Wednesday, 6 May 2026

Blog

తెలంగాణ

క్రీడలు విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే, సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకొనడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు.

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలం I పంగిడి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో “మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలం I పంగిడి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో “మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 3.0” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చడించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ….విద్య అనేది కేవలం పరీక్షల పరిమితి కాదని, విలువలు, శిస్థాచారం, సమాజం పట్ల బాధ్యతను నేర్పేది కూడా విద్యేనని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల కలలు సాకారం చేయాలంటే ఆ పిల్లల ప్రతిభను నిరంతరం గమనిస్తూ స్ఫూర్తినివ్వాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా చిన్నచిన్న లోపాలను గుర్తించి, వెంటనే దిద్దితేనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించగలరని చెప్పారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే వాతావరణం ఏర్పడాలని వివరించారు. వ్యక్తిత్వ వికాసం, మానసిక బలం, నైతిక విలువలు పెరుగడానికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి పిల్లలకు సహకరించాలని సూచించారు. విద్యార్థుల అబిలిటీలను, ఆసక్తులను గుర్తించి, వారితో సన్నిహిత అనుసంధానం కొరకు ఈ మెగా పీటీఎం 3.0 కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. END

తెలంగాణ

డిసెంబర్ 6న దేవరకొండకు రానున్న : సీఎం

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈరోజు ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

విశాఖపట్నం

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆకాంక్షించారు. విశాఖ రైల్వే స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్స్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు వినయం, విధేయత, సంస్కారం, మానవతా విలువలను కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విధ్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసు కురావాలన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల్లో రాణించడం వల్ల విద్య ఉద్యోగాల్లో వారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుందన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశలో విద్యార్థులు క్రమశిక్షణ తో ఉజ్వల భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ వై. మీనాక్షి అలాగే బి.రామారావు, ఏబి మాణిక్యం, ఎం ఆర్ వి నర్సమ్మ, టి పద్మజ, పి సుధా, ఎస్ ఆర్ తులసి, ఏఎస్ రాజా, ఎన్ పవన్ కుమార్ కె.సాయి విమల కుమారి, ఎస్ కే మదీనా, బి.శివ ప్రసాద్, ఈ.మేరీ సుశీల , జి.ఆనంద్, సిహెచ్ ఝాన్సీ, కె .రామారావు ,ఆర్ ఏ ప్రసన్న, టి.జయ, ఏ.మణి, డి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్నేహ MACS భారీ ఆర్థిక మోసాన్ని విశాఖపట్నం సిటీ పోలీసులు చేదించారు; ప్రధాన నిందితుల అరెస్ట్

