Friday, 24 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు – కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఎన్నికలను నాలుగు దశలుగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇటీవల ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నీలం సాహ్ని ప్రకారం, డిసెంబర్ చివరి వారంలో అన్ని రాజకీయ పార్టీలతో సమీక్షా సమావేశం నిర్వహించి, జనవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో SEC ఉందని తెలుస్తోంది. అదే నెలలోనే పోలింగ్ పూర్తయ్యి ఫలితాలు ప్రకటించే అవకాశముందని సమాచారం. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు అందుకున్నారు. అంతేకాకుండా, 18 ఏళ్లు నిండిన వారందరికీ ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచనలు పంపినట్లు నీలం సాహ్ని తెలిపారు. ఈ నిర్ణయం యువతకు రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించేందుకు దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్య బలోపేతం, స్థానిక అభివృద్ధి, ప్రజా పాలన పారదర్శకత — ఇవే ఈ ఎన్నికల ప్రధాన లక్ష్యాలుగా SEC స్పష్టం చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నర్రవాడ ఈవో శ్రీనివాసులు రెడ్డి..!

ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ ఈవో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు రెడ్డి వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసము యూ ఎ ఈ లో ముఖ్యమంత్రి పర్యటన

అమరావతి అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం ) రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈ (UAE)లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు• రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈ లో ముఖ్యమంత్రి బృందం పర్యటన• వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్న చంద్రబాబు• మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్న సిఎం చంద్రబాబు• 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో ఒన్ టూ ఒన్ మీటింగులకు హజరు కానున్న ముఖ్యమంత్రి• పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోను భేటీలు• రేపు దుబాయ్ లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం చంద్రబాబు• దుబాయ్ లో మూడవ రోజు AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న సిఎం చంద్రబాబు• తొలి రోజు పర్యటనలో భాగంగా 22వ తేదీ ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ.• శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు సీఎం చంద్రబాబు సమావేశం.• ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించనున్న చంద్రబాబు.• పర్యటనలో పలు ప్రాంతాలను సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం• చంద్రబాబుతో పాటు దుబాయ్ పర్యటనలో పాల్గొననున్న మంత్రులు టిజి భరత్, బిసి జనార్థన్ రెడ్డి, సిఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఎపి ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి.• నవంబర్ లో నిర్వహించే విశాఖ పార్టనర్షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం• పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సిఎం చంద్రబాబు, నారా లోకేష్ రోడ్ షోలు.

