ఉక్కు లో అమృతరావు కు ఘన నివాళులు
ఉక్కులో అమృతరావుకు ఘన నివాళి విశాఖపట్నం , పున్నమి ప్రతినిధి ( అక్టోబర్). విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 21రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే తెలుగు వారికి ఉద్యోగాలొస్తాయని ప్రాణాలకు సైతం లెక్కచేయలేని ఉక్కు సాధకులు, ఉక్కు సత్యాగ్రహి, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా సైన్యంలో పనిచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు , గుంటూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ తమనంపల్లి అమృతరావు 105వ జయంతి వేడుకను స్టీల్ ప్లాంట్ అమృతరావు పార్కులో ఘనంగా నిర్వహించారు. నిర్వహణ కమిటీ చైర్మన్ ఎ.వి.రమణారావు, వైస్ చైర్మన్ జెర్రిపోతుల మోహన్ కుమార్ నిర్వహణ లో జరిగిన ఈ జయంతి వేడుకలకు గాజువాక మాజీ ఎంఎల్ఎ చింతలపూడి వెంకటరామయ్య, వైఎంసిటీ చైర్మన్ వై వరలక్ష్మి ముఖ్య అతిథి గా విచ్చేసారు. ఈవేడుకలో చింతలపూడి వెంకటరామయ్య మరియు కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉక్కు పోరాటంలో చనిపోయిన 32మంది అమరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా చింతలపూడి వెంకటరమణ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండడం కోసం మేమంతా ఎంత దూరమైనా పోరాడుతామని తెలియజేస్తున్నానన్నారు. స్టీల్ ప్లాంట్ కి నిధులు కేటాయించామని చెబుతూనే ప్లాంట్ అవసరాలకు కేటాయించకుండా భారం మోపుతున్నారని, విఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను సాగనంపుతు, మరో పక్క వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నారని ,ఇది చాలా అన్యాయమన్నారు. మన రాష్టంతో పాటు పక్కరాష్ట్రాలలో వున్న ఇతర ఉక్కు కర్మాగారాల ప్రైవేటీకరణ ఆపి ,వాటి అభివృద్ధికి నిధులు కేటాయించుకున్నారని, కానీ మన రాష్ట్రంలో ఎండిఏ ప్రభుత్వం అధికారంలో వున్నా సరే ఇప్పటికీ ప్రైవేటీకరణ ఆపేసామనే స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని, ఓవైపు వివిధ విభాగాల ప్రైవేటీకరణతో పూర్తి స్ధాయి ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచారని అన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు తెలుగు వారిగా ఉద్యమాలతో ఉక్కు పాదం మోపుతామని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ 9 లక్షల కోట్లు ఇతర ప్రైవేట్ బిజినెస్ మాన్ లకు రుణాలు రద్దు చేశారని, స్టీల్ ప్లాంట్ కున్న ఇరవై వేల కోట్లు అప్పుని రద్దు చేయకుండా గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకంత మొగ్గు చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితని,ఎనిమిది లక్షల కోట్లు విలువచేసే స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటీకరణ చేస్తున్నారా లేక ఇరవైవేల కోట్లు అప్పు ఉన్నాయని స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఉక్కు చరిత్రలో అమృతరావు ప్రతీ అణువునా వుంటారని, నేడు కర్మాగారంను బ్రతికించాలంటే 5సం ల పాటు అప్పును పెట్టుబడిగా చూపితే తనంతట తానే పుంజుకుంటుందని అన్నారు. అమృతరావు స్ఫూర్తితో కర్మాగారం కాపాడుకోవాలని, విశాఖ ఉక్కును సెయిల్ లో మెర్జ్ చేయాలని లేదా సొంత గనులు కేటాయించాలని కోరారు . గాంధీ మిషన్ కన్వీనర్ రమణరావు మాట్లాడుతూ ఆంధ్రులకోసం అమృతరావు ప్రాణాన్నే ఫణంగా పెట్టి విశాఖఉక్కును సాధించారని, కర్మాగారం ఏర్పడ్డాక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ లాభాలు ఆర్జించి మేలిమి ఉక్కును ఉత్పత్తి చేసిన ఈ కర్మాగారంకు కూటమి ప్రభుత్వం చేదోడును అందించి కాపాడుకునే ప్రయత్నాలు చిత్త శుద్ధితో చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో జె అయోధ్యరాం,పివి రమణ మూర్తి, జెర్రిపోతుల మోహన్ కుమార్,శకునాల చంద్రశేఖర్, యు రామస్వామి,విళ్లా రాంమోహన్ కుమార్, దేవులపల్లి సంపూర్ణం, కె పరందామయ్య, డివి రమణయ్య,పోలీస్ నాయుడు, అట్టా అప్పారావు,బూసి వెంకట్రావు, డివి రమణా రెడ్డి, డేవిడ్ రాజు,బొండా ఎల్లాజి, దాసరి సురేష్ బాబు, పులి రమణా రెడ్డి, పితాని బాస్కర్,వైకోటి, వంశీ, రవికుమార్,సూరిబాబు,రమణ తదితదులు పాల్గొన్నారు