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* *స్నేహ MACS భారీ ఆర్థిక మోసాన్ని విశాఖపట్నం సిటీ పోలీసులు చేదించారు; ప్రధాన నిందితుల అరెస్ట్, ఆస్తుల జాబితా సిద్ధం* మోసం మరియు FIRల సంక్షిప్త చరిత్ర: విశాఖపట్నం సిటీ పోలీసులు “స్నేహా MACS” (Sneha Mutually Aided Co-operative Society Ltd.) మరియు దానికి సంబంధించిన బినామీ సంస్థల పేరిట నిర్వహించబడిన భారీ ఆర్థిక మోసాన్ని వెలికితీశారు. యాజమాన్యం అధిక వడ్డీ ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి, ఆ మొత్తాలను వ్యక్తిగత ప్రయోజనాలకు మరియు బినామీ కంపెనీలకు మళ్లించి, విశాఖపట్నం మరియు ఇతర జిల్లాల్లో విస్తారంగా స్థిరాస్థులు కొనుగోలు చేసింది. ప్రధాన బాధితులు SC/ST సమాజ సభ్యులు మరియు ఇతర మధ్యతరగతి డిపాజిటర్లు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాలు మరియు “Pay Back to Society” నినాదం నమ్మి తమ జీవన పొదుపులను పెట్టుబడి చేసినారు. డిపాజిటర్ల నుండి వచ్చిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా, స్నేహా MACS యాజమాన్యం మరియు సంబంధిత సంస్థలపై విశాఖపట్నం నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అనేక FIRలు నమోదు చేయబడ్డాయి: 1. Cr. No. 166/2025 – దువ్వాడ PS, నమోదు: 22.04.2025 2. Cr. No. 85/2025 – ద్వారకా PS, నమోదు: 01.05.2025 3. Cr. No. 215/2025 – గోపాలపట్నం PS, నమోదు: 07.08.2025 4. Cr. No. 222/2025 – II Town PS, నమోదు: 18.12.2025 మోసం విధానం (Modus Operandi) A.P. MACS Act, 1995 సెక్షన్ 29 ప్రకారం నిర్వహించిన దర్యాప్తు మరియు పోలీస్ చట్టపరమైన విచారణలో వెల్లడైన ముఖ్యాంశాలు: • “SC/ST Sneha MACS” (Regd. No. AMC/VSP/DCO/2008/2446) పేరుతో 2008లో రాజేంద్రనగర్, సీతమ్మపేట, విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన ఈ సోసైటీ పేరు 2014లో అసలు SC/ST సభ్యులకు తెలియజేయకుండా “Sneha MACS” గా మార్చబడింది. • అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ, అధిక వడ్డీ వాగ్దానాలు చేసి, ముఖ్యంగా SC సభ్యులను ఏజెంట్లు మరియు సిబ్బంది ద్వారా పెట్టుబడులకు ప్రోత్సహించారు. • కానీ, ఆ డిపాజిట్లను సహకార ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు, బినామీ పెట్టుబడులు, మరియు అక్రమ ఆస్తుల కొనుగోలుకు మళ్లించారు. విచారణ నివేదిక ప్రకారం: • Sneha MACS కి మొత్తం 2,504 మంది డిపాజిటర్లు ఉన్నారు. • చెల్లించవలసిన మొత్తం డిపాజిట్లు: ₹55.10 కోట్లు • అక్రమ రుణాలు, నిబంధనలకు వ్యతిరేకంగా నిధులను మళ్లించడం కారణంగా విశాఖపట్నం MACS ఖాతాల నుండి హైదరాబాద్, పన్నూరు MACSలకు మరియు అనేక బినామీ సంస్థలకు సుమారు ₹56.10 కోట్లు మళ్లించబడినట్లు బయటపడింది. ప్రధాన నిందితులు ఈ కేసుల్లో ముఖ్య నిందితులు: • వ్యవస్థాపక అధ్యక్షుడు : కటికల శివ భాగ్యరావు • అధ్యక్షరాలు (President) : కె. స్వర్ణలత • వారి కుమారులు : కె. శ్రీకాంత్, కె. క్రాంతి కుమార్ • డైరెక్టర్లు మరియు CEO : ఏ. పున్నారావు • బినామీ సంస్థలు : ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్, యునైటెడ్ పబ్లికేషన్స్, స్నేహ ప్రియా ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిని ఎస్. ధనుంజయ శరత్, గుమ్మడి మనోరంజన్ ఇతర బినామి లు నిర్వహించారు. లుక్ అవుట్ నోటీసులకు పంపిన ప్రతిపాదనలు : కె. స్వర్ణలత కే. శ్రీకాంత్ 3. అల్లాడి పున్నారావు 4. గుమ్మడి మనోరంజన్ 5. కె. క్రాంతి కుమార్ వివిధ కేసుల్లో అరెస్టులు : • Cr. No. 166/2025 (దువ్వాడ PS): మతూరి శ్రీనివాసరావు, గుమ్మడి మనోరంజన్, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతా మహాలక్ష్మి, లిఖితపూడి విశ్వేశ్వరరావు, పి. శ్రీహరి రాజు, గుంటక రంగారావు, జంపరంగి ధనలక్ష్మి, సజ్జా ధనుంజయ శరత్ తదితరులు అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు. • Cr. No. 215/2025 (గోపాలపట్నం PS): సజ్జా ధనుంజయ శరత్ అరెస్టై రిమాండ్‌కు వెళ్లారు. Cr. No. 85/2025 (ద్వారకా PS): మదిరి విజయ్‌కుమార్ (Sneha TV, Sneha Spoorthy Chits), కటికల శ్రీకాంత్, కటికల క్రాంతి కుమార్ అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు. Cr. No. 222/2025 (II Town PS): ప్రధాన నిందితుడు కటికల శివ భాగ్యరావు 04-12-2025న అరెస్టై కోర్టులో హాజరుచేయబడి రిమాండ్ అయ్యారు. బినామీ ఆస్తుల గుర్తింపు : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరియు తహసీల్దార్లకు పంపిన రిక్విజిషన్ల మేరకు సర్టిఫైడ్ కాపీలు సేకరించి, భూములను సర్వే చేసి, జియోట్యాగ్ చేసి, మళ్లించిన డిపాజిటర్ల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు గుర్తించబడ్డాయి: వెంకన్నపాలెం / రాయపురాజుపేట వద్ద కుటుంబ సభ్యులు మరియు ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్ బినామి పేర్లలో సుమారు 21.12 ఎకరాలు (డాక్యుమెంట్ నంబర్లు: 3075/2011, 5727/2011, 9625/2012, 9655/2012, 3789/2014, 3926/2014 మొదలైనవి). ఎలమంచిలిలో దుప్పిటూరు గ్రామంలో 0.47 ఎకరాలు, దబ్బందలో 1.50 ఎకరాలు – Sneha Priya Financial Services పేర్లలో. శీలనగర్ STBL దగ్గర 2450 చ.గజాలు — యునైటెడ్ పబ్లికేషన్స్ పేరిట. చిన్నవాల్తేర్‌లో అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2125 చ.అడుగుల ఫ్లాట్ – ₹96,00,000కు గుమ్మడి మనోరంజన్ పేరిట. మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 350 చ.గజాలు – Sneha Priya Financial Services పేరుతో. ఇవి అన్నీ మోసపూరితంగా మళ్లించిన ప్రజా డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులే. ప్రస్తుతం కేసు స్థితి : • A.P. MACS Act సెక్షన్ 29 ప్రకారము కోర్టు విచారణ పూర్తయి, వ్యవస్థాపకులు, అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బినామీ సంస్థలపై క్రిమినల్ చర్యలు, అలాగే ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం సిఫార్సు చేయబడింది. • పోలీసు వివిధ కేసుల్లో కీలక నిందితులను అరెస్టు చేసి, PT వారెంట్లు అమలు చేసి సంబంధిత కేసులకు కనెక్ట్ చేస్తున్నారు. • గుర్తించిన ఆస్తులపై మరిన్ని లావాదేవీలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్లకు హోల్డ్ పెట్టమని రిక్విజిషన్లు పంపబడ్డాయి. • మళ్లించిన నిధుల రికవరీ కోసం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి; ఇంకా గుర్తించాల్సిన బాధితులు మరియు బినామీ ఆస్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

