Saturday, 25 April 2026

Blog

విశాఖపట్నం

డిపోలో 4వ రోజుకి చేరిన అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె.

అద్దె బస్సు డ్రైవర్ల జీతాలు పెంచాలని వాల్తేర్ డిపోలో సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టి ఆర్టీసీ అధికారులు గానీ, అద్దె బస్సు యజమానులు గాని చర్చలకు ఆహ్వానించి డిమాండ్స్ పరిష్కరించడంలో ముందుకు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికే మద్దిలపాలెం, సింహాచలం డిపోలలో అద్దె బస్సు డ్రైవర్లు జీతాలు పెంచాలని ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చారని జిల్లావ్యాప్తంగా అద్దె బస్సు డ్రైవర్ల జీతాలు పెంచి డిమాండ్స్ ఆమోదించకపోతే అన్ని డిపోలలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్ కి 8 గంటల డ్యూటీకి 1000 జీతం చెల్లిస్తే అదే డ్రైవర్ డ్యూటీ చేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు 600 మాత్రమే ఒక డ్యూటీ కి చెల్లిస్తున్నారని విమర్శించారు. ఒకే రకమైన డ్యూటీ చేస్తున్న వారికి ఒకే రకమైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అద్దె బస్సు యజమానులు చర్చలకు వచ్చి జీతాలు పెంపుదలతో పాటు ఇతర డిమాండ్స్ ఆమోదించాలని లేనియెడల ఆర్టీసీ ఆర్.ఎం ఆఫీసు లేబర్ ఆఫీస్ వద్ద ధర్నాలు నిర్వహించి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మద్దిలపాలెం జోన్ గౌరవ అధ్యక్షులు పి. వెంకటరావు, హైర్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ వాల్తేర్ డిపో అధ్యక్షుడు, కార్యదర్శులు బి. జంపన్న, పి. రఘు, మద్దిలపాలెం డిపో అధ్యక్ష కార్యదర్శులు జే.కృష్ణ, సిహెచ్.తేజ మరియు అద్దె బస్సు డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి.

*కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి…* *లేనిపక్షంలో చలో పొదలకూరుకు పిలుపునిస్తాం…* *ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్..* *పొదలకూరు*: పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు సూరి పాక ఉదయ్ కృష్ణ మాదిగ మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో మాదిగ సోదరుడైన వేమయ్యా సరియు హీరో హోండా షోరూమ్ నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారని గూడూరు కి చెందిన విశ్వ సాయి హీరో షోరూం నుంచి టూ వీలర్స్ ని తీసుకుని వచ్చి విక్రయాలు సాగించేవాడని , ఈ క్రమంలో గూడూరు నుంచి తీసుకొచ్చే టూ వీలర్స్ వాహనాల, ట్రాన్స్పోర్ట్ మరియు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లు పోగా ఆదాయం రాకపోవడంతో నెల్లూరుకు చెందిన సరయు హోండా షోరూం నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విక్రయించడం ప్రారంభించాడని , గూడూరు లో ఉన్న విశ్వ సాయి హోండా షోరూం వారు ఇచ్చే మార్జిన్ కంటే నెల్లూరు సరయు వారు ఇచ్చే వాహనాలపై ఇచ్చే మార్జిన్ ఎక్కువ ఉండటంతో నెల్లూరులో కొనుగోలు చేయడం ప్రారంభించారని, గూడూరులో తన వద్ద కొనడం లేదు అని కక్ష పెట్టుకుని గత నెల 24వ తేదీ గూడూరు కు చెందిన షోరూం యజమాని పొదలకూరులోని సరియో హోండా షోరూం కి చేరుకొని వేమయ్య లేని సమయంలో తమ సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ కొత్త ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకొని వెళ్తూ, వేమయ్య పై అసభ్య పదజాలం వాడుతూ , కులం పేరుతో దూషించి అక్కడ నుంచి వెళ్లిపోయాదని షోరూం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో షోరూం కు చేరుకున్న వేమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరు కు చెందిన విశ్వ సాయి హోండా షోరూం యజమానిపై ఫిర్యాదు చేయగా సుమారు నెలకావస్తున్న అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయము డీఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లామని,కావున ఇప్పటికైనా పొదలకూరు పోలీస్ వారు వెంటనే అతనిపై కేసు నమోదు చేసి వేమయ్య కు న్యాయం చేయవలసిందిగా, లేని పక్షంలో దళిత సోదరులంతా కలిసి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ సూచనలతో చలో పొదలకూరు అనే కార్యక్రమంతో పిలుపునిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, పందింటి అంబేద్కర్ మాదిగ ఎం ఎస్ పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, వెంకటేశ్వర్లు మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, వేగూరు వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు..

