో భవానీశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీలేఖ ఆ లేఖ కోరారు. ఇది కాస్త రచ్చ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వో, ఆర్డీవోలపై వేటు వేసింది. వారిని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి సరెండర్‌ చేస్తూ వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా రెవెన్యూతో సహా అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రోటోకాల్‌ వివాదాలు, అవినీతి ఆరోపణలకు పరోక్షంగా ప్రభుత్వం కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న ఆర్డీవో శ్రీలేఖ వివాదస్పదమైన వాదన ఇప్పటిది కాదు.. ఆమె విధుల్లో చేరిన నాటి నుంచి కూడా ఏదో వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. సరుకులు సప్లై కోణంలో డీఆర్వో భవానీ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇరువురికి దాదాపు ఏడాదిగా వివాదం వుందనే వాదన లేకపోలేదు. ఇరువురు ఈగోకి వెళ్లే దాఖలాలు కూడా వున్నాయనే వాదన విశాఖ కలెక్టరేట్‌లో వినిపిస్తున్నాయి. ఎవరైతే నాకేంటి? అనే పంథాలో ఆర్డీవో శ్రీలేఖ వ్యవహరించేదనే వాదన బలంగా కలెక్టరేట్‌ నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో.. ఆ ప్రభుత్వ మాటేమో కానీ.. చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించిన బదిలీ అయిన శ్రీలేఖ.. అక్కడున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అక్కడున్న పరిస్థితుల్లో భాగంగా ఆయనకు మచ్చెమటలు పట్టించిన నేపధ్యంలో.. ప్రస్తుతం ప్రభుత్వం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ దృష్టిలో పడడంతో రాష్ట్రంలో కీలకమైన జిల్లాగా పేరొందిన విశాఖలో ఆర్డీవో పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. విశాఖకు వచ్చాక.. పలు వివాదాల్లో శ్రీలేఖ కూరుకుపోయిందనే వాదన వుంది. పత్రికల పరంగా కూడా ఆమె వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందనే ఆరోపణలున్నాయి. ఓ పత్రికపై తనదైన శైలిలో విజృంభించందనే వాదన వుంది. మరోపక్క.. గాజువాక అంశం పక్కన పెడితే… తనకు అడ్డుగా వున్నాడనే యోచనతో డీఆర్వో భవానీ ప్రసాద్‌ అంశంపై మీడియాకు లీక్‌లు ఇస్తూ.. అది కూడా ప్రతిపక్షానికి చెందిన మీడియాకు లీకులివ్వడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం నేపధ్యంలొ ఇరువురు మధ్య నెలకొన్న వైరం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నది అనే యోచనలో… ఇరువుర్ని కూడా ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఆంధ్రప్రదేశ్

వర్షాలకు గిరిజన కాలనీల లో పర్యటనలు ముమ్మరం

గిరిజన కాలనీలలో పర్యటించిన బొబ్బేపల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజన కాలనీల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండలంలోని బలిజపాలెం గిరిజన కాలనీను సందర్శించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులను ఆరా తీసి, వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, సర్వేపల్లి పరిధిలో కూడా జనసేన నేతలు ప్రజలతో మమేకమవుతూ సహాయక చర్యల్లో భాగమవుతున్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పనిచేస్తోంది. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు, కీలక అప్డేట్*

AP లో స్థానిక సంస్థల ఎన్నికలకు( సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీలు) కసరత్తు మొదలయ్యింది. ఈ ఎన్నికలను నాలుగో దశలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల SEC నీలం స్నాహిని చెప్పిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని SEC చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.

ఖమ్మం

ఎల్లా రావు గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లా రావు గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పున్నమి దినపత్రిక ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు మరింత విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.

E-పేపర్

అమరవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అష్ఫాఖుల్లా ఖాన్‌ (1900-1927) 125వ జయంతి

