Friday, 24 April 2026

Blog

విశాఖపట్నం

నగర పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి.” విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.

“నగర పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి.” * అంతర్జాతీయ కార్యక్రమాలకు నగరాన్ని సుందరీకరించండి. * పారిశుద్ధ్య కార్మికుల జీతాలను నిర్ణితకాలంలో చెల్లించండి. – విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: విశాఖ నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని , విశాఖ నగర వేదికగా జరుగబోవు అంతర్జాతీయ కార్యక్రమాలకు నగరాన్ని సుందరకరించాలని , పారిశుద్ధ్య కార్మికుల విధులను వారి హాజరును పరిశీలించి నిర్ణీత కాలంలో వారి వేతనాలను చెల్లించాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ విశాఖ వేదికగా అంతర్జాతీయ కార్యక్రమాలు నగరంలో త్వరలో జరుగనున్నందున విశాఖ నగరాన్ని మరింత సుందరీకరిస్తూ, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని , అలాగే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను నిర్ణీత కాలంలో చెల్లించేందుకు జోనల్ కమిషనర్లు, ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని ,అందుకు తగినంత కార్మికులను ఏర్పాటు చేయాలని, ఇటీవల తన పర్యటనలో బీచ్ తీర ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది విధులు నిర్వహించడం గమనించానని అన్నారు. పారిశుధ్య కార్మికులు ఎక్కువగా విధులకు గైర్హాజరైనట్లయితే అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని , అలాగే సుదీర్ఘకాలం నుండి విధులకు గైర్హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని, మరణించిన, పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుల స్థానాలలో కొత్తవారిని తీసుకునేందుకు కావలసిన చర్యలను, ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాన వైద్యాధికారికి , జోనల్ కమిషనర్లకు మేయర్ ఆదేశించారు. అలాగే నగరంలో ఎక్కువ ఏ ఏ చోట్ల పారిశుద్ధ్య పనులు అవసరమో గుర్తించి అక్కడ పారిశుద్ధ్య పనుల మెరుగకు అవసరమగు వర్కర్లను సర్దుబాటు చేయాలని అన్నారు. ఇకపై వార్డుల్లో నిత్యం పర్యటిస్తానని పారిశుద్ధ్య పనితీరులో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ,సహాయక వైద్యాధికారులకు మేయరు తెలిపారు. బీచ్ లో సందర్శకులు ,విహారయాత్రికులు ఎక్కువగా సందర్శిస్తున్నందున వారికి కల్పించవలసిన మౌలిక సదుపాయాలలో భాగంగా స్నానపు గదులను, పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ,ఇప్పుడు ఉన్న టాయిలెట్లకు అదనంగా ఆర్కే బీచ్ నుండి అప్పుగర్ వరకు అవసరమైన చోట టాయిలైట్లు, స్నానపు గదుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. బీచ్ లో కలుస్తున్న ప్రధాన కాలువల పరిశుభ్రతకు అవసరమగు చర్యలు చేపట్టాలని మేయర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అందరు జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, అందరు సహాయక వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

