Saturday, 7 March 2026

Blog

E-పేపర్

రెండవసారి వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్, చైర్మన్ ఎన్నిక హైకోర్టు స్పెషల్ జిపి అడ్వకేట్ జనరల్ ఉత్తర్వుల మేరకే పాలకవర్గం ఎన్నికలు రద్దు చేశామని తెలిపిన ఆర్డీవో అనంతరెడ్డి

*రెండవసారి వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్, చైర్మన్ ఎన్నిక* పున్నమి న్యూస్ ప్రతినిధి 17 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇంచార్జ్ : చైర్మన్ ఎన్నిక అయిపోయిన తర్వాతనే ఎన్నికల అధికారికి ఫోన్ కాల్ వచ్చిందంటున్న బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు…. హైకోర్టు స్పెషల్ జిపి అడ్వకేట్ జనరల్ ఉత్తర్వుల మేరకే పాలకవర్గం ఎన్నికలు రద్దు చేశామని తెలిపిన ఆర్డీవో అనంతరెడ్డి హైకోర్టు తీర్పు తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకే మరోసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక 19 వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి బంధువుల పిటిషన్ తోనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఆర్డర్ ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆకుల యాదగిరి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.తనని ఎవరు కిడ్నాప్ చేయలేదని,ఆరోగ్యం సహకరించకనే హాజరు కాలేదని తెలిపారు. తాము స్పష్టమైన మెజార్టీతో చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటాం అంటున్న కాంగ్రెస్ నేతలు తిరిగి మూడోసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక…. ఎప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందో వేచి చూడాలి….. అప్పటివరకు క్యాంపుల తిప్పలు తప్పవు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాగితాలపూరులో రైతు భూమి నష్టంపై జెసి వెంకటేశ్వర్లు పరిశీలన – నష్టపరిహారం కోరిన రైతు అర్జీపై స్పందన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామానికి చెందిన రైతు అడపాల గోపాల్ రెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన అర్జీపై మంగళవారం జెసి వెంకటేశ్వర్లు స్పందించారు. భూ సర్వే నంబర్ 186-1డి పరిధిలో గాడి కాలువ వద్ద 57 సెంట్ల భూమి నష్టపోయినట్లు రైతు ఫిర్యాదు చేశారు. నష్టపోయిన భూమికి బదులుగా మరో భూమి లేదా నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో జెసి గారు గాడి కాలువను పరిశీలించారు.

విశాఖపట్నం

వార్నింగ్ లెటర్స్ ఉపసంహరించుకోవాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 17, పున్నమి ప్రతినిధి. విశాఖ స్టీల్ కార్మికుల వార్నింగ్ లెటర్స్ ను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వార్నింగ్ లెటర్స్ ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్ తో మంగళవారం స్మృత్యాంజలి పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం అనైతికంగా స్టీల్ కార్మికుల జీతభత్యాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లింపులు కొనసాగించడం అత్యంత దుర్మార్గమని వారు అన్నారు. దీనిని కొనసాగించకూడదని రీజనల్ లేబర్ కమిషనర్, డిపిఈ చెప్పినప్పటికీ యాజమాన్యం ఆచరించలేదు. నేడు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో 25 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొన్నారు. ఆ సమ్మెకు మద్దతుగా ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమ్మెకు మద్దతు తెలియజేశారు. అటువంటి వారికి నేడు స్టీల్ యాజమాన్యం వార్నింగ్ లెటర్స్ ఇవ్వాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. నేడు యాజమాన్యం ఆర్ ఎల్ సి, డి పి ఈ వారి ఆదేశాలను పాటించకుండా వారు చెప్పారని నేడు వార్నింగ్ లెటర్స్ ఇవ్వడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఈ సమ్మె ను యాజమాన్యానికి నిర్ణీత కాలవ్యవధిలోనే తెలియజేశామని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. యాజమాన్యం తన మొండి వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డి ఆదినారాయణ, పి వి రమణమూర్తి, జె అయోధ్యరామ్, దొమ్మేటి అప్పారావు, దాసరి సురేష్ బాబు, యు రామస్వామి, జె రామకృష్ణ, ఎల్ వి రమణ, డొక్కా నర్సింగరావు, పి శ్రీనివాసరాజు, నగేష్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బెహరా ఆసుపత్రి నిర్లక్ష్యంతో పత్రిక పంపిణీదారుడి మృతి?

