Saturday, 25 April 2026

Blog

తిరుపతి

భారీ వర్షాల పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎమ్మెల్యే బొజ్జల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల కోతలు చేయరాదని, కల్లాలలో ఉన్న పంటలు కాపాడుకోవడానికి టార్పాలిన్ పట్టాలతో సిద్ధంగా ఉండాలన్నారు.కూటమి నాయకుల అధికారులు,గ్రామ వార్డు,సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని,భారీ వర్షాల కారణంగా చెరువులు,నీటి కుంటలకు గండ్లు పడే అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రజలు,అధికారులు గుర్తించి ముందుగానే ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలునిచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కరువు భత్యం జీవోలు 60, 61లలో బకాయిల చెల్లింపు విధానం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం – ఆప్టా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (APPTA) నేతలు ప్రభుత్వం జారీ చేసిన కరువు భత్యం (DA) సంబంధిత జీవోలు 60, 61లలో చూపిన బకాయిల చెల్లింపు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాప్టో పోరాటం మరియు అనేక సంఘాల ప్రాతినిధ్యాల తర్వాత ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చల అనంతరం పేరివిజన్ కమిషన్ మరియు బకాయిల చెల్లింపులను పక్కనపెట్టి కేవలం ఒకే ఒక్క డీఏను విడుదల చేయడం ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు చింతాడ రాము, ప్రధాన కార్యదర్శి బి. నరసింగరావు మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 19 నెలల బకాయిలను రిటైర్మెంట్ సమయానికి ఇవ్వడం, పెన్షనర్లకు 2027–28 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేయడం అనేది విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే సీపీఎస్ వారికి ఇవ్వవలసిన 90% నగదు జమపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం సరికాదని, జీవోలు 60, 61లు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే సదరు జీవోలను సవరించి, సర్వీసులో ఉన్న వారి డీఏ బకాయిలను వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని, రిటైర్ అయిన వారికి వెంటనే పూర్తి చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాన్ని పెంపొందిస్తున్నాయని ఆప్టా నేతలు హెచ్చరించారు. ధన్యవాదాలతో, మీ భవదీయులు, షబ్బీర్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు షానవాజ్ హుస్సేన్ మాజింద్రని, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

వికారాబాద్

*వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025* *2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీ

*వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ:: 20 /10/ 2025* *2025-2027 రెండు సంవత్సరాలకు గాను వికారాబాద్ జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు తెలియజేశారు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడుగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్, రాష్ట్ర బాధ్యులు వీరేందర్ గౌడ్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గంగా జిల్లా అధ్యక్షుడుగా డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎజాజ్ అమ్మదును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు మరియు పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేశారు రానున్న భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం మరియు యాక్ట్ 1/2000 రద్దుచేసి సర్వీసు ప్రొటక్షన్ ఇప్పించేందుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా వందమంది భాషా పండితులు పాల్గొన్నారు*

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామీనేషన్ గడవు పూర్తి

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అయిన ఈరోజు భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అధికారులు తెలిపిన ప్రకారం, మూడు గంటల తర్వాత కూడా వచ్చే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించలేమని పేర్కొన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తదుపరి అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

ఫార్మా కంపెనీ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:21 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువతకు విశాఖ, హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ డా.కె.బి.కె నాయక్ తెదిపారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్దులకు విశాఖ లోని స్కిల్ సెంటర్ నందు 45 రోజులు ఫార్మా రంగంపై ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం కంపెనీ యూనిట్ల యందు ఉద్యోగం కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలకు బిఎస్సీ కెమిస్ట్రీ పాస్/ఫైల్ , ఇంటర్, ITI(ఫిట్టర్, ఎలిక్ట్రీషన్), డిప్లమో(మెకానిక్, ఎలిక్ట్రీషన్), 10వ తరగతి అర్హతలతో 25ఏళ్ళకు మించని పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులన్నారు. కావున ఈ ఇంటర్వ్యూలకు హజరగు అభ్యర్ధులు మీయొక్క విద్యార్హత సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, కులదృవీకరణ పత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు 8699156216, 8688003060 నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోలీసుల అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – రాజోలు సీఐ టీ.వి. నరేష్ కుమార్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజోలు సీఐ టీ.వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఈ ప్రాంతానికి చెందిన కోళ్ల వెంకన్న, పిల్లా రవి ప్రసాద్ లకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను శాలువాలు కప్పి సన్మానించారు. సీఐ నరేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించడం గొప్ప త్యాగమని, వారి సేవలను తరతరాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి ఎస్సైలు రాజేష్, సురేష్, శ్రీనివాస్ తో పాటు సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

