Saturday, 25 April 2026

Blog

భక్తి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా కేదారి గౌరీ వ్రతం

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మంగళవారం శ్రీ కేదారి గౌరీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు.దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ బ్రహ్మ గుడి నందు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీ కేదారి దేవి కలిశాన్ని ప్రతిష్ట,గణపతి పూజ చేసి,శ్రీ కేదారి గౌరీ దేవి వ్రత పూజను దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్,పురోహితుడు అర్ధగిరి లు శ్రీ కేదారి గౌరీ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.భక్తులు విశేషంగా విచ్చేసి భక్తిశ్రద్ధలతో వ్రత పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి దంపతులు,డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి దంపతులు,దేవస్థానం ప్రధాన ఆర్చకులు సంబంధం గురుకుల్,ఏఈఓ లోకేష్,సూపర్డెంట్ నాగభూషణం,మరియు ఆలయ అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ వావిరాల మహేష్ కుమార్ ,గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ,అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ,ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సహజ వ్యవసాయం – ఆరోగ్యకర సమాజానికి మార్గదర్శక దిశ

డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, మామిడికుదురు మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు సాధికార సమస్థ (Rythu Sadhikara Samastha – APRySS) మరియు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) సంయుక్తంగా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పర్యావరణానికి అనుకూలంగా, మానవ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార ఉత్పత్తులపై దృష్టి సారించాయి. రసాయన రహితంగా, నేల సారాన్ని కాపాడుతూ, పర్యావరణ స్నేహపూర్వక పద్ధతుల్లో పండించే పంటలు రైతులకు ఆర్థిక లాభాలను, వినియోగదారులకు ఆరోగ్యకర ఆహారాన్ని అందిస్తున్నాయి. డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు ఈ సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలను నేరుగా ప్రజలకు అందించేందుకు “రైతు మండి నుండి వినియోగదారుల దాకా” అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రైతులు స్వయంగా ఉత్పత్తులను మార్కెట్‌కి తీసుకెళ్లడం ద్వారా మధ్యవర్తులను తొలగించి, న్యాయమైన ధరను పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు సహజ ఆహారాన్ని తినడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అవగాహన పెంచుతున్నారు. ఈ కార్యక్రమం K. జానకి, Ch. రాధ, మరియు G. లెనిన్ ఆధ్వర్యంలో జరుగుతూ సహజ వ్యవసాయ విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇది పచ్చని భవిష్యత్తు వైపు రైతుల సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోంది.

విశాఖపట్నం

ఘనంగా జరిగిన 𝐜𝐣𝐰𝐚 దీపావళి ఉత్సవాలు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి 𝐜𝐣𝐰𝐚 యూనియన్ లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క పాత్రికేయునికి క్రాకర్ బాక్స్ మరియు మిఠాయి పంపిణీ విజయవంతంగా నిర్వహించారు నూతనంగా ప్రారంభించిన సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గడిచిన ఆరు నెలల్లోనే తారస్థాయికి చేరుకున్నాది అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.. అని కొంతమంది జర్నలిస్టు మిత్రులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా గతంలో విజయవంతంగా జరిపించిన దసరా సంబరాలు మరియు దీపావళి పండుగని పురస్కరించుకుని జరిపించిన దీపావళి ఉత్సవాలు వారిలో ఎంతో ఆనందాన్ని కలగజేశాయని కొంతమంది జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కంచర్ల మీడియా సీఈఓ శంకర్రావు,ఆనందరావు సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ .అధ్యక్షులు ఆల్ఫా కృష్ణ .ఉప అధ్యక్షులు రేగిడి రూప గుణ శేఖర్.. సెక్రటరీ కందుకూరి మహాలక్ష్మి పి ఆర్ ఓ మామిడి రవికుమార్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఈ యొక్క కార్యక్రమానికి కొంతమేరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సినీ నిర్మాత డైరెక్టర్ మరియు వ్యాపారవేత్త. మనసులో మాట పత్రిక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి కంచర్ల అచ్యుతరావు కి .యూనియన్ తరపున సభ్యులు అందరి తరపున అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ మరియు రేగిడి గుణశేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు.

E-పేపర్

కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ

అరబీ స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా కువైట్ దేశం నందు తెలుగు కళా సమితి – కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ముఖ్య ఘమనిక : ఈనెల 22 తేదీ నుండి అనగా బుధవారం నుండి కువైట్ దేశం సాల్మియా లోని హాలిడే ఇన్ అనే హోటల్ నందు తెలుగువారికి అందుబాటులో ఉండనున్న *రామిరెడ్డి ధ్వజారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రైల్వే కోడూరు నియోజకవర్గం.