ఆంధ్రప్రదేశ్

మహిళాభివృద్ధికున్న అవకాశాలన్నీ వినియోగించండి

మహిళాభివృద్ధికున్న అవకాశాలన్నీ వినియోగించండి డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి ఉత్పత్తుల వారీగా రాష్ట్రంలో క్లస్టర్లు ఏర్పాటు చేయండి స్టార్‌బక్స్ తరహాలో అరకు, మిల్లెట్ ఔట్‌లెట్లు డ్వాక్రా, మెప్మా విభాగాలను ఒకే గొడుగు కింద తెచ్చే అంశాన్ని పరిశీలించండి సెర్ప్-మెప్మాపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం అమరావతి, అక్టోబర్ పున్నమి ప్రతినిధి ( విశాఖపట్నం): మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంపైనా సీఎం చర్చించారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాష్ట్రంలోని మహిళలను శక్తిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలి. డ్వాక్రా సంఘాల ఏర్పాటు తర్వాత వాళ్లల్లో చాలా చైతన్యం వచ్చిందని.. వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసేలా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే… ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న వర్గంగా తెలుగువారు ఉన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసే రోజుల్లో చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తెచ్చి అద్భుతాలు సృష్టించాం. ఇప్పుడు మహిళ సంఘాలు రూ.20,739కోట్లను పొదుపు చేయగలుగుతున్నారు..దీనికి రెండింతలు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకోగలుగుతున్నారు. ఈ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేయగలిగే సంస్థలు తక్కువ. పైగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో ముందుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో డ్వాక్రా మహిళలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సుమారు 99 శాతం మందికి పైగా మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నారు. కేవలం 0.02 శాతం మంది మహిళల మాత్రమే వెనక్కి తగ్గుతున్నారు. ఇంతటి పెద్ద నెట్ వర్క్ ఎక్కడా ఉండదు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న పొదుపునకు మించిన స్థాయిలో మరింతగా పొదుపు చేయించడం.. వారిని వ్యాపారులుగా.. పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందించాలి. ఇదే సమయంలో డ్వాక్రా, మెప్మా మహిళల్లో ఉన్న టాలెంట్ గుర్తించాలి. డ్వాక్రా సంఘాలు పొదుపు చేసే మొత్తాలను..వాళ్లు బ్యాంకులోన్ల ద్వారా తీసుకునే రుణాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చు… వాటిని మరింత సద్వినియోగం ఎలా చేయవచ్చనే అంశంపై గైడ్ చేయడానికి అవసరమైతే ఫండ్ మేనేజర్‌ను ఏర్పాటు చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలి.” అని సీఎం చంద్రబాబు చెప్పారు. స్వయం సహయక మహిళలకు గంటల్లో బ్యాంకు రుణాలు “స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. గంటల్లోనే రుణాలందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు..ఇది అమలు అవుతుందో లేదో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించండి. తీసుకున్న రుణాలతో వ్యాపారం చేసుకునే మహిళలను ప్రొత్సహించండి. వారికి వ్యాపార అవకాశాలు మరింతగా పెరిగేలా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ రావాలి. డ్వాక్రా మహిళల్లోని టాలెంట్ గుర్తించడం… స్థానికంగా ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవడం.. టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటి అంశాల ద్వారా డ్వాక్రా మహిళల అభివృద్ధికి తొడ్పాటు అందివ్వాలని సూచించారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ బిజినెస్, ఆక్వా, టూరిజం వంటి రంగాల్లో మహిళా ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్ ఉంటుందో అన్వేషించి…వారికి అవకాశాలు కల్పించాలి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 వరకు ప్రొడెక్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం డ్వాక్రా మహిళల తలసరి ఆదాయం రూ.1,45,000గా ఉంది. ఇది మరింతగా మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఐటీని ప్రమోట్ చేశాను..దాన్ని అందిపుచ్చుకున్న వారు అత్యధిక తలసరి ఆదాయంతో ఉన్నారు. అలాగే డ్వాక్రా సంఘాలను ప్రారంభించాను.. మహిళల్లో సాధికారత తెచ్చే ప్రయత్నం చేశాను. కానీ డ్వాక్రాసంఘాలు ప్రారంభించే నాటికి చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అయినా ఆ సంఘాల ద్వారా వారు అభివృద్ధి చెందారు కానీ… వారు పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారస్తులుగా ఎగదాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళలతో ఎంఎస్ఎంఈలు స్థాపించేలా అధికారులు డ్వాక్రా మహి”ళల అభివృద్ధికి కృషి చేయాలి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్టార్ బక్స్ తరహాలో అరకు కాఫీ-మిల్లెట్ల అవుట్ లెట్లు “అరకు కాఫీ-మిల్లెట్లు ఈ రెండింటి కాంబినేషన్లో అవుట్ లెట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయండి. స్టార్ బక్స్ తరహాలో ఈ అవుట్ లెట్ల డిజైనింగ్ ఉండాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. మునగాకుతో ఉత్పత్తులు చేయొచ్చు… మహారాష్ట్ర బ్యాంబూ మిషన్ పాలసీ తెచ్చింది.. దీనిపై అధ్యయనం చేయండి.. డ్వాక్రా మహిళలతో ఈ ఉత్పత్తులు చేయిద్దాం. ఆక్వా రంగంలో రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సీవీడ్ కల్చర్ ప్రమోట్ చేద్దాం. గుర్రపు డెక్కతో ఉత్పత్తులు చేయవచ్చు. అన్నింటిని ఇంటిగ్రేట్ చేసుకుని చేయండి. డ్రోన్లను ఎగరేయడం మొదలుకుని ఎగ్ కార్ట్, ఆక్వా కార్ట్, మిల్లెట్ కార్ట్ వంటివి ప్రయోగత్మాకంగా చేపట్టండి. డ్వాక్రా సంఘాల్లో కూడా పీహెచ్డీ చేసిన మహిళలు ఉన్నారు.. వారిని గుర్తించి.. వారి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. టూరిజం రంగం హోం స్టేలను ఏర్పాటు చేస్తోంది… వీటిల్లో డ్వాక్రా సంఘాలు వచ్చేలా చూడండి.” అని ముఖ్యమంత్రి చెప్పారు. మెప్మా-మన మిత్ర యాప్‌ ఆవిష్కరణ సమీక్ష అనంతరం మెప్మా-మన మిత్ర యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలను యాప్‌లో అందుబాటులో ఉంచారు. మెప్మా చేపట్టే కార్యక్రమాలు, కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను ఆవిష్కరించారు. ప్రగ్న్యా యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు. అలాగే రూ.1.25 కోట్లను బ్యాంక్ నుంచి రుణం పొంది వ్యాపారం చేస్తున్న మంగళగిరికి చెందిన మహిళను సీఎం అభినందించారు. ఈ మేరకు ఆమెకు చెక్కును అందించారు. ఈ సమీక్షలో మంత్రులు వర్చువల్‌గా నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటన అమరావతి, అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం) :- కందుకూరులో ఇటీవల హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ నాయుడు హత్యను సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, అమానవీయం అని వ్యాఖ్యానించారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అన్నారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. రూ.5 లక్షల చొప్పున పరిహారం.. 2 ఎకరాల చొప్పున భూమి లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వీరితో పాటు దాడిలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని చంద్రబాబు అధికారులను సూచించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్‌కు కూడా రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భధ్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

