Saturday, 25 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

తమ్మవరపు మంగపతి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

నందిగామ పట్టణం, తొమ్మిదవ వార్డు తమ్మవరపు మంగపతి సతీమణి చంద్రమ్మ ఇటీవల మరణించిన విషాద వార్త తెలుసుకున్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, తమ్మవరపు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించామని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం బుచ్చిబాబు, వీసం జగదీష్ పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

తెగిపోయిన లో లెవెల్ వంతెన.. మరమ్మతులు చేయించిన మార్కెట్ కమిటీ చైర్మన్.

వెల్దండ, అక్టోబర్ 21, పున్నమి న్యూస్: వెల్దండ మండలంలో సిలోన్ బండ తండా గ్రామపంచాయతీ లో ఇటీవల కురిసిన వర్షాలకు లో లెవెల్ వంతెన (బ్రిడ్జి) పూర్తిగా ధ్వంసమై తండా వాసులకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ విషయాన్ని సిలోన్ బండ తండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా సంజీవ్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకుపోగా.. వెంటనే స్పందించి రెండు గూనలు (గబీన్లు) ఏర్పాటు చేసి తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అలాగే లో వోల్టేజ్ విద్యుత్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 25 కెవి వోల్టేజ్ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పించారు . స్తంభించిపోయిన రాకపోకలకు తక్షణ మరమ్మతులు చేయించి దారి చూపాడని, లో వోల్టేజితో ఇబ్బంది పడుతున్న గ్రామానికి వెలుగులు నింపారని సిలోన్ బండ తండా వాసులు గ్రామస్తులు సంజీవ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాత్లవత్ రమేష్ తన సొంత ఖర్చులతో జెసిబి తో పని చేయించాడు. రమేష్ నాయక్, రామ్ లాల్ నాయక్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించిన గంటా

విశాఖపట్నం, అక్టోబర్ 21: జీవీఎంసీ వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మధురవాడ, భీమిలి జోనల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, కళ్యాణ మండపాలు, హౌసింగ్ తదితర సమస్యల పరిష్కారానికి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎండాడ మెయిన్ రోడ్డులో ఫుట్ పాత్ వ్యాపారులకు ప్రతిపాదించిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈట్ స్ట్రీట్ ను సాగర్ నగర్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తే ఎక్కువమందికి అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిల్లపేట చెరువు వద్ద రిటైనింగ్ వాల్ కు ఎక్కువ వ్యయమవుతుందని.. భీమిలి, తగరపువలస మెయిన్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనల గురించి వివరిస్తూ ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. భీమిలి క్లాక్ టవర్ డిజైన్ ను సిద్ధం చేయాలన్నారు. ఓపెన్ స్పేస్ లలో ఆక్రమణలు తొలగించండి సామాజిక అవసరాల కోసం వదిలిన ఓపెన్ స్పేస్ ల ఆక్రమణపై గంటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ వార్డుల్లోని 149 ఓపెన్ స్పేస్ లలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే 24 పార్కులను అభివృద్ధి చేయగా.. 25 పార్కులను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. దీనిపై గంటా స్పందిస్తూ.. గతంలో వైసీపీ నాయకుల అధీనంలో ఉన్న వైభవ్ నగర్ పార్కుల తాళాలు తీయించి అప్పజెప్పామని, వాటిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. స్థానిక అసోసియేషన్ లు బాధ్యత తీసుకున్నప్పుడే పార్కులు అభివృద్ధి చెందుతాయన్నారు. పార్కుల అభివృద్ధి కోసం 2, 4 వార్డులను ఎంపిక చేశామని అధికారులు తెలియజేశారు. జోనల్ కమిషనర్లు కనక మహాలక్ష్మి, అయ్యప్పనాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు.

నిర్మల్ అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని తెలిపారు. www.telangana.gov.in /telanganarising అనే వెబ్ సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను పొందుపరచాలని అన్నారు. శక్తివంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఈ ప్రకటనలో కోరారు.