నగరంలో వ్యాపారస్తులు డస్ట్ బిన్ లు ఉపయోగించాలి . *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో తమ దుకాణాల ముందుడస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని, లేనియెడల వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు తగిన జరిమానాలు చర్యలు చేపట్టడం జరుగుతుందని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ 2 జోన్ లోని 11, 12, 13 వార్డుల పరిధిలోని ఆరిలోవ లోని బాలాజీ జంక్షన్, శాంతినగర్ కొండ ప్రాంతం, దుర్గా బజారులోని అన్నా క్యాంటీన్ పరిశీలన తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ ముందుగా ఆరిలోవ , బాలాజీ నగర్ లో మాంసం దుకాణం, పూల వ్యాపారులు విక్రయిస్తున్న వీధి వ్యాపారులు వ్యర్ధాలను రోడ్లపై వేయడంతో కమీషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వ్యర్ధాలను వారిచే స్వయంగా తొలగింప చేశారు. ఆరిలోవలోని టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడం గమనించి ఆ టిఫిన్ సెంటర్ యజమానికి 1000 రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. నగరంలో ప్రతి దుకాణం ముందు 3 డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. తదుపరి శాంతిపురం కొండ వాలు నివాస ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు నిత్యం చెత్త తరలించే వాహనాలు సమయానికి వస్తున్నాయా ? వ్యర్ధాలను విభజించి సిబ్బందికి అందిస్తున్నారా, లేదా అని స్థానికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాగునీరు ఏ సమయానికి వస్తుంది ఎంత సమయం ఇస్తున్నారని, తాగునీరు సంతృప్తికరంగా సరఫరా జరుగుతుందా, వీధిలైట్లు సమయానికి వెలుగుతున్నాయి లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిత్యం నిర్ణీత సమయానికి తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని, వీధిలైట్లు నిత్యం వెలిగేలా చర్యలు చేపట్టాలని నీటి సరఫరా, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు కమిషనర్ ఆదేశించారు. నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా తమ దుకాణాల ముందు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసుకోవాలని వ్యర్ధాలను డస్ట్ బిన్లలో వేసి రోజు జీవీఎంసీ వాహనాలకు అందించాలని ,అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలోను, రోడ్ల పైన, కాలువలలో ,ఫుట్పాతులపై వ్యర్ధాలు వేస్తే వ్యాపారస్తులకు 1000 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు జరిమానా విధిస్తూ తగిన చర్యలు శానిటరీ ఇన్స్పెక్టర్లు చేపట్టాలని కమిషనర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. “అన్న క్యాంటీన్ కమిషనర్ పరిశీలన” అనంతరం దుర్గా బజార్ లోనే అన్న క్యాంటీన్ పరిశీలించి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహారం రుచికరముతో పాటు సూచిక బోర్డులో ఉన్న విధంగా అందిస్తున్నారా అని ఆహారం భుజిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టోకెన్ సిస్టంను పరిశీలించి అన్న క్యాంటీన్లోని ఆహారంతో పాటు పరిశుభ్రత పాటించాలని మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె . కనకమహాలక్ష్మి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సమన్వయంతోనే భీమిలి ఉత్సవ్ విజయవంతం*ఎమ్మెల్యే గంటా*

_విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి:_ జీవీఎంసీ, టూరిజం, విద్యా తదితర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసి భీమిలి ఉత్సవ్ ను ఘనంగా నిర్వహించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలి ఉత్సవ్ ను ప్రజలకు, టూరిస్టులకు అనుకూలమైన తేదీల్లో నిర్వహించాలని సూచించారు. భీమిలి చారిత్రక గొప్పదనాన్ని తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలన్నారు. కోలాటాలు.. బోట్ రేసింగ్.. పారా గ్లైడింగ్.. బీచ్ వాలీబాల్.. కబడ్డీ.. డ్రాయింగ్.. రంగోలి.. కుకింగ్.. తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పగా.. ఉత్సవ్ లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీడీపీ హయంలో క్రమం తప్పకుండా ఎంతో ఉత్సాహంగా జరిపిన ఉత్సవ్ ను వైసీపీ హయంలో నిర్వహించకుండా ఆ స్ఫూర్తిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. సమావేశంలో టూరిజం రీజనల్ డైరక్టర్ కల్యాణి, జిల్లా టూరిజం అధికారి మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

వాయుగుండం ప్రభావంతో రాబోయే రెండు రోజులలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని,వారి భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి,ప్రజల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలకు వారిని వెంటనే తరలించాలన్నారు.వాగుల వంకల వద్దకు వెళ్ళొద్దన్నారు.ఎలక్ట్రిక్ స్తంభాలు,తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు.తగినంత త్రాగు నీరు,మందులు,టార్చ్ లైట్లు కొవ్వొత్తులు,పొడి ఆహారం వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ​

హైదరాబాద్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఎన్నికల ప్రచార సమయములో నాయకుల మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణగా మారింది. భవాని శంకర్ వర్గం, నవీన్ యాదవ్ వర్గాల మధ్య తలపడ్డ ఈ ఘర్షణ ర్యాలీ సమయంలో చోటుచేసుకుంది. రెసిడెన్స్ హాలులో జరిగిన ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగినట్లు సమాచారం. భవాని శంకర్ వర్గం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉందని, ఇది పాత వర్గ విభేదాల కొనసాగింపేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు.