విశాఖపట్నం

వైజాగ్ గూగుల్ డేటా ఏఐ హబ్ పై బిజెపి చీఫ్ మాధవ్ ప్రెజెంటేషన్

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* వైజాగ్ గూగుల్ డేటా ఏఐ హబ్ పై బిజెపి చీఫ్ మాధవ్ ప్రెజెంటేషన్ *పి వి ఎన్ మాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు* విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం శుభపరిణామం ప్రపంచమంతా మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారింది విశాఖ గ్లోబల్ కేపిటల్ గా మారబోతుంది అమెరికా వెలుపల పెద్ద మొత్తంలో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెడుతుంది విశాఖ లో 1.3 లక్షల కోట్ల తో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలో సువిశాల సాగర తీరం అనేక అవకాశాలకు నిలయం ప్రపంచంలో దిగ్గజ సంస్థలకు 40 శాతం సర్వీస్ ప్రొవైడర్లుగా తెలుగు వారు ఉన్నారు విశాఖ కేంద్రంగా యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి సెమి కండక్టర్స్ కు ఏపి కేపిటల్ గా మారబోతుంది విశాఖ లో నూతన శకం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే సీపీ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ లాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసుకున్నాం ఏపీపై ప్రత్యేక శ్రద్ధ మోది తీసుకున్నారు సవాళ్లను అధిగమిస్తూ లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ముందు వెళ్తాం

విశాఖపట్నం

వైయస్ఆర్సిపి యువజన విభాగం ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు.*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *ఎండాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సిపి యువజన విభాగం ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు.* అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో యువజన విభాగం మరింత బలోపితం చేసి రానున్న రోజుల్లో గ్రామ ,మండలం యువజన విభాగం కమిటీలు త్వరత్వగతిన పూర్తి చేసి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్,జోనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మరియు కార్పొరేటర్ ఊరుకుటి చందు, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి & కార్పొరేటర్ ఇమ్రాన్ పుల్లేటి వెంకటేష్, శరత్ బాబు,పృథ్వీ,అల్లు అవినాష్,గాబడి శేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్,దొడ్డి కిరణ్, జగుపిల్ల నరేష్ ,చందు యాదవ్,చింతకాయల వరుణ్,కనకాల ఈశ్వర్ రావు,సత్యం నాయుడు,శివాజీ చక్రవతి,వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు,రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

నందిగామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం నందిగామ పట్టణం లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ డా.మొండితోక జగన్మోహనరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు అవతూ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.జగన్మోహనరావు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేత లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటు, పరిశీలకుల నియామకం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలు, గ్రామస్థాయి నాయకులు తది తరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో “వైద్య పోరాట ధర్మా” అక్టోబర్ 23న అమలాపురంలో వైద్యరంగ హక్కుల కోసం !

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీనారాయణ గురు, పెరియార్, కాంశీరామ్ వంటి మహనీయుల ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఉద్యమంలో భాగంగా, అక్టోబర్ 23, 2025 గురువారం నాడు అమలాపురం లో ఘనంగా “వైద్య పోరాట ధర్మా” నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమం ద్వారా వైద్య రంగంలో నెలకొన్న అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, మందుల లభ్యత సమస్యలు, పేద ప్రజలకు అందని వైద్య సదుపాయాలు, ప్రైవేటు వైద్యరంగంలో అధిక ఛార్జీల వలన బాధపడుతున్న ప్రజల పరిస్థితి వంటి అంశాలపై ఈ ధర్మా ప్రధాన చర్చగా నిలవనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. పి. గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రాంబాబు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల స్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఆహ్వానాలు అందిస్తూ, ధర్మా విజయవంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. “సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్య హక్కు ఉండాలి” అనే ధ్యేయంతో బహుజన సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ నాయకురాలు మాయావతి గారి ప్రేరణతో, ఆరోగ్యరంగ అభివృద్ధి, సమాన వైద్య సేవల అందుబాటు, మరియు వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనాల కోసం ఈ ఉద్యమం నిలుస్తుంది అని పి. గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రాంబాబు అన్నారు. ప్రజలందరూ ఈ పోరాట ధర్మాలో పాల్గొని తమ మద్దతు తెలపాలని, ఆరోగ్య రంగ సంస్కరణలకు బలాన్నివ్వాలని పి. గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రాంబాబు మరియు నాయకులు పిలుపునిచ్చారు. జై భీమ్ – జై భారత్!