భక్తి

కార్తీక మాసం లో శివాలయ దర్శన విధానం వివరముగపున్నమి పాఠకుల కోసం

పున్నమి ప్రతి నిధి ఖమ్మం శివభక్తులకు శుభవార్త. పరమశివుని అనుగ్రహం పొందేందుకు 42 రోజుల శివాలయ దర్శనం ఆచరణ విధానం వివరాలు భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భక్తి, నియమం, శ్రద్ధతో ఈ పుణ్య కార్యక్రమం చేపట్టినవారికి ఆధ్యాత్మిక శాంతి, శివకృప లభిస్తుందని పండితులు చెబుతున్నారు. రేపట్నుంచి ప్రారంభమయ్యే ఈ 42 రోజుల శివాలయ దర్శనంలో భక్తులు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి, పౌరాణిక పద్దతిలో భూషణం, భూమాషణం, మానసాహారం చేయకుండా నియమ నిష్టలతో ఉపవాసం పాటించాలి. ఉదయం, సాయంత్రం భక్తితో శివనామ స్మరణ, అష్టోత్తర శతనామ పఠనం, మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం ద్వారా శివకృప పొందవచ్చు. ప్రతి రోజూ శివాలయానికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేసి, మీ ఇంటి వద్ద ఉన్న దేవతా విగ్రహాలకు కూడా నమస్కారం చేయడం మంచిదని ఆచార్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 9వ రోజు నుండి 42వ రోజు వరకు కఠినంగా నియమాలు పాటిస్తే శివభక్తికి ప్రత్యేక ఫలితాలు దక్కుతాయి. శివనామ జపం, ఉపవాసం, దానం వంటి సత్కార్యాలు ఈ కాలంలో చేయడం శ్రేయస్కరం. శివపూజ అనంతరం అన్యదేవతారాధన చేయకుండా, పరమశివుడి స్మరణతో జీవనం సాగించడం భక్తి పరమార్థం అని గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5వ రోజు నుండి 10వ రోజు వరకు శివనామ స్మరణలో ఎక్కువ సమయం గడపాలని, ఇది ప్రాణాంతక సమస్యలకూ దివ్య పరిష్కారమని పండితులు పేర్కొంటున్నారు. 42 రోజుల శివారాధనలో ఆచరించే నియమాలు భక్తిని పెంపొందించడమే కాక, మనసుకు ప్రశాంతతను, జీవితంలో సౌఖ్యాన్ని అందిస్తాయి. ఈ పుణ్యకాలంలో భక్తులు భగవంతుని ఆశీర్వాదంతో ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందవచ్చు.

హైదరాబాద్

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌ (TCA) నూతన గవర్నింగ్ బోర్డు ప్రకటించిన అధికారులు

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌ (TCA) కొత్త గవర్నింగ్ బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీని 2025 హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించింది. 2025 నుండి 2028 వరకు మూడు సంవత్సరాల కాలానికి ఈ నూతన బోర్డు బాధ్యతలు స్వీకరించనుంది. క్రికెట్ అభివృద్ధికి అనుభవజ్ఞులు, నూతన ప్రతినిధులు, మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జోన్ల సమతుల్యతను ప్రతిబింబించే విధంగా కమిటీలు ఏర్పాటు చేశారు. బోర్డు ఆఫ్‌ పేట్రన్స్‌గా బండి సంజయ్ కుమార్‌, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్. రామ్ చంద్ర రావు, మరియు వెదిరే శ్రీరామ్‌ ఉన్నారు. బోర్డు ఆఫ్‌ అడ్వైజరీలో బందారు దత్తాత్రేయ, ఐ. గోపాల్ శర్మ, న్యాయమూర్తులు బి.ఎస్. రెడ్డి (రిటైర్డ్‌), సాద్ బిన్ జంగ్‌, సి.వి. రాములు (రిటైర్డ్‌) ఉన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కో-చైర్‌గా వై. లక్ష్మీనారాయణ, వైస్‌ చైర్మన్‌గా నూనే బాల్‌రాజ్‌ నియమితులయ్యారు. మేనేజింగ్ కమిటీలో అధ్యక్షుడిగా బీబీ పాటిల్‌, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా ధరం గురువా రెడ్డి, ట్రెజరర్‌గా డాక్టర్ తేగల హరినాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్ అద్మాలా ఉన్నారు. అదనంగా, ఎం.సి. మెంబర్లుగా కాల్. ఏ. ప్రకాశ్ కుమార్‌, బద్దం మహిపాల్ రెడ్డి, అంబర్ అబ్బాస్ (మెన్స్ క్రికెటర్), పి. ఝాన్సీ లక్ష్మి (విమెన్ క్రికెటర్) ఎంపికయ్యారు. గవర్నింగ్ కౌన్సిల్‌, జోనల్‌, కోచెస్‌, మీడియా, టెక్నికల్‌, గ్రౌండ్స్ అండ్ టోర్నమెంట్స్ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ కమిటీలలో దేవకీ వాసుదేవరావు, కపిలవాయి రవీందర్, పరవేజ్ హసన్ అబ్బాస్, ఈ. వరుణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణలో క్రికెట్‌కు కొత్త ఊపును, యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలను తీసుకురావడమే ఈ నూతన బోర్డు లక్ష్యమని జనరల్ సెక్రటరీ ధరం గురువా రెడ్డి తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు10రోజులుగా కరెంట్ లేదని ఆందోళన

వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీతక్కెళ్లపాడులో పది రోజులుగా విద్యుత్తు సరఫరా లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. వింజమూరు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పలుమార్లు అధికారులకు చెప్పినా మరమ్మతులు చేసేందుకు కొన్ని వస్తువులు లేవని, అవి తెచ్చుకుంటే చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా కరెంట్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నారు.

అనకాపల్లి

సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభలను ఆటో కార్మికులు జయప్రదం చేయoడి, సిఐటియు.

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఈ రోజు అచ్చుతాపురంలో జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కూండ్రపునాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలో ఆటో, మోటార్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని మోటారు కార్మికులకు శిక్షలు, పెనాల్టీలు పెంచి స్వయం ఉపాధితో అప్పులు చేసి బ్రతుకుతున్న ఆటో కార్మికులకు శ్రీ శక్తి పథకంతో ఆటో కార్మికుల జీవితాలు నష్టపోతున్నాయని వీరికి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసి మోటారు కార్మికులను ఆదుకోవాలని సిఐటి ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ఆటో యూనియన్ అధ్యక్షులు డి చండీ, ఉపాధ్యక్షులు టి రాజు, కార్యదర్శి ఏ అప్పారావు, కోశాధికారి డి డి సన్నీబాబు, టివియస్ ప్రకాష్, గుమ్మెళ్ల గోవిందరావు, కారే త్రినాద్, మేరుగు అప్పలనాయుడు,దుర్గా, మురళి, కుమార్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.