E-పేపర్

శాంతి భద్రతలే కాదు… సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి.. ఎంపీటీసీ బండారు. మల్లికార్జున

శాంతి భద్రతలే కాదు… సమాజ సేవలోనూ పోలీసు సిబ్బంది సేవలు, విధులలో నిబద్ధత వెలకట్టలేనివి.. ఎంపీటీసీ బండారు. మల్లికార్జున అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి): అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో దివంగత మాజీ ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సందర్భంలో అనంతరాజుపేట ఎంపీటీసీ బండారు మల్లికార్జున పోలీస్ సిబ్బంది తో పాటు ఉమేష్ చంద్రకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ సమాజంలో పోలీసు సిబ్బంది యొక్క సేవ, కృషి, విధుల పట్ల నిబద్దత మరియు అంకితభావం ప్రజాసేవలో ప్రశంసనీయం అన్నా రు కార్యక్రమంలో మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ యర్రతోట ఉమామహేశ్వరరావు బాబు కానిస్టేబుల్ రాజేంద్ర స్వామి, మాజీ ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర కు నివాళులు అర్పించారు.

అల్లూరి సీతారామరాజు

గంజాయి తో జీవితాలు నాశనం అవుతాయి

డుంబ్రిగుడ( పున్నమి ప్రతినిధి), అక్టోబర్: 21 మండలం లోని అరకు పంచాయితీలో మంగళవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ కెల్ల పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. గంజాయితో పట్టుబడిన వారి ఆర్ధిక లావాదేవీలపైన దర్యాప్తు జరిపి గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ శారద, ఎంపీటీసీ, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

E-పేపర్

కువైట్ లో డిఎస్పి లైవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామిరెడ్డి ధ్వజారెడ్డి.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ) ఈనెల 24వ తేదీన శుక్రవారం నాడు ఏ. ఐ అరబీ స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా, కువైట్ దేశంలో తెలుగు కళా సమితి – కువైట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి. కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 వ తేదీ నుండి అనగా బుధవారం నుండి కువైట్ దేశం సాల్మియా లోని హాలిడే ఇన్ హోటల్ నందు తెలుగువారికి, మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్న రామిరెడ్డి ధ్వజా రెడ్డి.

ఎన్ టి ఆర్ జిల్లా

శివరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆడియో సాంగ్ విడుదల

నూజివీడు నియోజకవర్గ ఫైర్ బ్రాండ్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో సాంగ్‌ను మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అధికారికంగా విడుదల చేశారు.ఈ సందర్భం గా ఉదయభాను శివరామకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు వేడుకల భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. శివరామకృష్ణ జీవితంలో మరింత విజయాలు, ఆరోగ్యం, ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ, అభినందనలు తెలిపారు.

E-పేపర్

దళితుల భూములను ఆక్రమించిన వారి పైన తక్షణమే కేసులు పెట్టాలి…

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి, కార్యాలయాన్ని ముట్టడించి తాసిల్దార్ కు వినత పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా పండుగోల మణి, జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూర్ వారి పల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మినుగు యానాదమ్మ భర్త జయరామయ్య గత 15 సంవత్సరముల నుండి రెండు ఎకరాలు భూమి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19.10.2025 తేదీన ఆదివారం. దీపావళి సెలవులు సమయంలో అదును చూసుకొని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రి, ముళ్ల కంచె తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దళితులు భూములు దళితులు ఇచ్చి. అక్కడ మిగిలిన భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలకు కేటాయించాలని తాహసిల్దార్ ను కోరగా, అర్హత గలవారు దరఖాస్తు చేసుకుంటే, పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అదేవిధంగా దళితుల భూములను కబ్జా చేసిన వారి పైన వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు కడతామని తహసిల్దార్ కే అమర్నాథ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటరమణ. కటారి గోపాల్ బాధితులు దాదాపు 50 మంది పాల్గొనడం జరిగినది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.