Saturday, 25 April 2026

Blog

విశాఖపట్నం

గ్రామ ,మండలం యువజన విభాగం కమిటీలు త్వరలో అన్నంరెడ్డి అదీప్ రాజ్

ఎండాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సిపి యువజన విభాగం ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అదీప్ రాజ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో యువజన విభాగం మరింత బలోపితం చేసి రానున్న రోజుల్లో గ్రామ ,మండలం యువజన విభాగం కమిటీలు త్వరత్వగతిన పూర్తి చేసి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్,జోనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊరుకుటి చందు, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి కార్పొరేటర్ ఇమ్రాన్ పుల్లేటి వెంకటేష్, శరత్ బాబు,పృథ్వీ,అల్లు అవినాష్,గాబడి శేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్,దొడ్డి కిరణ్, జగుపిల్ల నరేష్ ,చందు యాదవ్,చింతకాయల వరుణ్,కనకాల ఈశ్వర్ రావు,సత్యం నాయుడు,శివాజీ చక్రవతి,వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు,రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రతీ 50 కిలోమీటర్ల‌కు ఒక సీసీ: టెక్నో-పోలీసింగ్‌తో శాంతి భద్రతను గరెంటీ చేయాలని ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి సాంకేతిక లక్ష్యాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతీ 50కి.మీ.마다 సీసీ కెమెరాలు పెట్టివ్వడం ద్వారా రహదారి పర్యవేక్షణ, నేరాల నిరోధం మరియు తాజా సమాచారాన్ని రియల్‑టైమ్‌లో పొందటం మొదలైన వాటిని సుశక్తం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా పెట్టుబడులకు మన్నికైన, సురక్షిత వాతావరణం ఏర్పడతాయని ప్రభుత్వం నమ్ముతోంది; ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ పోలీసులు ఆపరేషన్‌ను ‘మూడో కన్ను’గా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధునీకరణ, డ్రోన్లు, సైబర్‑పరిశీలనలు వంటి సాంకేతిక సాధనాలను విస్తృతంగా police యంత్రాంగంలో ప్రవేశపెట్టడం ద్వారా నేరవర్గాల ఆటను ముందే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవచ్చు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రత్యేక గుంపులు — ఈగల్, శక్తి బృందాలు — పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా గటిస్తాయని ప్రకటించారు. సమాజంలో ఎక్కడైనా అసాజీవకత్వం, రౌడీయిజం ఏర్పడకుండా చేసే చర్యలు, సాంకేతిక శిక్షణతో పాటు ఆధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం కూడా ఈ పథకంలో భాగమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య ద్వారా రవాణా, గూడ్స్‑మోనిటరింగ్, నిబంధనల ఎలా అమలు చేయబడుతున్నాయో కూడా మరింత పారదర్శకంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు‑బయటి ప్రయాణాల్లో మరియు సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన వ్యూహాల్లో కూడా టెక్నాలజీ

ఎన్ టి ఆర్ జిల్లా

ఆధార్ అప్డేట్‌కు 150 రూపాయలు వసూలు – ప్రభుత్వ ఆధార్ సెంటర్‌లో అక్రమ వసూళ్లు

జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆధార్ కార్డు సెంటర్ లో సర్వసాధారణ ప్రజలను దోచుకునే విధంగా అక్రమంగా వసూళ్లు జరుగుతు న్నాయన్న ఆరోపణలు వెల్లడి చేస్తున్నాయి. ఆధార్ కార్డ్ అప్డేట్‌కు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు భిన్నంగా, ₹150 వరకు వసూలు చేస్తూ, ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా, విధిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ప్రజలను వేధిస్తున్న తీరుపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సిబ్బంది, అప్డేట్ కోసం వచ్చిన వారిని 2-3 గంటలపాటు వేచి ఉండాలని చెబుతూ, ప్రశ్నించిన వారిని “ఉండు లేకపోతేవెళ్ళిపో” అంటూ బెదిరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. మరింత ఆశ్చర్యకరం ఏంటంటే, ఏ సేవకు ఎంత చార్జ్ అని పేర్కొనబడిన బోర్డు కూడా అక్కడ కనబడడం లేదు. కూలీలుగా పనిచేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా వేధింపులకు గురవు తుండగా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. MRO ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించకపోగా, RDO ను కలిసిన తర్వాత సంబంధిత అధికారులను పంపించి విచారణ చేపడతానని హామీ ఇవ్వడం కొంత ఊరటనిస్తోంది. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు – ఇలాంటి అక్రమ కేంద్రాలను వెంటనే మూసివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ దోపిడీకి సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరం. ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా ఆధార్ అప్డేట్ కేంద్రం లో అక్రమ వసూళ్లకు గురైతే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ (1947) ద్వారా ఫిర్యాదు చేయాలి. తీసుకునే డబ్బులకు రిసిప్ట్ ఇవ్వకపోతే, అది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన.

