Sunday, 8 March 2026

Blog

తిరుపతి

అట్టహాసంగా ఆదిదేవుని సంబరాలు…..

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: అమృతం కోసం దేవ, దానవులు క్షీరసాగర మధన సంఘటన ఆధారంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సావాలకు అకురం ఏర్పడిందని పురాణలు ద్వార తెలుస్తుంది. పాలసముద్ర మధన సమయంలో లక్ష్మిదేవి ఉద్భవించిన ఆమేను శ్రీమహావిష్ణువు వివాహమాడతాడు. కామధేనువుని, ఐరావతాన్ని దేవతాధిపతి దేవేంద్రుడు తీసుకుంటాడు. అమృతం రావటానికి మంరింత సమయం కావడంతో దేవతలు, రాక్షసులు అత్యంత శక్తితో పాలసముద్రాన్ని చిలకగా కాలకూట విషం (హలహలం) ఉద్భవించింది. దీనిని స్వీకరించాడానికి దేవతలలోగాని, రాక్షసులలోగాని ఎవ్వరు ముందుకు రాకపోవడంతో మహాదేవుడు ఆ విషాన్ని తన త్రాగి తన కంఠస్థానంలో నిపుపుకుంటాడు అంద తనే ఆయనకు గరళకంఠుడనే పేరువచ్చింది. విషప్రభాంతో పరమశివుడు మగత నిద్రలోనికి జారుకుంటాడు. పడుకుంటే విషప్రభావం అధికమౌ తుభావించిన దేవత, రాక్షసులు, మునులు, యక్ష, కిన్నేర్లు, గందర్వులు, అందరు కలసి జాగరణ చేస్తారు. ఈ విధానాన్నే మహాశివరాత్రి బ్రహో్మూ త్సావాల అంకురం ఏర్పదని పూర్వికులు చేబుతారు. తొలి పూజ భక్తునికే… మూడ భక్తితో కొలిచిన బోయవాడైన కణ్ణడికి మహేశ్వరుడు మోక్షాన్ని ఇవ్వగా అతడు భక్తకన్నప్పగా ప్రసిద్ధిగాంచాడు. దీంతో తొలిరోజు గురువారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలౌతాయి. రెండవ రోజు దేవరాత్రి….. పరమేశ్వరుని మేలుకోలుపుతూ దేవతలు నిర్వహించడమే దేవరాత్రి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వామివారి ధ్వజారోహణం జర గుతుంది. స్వామివారి ఆలయ సన్నిధిలోని ధ్వజస్థంభం వద్ద స్వామి, అమ్మవార్ల, ఉత్సవమూర్తులతో పాటు, గణపతి, కూమరస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరస్వామి లను నాలుగు ప్రక్కల ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. శ్రీస్వామి, అమ్మవార్లను అంబారీలపై ఊరేగిస్తారు. మూడవ రోజు భూతరాత్రి… ఈ కార్యక్రమాన్ని శనివారం భూత, ప్రమథగణాదుల ఆడుతూ, పాడుతు నిర్వహించే కార్యక్రమంల కావడంతో ఈ రాత్రిని భూత రాత్రి ఆ ని పిలుస్తారు. ఉదయం సూర్య ప్రభవాహనం పై, రాత్రి భూత- శుక వాహనాల పై స్వామి, అమ్మవార్ల ఊరేగుతారు. హరిజన సేవాసంఘ ఆధ్వర్య Oలో ఈ కార్యన్ని చేస్తారు. నాలుగో రోజు గంధర్వరాత్రి…. సామిని మేలుకొలుపుతూ నాలుగోరోజు గంధర్వులు వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శిస్తారు. స్వామివారిని అనేవ రకాలుగా కీర్తిస్తారు. ఉదయం స్వామి, అమ్మవార్లను రాత్రి రావణ- మయురి వాహనాలపై పురవీధులయందు సంచరించి భక్తులను కటాక్షిస్తారు. ఐదవ రోజు నాగరాత్రి…. ఐదో రోజు నాగులు నాట్యమాడి పరమేశ్వరుని నిద్రలోకి జారనివ్వకుండా ప్రయత్నం చేస్తాయి. స్వామి, అమ్మవార్లను హంస-యాళి వాహనలపై ఉరేగిస్తారు. అరవ రోజు మహాశివరాత్రి…. ఆరోరోజు దేవ, దానవులు, గంధర్వులు, ఋషులు, కిన్నేర, కింపురుషులు కలిసి జాగరణ చేస్తారు. ఈ రాత్రినే మహాశివరాత్రి అంటారు. ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు 10 అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం ఇంద్రవిమాన వాహనం, రాత్రి నంది, సింహ వాహనాలపై ఊరేగింపు చేపడతారు. ఇక 11వ అభిషేకానికి పరమశివుడు మగత నిద్రనుండు మేల్కోంటాడు. దీనినే లింగోధ్భవ దర్శనం అంటారు. ఏడవ రోజు బ్రహ్మారాత్రి…. భూమిని రథంగా చేసుకుని, సూర్య, చంద్రులను చక్రాలుగా బ్రహ్మాసారథిగా నిర్వహించేదే ఈ రథోత్సవం ఆ రోజు అమ్మవారికి కూడ రథో త్సవం కార్యక్రమాన్ని చేపడతారు. అదే రోజు రాత్రి నారద పుష్కరిణినందు తెప్పొత్సవాన్ని నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు స్కందరాత్రి పరమేశ్వరుని కుమారుడు సుబ్రమణ్య స్వామి, చేపట్టే శ్రీస్వామి, అమ్మవార్ల వివాహాన్నే స్కందరాత్రి అని అంటారు. ఈ రోజు స్వామివారిని గజవాహనంపై అమ్మవారిని సింహవాహనంపై చతుర్మద వీధులయందు ఊరేగిస్తారు. తొమ్మిదవ రోజు దేవరాత్రి…. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలోని శివకామిని సుందరి సమేత నటరాజస్వామికి ఆలయ ప్రాగణంలో వివాహన్ని జరుపుతారు. పదవ రోజు ఋషిరాత్రి పరమశివుని మేల్కొలపడానికి విచ్చేసిన ఋషులను తిరిగి వారి నివాసాలకు చేర్చే ఉత్సవాన్ని గిరి ప్రదక్షణ, కొడచుట్టు, ఋషిరాత్రి గాను పిలుస్తారు. అనంతరం రాత్రి స్వామి వారు అశ్వవాహనంపై, అమ్మవారు సింహవాహనం పై నాలుగు వీధులయందు విహరిస్తారు. పదకుండవ రోజు దేవరాత్రి. మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలలో రెండవ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. దీంతో 11వ రోజును దేవరాత్రిగా పిలుస్తారు. ఆదివారం కే డిగం మీద రాత్రి సింహ-కామధేను వాహనాలపై స్వామి, అమ్మవార్లను ఊరేగింపు ఉంటుంది. పన్నేండవ రోజు పల్లకీ సేవ… పరమేశ్వరునితోపాటు పార్వతిదేవి, గంగాదేవిని వేడుకగా పురవీధులయందు పల్లకీలో ఊరేగిస్తారు. పదమూడవరోజు ఏకాంత సేవా బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగుస్తాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సావాలు జరిగే 12 రోజు ఏకాంత సేవను నిర్వహించరు. ఉత్స వాలు ముగిసిన తరువాత ఏకాంత సేవను నిర్వహి స్తారు.