విశాఖపట్నం

భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ‌ ఏర్పాట్లు చేయాలి* *ప్రాథ‌మిక స‌మీక్ష‌లో అధికారులను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్

*భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ‌ ఏర్పాట్లు చేయాలి* *ప్రాథ‌మిక స‌మీక్ష‌లో అధికారులను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ *విశాఖ‌ప‌ట్ట‌ణం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి* న‌వంబ‌ర్ 14, 15వ తేదీల్లో విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. జేసీ కె. మ‌యూర్ అశోక్, సీఐఐ ప్ర‌తినిధులు, నిర్వాహ‌కులు, జిల్లా అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం సాయంత్రం త‌న ఛాంబ‌ర్లో ప్ర‌త్యేకంగా సమావేశ‌మైన ఆయ‌న వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కార్య‌క్ర‌మం కావున అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అప్ప‌గించిన విధుల‌ను అత్యంత బాధ్య‌త‌గా నిర్వ‌ర్తించాల‌ని నిర్దేశించారు. ఎక్క‌డా ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా సీఐఐ ప్ర‌తినిధుల‌తో స‌మన్వ‌యం వ‌హించుకోవాల‌ని అధికారులకు సూచించారు. 13వ తేదీ సాయంత్రం నుంచి అన్ని ర‌కాల కార్య‌కలాపాలు మొద‌ల‌వుతాయ‌ని, 14, 15వ తేదీల్లో ప్ర‌ధాన ఈవెంట్లు జరుగుతాయ‌ని పేర్కొంటూ దానికి త‌గ్గ‌ట్లు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. వీఐపీలు, అతిథుల రాక కోసం ప్ర‌త్యేక పార్కింగు స‌దుపాయాలు క‌ల్పిస్తూ.. ఎంట్రీ, ఎగ్జిట్లు ప‌క్కాగా ఏర్పాటు చేయాల‌న్నారు. ఇప్ప‌టి నుంచే ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకొని పనులు మొద‌లు పెట్టాల‌ని సూచించారు. లెవెలింగ్ ప‌నులు చేయాల‌ని, చిన్న‌చిన్న రాళ్ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు. జీవీఎంసీ, హార్టిక‌ల్చ‌ర్ విభాగాల ఆధ్వ‌ర్యంలో బ్యూటిఫికేష‌న్ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. ఆక‌ర్షించే విధంగా విభిన్న రీతిలో పెయింటింగులు వేయాల‌ని, ప్ర‌చారానికి సంబంధించిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. పారిశుద్ధ్య‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, పార్కింగ్, ప్ర‌ధాన ఈవెంట్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ క‌లెక్ట‌ర్ నిర్దేశించారు. బుధ‌వారం నుంచే ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో అంబులెన్స్ ను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని డీఎం&హెచ్వోను ఆదేశించారు. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు, ప్ర‌ధాన కార్య‌క్ర‌మానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ప్ర‌త్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాల‌న్నారు. *ప్ర‌మాణాలు త‌ప్ప‌కుండా పాటించాలి…* అన్ని ర‌కాల భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాని, ఫైర్ సేఫ్టీ చూసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన మేర‌కు అగ్నిమాప‌క యంత్రాల‌ను అందుబాటులో ఉంచాల‌ని, ముందుగా త‌నిఖీలు చేప‌ట్టి ధృవీక‌రించాల‌ని అగ్నిమాప‌క శాఖ అధికారికి సూచించారు. ఏయూ ప‌రిధిలోని అంత‌ర్గ‌త డ్రెయిన్ల‌ను శుభ్రం చేయాల‌ని, ఏమైనా మైన‌ర్ రిపేర్లు ఉంటే చేయించాల‌ని ఏయూ అధికారుల‌కు చెప్పారు. కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని, బీఎస్ఎన్ఎల్, ఇత‌ర నెట్ వ‌ర్క్ ల సాయంతో క‌నెక్టివిటీ స‌దుపాయం క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ప్ర‌పంచ దేశాల నుంచి అతిథులు, రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖులు విచ్చేస్తున్న క్ర‌మంలో వారు బ‌స చేసేందుకు అనువైన హోట‌ల్ రూమ్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని, ముందు నుంచే బుకింగ్ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే హోం స్టే విధానంలో భాగంగా సంబంధిత నిర్వాహ‌కుల‌ను గుర్తించాల‌ని, వాటిల్లో కూడా అతిథులు బ‌స చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా ప‌ర్యాట‌క శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స్ట్ర‌క్చ‌ర‌ల్ ఈవెంట్స్, ప్ర‌ధాన వేదిక‌ల‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి ధృవీక‌ర‌ణ ప‌త్రాలు అంద‌జేయాల‌ని ఆర్ & బి అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం వ‌హించి భాగస్వామ్య స‌ద‌స్సును విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.