కర్నూలు

అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవీ ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 21(పున్నమి ప్రతినిధి) నేడు ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో రాబోయే రోజుల్లో రైతులకు నీటి వనరులను మరియు నీటి లభ్యత కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి. సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పచ్చి కరువు వచ్చి పత్తి రైతులాకు జరుగుతున్న నష్టంపై అధికారులతో చర్చించారు అలాగే వచ్చే రబీ సీజన్లో వారికి బ్లాక్ గ్రామ్ మినీ కిట్లు అందించి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు. అలాగే గత ప్రభుత్వంలో ఉల్లి రైతులకు జరిగిన నష్టం మన ప్రభుత్వంలో జరగకూడదని తగిన మద్దతు ధర అందేలా చూడాలని అధికారులని ఆదేశించారు.అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నీటి సామర్థ్యాన్ని బట్టి తాగునీటి సమస్యను ఎదుర్కోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా సరిపడే నీటి నిల్వపై అధికారులు దృష్టి సారించాలి అని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

కర్నూలు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి ఎమ్మెల్యే బీవీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి ఎమ్మెల్యే బీవీ ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 21(పున్నమి ప్రతినిధి) ఎమ్మిగనూరు పట్టణ వివిధ వార్డులకు చెందిన 26 మంది బాధితులకు రూ. 9. 68 లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 122 మంది బాధితులు రూ. 1.12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారుఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పండుగలు మరియు ఆదివారం సెలవులు వస్తె మీ పిల్లల మీద ఓ కన్నేయండి.

ఇటీవల కురుస్తున్న అధిక వర్షపాతం వల్ల కన్యక చెరువు నీటి ప్రవాహం ఎక్కువ అయిన సందర్భంగా కన్యక చెరువులో నీటిమట్టం పెరిగింది. నాగిరెడ్డిపల్లి పంచాయతీ గాంధీనగర్ ఆంజనేయ స్వామి ఆలయము ప్రాంగణంలో కన్యక చెరువు వద్ద నీళ్ళు భారీ స్థాయిలో చేరుకుంటుంది. గాంధీనగర్ గ్రామముకు సమీపంలో చెరువు ఉన్న కారణంగా ప్రస్తుతం దీపావళి సెలవులు కావడంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పిల్లలు చేపలు పట్టేందుకు ఈత కొట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్తున్నారు.గతంలో కన్యకచెరువులో మట్టితోవడంతో లోతట్టు గుంతలు ఏర్పడ్డాయి. దీనిలో పిల్లలు అనుకోకుండా చెరువులో పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.గతంలో ఇదే చెరువులో గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు నీటి వనరుల వద్ద ఉండే ప్రమాదాల గురించి వివరించాలి. ఎంత లోతు ఉంటుందో,లోతైన గుంతలు ఎలా ఏర్పడతాయో తెలియజేయాలి.కావున చెరువు కుంటలు వద్ద ఎవరైనా పిల్లలు కనబడితే పెద్దలు వారిని వెంటనే అక్కడి నుంచి పంపేయాలి.

అన్నమయ్య

జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఇచ్చి ఆదుకోండి

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీ ఇచ్చి ఆదుకోవాలని అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరాజు రాజంపేట సరస్వతి విద్యా మందిర్ నూతన ఏర్పాటు చేసిన అదనపు గదులు ప్రారంభోత్సవానికి హాజరైన రైల్వే బోర్డు చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ కు వినతిపత్రం సమర్పించారు.గతంలో జర్నలిస్టులకు భారతదేశంలో రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాయితీతో ప్రయాణం చేస్తే సౌకర్యం ఉండేదని కోవిడ్ సమయంలో రాయితీని తీసివేసారని రఘురామరాజు వినతి పత్రంలో పేర్కొన్నారు.రైల్వే బోర్డు చైర్మన్ గా తమ వినతిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ వినతిని తీసుకెళ్లాలని రైలు ప్రయాణంలో రాయితీని తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఇందుకు ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ మీ వెనతిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సమస్య పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందిస్తానని పేర్కొన్నారు.

హైదరాబాద్

ప్రతి మంగళవారం ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

పున్నమి అక్టోబర్ 21 తెలంగాణ హైదరాబాద్ ప్రతి మంగళవారం TGSRTC రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది225వారం పూలమాలము ఇప్పిచ్చినవారు N. శ్రీలత బిక్షపతి కేసు బాబు D రామచందర్ కార్మికులు T విజయ్ కుమార్ శ్రామిక్ మరియు జీవన్ శ్రామిక్ SUDDALA SURESH M గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును జై భీమ్ జై జై భీమ్

హైదరాబాద్

ప్రతి మంగళవారం ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

పున్నమి అక్టోబర్ 22 తెలంగాణ హైదరాబాద్ ప్రతి మంగళవారం TGSRTC రాణిగంజ్ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది225వారం పూలమాలము ఇప్పిచ్చినవారు N. శ్రీలత బిక్షపతి కేసు బాబు D రామచందర్ కార్మికులు T విజయ్ కుమార్ శ్రామిక్ మరియు జీవన్ శ్రామిక్ SUDDALA SURESH M గోపి మరియు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును జై భీమ్ జై జై భీమ్

తిరుపతి

భారీ వర్షాల పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎమ్మెల్యే బొజ్జల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల కోతలు చేయరాదని, కల్లాలలో ఉన్న పంటలు కాపాడుకోవడానికి టార్పాలిన్ పట్టాలతో సిద్ధంగా ఉండాలన్నారు.కూటమి నాయకుల అధికారులు,గ్రామ వార్డు,సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,భారీ వర్షాల కారణంగా చెరువులు,నీటి కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రజలు,అధికారులు గుర్తించి ముందుగానే ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.