•చిన్న గాయానికి వెళ్లి శవంగా బయటకు వచ్చిన వెంకట్రావు •కేజీహెచ్‌లో ప్రత్యేక కమిటీతో పోస్టుమార్టం •డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ •డాక్టర్ల అరెస్టు వరకు పోరాటం ఆపమంటున్న కుటుంబ సభ్యులు విశాఖపట్నం,ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) కాలికి స్వల్ప గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్లిన స్థానిక పత్రికల పంపిణీదారుడు కె.వెంకట్రావు(65)ప్రాణాలు కోల్పోవడం నగరంలో కలకలం రేపింది.గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం,తప్పుడు చికిత్సే ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.ఘటనపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) మార్చూరీకి తరలించారు.వేపగుంట ప్రాంతానికి చెందిన వెంకట్రావు శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జారి పడిపోయి కాలికి గాయమైంది.కుటుంబ సభ్యులు వెంటనే గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రికి తరలించగా ఆర్థోపెడిక్ వైద్యుడు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని చెప్పినట్లు తెలిపారు.సోమవారం మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన తర్వాత గంట వ్యవధిలోనే మృతిచెందినట్లు ప్రకటించారని మృతుని కుమారుడు కె.శ్యామ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.“మత్తుమందు ఇచ్చామని,శరీరం సహకరించడం లేదని చెప్పారు.మరో గంటలో చనిపోయాడని ప్రకటించారు.ఆపరేషన్ ముందు అన్ని పరీక్షలు బాగున్నాయని చెప్పి చివరికి ప్రాణం తీసేశారు”అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వడమే మృతికి కారణమై ఉంటుందని,మత్తు ఇచ్చిన వైద్యుడు అర్హత కలిగిన అనస్థీషియా నిపుణుడా కాదా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు.మరణించిన వెంటనే సమాచారం ఇవ్వకుండా రెండు గంటలపాటు రహస్యంగా ఉంచారని,ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా“ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోండి…కేసు పెట్టుకోండి”అంటూ దురుసుగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.సంబంధిత డాక్టర్లు,యాజమాన్యంపై హత్యాయత్నం సహా క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఫిర్యాదు చేసినప్పటికీ తొలుత పోలీసుల నుంచి స్పందన రాలేదని,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ డా.శంక బ్రత బాగ్చి ప్రత్యేక వైద్యుల కమిటీతో పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు.ఫోరెన్సిక్,పాథాలజీ,అనస్థీషియా,ఆర్థోపెడిక్ శాఖల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి పోస్టుమార్టం చేపట్టారు.అలాగే జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ను కలిసిన బాధితులు ఆసుపత్రిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరగా సంబంధిత అధికారులకు తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.చిన్న గాయానికి చికిత్స కోసం వెళ్లిన ఓ సాధారణ పత్రిక పంపిణీదారుడు ప్రాణాలు కోల్పోవడం నగర వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే అసలు నిజాలు బయటపడనున్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ – 5,251 మంది పిల్లలకు మందుల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలో మొత్తం బాలికలు 5452 మంది ఉండగా, ఈరోజు 5,251 మంది పిల్లలకు నులిపురుగుల మందులను మింగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిహెచ్ఓ రాజయ్య ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ మోహసిన్ సుల్తానా, గేయ పూజితాలు సమన్వయంతో నిర్వహించారు. వైద్యులు మాట్లాడుతూ చిన్న పిల్లలకు సంవత్సరానికి ఒకసారి నులిపురుగుల మందులు తప్పనిసరిగా మింగించాలని సూచించారు.

విశాఖపట్నం

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము -స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖపట్నం ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’లో పాల్గొనేందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. నగర విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, నౌకాదళ ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షించనున్నారు. విశాఖ తీరంలో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకు దేశ విదేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా రిజిస్ట్రార్‌గా ఎం. రవి జోసెఫ్ బాధ్యతల స్వీకారం

నెల్లూరు, ఫిబ్రవరి 17 (పున్నమి ప్రతినిధి): జిల్లా రిజిస్ట్రార్‌గ రవి జోసెఫ్ బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రేషన్ శాఖలో అనుభవం కలిగిన ఆయన, భూ లావాదేవీలు మరియు పత్రాల నమోదులో పారదర్శకత, వేగం పెంపుపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కార్యాలయ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. సిబ్బంది సమన్వయంతో ప్రజాభిమానాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేయర్ ఎన్నికల వేళ నెల్లూరులో రాజకీయ ఉత్కంఠ… జగన్ రాకపై చర్చలు

నెల్లూరు నగరంలో ఈ నెల 26వ తేదీన రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక వివాహ కార్యక్రమం కోసం నగరానికి రానున్నప్పటికీ, అదే రోజున మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల మేయర్ పొట్లూరు స్రవంతి తన పదవికి రాజీనామా చేయడంతో మేయర్ స్థానం ఖాళీ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగే ఎన్నికలపై అన్ని వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. జగన్ రాకతో స్థానిక రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామ ప్రజలతో నేరుగా విద్యుత్ సమస్యలపై చర్చించిన అధికారులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మంగళవారం కరంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈఈ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి, గ్రామంలోని 11 కెవి మరియు ఎల్‌టీ లైన్ల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి కరెంటు సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.