జనగాం

PMDDYK యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేయండి: జనగామ కలెక్టర్

PMDDYK యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి –జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ———————————————- జనగామ, అక్టోబర్21,పున్నమి న్యూస్: వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి… స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ.. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవసాయ కార్యక్రమయిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశ వ్యాప్తంగా ఎంపిక అయిన 100 జిల్లా లో జనగాం ఒకటి . ఈ నేపథ్యంలో PMDDYK కార్యక్రమ అమలు కై వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణ పైన మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో *కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్* సమీక్షించారు. ఈ సందర్భంగా *కలెక్టర్* ముందుగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నమూనా ప్రకారం శాఖల వారీగా…వివిధ పథకాల వారీగా ఏ ఏ అంశాల లో కార్యాచరణ రూపొందించవచ్చో తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధి కోసం వివిధ శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో క్షేత్ర స్థాయి లో పరిశీలించి… కార్యాచరణను త్వరగా రూపొందించాలన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా NGO ల ద్వారా, పబ్లిక్, ప్రయివేట్, పార్ట్నర్షిప్ ద్వారా అమలు అయ్యే కార్యక్రమాలను కూడా సూచించ వచ్చాన్నారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, సిపిఓ, డిసిఓ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏవో కలెక్టరేట్, LDM, తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

రియల్ హీరోస్‌కి మావందనం — ‘సౌర్యం’ బుక్‌లెట్ ఆవిష్కరించిన నగర సీపీ శంక బ్రత బాగ్చి

విశాఖపట్నం, అక్టోబర్ 21: విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించి ప్రజల శాంతి భద్రతలను కాపాడిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ “రియల్ హీరోస్‌కి మా వందనం” పేరిట రూపొందించిన ‘సౌర్యం’ తెలుగు, ఆంగ్ల బుక్‌లెట్స్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బాగ్చి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ బాగ్చి మాట్లాడుతూ — “అమరులైన పోలీసుల ధైర్యసాహసాలు, త్యాగాలు అనితర సాధ్యమైనవి. దేశ రక్షణకోసం, అంతర్గత భద్రత కోసం వారు ప్రాణత్యాగం చేశారు. వారి సేవలకు మనం నమస్కరిస్తూ జరుపుకునేది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం” అన్నారు. యువతలో సేవాస్ఫూర్తి పెంపొందించేందుకు యూనివర్సల్ యూత్ వాకర్స్ బృందం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ యూత్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటి మాట్లాడుతూ — “సమాజ నిర్మాణానికి బలమైన వ్యూహకర్తలైన పోలీసుల త్యాగాలకు నివాళిగా ఈ ‘సౌర్యం’ బుక్‌లెట్ అంకితం చేస్తున్నాం” అన్నారు. యూత్ సమన్వయకర్త లికిత్ బేత తెలిపారు. ఈ బుక్‌లెట్‌ను ద్రోణ కన్సల్టీ అధినేత సురేష్ బేత రచించారని. కార్యక్రమంలో యూత్ వాకర్స్ కార్యదర్శి పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

తిరుపతి

వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు మార్గాలు..రాకపోకలకు ప్రయాణికుల ఇక్కట్లు

తోట్టంబేడు అక్టోబర్ 21, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పరిసరగ్రామలైన తొట్టం బేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో గత కొద్దిరోజులుగా పడుతున్న భారివర్షాల కారణంగా రోడ్డు మార్గాలు పెద్ద గుంతలు ఏర్పడి గ్రామం నుండి పట్టణానికి వెళ్ళే ప్రయాణికుల ఇక్కట్లు పడవలసిన పరిస్థితి వాహనదారులు రాకపోకలకు అధిక ప్రయాస పడుతూ అటు ప్రయాణికులు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఇబ్బందులు గురికావాలసి వస్తుంది. వాహనాలపై పయనించే తప్పుడు గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి గుంతలకు తగిన మరమ్మత్తలు చేసి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాలువారు కొండల నడుమ బైరవ క్షేత్రం { శైవ క్షేత్రం } స్పెషల్ స్టోరీ :

