Saturday, 25 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నల్లా సూర్యచంద్రరావు 71వ జయంతి సందర్భంగా కాపునాడు ఘన నివాళి

అమలాపురం, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి) : స్థానిక మహిపాల వీధిలో జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ మరియు కాపురత్న కీర్తిశేషులు నల్లా సూర్యచంద్రరావు విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాపునాడు.చంద్రరావు గారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా కాపునాడు కృషి చేస్తుందని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్ కుమార్,కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్, వైఎస్ఆర్సిపి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు దూడల ఫణి, చంద్రరావు తనయులు నల్లా అజయ్ మరియు సంజయ్, పోలిశెట్టి చిన్ని, ఆకుల ఈశ్వరరావు,అబ్బిరెడ్డి మూర్తి, పప్పొప్పుల తనీష్, గారపాటి బాలాజీ, తిక్కిరెడ్డి సురేష్, గుర్రాల రమేష్, సలాది నరేష్, అరవింద్ అబ్బిరెడ్డి, దిలీప్ వింటి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సాయం

వింజమూరు పంచాయతీలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన గంగ పట్ల కొండయ్య , గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు కొండయ్య మృతి పట్ల సంతాపం తెలియజేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10,000 రూపాయలు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి స్థానిక నాయకులు ఏగినేని శ్రీనివాసులు, పల్లాపు అరుణ అందజేయడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బండారు లంక లో చెత్త సమస్యకు కూటమి నాయకులే కారణం

అమలాపురం, అక్టోబర్ 21 (తూర్పు ఉదయం విలేఖరి) : మండలంలోని బండారులంకలో గత 15 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ గా ఉన్న 40 సెంట్ల భూమిలో గత సంవత్సర కాలం నుంచి అక్కడ చెత్త వేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయం చేసి చెత్త వేయకుండా ఆపింది బండారులంక కూటమి నాయకులేనని…. కాబట్టి ఈ సమస్య పరిస్కరించవలసిన బాధ్యత స్థానిక కూటమి నేతలపైనే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు జానా జగదీశ్ చంద్ర గణేష్ పేర్కొన్నారు.బండారులంకలో తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తను తరలించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకి చేరుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తుల ఏసుబాబు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చందన శంకర్రావు లు మాట్లాడుతూ ఇప్పుడు స్థానిక కూటమి నాయకుల పరిస్థితి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడిన చందంగా మారిందన్నారు.. బండారులంక పంచాయతీకి ఉత్తమ సంస్థ అవార్డు రావడం తీవ్ర హాస్యాస్పదమని ఇప్పుడున్న పరిస్థితుల్లో బండారులంక ఉత్తమ చెత్త పంచాయతీగా నిలుస్తుంది అన్నారు. ఈరోజు జరిగిన దీక్షలో గంటి కామేశ్వరరావు, కందనాల పుల్లయ్య, ఇనుమర్తి నాగేశ్వరరావు,బిళ్ళ నంది సుబ్రహ్మణ్యం, బళ్ళ శేఖర్, కామిశెట్టి వెంకటేశ్వరరావు, ములికి సాయి, ఊటుకూరి దిలీప్,ఏకుల సాంబమూర్తి మరియు 5 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.వీరికి గ్రామంలోని పెద్దలు పేరి రాంబాబు, పేరి భానుమూర్తి, చందన శంకర్రావు,గుత్తుల ఏసుబాబు సరేళ్ళ రామకృష్ణ, కామిశెట్టి శ్రీనివాసరావు, దంగేటి సత్తిపండు,చింతా ఉమా మహేశ్వర రావు,కాలెపు శ్రీనివాసరావు, కొండా తాతారావు, చింతా పల్లపరాజు,గుమ్మిడి పుల్లయ్య,గుత్తుల సత్తిబాబు, దంగేటి వెంకట శెట్టి, దొమ్మేటి బాబ్జి,కోరుకూరి వీరబాబు, గిడ్ల శ్రీను, ఊటుకూరి సుబ్రహ్మణ్యం,దంగేటి మహేష్, గుమ్మిడి వెంకన్న, దంగేటి మురళి, బొక్కా రమేష్, కుడిపూడి శ్రీధర్, లక్కింశెట్టి మల్లికార్జున, చింతా ఉమామహేశ్వరరావు, గోళ్ళ లింగయ్య, మాడా శివ రామకృష్ణ, జాన కామేశ్వరరావు, ఇనుమర్తి లింగమూర్తి, కారుపర్తి మల్లేశ్వరరావు, పిచ్చిక కేశవ,ఆశపు రేణుకా ప్రసాద్, గుమ్మిడి బోస్, లక్కింశెట్టి సత్యనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు.

అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి.ఎమ్మెల్యే కాకర్ల సురేష్

తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు.అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. విస్తారం గా కురుస్తున్న వర్షాలు తొ పాడి రైతులు, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రజలందరు దృఢమైన భవనాలలో ఉండాలని పెచ్చులూడి న స్లాబ్ లు ఇతర గుడిసెలు లోతట్టు ఉండవద్దు అన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు, నాయకులకు సమాచారం అందించాలన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవిన్యూ,విద్యుత్, పోలీస్,అగ్నిమాపక సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం లో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తనిఖీలు

అమలాపురం, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి) ; అమలాపురం పట్టణం ముమ్మిడివరం గేట్ సెంటర్లోని శ్రీ లలితా రైస్ స్టోర్స్ పై సివిల్ సప్లై అధికారులు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి తనిఖీలు చేశారు. ఏడు బస్తాలు పిడిఎస్ రేషన్ బియ్యం స్వాధీనం…పట్టించుకొని రెవెన్యూ అధికారులు

నిర్మల్

తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి

అక్టోబర్ 21, 2025- నిర్మల్:- *తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి:* *ప్రజలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు.* తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని తెలిపారు. www.telangana.gov.in /telanganarising అనే వెబ్ సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను పొందుపరచాలని అన్నారు. శక్తివంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

జోగులాంబ గద్వాల

పిడుగుపాటుకు వ్యక్తి మృతి.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం ముండ్లదీన్నె గ్రామానికి చెందిన కుర్వ మద్దిలేటి (42) రోజు లాగే తన పొలము పనులు చేసుకుంటుండగా.. అకస్మాత్తుగా వర్షానికి పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కూతురు కలరు. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు.

తిరుపతి

భారీ వర్షం కారణంగా సమస్యలు వలయంగా మారిన ఇలగనూరు

తొట్టంబేడు మండలం ఇలగనూరులో భారీ వర్షాల కారణంగా వీధులలో వర్షపు నీరు ప్రవహిస్తోందని గ్రామస్తులు తెలిపారు. పొలాల్లో వేసిన వరి పూర్తిగా నీటి మునిగిందని రెండు రోజులగా గ్రామంలో నీటి సరఫరా మరియు తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలియజేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు

తిరుపతి

ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పతన శివార్లోని రాజీవ్ నగర్ కాలనీ నందు నిన్నటి రోజున పడిన భారి వర్షాలకు పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది రాజీవ్ నగర్ లోని పలు వీధులకు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షులు షేక్ కరీం మిర్జా, ఆరిఫ్, లు వెంటనే స్పందించి సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేయగా అయన తేదేపా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ విద్యుత్ శ్యాఖ అధికారులను సంప్రదించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయమని సూచించగా వారు సంబందిత విద్యుత్ శ్యాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచనలను తెలుపడంతో విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజీవ్ నగర్ కాలనీలో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిందుకు రాజీవ్ నగర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యేకి కృతఙ్ఞతలు తెలియజేసుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.