Friday, 24 April 2026

Blog

E-పేపర్

దళితుల భూములను ఆక్రమించిన వారి పైన తక్షణమే కేసులు పెట్టాలి…

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి, కార్యాలయాన్ని ముట్టడించి తాసిల్దార్ కు వినత పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా పండుగోల మణి, జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూర్ వారి పల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మినుగు యానాదమ్మ భర్త జయరామయ్య గత 15 సంవత్సరముల నుండి రెండు ఎకరాలు భూమి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19.10.2025 తేదీన ఆదివారం. దీపావళి సెలవులు సమయంలో అదును చూసుకొని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రి, ముళ్ల కంచె తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దళితులు భూములు దళితులు ఇచ్చి. అక్కడ మిగిలిన భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలకు కేటాయించాలని తాహసిల్దార్ ను కోరగా, అర్హత గలవారు దరఖాస్తు చేసుకుంటే, పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అదేవిధంగా దళితుల భూములను కబ్జా చేసిన వారి పైన వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు కడతామని తహసిల్దార్ కే అమర్నాథ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటరమణ. కటారి గోపాల్ బాధితులు దాదాపు 50 మంది పాల్గొనడం జరిగినది

ఎన్ టి ఆర్ జిల్లా

జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన తరగతులు

జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మంగళవారం నాడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నందిగామ శక్తి టీం ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, హనుమయ్యలు సమన్వయపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్”, సైబర్ క్రైమ్, మరియు “పోక్సో చట్టం”లపై అవగాహన కల్పించారు. యువత ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో స్పష్టంగా వివరించారు. అదేవిధంగా, “నో హెల్మెట్ – నో డ్రైవింగ్”, “నో లైసెన్స్ – నో డ్రైవింగ్” వంటి రోడ్ సెఫ్టీ అంశాలపై కూడా సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐలు శ్రీనివాసరావు, హనుమయ్యలతో పాటు పలువురు పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

తిరుపతి

కూలిన కోర్టు ప్రహరీ గోడ- రెండు ఇళ్లు ధ్వంసం:బాధితులకు బాసటగా బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని కోర్టు వద్ద గల కర్మ క్రియల మండపం పక్కన ఉన్న చెంబేడు కాలువ ఆనుకుని ఉన్న 30 అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం తో అక్కడ పక్కనే ఉన్న రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో నిర్వాసితులకు భరోసా కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పై విషయాన్ని చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేసి ఇళ్లు కోల్పోయిన వారికి మౌలిక వసతులను కల్పించి కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఇల్లు కూలిపోయిన నిర్వాసితులకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు

మైనర్ విద్యార్ధి గొంతు కోసిన అగంతకుడు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:21 జరుగుతున్న కొన్ని ఘటనలు పట్టణాల విష సంస్కృతి పల్లెలకు ప్రకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అరకులోయ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం అరకు క్రీడా పాటశాలలో 9వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్ధి ని ఓ అగంతుకుడు గొంతు కోసి పరారయ్యాడు. దీంతో గాయపడిన విద్యార్ధిని తోటి విద్యార్ధులు అరకు ఏరియ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఏరియ ఆసుపత్రిలో గాయపడిన మైనర్ విద్యార్ధికి త్వరగా చికిత్స అందడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. క్రీడా పాటశాల ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం… క్రీడా పాటశాల కు చెందినా నలుగురు విద్యార్ధులు పాటశాల నిర్వాహకుల అనుమతితో దీపావళి రోజున అరకులోయ కు వచ్చి, తిరిగి పాటసాలకు వస్తున్నా సమయంలో వారికి పరిచయం లేని వ్యక్తీ విద్యార్ధులను డబ్బులు అడగగా వారి వద్ద లేవని తెలపడంతో, డబ్బులు లేవన్నందుకు విద్యార్ధులతో వాగ్వాదానికి దిగి ఆగంతుకుడు తన దగ్గర ఉన్న బ్లేడుతో మైనర్ విద్యార్ధి గొంతు కోసి పరారైనట్లు తెలిపారు. దీంతో గాయపడిన మైనర్ విద్యార్ధిని తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