హైదరాబాద్

సహకార, చేనేత శాఖల్లో 101పోస్ట్ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రత్యేక ప్రతి నిధి) తెలంగాణ ప్రభుత్వం పరిపాలనను గాడిలో పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా ఖాళీగా ఉన్న సహకార, చేనేత శాఖల్లో 101 పోస్టులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో సహకార శాఖలో 63 మంది సహాయ రిజిస్ట్రార్లు (అసిస్టెంట్ రిజిస్ట్రార్లు), చేనేత శాఖలో 38 మంది సహాయ అభివృద్ధి అధికారులు (ఏడీఓలు) ఉన్నారు. గ్రూప్-2 పరీక్షల ద్వారా ఎంపికైన ఈ అధికారులు త్వరలోనే విధుల్లో చేరనున్నారు. సహకార శాఖలో క్షేత్రస్థాయిలో సహకార సంఘాల నిర్వహణ, నిధుల వినియోగం, ఆడిటింగ్ వంటి బాధ్యతలు చూసే పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉండటం వల్ల పనితీరు మందకొడిగా మారింది. ఉన్నతాధికారులపై అదనపు పనిభారం పెరగడంతో పలు పథకాల అమలులో జాప్యం ఏర్పడింది. తాజా నియామకాలతో ఈ లోటు పూడ్చబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక చేనేత, జౌళి శాఖలో కూడా చాలా కాలంగా సిబ్బంది కొరతతో పథకాల అమలు కష్టంగా మారింది. ముఖ్యంగా చేనేత రుణమాఫీ, జౌళి ప్రోత్సాహకాలు వంటి పథకాల అమలులో జాప్యం ఏర్పడింది. కొత్త ఏడీఓల నియామకంతో ఈ సమస్యలు తీరనుండగా, చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు మరింత వేగంగా చేరనున్నాయి. ఈ 101 పోస్టుల భర్తీతో రెండు శాఖల్లో క్షేత్రస్థాయి పరిపాలన బలపడనుందని, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సహకార శాఖలో ఇంకా ఖాళీగా ఉన్న 23 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేసే అవకాశముందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, ఈ నియామకాలతో సహకార, చేనేత రంగాల పనితీరు మెరుగుపడే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది

కర్నూలు

శ్రీశ్రీశ్రీ సదానందగిరి మహారాజ్ స్వర్ణహస్తాలతో శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం ఆవిష్కరణ

బ్రహ్మశ్రీ పితామహ ప్రతిజి మరియు శ్రీమతి స్వర్ణమాల ప్రతి గారి ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ స్వామి సదానందగిరి మహారాజ్ 110 సంవత్సరముల హిమాలయ యోగి వారే స్వర్ణ హస్తాలతో 23–10-2025 తేదీన సమయం ఉదయం 11 గంటలకు, స్థలం బోడ బండ శ్రీ తిమ్మప్ప స్వామి, శ్రీ పకీరప్ప స్వామి క్షేత్రము, ఉప్పర్లపల్లి గ్రామం తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా, ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న వారు కేజీ శ్యాంబాబు శాసనసభ్యులు పత్తికొండ, ఆహ్వానించువారు శ్రీ సింగంశెట్టి గురునాథ్, శ్రీ అప్ప ప్రభాకర్, శ్రీ అప్ప వేణుగోపాల్, మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామివారి ప్రసాదాలతో పాటు భోజనాలు కూడా ఉంటాయి, ఇక్కడ ఈ చుట్టూ ప్రాంతాలలో జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది, ధ్యానం వలన, జ్ఞానం–జ్ఞానం వలన ముక్తి, శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం మరియు ధ్యాన జ్ఞాన బోధ మందిరం ప్రారంభం, అందరూ పాల్గొనవచ్చును, వివరాలు తెలిపిన అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు,

విశాఖపట్నం

నగరంలో వ్యాపారస్తులు డస్ట్ బిన్ లు ఉపయోగించాలి . బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

