Thursday, 5 March 2026

Blog

తిరుపతి

ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన అక్కుర్తి హై స్కూల్ విద్యార్థులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ముగ్గురు విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ కుమారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన సైన్స్ ప్రాజెక్టులలో ఎంపిక అవడం ఎంతో ఆనందదాయకమని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని మా విద్యార్థులు నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీ ప్రకాశం రాజును ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంపిక కావడం పాఠశాలకు గౌరవకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.

తిరుపతి

ఏర్పేడులో ఉత్సాహంగా జనసేన ‘ఉద్యమి’ నమోదు

ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 03, శిరకళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పేడు పట్టణంలో నిర్వహించిన “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, జనసైనికులు పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉత్సాహంగా కొనసాగించారు. ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ గుర్తింపు, కార్యక్రమాల్లో ప్రాధాన్యత, కమిటీల్లో బాధ్యతలు, నాయకత్వ శిక్షణతో పాటు నాయకులుగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని నాయకులు తెలిపారు. అదనంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు “ఉద్యమి” సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

గూడూరు

రాపూర్ ఘాట్‌ రోడ్డులో ప్రేమ జంట ఆత్మహత్య సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి విషాదాంతం

రాపూరు అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాపూరు – చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వగా, ముందుగా విషం తాగి తర్వాత ఉరివేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అన్నమయ్య

రాపూరు ఘాట్ రోడ్డులో ప్రేమ జంట ఆత్మహత్య

అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాపూరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. రాపూరు–చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి సమీపంలో ప్రేమికులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతులను ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24)గా పోలీసులు గుర్తించారు. -సోషల్ మీడియా పరిచయం.. విషాద ముగింపు: పోలీసుల కథనం మేరకు.. ప్రసన్న, సావిత్రిలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చు పెట్టిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరూ అటవీ ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. -విషం తాగి.. ఆపై ఉరివేసుకుని. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రేమికులు మొదట విషం తాగి, ఆపై చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో మృతదేహాలను గమనించిన పంగిలి గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. -కేసు నమోదు: సమాచారం అందుకున్న రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. వివాహిత అయిన సావిత్రి తన ఇద్దరు పిల్లలను వదిలి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్ల భూములను దానం చేసింది ఈ మహానుభావుడే.

ఖమ్మం వెలుగుమట్ల భూములను దానం చేసింది ఈ మహానుభావుడే..63.ఎకరాలు కోట్ల విలువైన భూమిని తృణపాయంగా శ్రీ ఆచార్య వినోబా భావే గారికి భూదాన్ (భూమి దానం ) క్రింద ఇచ్చిన మహనీయుడు శ్రీ కల్వల రాజా రామ్ రావు గారు.ఇప్పుడు ఆ భూములను గద్దల్లా తన్నుకు పోవాలని చూస్తున్న బడా బాబులు.

E-పేపర్

విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు పేరుకే ప్రజా పాలన ఎక్కడ చూసినా సమస్యలే పట్టించుకోని అధికారులు నిద్ర మత్తులో గ్రామ పెద్దలు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ : 03 మార్చ్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు గ్రామంలో సబ్స్టేషన్ ఉన్న విద్యుత్ సమస్యలు తప్పడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 సార్లు విద్యుత్ పోతుంది. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాల్సిన గ్రామం కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. విద్యుత్ అధికారుల స్పందించి కరెంటు కొరత లేకుండా చూడాలని గ్రామ ప్రజలు విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.

ఖమ్మం

రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది.

T.Ravinder పున్నమి న్యూస్ 3/3/2026 ఖమ్మం రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. మంగళవారం తొమ్మిది మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ తొమ్మిది మందిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉండటం విశేషం…* నితిన్ నబిన్ బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. 2026, ఫిబ్రవరి 18వ తేదీన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. *10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.* ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో *తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవులు ముగియనున్నాయి.* వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. *బీజేపీ అభ్యర్థులు వీరే…* 1. నితిన్ నబిన్ (బిహార్) 2. శివేష్ కుమార్ (బిహార్) 3. తేరష్ గోవాలా (అస్సాం) 4. జొగెన్ మోహన్ (అస్సాం) 5. లక్ష్మి వర్మ (ఛత్తీస్‌గఢ్) 6. సంజయ్ భాటియా (హరియాణా) 7. మన్మోహన్ సామేల్ (ఒడిశా) 8. సుజీత్ కుమార్ (ఒడిశా) 9. రాహుల్ సిన్హా (పశ్చిమ బెంగాల్)

ఖమ్మం

తెలంగాణ కాంగ్రెస్‍లో రాజ్యసభ టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ బాగా పెరిగింది

*తెలంగాణ కాంగ్రెస్‍లో రాజ్యసభ టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ బాగా పెరిగింది. నామినేషన్లకు ఆఖరి గడువు (మార్చి5) ముంచుకొస్తున్నా అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఇంకా కసరత్తు చేస్తోంది…!!!!* నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తుందని భావించినా అలా జరగలేదు. *నిన్న ఎయిర్ పోర్టులో రాహుల్‍తో జరిగిన భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ రాలేదని పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.* మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. ఈ విషయంలో మరోసారి చర్చిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు. *రేపు అభ్యర్థుల ప్రకటన…!* రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి వెళ్లపోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున అభ్యర్థులను ఖరారు చేద్దామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఖమ్మం

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు రూ.6 కోట్లు..!*

*డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాలకు రూ.6 కోట్లు..!* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.* *ఖమ్మంలో కొత్తది, మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతులకు అవసరమైన రూ.6 కోట్లకు పరిపాలనా అనుమతులు విడివిడిగా మంజూరు చేసింది.* *ఖమ్మంలోని ఎన్నెస్పీ క్వార్టర్స్‌ లైన్‌లో ఇప్పటికే ఉన్న క్యాంపు కార్యాలయం స్థలంలో కొత్తది నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.4.50 కోట్లకు అనుమతి వచ్చింది. అలాగే భట్టి సొంత నియోజకవర్గమైన మధిరలోని క్యాంపు కార్యాలయంలో మరమ్మతుల కోసం రూ.1.50కోట్ల నిధులకు కూడా పాలనా అనుమతినిచ్చారు*

తిరుపతి

పుట్టినరోజున ఆశ్రమంలో సేవా కార్యక్రమం మానవత చిట్వేలు శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

తిరుపతి జిల్లా, పెనగలూరు మండలం అత్తిగారిపల్లి గ్రామానికి చెందిన అనిమెల సుబ్బరాయుడు – కృష్ణవేణి దంపతుల కుమారుడు అనిమెల హన్సిత్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. చిట్వేలు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ నారాయణ తపోవన ఆశ్రమం లో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆశ్రమ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా అక్కడి వృద్ధులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. చిట్వేలు మానవతా సంస్థ సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యకర్త చంద్ర, ఆశ్రమ పెద్దలు, చిట్వేలు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.