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ 21: శ్రీ భైరవ కోన దుర్గా భైరవేశ్వర సంగ్రహ చరిత్ర : ఆర్యావర్తము, పుణ్య భూమి, దైవాన్ని దర్శించాలన్న భారత దేశంలో జన్మించవలెను. ఇది మన అభిప్రాయం కాదు. ఎందరో పాశ్చాత్య పండితుల అభిప్రాయం కూడా. మానవుని మోక్ష సాధనకు, అనేక మార్గములు చూపినది. హైందవ ధర్మమే “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” సత్యం ఒక్కటే పండితులు దానిని అనేక విధములుగా తెలిపిరి. దుష్ట శిక్షణకు శిష్ఠ రక్షణకు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు అవతరించాడు. అదే విధంగా భక్తుల మనోభీష్ఠములను తీర్చుటకై జగదీశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపులతోనూ ఆది శక్తి జగన్మాత అష్టదశ శక్తి పీఠముల యందును అనేక రూపములలో అనేక ప్రదేశములలో వెలసి యున్నారు. అటువంటి పుణ్య క్షేత్రములలో బైరవ కోన క్షేత్రం ఒకటి. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నకు పదిహేను కిలోమీటర్లు దూరములో పచ్చటి చెట్లతో పక్షులు కిలకిలా రావములతో సెలయేర్లతో జలపాతములతో కనువిందుగా రమనీయ ప్రశాంత వాతావరణముతో ప్రకృతి శోభకు అలవాలమైన అటవీ ప్రాంతములో ఉన్నది. ఇది శైవ క్షేత్రమైనను ఎచటనూ లేనివిధముగా ఈశ్వరాలయము నందు. బ్రహ్మ, విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడి యున్నవి. ఎచటనూ లేని విధముగా ఈశ్వరాలయము నందు బ్రహ్మ విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడుట విశేషము. భైరవమహర్షి ఇచట తపస్సు చేయుట వలన ఈ ప్రాంతమునకు భైరవకోన అనియు సాక్షాత్తు పరమశివుడే ఈ ప్రాంతములో సంచరించుచుండుట వలనను క్షేత్రపాలకుడు భైరవస్వామి అగుటవలనను భైరవకోన అను పేరు వచ్చినది. ఇచట సమీపమునగల క్రొత్తపల్లె గ్రామములోగల క్షత్రియ దంపతులు బిడ్డలు లేక సంతాన ప్రాప్తికై ఈ భైరవాద్రిలో తపస్సు చేసుకొనుచున్న భైరవమహర్షిని ప్రార్ధించగా వారు అనుగ్రహించి ఒక షరతు విధించిరి. వారికి కలిగిన మగబిడ్డను 9 సంవత్సరములు వయసు రాగానే తనకు అప్పగించాలని కోరిరి. తదుపరి వారికి పుత్ర సంతానము కలిగెను. చెప్పిన మాట ప్రకారము ఆ బిడ్డను 9వ ఏడు వచ్చిన వెంటనే మహర్షికి అప్పగించిరి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై గొప్ప శిల్పిగామారి ఆ భైరవకోన యందు దేవాలయములను శిల్ప కళానైపుణ్యముతో తీర్చిదిద్దాడని ఒక వార్త ప్రచారములో