విశాఖపట్నం అక్టోబర్ 21: నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో తమ దుకాణాల ముందుడస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని, లేనియెడల వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు తగిన జరిమానాలు చర్యలు చేపట్టడం జరుగుతుందని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ 2 జోన్ లోని 11, 12, 13 వార్డుల పరిధిలోని ఆరిలోవ లోని బాలాజీ జంక్షన్, శాంతినగర్ కొండ ప్రాంతం, దుర్గా బజారులోని అన్నా క్యాంటీన్ పరిశీలన తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ ముందుగా ఆరిలోవ , బాలాజీ నగర్ లో మాంసం దుకాణం, పూల వ్యాపారులు విక్రయిస్తున్న వీధి వ్యాపారులు వ్యర్ధాలను రోడ్లపై వేయడంతో కమీషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వ్యర్ధాలను వారిచే స్వయంగా తొలగింప చేశారు. ఆరిలోవలోని టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడం గమనించి ఆ టిఫిన్ సెంటర్ యజమానికి 1000 రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. నగరంలో ప్రతి దుకాణం ముందు 3 డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. తదుపరి శాంతిపురం కొండ వాలు నివాస ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు నిత్యం చెత్త తరలించే వాహనాలు సమయానికి వస్తున్నాయా ? వ్యర్ధాలను విభజించి సిబ్బందికి అందిస్తున్నారా, లేదా అని స్థానికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాగునీరు ఏ సమయానికి వస్తుంది ఎంత సమయం ఇస్తున్నారని, తాగునీరు సంతృప్తికరంగా సరఫరా జరుగుతుందా, వీధిలైట్లు సమయానికి వెలుగుతున్నాయి లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిత్యం నిర్ణీత సమయానికి తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని, వీధిలైట్లు నిత్యం వెలిగేలా చర్యలు చేపట్టాలని నీటి సరఫరా, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు కమిషనర్ ఆదేశించారు. నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా తమ దుకాణాల ముందు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసుకోవాలని వ్యర్ధాలను డస్ట్ బిన్లలో వేసి రోజు జీవీఎంసీ వాహనాలకు అందించాలని ,అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలోను, రోడ్ల పైన, కాలువలలో ,ఫుట్పాతులపై వ్యర్ధాలు వేస్తే వ్యాపారస్తులకు 1000 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు జరిమానా విధిస్తూ తగిన చర్యలు శానిటరీ ఇన్స్పెక్టర్లు చేపట్టాలని కమిషనర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. “అన్న క్యాంటీన్ కమిషనర్ పరిశీలన” అనంతరం దుర్గా బజార్ లోనే అన్న క్యాంటీన్ పరిశీలించి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహారం రుచికరముతో పాటు సూచిక బోర్డులో ఉన్న విధంగా అందిస్తున్నారా అని ఆహారం భుజిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టోకెన్ సిస్టంను పరిశీలించి అన్న క్యాంటీన్లోని ఆహారంతో పాటు పరిశుభ్రత పాటించాలని మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె . కనకమహాలక్ష్మి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వ్యాపారస్థులు డస్ట్ బిన్ లు ఉపయోగించాలి జీ వీ ఎం సి కమీషనర్

వ్యాపారస్తులు డస్ట్ బిన్ లు ఉపయోగించాలి .*బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవు – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో తమ దుకాణాల ముందుడస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని, లేనియెడల వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు తగిన జరిమానాలు చర్యలు చేపట్టడం జరుగుతుందని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ 2 జోన్ లోని 11, 12, 13 వార్డుల పరిధిలోని ఆరిలోవ లోని బాలాజీ జంక్షన్, శాంతినగర్ కొండ ప్రాంతం, దుర్గా బజారులోని అన్నా క్యాంటీన్ పరిశీలన తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ ముందుగా ఆరిలోవ , బాలాజీ నగర్ లో మాంసం దుకాణం, పూల వ్యాపారులు విక్రయిస్తున్న వీధి వ్యాపారులు వ్యర్ధాలను రోడ్లపై వేయడంతో కమీషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వ్యర్ధాలను వారిచే స్వయంగా తొలగింప చేశారు. ఆరిలోవలోని టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడం గమనించి ఆ టిఫిన్ సెంటర్ యజమానికి 1000 రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. నగరంలో ప్రతి దుకాణం ముందు 3 డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. తదుపరి శాంతిపురం కొండ వాలు నివాస ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు నిత్యం చెత్త తరలించే వాహనాలు సమయానికి వస్తున్నాయా ? వ్యర్ధాలను విభజించి సిబ్బందికి అందిస్తున్నారా, లేదా అని స్థానికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాగునీరు ఏ సమయానికి వస్తుంది ఎంత సమయం ఇస్తున్నారని, తాగునీరు సంతృప్తికరంగా సరఫరా జరుగుతుందా, వీధిలైట్లు సమయానికి వెలుగుతున్నాయి లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిత్యం నిర్ణీత సమయానికి తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని, వీధిలైట్లు నిత్యం వెలిగేలా చర్యలు చేపట్టాలని నీటి సరఫరా, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు కమిషనర్ ఆదేశించారు. నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా తమ దుకాణాల ముందు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసుకోవాలని వ్యర్ధాలను డస్ట్ బిన్లలో వేసి రోజు జీవీఎంసీ వాహనాలకు అందించాలని ,అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలోను, రోడ్ల పైన, కాలువలలో ,ఫుట్పాతులపై వ్యర్ధాలు వేస్తే వ్యాపారస్తులకు 1000 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు జరిమానా విధిస్తూ తగిన చర్యలు శానిటరీ ఇన్స్పెక్టర్లు చేపట్టాలని కమిషనర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.”అన్న క్యాంటీన్ కమిషనర్ పరిశీలన” అనంతరం దుర్గా బజార్ లోనే అన్న క్యాంటీన్ పరిశీలించి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహారం రుచికరముతో పాటు సూచిక బోర్డులో ఉన్న విధంగా అందిస్తున్నారా అని ఆహారం భుజిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టోకెన్ సిస్టంను పరిశీలించి అన్న క్యాంటీన్లోని ఆహారంతో పాటు పరిశుభ్రత పాటించాలని మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె . కనకమహాలక్ష్మి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లికేషన్లపై ప్రభుత్వ కీలక అప్డేట్ – దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో పరీక్షలు నిర్వహణకు సిద్దం