E-పేపర్

దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీలకు భూగర్భ డ్రైనేజ్ సదుపాయం – అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీలకు భూగర్భ డ్రైనేజ్ సదుపాయం – అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ మరియు సాయి కాలనీలలో ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దత్తాత్రేయ కాలనీలో 30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, సాయి కాలనీలో 19.00 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీరు నిల్వ ఉండటం, రోడ్లపైకి రావడం, దుర్వాసన మరియు దోమల సమస్యలు పూర్తిగా తగ్గి కాలనీల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొననుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… “ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలే మా ప్రాధాన్యం. డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ప్రతి కాలనీకి సమానంగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే వేగంతో పనులు కొనసాగిస్తాం” అని తెలిపారు. కాలనీ వాసులు మాట్లాడుతూ… “మా సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపిన కార్పొరేటర్ కి మా కృతజ్ఞతలు. దత్తాత్రేయ కాలనీ, సాయి కాలనీల్లో డ్రైనేజ్ సదుపాయం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు మేమంతా ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అయ్యా కాలనిలా సంక్షేమ సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, బీజేపీ నాయకులు బొడ్డుపల్లి జనార్దన్,ఇట్టబోయిన నర్సింహా,శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, బాలు, అరుణ్, ప్రేమ్, అఖిల్,భరత్,మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..

