తిరుపతి
శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నం-శరవేగంగా శివం-టు-శివంరోడ్డు పనులు శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పట్టణంలోని జాతీయ రహదారి (NH) నుండి నేరుగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వరకు నిర్మిస్తున్న ‘శివం టు శివం’ రహదారి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కాబోతుండటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ. 42 కోట్ల ప్రతిపాదనల నుండి రూ. 22 కోట్లకే కార్యాచరణ: గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ‘శివం టు శివం’ రోడ్డు ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 42 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, పనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌ను కేవలం రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇది నిధుల సద్వినియోగానికి, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులతో రోడ్డు నిర్మాణంతో పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థను STP ప్లాంట్‌కు అనుసంధానించే పనులు కూడా చేపట్టారు. పనులపరిశీలన,అభివృద్ధికిప్రణాళికలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అధికారులతో కలిసి రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలపై తగిన సూచనలు చేశారు. ఈ రహదారి పొడవునా నది వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్‌లు వంటివి ఏర్పాటు చేసి పర్యాటక శోభను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి శ్రీకాళహస్తిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ‘విజన్-2029’ ప్రణాళికలో ఈ రోడ్డు నిర్మాణం ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. తగ్గనున్నట్రాఫిక్ఇక్కట్లపైహర్షంవ్యక్తంచేస్తున్నప్రజలు ‘శివం టు శివం’ రోడ్డు పూర్తయితే, తిరుపతి, చెన్నై వైపు నుండి వచ్చే భక్తులు, ప్రయాణికులు పట్టణంలోకి రాకుండానే నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజలకు, భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. కూటమి ప్రభుత్వ వేగవంతమైన చర్యలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.