విశాఖపట్నం

వ‌న్డే మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-* *పండుగ వాతావరణం లో ఇండియా-సౌతాఫ్రికా వ‌న్డే మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి : ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్* వైజాగ్ స్టేడియంలో ధ‌ర్డ్ వ‌న్డే మ్య‌చ్ ఏర్పాట్ల ను పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వైజాగ్ : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జ‌ర‌గ‌బోయే మూడో వ‌న్డే కు అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో పూర్తి చేయ‌టం జ‌రిగింద‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ అన్నారు. శ‌నివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లును ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా స‌తీష్‌, వైస్ ప్రెసిడెంట్ , ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ బండారు న‌ర‌సింహారావు, కోశాధికారి దండ‌మూడి శ్రీనివాసరావు, ఏసీఏ కౌన్సిలర్ విష్ణు దంతు, ఏసీఏ స్టేడియం చైర్మ‌న్ ప్ర‌శాంత్, , ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రే, ఏసీఏ సి.ఎ.వో జై కిష‌న్ ల‌తో శుక్ర‌వారం సాయంత్రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప‌రిశీలించారు. స్టేడియం మొత్తం తిరిగి ఏర్పాట్లు ను స్వ‌యంగా స‌మీక్షించారు. పోలీస్ అధికారుల‌తో మాట్లాడి భ‌ద్ర‌త ప‌రంగా తీసుకుంటున్న జాగ్ర‌త్తలు తెలుసుకోవ‌టంతో పాటు త‌గు సూచ‌నలు, స‌ల‌హాలు అందించారు. స్టేడియం లోపల, వెలుపల ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రేక్షకులకు అవసరమైన తాగునీరు, శౌచాలయాలు, వైద్య సౌకర్యాలతోపాటు అగ్నిమాపక భద్రత వంటి కనీస వసతులు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, ప్రముఖుల రాకపోకలు, వారి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మ్యాచ్ నిర్వహణలో పాల్గొనే ఏసీఏ సిబ్బంది, ఇతర ఏజెన్సీలు , పోలీసు యంత్రాంగం మధ్య పూర్తి సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత విశాఖపట్నంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్‌ను విజయవంతంగా, ఒక పండ‌గ వాతావ‌రంణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. . ఈ సమగ్ర ఏర్పాట్లు మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే వేలాది మంది క్రీడాభిమానులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తాయని స్ప‌ష్టం చేశారు.