ఉన్నది. చుట్టు ప్రక్కల కొండలపైకూడ అనేక శివాలయములు కలవు. జలపాతము, జాలువారుచున్న కొండపై అడుగడుగునా శివలింగములు కనుపించును. ఇచట ఆలయములు గుహాలయములు అనగా కొండకు రంధ్రము వేసి ఆలయములు నిర్మింపబడియున్నవి. ఇవి క్రీస్తుశకము 6, 7వ శతాబ్దముల కాలమునాటివని చోళపల్లవ రాజులచే నిర్మింపబడినవని పురాణ గాధలవలన శిల్పము వలనను తెలియచున్నది. మహాబలిపురములలో గల శిల్పి నైపుణ్యమునకు దీటుగా నిర్మించారని పురాతత్వవేత్తలు అభిప్రాయము ఒకేరాతిలో అష్ట శివాలయములు నిర్మించుట ఇచట ప్రత్యేకత. ఈ శివాలయములలో శివుడు పక్షఘాతేశ్వరుడు, విశ్వేశ్వరుడు, మల్లికార్జునుడు, నగరేశ్వరుడు, భర్గవేశ్వరుడు, భీమేశ్వరుడు, రామేశ్వరుడు శశినాగేశ్వరులను నామములతో భక్తుల పూజలందుకొను చున్నాడు. శివలింగమును గర్భాలయములో ప్రతిష్ఠించి ద్వారము వద్దగల ద్వారపాలకులకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. ఎచటనూ లేనివిధముగా ప్రతి ఆలయము ముందు బ్రహ్మ, విష్ణు నందీశ్వర భృంగీశ్వర విఘ్నేశ్వరుల విగ్రహముల ద్వారపాలకులుగా నుండుట ఇచట విశిష్టత. హరిహరులకు అభేదమును చాటుటకై ఈ త్రిమూర్తుల విగ్రహాములను ఒకే ఆలయమునందు ప్రతిష్ఠించి యుందురని చారిత్రక పరిశోధకులు భావించుచున్నారు. ఇచట క్షేత్రపాలకుడు కాలభైరవస్వామి శివలింగములు అన్నియు చతురస్రాకారములో వుండి శివలింగములకు భస్మత్రిపుండ్రములు అడ్డముగా రేఖలు లేకుండా లింగము మధ్యలో మూడు నిలువు గీతలు మధ్యలో ఒకచుక్క ఇరువైపులా అర్థచంద్రాకారములో రెండు గీతలు కలిగియున్నవి. ఇది భారత దేశంలోని ఏ ఇతర శైవ క్షేత్రములలోనూ కనుపించని సాంప్రదాయము. ఇచట అమ్మవారు సరస్వతీ లక్ష్మీదుర్గా స్వరూపములతో త్రిముఖములు కలిగి దుర్గాంబ అను పేరుతో కొలువబడు చున్నది. ఈ ఆలయమునకు ఎదురుగా క్షేత్ర పాలకుడైన కాలభైరవస్వామి ఆలయము కలదు. ఇచటనున్న కొండపైన జలపాతము నుండి వచ్చు నీటిని సోనవాన అని పిలిచెదరు. ఇది దుర్గా భైరవుల నడుమ నుండి ప్రవహించుచుండును. ఈ ప్రవాహము వర్షాకాలమున ఉర్దృతరూపము తాల్చిననూ నీరు సుమారు ఆరు అడుగుల ఎత్తునగల శివాలయములోనికి ప్రవేశించును. కానీ మూడు అడుగుల ఎత్తునగల దుర్గాంబా ఆలయమలోనికి ప్రవేశించదు. ఇది నేటికిని కనుపించుచున్న సత్యము. మాహాత్మ్యములకు నిలయము భైరవకోన దుగ్గమ్మ గుడికి ఎదురుగా గలమట్టిని అమ్మ బంగారమని పిలిచెదరు. ఈ మట్టిని పొలాలకు చల్లుట వలన పంటలు పుష్కలముగా పండునని