E-పేపర్

ఇబ్రహీంపట్నం శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ రూపురేఖలు మారుస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అమ్మవారి భక్తులకు నీటి వసతి కోసం బోర్ వేయిస్తాను, ఇక పై భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తాం ఎమ్మెల్యేమల్ రెడ్డి రంగారెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరికరణ పనులను పరిశీలించారు. కట్టమైసమ్మ* ఆలయం చుట్టూ రూపురేఖలు మారుస్తాం… అమ్మవారి భక్తులకు నీటి వసతి మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలను కలిపిస్తాం” అని ఆయన తెలిపారు. చెరువు పరిసరాల సుందరికరణ ఆలయం చుట్టూ అందమైన రూపురేఖలు భక్తులకు అన్ని వసతులు అందించనున్నట్టు ఆయన తెలిపారు చెరువు చుట్టూ చక్కట్టి ఆహ్లాదకరమైనా వాతావరణం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో షర్మిలారెడ్డి పర్యటన – ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రకు ఊపిరి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల హక్కుగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి మార్పులు చేసిందని, దీనిపై కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రజాస్వామ్యకవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు మహిళలు, యువత పాల్గొనాలని డిసిసి అధ్యక్షుడు నారపు రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

E-పేపర్

మరో అవినీతి పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు

పున్నమి ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 మరో అవినీతి పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు…. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు… ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్.. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు… బాధితులనుండి యాభైవేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. విధి నిర్వహణలో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న ఎస్సైకి ఏసీబీ రూపంలో గట్టిగానే షాక్ తగిలింది..

E-పేపర్

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 10 ఫిబ్రవరి 2026 *ఇబ్రహీంపట్నం ప్రజలకు వరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* *“నిధుల కొరత ఉండదు… వేగంగా పూర్తి చేయండి” అధికారులకు స్పష్టమైన ఆదేశాలు – రంగన్న* *“ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం… ఇబ్రహీంపట్నం అభివృద్ధి మా బాధ్యత” – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* ఎలక్షన్స్ ప్రచారం ముగిసినావెంటనే ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రూపురేకలు మారుస్తా అనీ ఇచ్చిన మాట కి కట్టుబడి మన పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ లో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రజల ఆరోగ్య భద్రతకు కీలకంగా మారనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వయంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం నాణ్యత, వసతులు, వార్డులు, అత్యవసర విభాగం, ప్రసూతి కేంద్రం, ల్యాబ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే, “ఇది సాధారణ భవనం కాదు… ఇబ్రహీంపట్నం ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆసుపత్రి” అని స్పష్టం చేశారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కఠినంగా ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పూర్తయితే ఇబ్రహీంపట్నం, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నగరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే రంగారెడ్డి తీసుకుంటున్న చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఆటో డ్రైవర్ల సంఘం ఆర్థిక సాయం

ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పునమీ ప్రతినిధి) మనుబోలు పట్టణంలో ఆటో డ్రైవర్ నాగరాజు (బుల్లయ్య) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరఫున రూ.12 వేల నగదు సహాయాన్ని సోమవారం రాత్రి అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, జడ శివకుమార్, ఖాదరవల్లి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన సంఘాన్ని స్థానికులు ప్రశంసించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర మహిళ అధ్యక్షులు క్రాకటూరు పుష్పాంజలి గడప గడప కార్యక్రమం నిర్వహించారు

ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం వెలగపాడు గ్రామo లో రాష్ట్ర మహిళ అధ్యక్షులు క్రాకటూరు పుష్పాంజలి గడపగడప కార్యక్రమం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ పార్టీ గురించి,రాబోవ్ ఎన్నికలు,వివరించారు ఈ కార్యక్రమంలో బీస్పీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు సిద్ధం కావాలి – గీస బిక్షపతి”