విశాఖపట్నం

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ*

*బామిని డిసెంబర్ 5(విశాఖ పున్నమి ప్రతినిధి)* *మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ* *భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రగతి నివేదికను సమర్పించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…* ⦁ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి… దీనికి అందరూ సహకరించాలి. ⦁ విద్యార్థులు అద్భుతంగా మీటింగ్ నిర్వహించారు. ⦁ మూడేళ్లల్లో ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ⦁ భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జీ అద్భుతంగా ఉంది.. త్వరలో వాళ్ల నుంచే నేను నేర్చుకునే రోజు వస్తుంది ⦁ పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు ⦁ విద్యలో పిల్లల బలాబలాలు తెలుకునేందుకు… దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరించారు. ⦁ క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. ⦁ నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది… పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు ⦁ పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా… ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది. ⦁ పిల్లలు మట్టిలో మాణిక్యాలు… సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు ⦁ కరుణకుమారి… అంధ విద్యార్థి… ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించింది ⦁ పల్నాడు మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు… అలాగే ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ⦁ ఒకప్పుడు పిల్లలు భారం… కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్ ⦁ మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం ⦁ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం ⦁ స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం ⦁ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాలను… విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు ⦁ తల్లితండ్రి కష్టపడతారు… గురువులు విద్య బోధిస్తారు… కానీ ఇవాళ్టీ రోజుల్లో విలువలు తగ్గిపోతున్నాయి ⦁ విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని.. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం ⦁ గతంలో విద్యార్థులకు చాలా యాప్ లు ఉండేవి… ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం ⦁ శనివారం నో బ్యాగ్ డే… ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు ⦁ 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు ⦁ చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ⦁ షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం ⦁ విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్ అప్రోచ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు ⦁ ప్రపంచంలో లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నారు… విదేశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు ⦁ టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే ⦁ ప్రభుత్వ టీచర్లను నియమించాం… చక్కటి చదువును చెప్పిస్తున్నాం ⦁ మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ⦁ కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం ⦁ ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం ⦁ గతంలో టీచర్లను అవమానించారు… మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు ⦁ టీచర్లను గౌరవించే బాధ్యత మాది… పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే టీచర్లది ⦁ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ⦁ కానీ ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. ⦁ ఇంతటి స్టాఫ్ ను ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చాం… ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి ⦁ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది… మేం సరి చేస్తున్నాం.• విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం… పిల్లలు అదరగొట్టారు. • *స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నాం.* • *పారిశ్రామికవేత్తలను ఇన్నోవేటర్స్ సదస్సుకు ఆహ్వానిస్తాను… పిల్లల ఆలోచనలు బాగుంటే ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తాం* • *ఉన్నత, విదేశీ విద్య కోసం కలలకు రెక్కలు పేరిట పథకం ప్రారంభిస్తున్నాం* • *పావలా వడ్డీతో విదేశీ విద్యకు రుణాలిప్పిస్తాం* • *విద్యార్థుల కలలు, కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు* • ప్రభుత్వ పాఠశాలల్లోనూ సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలి • పార్వతిపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలి • పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం… దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. • మంత్రి లోకేష్ విషయమై నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్ టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. • కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్ ఇప్పించాం.. ఆ తర్వాత చక్కగా చదువుకున్నారు…ఇప్పుడు మంత్రి అయ్యారు • రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు • విద్యా శాఖ చాలా కష్టంగా ఉందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా చేస్తానని లోకేష్ చెప్పారు. • లోకేష్ తల్లి భువనేశ్వరి స్టాన్ ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు… విద్యార్థులను ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకేష్ దే. • ఏడో తరగతి నుంచి వినూత్నంగా ఆలోచించాలి • గ్రూప్ గా… వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ఆలోచన చేయాలి • ఆడవారిని హింసించినా.. వేధించినా ఆడబిడ్డలకు భద్రత.. భరోసా కల్పించే బాధ్యత మాది • డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది. • తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏర్పాటు చేస్తాం. వంశధార-పోలవరంను అనుసంధానించి నీటి ఎద్దడి లేకుండా చూస్తాం • కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్

