Saturday, 25 April 2026

Blog

జనగాం

స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం అంధకారంలో జఫర్ గడ్ మండలం…

శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైఫల్యం తో దీపావళి పండగ పూట కూడా అమావాస్య చీకట్లను అనుభవిస్తున్న జఫర్ గడ్ మండలం 👉స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లో నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి జఫర్ గడ్ మండలం కి వచ్చే వంతెన పైన కానరాని లైట్లు 👉జఫర్ గడ్ మండలం లోని అని గ్రామాలలో జాడ లేని హైమస్ లైట్లు 👉 నీరు అందుబాటులో లేక డ్రమ్ములు ఇంటి ముందు పెట్టుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు 👉 పురోగతి లేని రోడ్లు 👉 ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టించుకోని పాలకులు 👉ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన పేదల పట్ల నిర్లక్ష్యం 👉 మండలం అనేక సమస్యలకు పుట్టిల్లు లాగా ఉన్న పట్టించుకోని మాజీ ఉపముఖ్యమంత్రి గారు ప్రస్తుత శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు

జనగాం

అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ

దేవరుప్పుల మండల కేంద్రంలో మంగళవారం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఇరుకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య సంఘం సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని, అన్నదానం ద్వారా, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుందన్నారు. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని, అదేవిదంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సానుకూలతను తీసుకువస్తాయన్నారు. అన్నదానం ద్వారా, ఇతరులకు ఆహారం అందించడం ద్వారా, వారికి జీవితాన్నిచ్చే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రతి నెల అమావాస్య రోజు దేవరుప్పుల మండల కేంద్రంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి.!

రైస్తో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి.! రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి..! సెంట్రల్ & స్టేట్ ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని సివిల్ సప్లైస్ మంత్రి నదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు షాపులు అందుబాటులో ఉంటాయి.. అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు.. ఇక కార్డ్ హోల్డర్లు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా సరుకు తీసుకునే పోర్టబిలిటీ సదుపాయమూ అందుబాటులోకి రానుంది…

తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

1 లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా బీజేపీ ఆచారి గారు అందజేత… కల్వకుర్తి అసెంబ్లీ : వెల్దండ మండలంలో భారతీయ జనతా పార్టీకి 30 సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా సేవలందించి కొన్ని రోజుల క్రితం అకాల మరణం చెందిన, వెల్దండ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కి,శే చిమ్ముల శ్రీనివాస్ రెడ్డి గారి నివాసానికి చేరుకొని బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు, వెల్దండ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు ఆర్ధిక సాయంగా చెక్కును వారి కుటుంబానికి రూ 1 లక్ష రూపాయలను అందజేశారు. అలాగే ఇంకా 1 లక్ష 40 వేల రూపాయలను వారి పిల్లల పై చదువుల కొరకు అందిస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ పార్టీ కన్వీనర్ శేఖర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, మోహన్ రెడ్డి, మట్ట పరమేష్ గౌడ్, మట్ట విష్ణు గౌడ్, రవి కుమార్ బీజేపీ నాయకుడు శ్రీశైలం, దేవేందర్, కొండల్, పెద్దయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

నిర్మల్

ధాన్యం కొనుగోలు పగడ్బందీల చేపట్టాలి

అక్టోబర్ 21, 2025 – నిర్మల్: *ధాన్యం కొనుగోళ్లు పగడ్బందీగా చేపట్టాలి:* *జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్* జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి కోత ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కోసం వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించాలని, ప్రతి వేయింగ్ మిషన్‌కి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్పలిన్‌లు, గన్ని సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలని, లారీలు, కూలీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9182958858ను సంప్రదించవచ్చని తెలిపారు. కొనుగోలు ఏజెన్సీల సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, హార్వెస్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. రోజువారీగా వరి ధాన్యం కొనుగోలు వివరాలను తమకు అందజేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్తీకమాసం

రేపటి.. కార్తీకమాసం మొదటి రోజు పాటించవలసిన నియమాలు దానధర్మ జపతపాది విధులు – వాటి ఫలితాలు.. 🚩🙏 ఓం నమఃశివాయ 🙏🚩

నాగర్‌కర్నూల్

పోలీస్ అమరవీరుకు* ఘనంగా నివాళులర్పించిన నాగర్ కర్నూల్ జిల్లా *ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ I.P.S గారు.*

*పోలీస్ అమరవీరుకు* ఘనంగా నివాళులర్పించిన నాగర్ కర్నూల్ జిల్లా *ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ I.P.S గారు.* నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో *జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్* గారి ఆధ్వర్యంలో *పోలీస్ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్బంగా* జిల్లా *కలెక్టర్ బి సంతోష్* గారు ముఖ్య అతిధిగా పాల్గొని వారి త్యాగాలను గుర్తుచేసుకొని, అమరుల కుటుంబాలను ముందుండి నడిపిస్తూ నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ నుండి *భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్* విగ్రహం దగ్గరి వరకు పోలీస్ కవాతు నిర్వహించి స్మరించుకోవడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్ రావు, డిఎస్పి బి శ్రీనివాస్ యాదవ్,సిఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుళ్లు హోంగార్డులు పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం