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్‌ వలస పాలకులపై విప్లవ శంఖారావం పూరించిన అష్ఫాఖుల్లాఖాన్‌ 1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, షాజహాన్‌పూర్‌ లోని సంపన్న జమీందారి కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు మజహరున్నిసా బేగం, షఫీఖుల్లాఖాన్‌. చిన్ననాటి నుండే మంచి చదువరి అయిన తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న అష్ఫాఖ్‌ ఉర్దూ కవిగా రూపొందారు. ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను తన కవితల్లో వ్యక్తంచేశారు. విప్లవోద్యమం పట్ల ఆకర్షితులైన ఆయన ‘హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ అధ్యక్షులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ పరిచయం కోసం పరితపించారు. ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ తొలుత విప్లవ సంఘంలో అష్ఫాఖ్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించారు. అష్ఫాఖ్‌ పట్టుదల, విప్లవోద్యమం పట్ల గత నిబద్దత వలన ‘హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’లో ఆయనను చేర్చుకోక తప్పలేదు. బిస్మిల్‌ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో అష్ఫాఖ్‌ చురుగ్గా పాల్గొన్నారు. విప్లవ సంఘానికి ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు బిస్మిల్‌ పథకం రూపొందించారు. ఈ పథకం పట్ల అష్ఫాఖ్‌ తొలుత అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ఆంగ్ల ప్రభుత్వం సర్వశక్తులతో విప్లవోద్యమం మీద విరుచుక పడగలదని, బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తినగలదని అష్ఫాఖ్‌ హెచ్చరించారు. చివరకు ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవం గల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు. 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం మీదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను కైవసం చేసుకునేందుకు రూపొందిన పథకాన్ని విజయవంతం చేయడంలో అష్ఫాఖ్‌ ప్రధాన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటిష్‌ ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకపడిరది. ‘హిందూస్దాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ సభ్యుల అరెస్టులు సాగించింది. అష్ఫాఖుల్లా ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన మిత్రద్రోహి కారణంగా ఢల్లీిలో అరెస్టయ్యారు. ఈ కాకోరి రైలు సంఘటన విచారణ సమయంలో నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు ఆయన శతవిధాల ప్రయత్నించారు. కాకోరి రైలు సంఘటనకు పూర్తి బాధ్యత తనదంటూ న్యాయవాది సలహాకు భిన్నంగా ప్రీవికౌన్సిల్‌కు రాతపూర్వకంగా తెలిపారు. అంగ్ల న్యాయస్థానం అష్ఫాఖ్‌కు ఆయన సహచరులు మరో ముగ్గురికి ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ ఉరిశిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ జైలులో గడిపిన ఆయన ‘నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి… నాదేముంది నేను ఉండొచ్చు, ఉండక పోవచ్చు’ అంటూ ఆకాంక్ష వ్యక్తంచేశారు. చివరకు 1927 డిసెంబర్‌ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జైలులో ఉరిశిక్షను ఆనందంగా ఆహ్వానించిన అష్ఫాఖుల్లా ఖాన్‌ చిరస్మరణీయులయ్యారు.

ఖమ్మం

అమిత్ షా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల

పున్నమి ప్రతి నిధి ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, అభివృద్ధి, జాతీయ ఏకతకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ ప్రజలకు శ్రీఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి..! బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి…!

దుత్తలూరు: 21 అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి…….. తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. విస్తారం గా కురుస్తున్న వర్షాలు తొ పాడి రైతులు, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రజలందరు దృఢమైన భవనాలలో ఉండాలని పెచ్చులూడి న స్లాబ్ లు ఇతర గుడిసెలు లోతట్టు ఉండవద్దు అన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు, నాయకులకు సమాచారం అందించాలన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవిన్యూ,విద్యుత్, పోలీస్,అగ్నిమాపక సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దుత్తలూరు: 21 అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి…….. తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. విస్తారం గా కురుస్తున్న వర్షాలు తొ పాడి రైతులు, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రజలందరు దృఢమైన భవనాలలో ఉండాలని పెచ్చులూడి న స్లాబ్ లు ఇతర గుడిసెలు లోతట్టు ఉండవద్దు అన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు, నాయకులకు సమాచారం అందించాలన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవిన్యూ,విద్యుత్, పోలీస్,అగ్నిమాపక సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

అన్నమయ్య

చిట్వేల్ గ్రామ పంచాయతీ ప్రజలకు అత్యవసర మనవి

-భారీ వర్ష సూచన: లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిట్వేల్, అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి ప్రతినిధి ) గత రెండు రోజులుగా చిట్వేల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, గ్రామ పంచాయతీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని **చిట్వేల్ గ్రామ పంచాయతీ (సర్పంచ్/అధికారి) శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి** విజ్ఞప్తి చేశారు. -వర్ష సూచన, ముంపు హెచ్చరిక మరికొన్ని రోజులు (మొన్న, నిన్న, ఈ రోజు) కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసినందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు. -ముఖ్యంగా గుంజన నదికి ఆనుకుని ఉన్న తోపువీధి, బ్రాహ్మణవీధి, పాత చిట్వేలిప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లేదా వాగుల వద్దకు వెళ్లరాదు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. -అందుబాటులో పంచాయతీ గ్రామ ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తినా, ఆపద సంభవించినా లేదా ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితిని గమనించినా వెంటనే పంచాయతీకి సమాచారం అందించాలని శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు. చిట్వేల్ ప్రజల కోసం తాను నిరంతరం ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

తిరుపతి

లోతట్టుప్రాంతాలలో ఉన్న గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి: జనమాల గురవయ్య

శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కుటుంబాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఓ ప్రకటనలో తెలియజేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల కూలీ పనులు లేక ఇళ్లకే పరిమితం అయిపోయిన యానాదులను ఆదుకోవాలని కోరారు. ఒకపక్కనీట మునిగిన ఇల్లు,మరోపక్క ఉరుస్తున్న ఇళ్లల్లో నానా అవస్థలు ఎదుర్కొంటున్న యానాదులను ప్రభుత్వ అధికారులు లో తొట్టు ప్రాంతాలను పరిశీలించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.