ఈరోజు 10.02.2026 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులకు కార్మిక సోదరులకు సోదరీమణులకు జిల్లాలో అన్ని రంగాలలో పనిచేసే కార్మిక సోదరులారా సిఐటియు అనుబంధ సంస్థ అయిన బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ప్రజానీకానికి అన్ని గ్రామాల కార్మికులకు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడి ఆటో డ్రైవర్స్ ఫేస్ కాంటాక్ట్ కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కరిస్తూ రైతులకు రైతన్న అనుబంధ వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకూ ఈనెల 12 ఫిబ్రవరి రోజున దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధం కావాలని ఈ సమ్మె ప్రజలందరూ మమేకమై పోరాడితేనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కార్మికుల 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకోవడం ఆ సాధించిన వెల్ఫేర్ బోర్డులు పోరాడి నియమించుకున్న 29 చట్టాలను ఇప్పుడున్న ప్రభుత్వం బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆ 29 చట్టాలను నాలుగు కోడ్ గా విభజించి కార్మికునికి సంఘం పెట్టుకునే విధానం లేకుండా యజమాని ఎలా చెప్తే అలాగే వినేలాగా ఎనిమిది గంటలు ఉన్న పని వేతనాన్ని 12 గంటలు గాని నియమించడం వెలుతురు బోర్డులో ఉన్న డబ్బును సిఎల్సిగా కార్మికుల రక్తం తీస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నియమించకపోవడం పారిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఆశా వర్కర్లకు సరైన బెనిఫిట్ లేకపోవడం అంగన్వాడి ఆయాలకు సరైన వేతనం లేకపోవడం మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఇవన్నీటిమీద రైతులకు స్మార్ట్ మీటర్ పేరుతో రీఛార్జి చేసుకుంటేనే కరెంట్ వచ్చే విధంగా ఆదానే అంబానీ ఎలా చెప్తే అలా చేయడం కరెంటు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత రీఛార్జి చేసుకుంటేనే రైతులకు కరెంటు ఉత్పత్తి రీఛార్జి చేసుకుంటేనే ఇంట్లో కరెంటు రావడం ఇలాంటి నియమ నిబంధనలు పెడుతూ ప్రజలకు రాబోయే రోజుల్లో అడిగే హక్కు లేకుండా చేయడం ఎన్నో ఇంకెన్ని ఎన్నో నిబంధన చేస్తూ ప్రజలకు కడుపు కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విన్నపించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్లింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా గీస బిక్షపతిగా పిలుపునివ్వడం జరుగుతుంది కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

E-పేపర్

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఫిబ్రవరి 10 , పున్నమి న్యూస్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సర్పంచులకు సోమవారం ప్రత్యేక అధికారి సుజాత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని, గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సర్పంచ్ లకు ప్రత్యేక అధికారి సుజాత తెలిపారు. సర్పంచులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన కుర్రవాని తండా గ్రామం ఆంబోతు చంటి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో సర్పంచ్ లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి 100% హాజరుకావాలని ఎంపీడీవో బాలశంకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా శిక్షణ కార్యక్రమానికి రావద్దని మహిళా సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను చేర్పించే విషయంలో నూతన సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామంలో తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారి రాందాస్ విజ్ఞప్తి చేశారు. ఉల్లాస్ పథకంపై కాసేపు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పై సర్పంచులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రామ పంచాయతీలలో తీర్మాన పుస్తకాలు ఎంతమంది సిద్ధం చేశారు అని అడగగా 50 శాతం మంది గ్రామపంచాయతీలో కూడా సిద్ధంగా లేవని తెలిసింది. బండలేమూరు అస్మాత్పూర్ సత్తి తండా గ్రామాలలో ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీ.ఈ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ మార్చి నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలో నగదు పుస్తకాన్ని మైంటైన్ చేయాలని మండల అభివృద్ధి అధికారి బాలశంకర్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లకి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయం ముఖ్యమని ఎంపీడీవో చెప్పారు. 15వ ఆర్థిక నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సర్పంచ్లకు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాసిల్దారు ఎం.వి.బి ప్రసాద్, సూపరిన్ టెన్ డెంట్ అబ్దుల్ అజీమ్, వ్యవసాయ అధికారి వెంకటేష్, మండల పంచాయతీ అధికారి ఉమారాణి, ఏ.ఈ మల్లారెడ్డి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.