ఏపీలో ఇంటి నుంచి పని చేయాలనుకునే నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కౌశలం సర్వే నిర్వహించింది. ఇందులో 10వ తరగతి నుండి పైకై అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ప్రారంభ దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత కూడా అధిక సంఖ్యలో ఆసక్తి ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. అయితే దరఖాస్తుల తర్వాత దీని ప్రక్రియపై ఎలాంటి అప్డేట్ లేకపోవడం కారణంగా అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది, కౌశలం సర్వేలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై త్వరలో పరీక్షలు నిర్వహించడం. ఈ పరీక్షలు గ్రామ, వార్డు సచివాలయ శాఖల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సచివాలయాలకు హెడ్‌ఫోన్‌లు (మైక్‌తో) మరియు వెబ్ కెమెరాలను పంపిణీ చేస్తున్నది. పరికరాల పంపిణీ పూర్తయ్యిన తర్వాత పరీక్షలకు సంబంధించిన ఇతర ఏర్పాట్లు, తేదీలు ఖరారు చేయబడతాయి. ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశ్యం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను అభ్యర్థులు చేపట్టగల సామర్థ్యం కలిగి ఉన్నారా అనే అంశాన్ని నిర్ధారించడం. అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు ప్రకటించబడలేదు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్నదే. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఈ కార్యక్రమంలోని భాగంగా అభ్యర్థులకి అవకాశాన్ని అందించేందుకు ప్రోత్సహించడం జరుగుతోంది. కాబట్టి కౌశలం సర్వే ద్వారా దరఖాస్తులు స్వీకరించి, తదుపరి ప్రక్రియలో పరీక్షలు నిర్వహించడం ప్రధాన దశగా నడుస్తోంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎడతెరిపి లేని వర్షం – రైతులు పంట నీటిపాలు

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి కాకివాయిలో 100 ఎకరాలు నీట మునిగిన వరి పంట అన్నదాతను ఆదుకోండి అంటూ రైతులు ఆవేదన నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో గడిచిన ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఆ గ్రామంలో సుమారు 100 ఎకరాలు వరి పంట నీట మునిగింది.వరి పంట నీటమునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికి వచ్చిన పంట ఇంటికి చేరే సమయానికి కురుస్తున్న వర్షాలు ఇంకా అధికమవు తుండడంతో పంట మొత్తం నేలపాలైయింది.తిరిగి గింజలు నీటిలో మొలకెత్తుతున్నాయని అన్నారు.తమ పంట మొత్తం నేలపాలయ్యిందని మమ్ములను ఆదుకోవాలంటూ తమ బాధను ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా కన్నీరు మున్నీరుగా రైతులు విలపిస్తున్నారు.ఉన్నతాధికారులు తక్షణమే నీట మునిగిన మా పంటలను పరిశీలించి పంట నష్టం కింద ప్రభుత్వం ఆర్థిక భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను వారు వేడుకుంటున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిసేలా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలని కాకివాయి గ్రామ రైతులు అభ్యర్థిస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తమ్మవరపు మంగపతి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

నందిగామ పట్టణం, తొమ్మిదవ వార్డు తమ్మవరపు మంగపతి సతీమణి చంద్రమ్మ ఇటీవల మరణించిన విషాద వార్త తెలుసుకున్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, తమ్మవరపు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించామని, కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం బుచ్చిబాబు, వీసం జగదీష్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.