ఎట్టి చీడ పురుగులు పంటకు వ్యాపించవని గృహ నిర్మాణములో ఉపయోగించినచో ఆ కుటుంబము సర్వతో ముఖముగా వృద్ధి చెందునని దుకాణములలో చల్లినచో వ్యాపారము ద్విగుణీకృతము అగునని విశ్వాసముతో భక్తులు ఈ మట్టిని తీసుకొని పోయెదరు. సంతానార్థులైన భక్తులు ఇచటగల మట్టిచెట్టుకు ఊయలలు కట్టి అమ్మవారిని సంతాన భాగ్యము కలిగించవలసినదిగా ప్రార్ధించినచో కురుణామయి జగన్మాత దుర్గాంబదేవి సంతానమును ప్రసాదించి వారి కోర్కెలను తీరుస్తూ వుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము, మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారముల వంటి పర్వదినములలో చుట్టుపక్క గ్రామముల నుండి మరియు ఆంధ్రదేశము నలుమూలలనుండి యాత్రీకులు భక్తులు వేనవేలు పరమశివుని అనుగ్రహము కొరకై ఈ దుర్గా భైరవేశ్వరకోన మహాక్షేత్రమునకు వచ్చుచుందురు. సామాన్యముగ పుణ్యస్థలములు క్షేత్రములు తీర్థములు అని చెప్పబడును. క్షేత్రమనగా కేవలము దైవము మాత్రమే ఆవిర్భవించినచోటు తీర్థమనగా ఆకాశ గంగాజలపాతము కల స్థలము. ఈ బైరవకోన క్షేత్రము తీర్థముగా ప్రసిద్ధి చెందియున్నది. భక్తి జ్ఞానసంపన్నులగు మహనీయులు ఈ దైవమును సందర్శించి దైవానుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరుచున్నారము. ఈ దుర్గా భైరవవేశ్వరులను గూర్చి శ్రీ రామకృష్ణశాస్త్రి గారు శ్రీ భైరవేశ్వర సుప్రభాతము రచించి యున్నారు. సాధకులు చదివి ఆనందింపగలరు. 1. శ్రీమత్ భైరవకోన నామ విలసత్ శైలాంతరాళస్ఫురత్ విఖ్యాతాష్ట గుహాంతరాళ సుమహత్ పీఠాంత సంవాసినీ | కావ్యాలాప వినోదినీ భగవతీ కారుణ్యవారాం నిధిః దేవీ భైరవ సుందరీ త్రిముఖ దుర్గాంబా సదా రక్షతు ॥ 2. శ్రీవాణీ కరుణాభిశోభిత ప్రకాశం మండలాంతర్గత శ్రీమత్ భైరవకోననామయు విఖ్యాతఅష్టగుహంతరాళ శైవక్షేత్రవిభ్రాజితః॥ శ్రీ ముప్పాళాప్వయ వంశవార్థిశశినం వేంకట నరసరాజాహ్వయం వాణీదేవి సతామణిం త్రిముఖ దుర్గా భైరవేశో వదు | 3. ప్రాతఃకాలసుకీర్తసీయ శుభకృత్ శ్రీ సుప్రభాతాభిధ గ్రంధస్యోచిత ముద్రణవ్యయమదాత్ శ్రీ భైరవస్వామినామ్ | శ్రీ మద్వేంకటనర్సరాజు గృహిణీ శ్రీవాణీ కుటుంబంసదా దతా యుర్థన ధాన్య వంశవిభవం పాయాత్ సదా భైరవః ॥ 4. శ్రీమత్ అంబవరం ఇతి ప్రవిలసత్ గ్రామీణ పంచాయతీ అధ్యక్షం శుభ ధర్మకార్య నిరతం సి.యస్.పురం మండలే | భాస్యత్ భైరవకోన క్షేత్ర వివిధౌన్నత్యమాకాంక్షిణం శ్రీ వాణీం వేంకట నరసరాజు అభిధం పాయాత్ సదా భైరవః ॥