కందుకూరు బాధితులకు ప్రభుత్వ భరోస హర్షనీయం.. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాపు నేతలు చంద్రబాబు కు రాధారంగా రాయల్ అసోసియేషన్ కృతజ్ఞతలు

కందుకూరు ఘటన విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించినందుకు రాధారంగా రాయల్ అసోసియేషన్ నేత గాదే బాలాజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అక్కయ్యపాలెం హైవే లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు ఉషాకిరణ్, రాధా రంగా రాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు శ్రీను ఇతర ప్రతినిధులతో కలిసి గాదె బాలాజీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పురపాలక మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి ఘటనా స్థలానికి పంపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలు కందుకూరి ఘటనను కులానికి ఆపాదించి కులం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితులకు స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని గాదె బాలాజీ మండిపడ్డారు. మీడియా సమావేశంలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ నేతలు, జనసేన నాయకులు,రంగా అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నగర పారిశుధ్యాన్ని మెరుగు పరచండి జీవీఎంసీ మేయర్

“నగర పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి.” విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖ నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని , విశాఖ నగర వేదికగా జరుగబోవు అంతర్జాతీయ కార్యక్రమాలకు నగరాన్ని సుందరకరించాలని , పారిశుద్ధ్య కార్మికుల విధులను వారి హాజరును పరిశీలించి నిర్ణీత కాలంలో వారి వేతనాలను చెల్లించాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ విశాఖ వేదికగా అంతర్జాతీయ కార్యక్రమాలు నగరంలో త్వరలో జరుగనున్నందున విశాఖ నగరాన్ని మరింత సుందరీకరిస్తూ, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని , అలాగే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను నిర్ణీత కాలంలో చెల్లించేందుకు జోనల్ కమిషనర్లు, ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని ,అందుకు తగినంత కార్మికులను ఏర్పాటు చేయాలని, ఇటీవల తన పర్యటనలో బీచ్ తీర ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది విధులు నిర్వహించడం గమనించానని అన్నారు. పారిశుధ్య కార్మికులు ఎక్కువగా విధులకు గైర్హాజరైనట్లయితే అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని , అలాగే సుదీర్ఘకాలం నుండి విధులకు గైర్హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని, మరణించిన, పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుల స్థానాలలో కొత్తవారిని తీసుకునేందుకు కావలసిన చర్యలను, ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాన వైద్యాధికారికి , జోనల్ కమిషనర్లకు మేయర్ ఆదేశించారు. అలాగే నగరంలో ఎక్కువ ఏ ఏ చోట్ల పారిశుద్ధ్య పనులు అవసరమో గుర్తించి అక్కడ పారిశుద్ధ్య పనుల మెరుగకు అవసరమగు వర్కర్లను సర్దుబాటు చేయాలని అన్నారు. ఇకపై వార్డుల్లో నిత్యం పర్యటిస్తానని పారిశుద్ధ్య పనితీరులో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ,సహాయక వైద్యాధికారులకు మేయరు తెలిపారు. బీచ్ లో సందర్శకులు ,విహారయాత్రికులు ఎక్కువగా సందర్శిస్తున్నందున వారికి కల్పించవలసిన మౌలిక సదుపాయాలలో భాగంగా స్నానపు గదులను, పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ,ఇప్పుడు ఉన్న టాయిలెట్లకు అదనంగా ఆర్కే బీచ్ నుండి అప్పుగర్ వరకు అవసరమైన చోట టాయిలైట్లు, స్నానపు గదుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. బీచ్ లో కలుస్తున్న ప్రధాన కాలువల పరిశుభ్రతకు అవసరమగు చర్యలు చేపట్టాలని మేయర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అందరు జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, అందరు సహాయక వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ ల జాబిత విడుదల చెసిన బీజేపీ

హైదరాబాద్ అక్టోబర్ పున్నమి ప్రతి నిధి జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం పార్టీ కీలక నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 14న బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ 40 మంది నేతల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, సునీల్‌ బన్సల్‌, తేజస్వి సూర్య, ధర్మపురి అరవింద్‌ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్‌ పురందేశ్వరి, బుర్రా నర్సయ్య గౌడ్‌, సుజనా చౌదరి, కాసం వెంకటేశ్వర్లూ యాదవ్‌, పాంగులేటి సుధాకర్‌రెడ్డి, పీవీ మాధవ్‌, బండా కార్తీకరెడ్డి వంటి నేతలు కూడా ప్రచార బృందంలో చోటు దక్కించుకున్నారు. పార్టీ నిర్ణయాల ప్రకారం వీరు త్వరలో ప్రచార షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో పర్యటించి బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, జాతీయ స్థాయి నేతలతో బలమైన ప్రచార యుద్ధానికి సిద్ధమవుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.