E-పేపర్

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో శ్రీ ఉమేష్ చంద్ర చిత్రపటానికి

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో శ్రీ ఉమేష్ చంద్ర చిత్రపటానికి నివాళులు ఘటిస్తుండగా వెళ్లి పోలీస్ సిబ్బంది తోటి వారికి సానుభూతి తెలియజేస్తూ మరియు నివాళులు అర్పించడం జరిగింది సమాజంలో పోలీసుల సేవ కృషి ప్రజాసేవలో ప్రశంసనీయం ఈ సందర్భంగా అనంతరాజుపేట ఎంపీటీసీ సభ్యులు బండారు మల్లికార్జున హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు, ఉమామహేశ్వరరావు బాబు, కానిస్టేబుల్ రాజేంద్ర స్వామి లతో ఉమేష్ చంద్ర గారికి నివాళులు అర్పించడం జరిగింది.

విశాఖపట్నం

News headline

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు నిర్వహించిన కార్యవర్గ సభ్యులు.. విశాఖపట్నం : సమాజంలో పాతుకుపోతున్న చెడు, అవినీతిని అంతమందించేందుకు జర్నలిస్టులు తమ కలాన్ని ఝాళిపించాలని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కే.ఎం. కీర్తన్ పిలుపునిచ్చారు. విశాఖ సెంట్రల్ పార్క్ లో జాప్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు దీపావళి సందర్భంగా మిఠాయిలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాప్ విశాఖ శాఖ అధ్యక్షులు కీర్తన్ మాట్లాడుతూ చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయులు సమాజంలోని చెడు, అవినీతిని పారద్రోలేందుకు కృషి చేయాలని కోరారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ సమాజ సంక్షేమానికి పనిచేయవలసిన బాధ్యత పాత్రికేయులుగా మనపై ఉందని చెప్పారు. సభ్యులందరి కుటుంబాల జీవితాల్లో లక్ష్మీదేవి కరుణించి వెలుగుల నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యవర్గ సభ్యుల సహకారంతో మరికొన్ని రోజుల్లో తమ యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీని కట్టే ఆలోచనలో ఉన్నామని కీర్తన్ స్పష్టం చేశారు. జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ కార్యవర్గం ప్రయత్నిస్తుందని చెప్పారు. సభ్యులందరికీ సహకారంతో రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జాప్ విశాఖ విశాఖ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అప్పలరాజు జన్మదిన వేడుకలను నిర్వహించారు. సభ్యుల సమక్షంలో కేకును కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ శాఖ ప్రతినిధులు గంట చంద్రశేఖర్ వి ఉదయ్ కుమార్, కే పృథ్వీరాజ్ వై.యస్ సాయికుమార్, పి .అర్జున్, ఎస్ రామకృష్ణ, , ఎస్. ఎన్. నాయుడు, ఆర్. శ్రీనివాసరావు, జి రాజు, కే .శంకర్ , వల్లి, సురేష్, జి సతీష్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం తలపా దామోదరం రెడ్డి

పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలు చిరస్మరణీయం అని కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారక్షణలో భాగంగా ఎందరో పోలీస్ వీరులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రజారక్షణే పరమావధిగా ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ,నేడు సమాజంలో ప్రజలు భద్రతతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి అదేవిధంగా ప్రజా రక్షణ కొరకు చేస్తున్నటువంటి సేవలు అజరామరం అని తెలియజేశారు.వారి త్యాగాలకు వెలకట్టలేమని,పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని ఊహించలేమని తెలిపారు.

రంగారెడ్డి

*ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం* *పున్నమి ప్రతినిధి 20/10/2025 రంగారెడ్డి జిల్లా* **నేడు శ్రీ కోళ్ల నరసింహ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాచారం రంగారెడ్డి జిల్లా వారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మెమొంటోను బహూకరిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ ,సీనియర్ పాఠశాల సహాయకులు బయోసైన్సు జి. బొందయ్య, మంగళపల్లి పటేల్ గూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగారెడ్డి జిల్లా వారికి బహుకరిస్తున్న దృశ్యం ఇంకా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి తదితరులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు*

*ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం* *పున్నమి ప్రతినిధి 20/10/2025 రంగారెడ్డి జిల్లా* **నేడు శ్రీ కోళ్ల నరసింహ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాచారం రంగారెడ్డి జిల్లా వారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మెమొంటోను బహూకరిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ ,సీనియర్ పాఠశాల సహాయకులు బయోసైన్సు జి. బొందయ్య, మంగళపల్లి పటేల్ గూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగారెడ్డి జిల్లా వారికి బహుకరిస్తున్న దృశ్యం ఇంకా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి తదితరులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు*

భక్తి

రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం. భక్తులతో కిటిటలాడానున్న శివాలయాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, వ్రతాలు, దీపారాధనలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న భగిని హస్త భోజనం, 25న నాగుల చవితి, 30న శ్రవణ నక్షత్రం, నవంబర్ 1న చిల్ల ఎకాదశి, 2న క్షీరాబ్ధి ద్వాదశి, 5న జ్యోతిర్లింగ భోజనం, 8న సంకట చతుర్థి, 11న స్మార్త పౌర్ణమి, 16న వనభోజనం, 18న మాస శివరాత్రి, 20న కాలభైరవ పూజ, 21న పోళి నక్షత్ర ప్రాయశ్చిత్తం వంటి పర్వదినాలతో భక్తి ఉత్సాహం నెలకొననుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.