అల్లూరి సీతారామరాజు

సమస్యలు పరిష్కారంకి ఈ నెల 22 నుండి సమ్మెలోకి : ఆసుపత్రి శానిటేషన్ కార్మికులు వేతనాలు పెంచుతూ జారి చేసిన జీవో ప్రకారం 2024ఎరియర్స్ చెల్లించాలి సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సానిటేషన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అరకులోయ ఏరియా ఆసుపత్రి ముందు సీఐటీయు అద్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. సానిటేషన్ కార్మికులు సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 22 తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉన్నతాధికారుల ద్వారా కంట్రాక్టర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ హాస్పటల్ శానిటేషన్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రఘు తెలిపారు. 2024 సంవత్సరంలో వేతనాలు రూ.18600 లకు పెంచుతూ వచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు హాజరై మాట్లాడారు. వేతనాలు పెంచుతున్నట్లు వచ్చిన జీవో ప్రకారం 2024 ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తవారికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీతాలు కి ఎఫ్ ఆర్ ఎస్ లింకు పెట్టొద్దని తెలిపారు. కార్మికులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున ప్రతినెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, డ్యూటీ చార్ట్ ఏర్పాటు చేసి అదనపు పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు. టెండర్ విధానం రద్దుచేసి ప్రభుత్వమే వేతనం లు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన పట్టించుకోలేదని అందుకే సమ్మెలోకి వెళుతున్నట్లు తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

రోడ్డు మరమ్మతులు చేయించిన రెడ్డి మిత్రమండలి.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం హైవే NH44 నుండి గ్రామానికి గల రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులు ఉన్న గుంతలను ఎర్ర మట్టితో సుమారు70 వేల రూపాయలతో [రెడ్డి మిత్రమండలి] వారు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో నీట మునిగిన రోడ్లు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలో తెల్లవారుజాము నుండి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయి కాలువలు నిండి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది.రోడ్లు కాలువలు నీటితో నిండిపోవడంతో కాలువలు కనిపించక పాదచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

E-పేపర్

*మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పుట్టినరోజు వేడుకలు*

*రామవరప్పాడు లో వైఎస్ఆర్సిపి నాయకుల సందడి రామవరప్పాడు: అక్టోబర్ 21 పున్నమి వినోద్. గన్నవరం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు వల్లభనేని వంశీ మోహన్ జన్మదిన వేడుకలు రామవరప్పాడు లో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. రామవరప్పాడు లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి, తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈవేడుకలో సమ్మెట సాంబశివరావు,సమ్మెట లక్ష్మి,కూనపరెడ్డి సీతయ్య మెండే సుధాకర్,నూకల పుల్లయ్య, ఉప్పు నాగరాజు,రాచమల్ల నాగభూషణం,కర్నే గోవిందు,శనాపతి నారాయణ, బిరుదుగడ్డ దానియేలు,గాడిలీ రాజేష్,ఈదర నాగేశ్వరరావు,కొల్లు రమేష్, శిఖ ఆజాద్, కూనపరెడ్డి శివ,నాని,సత్తిబాబు, సంజీవ్ తో పాటు పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై తమకున్న అభిమానాన్ని,విశ్వాసాన్ని చాటుతూ,వారు ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలు రామవరప్పాడు వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.

ఖమ్మం

బీజేపీ నేతల మీద దాడి.. విచారణ కి త్రి సభ్య కమిటీ నియామకం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రత్యేక ప్రతినిధి) ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లిలో ఇటీవల జరిగిన బీసీ రిజర్వేషన్ బంద్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై విచారణ కోసం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 18న ఖమ్మం జిల్లాలో బీసీ రిజర్వేషన్ బంద్ అనంతరం సత్తుపల్లి పట్టణంలోని డీఈ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు అధికారులను కలవడానికి వెళ్తుండగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డగించి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ నేతలపై అబద్ధపు అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు బీజేపీ పేర్కొంది. ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వీ. ఉమాశంకర్ సంతకం చేసిన ప్రకటనలో త్రిసభ్య కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో మాజీ ఎంపీ శ్రీ సీతారాం నాయక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆనంద్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ క్రాంతి కిరణ్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో సత్తుపల్లి పట్టణాన్ని సందర్శించి, అక్కడ జరిగిన వాస్తవ సంఘటనలను ప్రత్యక్షంగా పరిశీలించి, బాధిత బీజేపీ నాయకులతో, స్థానిక పోలీసు అధికారులతో సమావేశమై నివేదికను రాష్ట్ర నాయకత్వానికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన మిశ్రా మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గం లోని బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు కమిటీ పర్యటనలో తప్పకుండా పాల్గొని సంఘటనల వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని పేర్కొంటూ, నిజమైన న్యాయం జరిగే వరకు పార్టీ నిశ్శబ్దంగా ఉండబోదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది.

విశాఖపట్నం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

విశాఖపట్నం, అక్టోబర్ 21: మొత్తం ₹3,92,610 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు. మంగళవారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు బందిపురపు రామయ్య అమ్మ, నగిశెట్టి నాగమణి, రాడి గణేష్, పెదపాటి నానాజీ, సాలాపు నరసమ్మ, మడక పరిదేశి లు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, సింహాచలం, వంగలి గ్రామ సర్పంచ్ గణేష్, ఏఎంసీ డైరెక్టర్ ఆర్.ఎస్. నాయుడు, పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.