విశాఖపట్నం

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న – రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌ పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పంచుకుంటారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారం వారి తల్లిదండ్రులకు సత్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. స‌మావేశం అనంత‌రం పూర్వ విద్యార్థుల సంఘంచే నిర్మింపబడిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య హాస్టక్ బ్లాక్‌ను ఆసక్తి గల సభ్యులు సందర్శిస్తారు. ఈ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని రూ 4.5 కోట్ల వ్య‌యంతో పూర్వ‌విద్యార్థుల సంఘం స‌భ్యులు స్వ‌యంగా నిర్మించి వ‌ర్సిటీకి బ‌హూక‌రించ‌డం జ‌రిగింది. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న పూర్వ‌విద్యార్థులంతా అందించిన విరాళాల‌తో ఈ హాస్ట‌ల్ భ‌వ‌న స‌ముదాయం నిర్మాణం జ‌రిపాము. విశాఖ న‌గ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఉన్న పూర్వ‌విద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జ‌రిగే పూర్వ విద్యార్థుల స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని పూర్వ‌విద్యార్థుల సంఘం త‌ర‌పున సాద‌రంగా ఆహ్వానిస్తున్నాము. శ‌తాబ్ధి వేడుక‌లు జ‌రుపుకుంటున్న త‌రుణంగా ఈ స‌మావేశం ఒక మ‌ధుర అనుభూతిగా నిల‌వాల‌ని ఆకాంక్షిస్తున్నాము. కార్య‌క్ర‌మంలో సంఘం కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్క‌ర రావు, ఉపాధ్య‌క్షులు ఎం.జి మాధ‌వ బాబు, సీనియ‌ర్ స‌భ్యులు వి.ఆర్ రావు, ర‌విశంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విద్య వ్యవస్థలో మార్పుకు అనుగుణంగా సూచనలు ఇవ్వండి.

విద్య వ్యవస్థలో మార్పుకు అనుగుణంగా సూచనలు ఇవ్వండి. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు . *విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి:- * విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 8వ జోన్ పెందుర్తి పరిధిలో సమగ్ర శిక్ష జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ చేపట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల బృహత్ సమావేశం నిర్వహించాలని ఆదేశాల మేరకు పెందుర్తి పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులే కాకుండా ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, దాతలు పాల్గొని పాఠశాల అభివృద్ధితో పాటు పిల్లల భవిష్యత్తు కార్య చరణ పై చర్చించడం జరిగిందని మేయర్ తెలిపారు. పాఠశాలలో రాజకీయాలు ఉండకూడదని పాఠశాల ఉన్నతకి ప్రతి ఒక్కరు కృషితో, విద్యా వ్యవస్థలో మార్పుకు అవసరమయ్యే తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూస్ మొదలైన వాటి తో పాటు తల్లికి వందనం పథకాలను కూడా ప్రతి ఏటా  అందిస్తున్నారని తెలిపారు.  అనంతరం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఎటువంటి రాజకీయాలు తావులేకుండా మంచి విద్యా బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు.  పిల్లలను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంతోమంది మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్య నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పాఠశాల కమిటీ సూచనలు పాటించి పిల్లలకు బంగారు బాట వేయాలన్నారు. పాఠశాలలో పిల్లలకు అవసరమయ్యే మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని శాసనసభ్యులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, పూర్వపు విద్యార్థులు, పలువురు దాతలు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా*

*మోడల్ స్కూల్ గా కేజీబీవీ* *పి.టి.ఎం.లో గంటా* *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్కూల్ ఆవరణలో శుక్రవారం జరిగిన పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో ఏం కావాలనేది స్కూల్ దశలో నిర్ణయించుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువులు, స్కూల్, ఊరు, జిల్లా, రాష్ట్రం గర్వపడేలా ఉన్నత స్థానానికి చేరుకుని, మంచి పేరు తెచ్చుకోవాలని హితబోధ చేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూరుస్తున్న ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ను గంటా అభినందించారు. కేజీబీవీ విద్యార్థిని మాట్లాడుతూ తాను బాగా చదువుకుని ఐ.ఎ.ఎస్. అవుతానన్నారు. అంతకు ముందు స్కూల్ ప్రాంగణంలో బుద్ధుడు, మదర్ థెరిస్సా విగ్రహాలను ఆవిష్కరించారు. స్కూల్ లో అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగమణి, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గాడు వెంకటప్పడు, కురుమిన లీలావతి, పాండ్రంగి అప్పలరాజు, గండ్రెడ్డి సోమినాయుడు, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, మహంతి శివాజీ, అంగటి రాము తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.