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సురక్షిత సమాజ నిర్మాణం లో పోలీసులు పాత్ర ముఖ్యమైనది : రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్

అమలాపురం ,అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి) : సురక్షిత సమాజ నిర్మాణం లో పోలీసులు పాత్ర ఎంతో ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళ వారం స్థానిక పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. తొలుత ప్రజా ప్రతినిధులు పోలీసు ఉన్న తాధికారులు అమర వీరుల స్తూపం వద్ద పుష్ప చక్రాలు ఉంచి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు అమరవీరు ల సంస్మరణ దినోత్సవం పోలీసు బలగాల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, త్యాగాన్ని వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకితభావాన్ని గుర్తుచేస్తుందన్నారు.దేశ భద్రత, ప్రజా శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని దేశ వ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు. పోలీసు సేవలను గౌరవించే రోజుగా, సివిల్ సొసైటీ భద్రతా వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహ ణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ సిబ్బంది యొక్క త్యాగాలను, శౌర్యాన్ని స్మరించుకుo టూ గౌరవ వందనం సమ ర్పించారు. వారి అపారమైన ధైర్యం దేశభక్తికి చిహ్నంగా ఈ దినోత్స వాన్ని ప్రకటించారన్నారు జిల్లా స్థాయిలో పోలీస్ బలగాలు అమరులకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక పరేడ్‌లు, సంస్మరణ కార్యక్ర మాలు నిర్వహించడం జరి గింద న్నారు.అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా నిలబడి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటా మన్నారు అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు, కష్టాలు నిరంతరకృషి శ్లాఘ నీయమన్నారు.ఈ దినోత్స వ విశిష్టతను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు దేశ సేవ లో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరిం చుకుని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీ సులకు శ్రద్ధాంజలి ఘటిం చార న్నారు.1959లో లద్దాఖ్‌ లోని హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైన్యం చేతిలో 10 మంది భారత సాయుధ పోలీసులు వీరమరణం పొందిన నాటినుండి ఈ సంస్మరణ దినోత్సవం ప్రాముఖ్యత సంతరించుకుoదన్నారు. పోలీసు శాఖలో సేవలంది స్తున్న వారికి ప్రోత్సాహం, గౌరవం కల్పించేందుకు ఇదొక అవకాశమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీ స్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.దేశం కోసమే ఈ దేహ మని ప్రజల కోసమే మా ప్రాణమంటూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీ రులకు శ్రద్ధాంజలి ఘటిం చారు. దేశ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం శాంతి భద్రతల పరిరక్షణలో అసాంఘిక శక్తులతో ప్రతి దినం ధైర్యంగా పోరాడు తూ తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు సిబ్బందికి నివాళు లర్పించేందుకు అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగు తోందన్నారు పోలీసు సేవలో అత్యున్నత త్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకునే రోజు మాత్ర మే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి వారు చూపిన సేవాభా వానికి చిహ్నమన్నారు. అమరు లత్యాగాన్ని స్మరిం చుకునే సూచకంగా అమరవీ రుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతోంద న్నారు.నేడు ఆరంభమైన సంస్క రణ కార్యక్రమాలు జాతీయ ఐక్యతా దినోత్సవం అనగా ఈనెల 31 తో ముగుస్తాయ న్నారు.దేశ భద్రత కోసం వారు చేసిన త్యాగాల గురించి సమాజంలో అవ గాహన కల్పించేందుకు అమర వీరుల స్మారకార్థం పోలీసు సిబ్బంది వారం రోజులపాటు కార్యక్రమా లను చేపడతా రన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమలాపురం ఎస్సై అశోక్ కుటుంబానికి కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికల తో పాటుగా ఆర్థిక సహాయాన్ని పోలీసు శాఖ తరపున అతిధులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. తొలుత జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జిల్లావ్యాప్తంగాపోలీస్ శాఖ లో విధినిర్వహణలో అమరులైన వారి కుటుంబాల సంక్షేమ నిమిత్తం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు వారి కుటుంబాలను ఆదుకునే విధివి ధానాలపై విశదీకరించారు ఈ కార్యక్రమంలో, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ స్థానిక శాసన సభ్యులు అయితా బత్తుల ఆనందరావు, డీఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.

తిరుపతి

ఇండ్లలలోకి చొచ్చుకు వస్తున్న వర్షపు నీరు

తోట్టంబేడు అక్టోబర్ 21, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని తోట్టంబేడు మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మండలంలో గత రెండు రోజుల నుంచి ముసురు పట్టండంతో ఉదృతంగా వర్షాలు కురవసాగాయి మంగళవారం నాడు తెల్లవారి జామున మండలంలోని రౌతు సూరమాల గ్రామంలో లోతట్టు ప్రాంతంలో వున్నా నివాసలలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో గ్రామంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో వాతావరణశాఖ భారీ వర్షాలు పడతాయని సూచించారు. ఇకనైనా సంబందిత ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామంలో పర్యటించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఏంతో ఆత్రుతగా ఎదురుచుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.