Wednesday, 6 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజనుల సంక్షేమo కోసం ….వారి బ్రతుకులో మార్పు కోసం చలో కలెక్టరేట్…..సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి

మర్రిపాడు:డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)” అనంతసాగరం మండల కేంద్రంలో ఉండే గిరిజనులకు ST కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సహాయ సహకారాలు అందించి వారి జీవితాలు బాగుచేయాలని కోరుతూ సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యం లో ఛలో కలెక్టరేట్ కు తరలిన గిరిజనులు….ST కార్పొరేషన్ ద్వారా తమకు సహాయం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది….*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కంప సముద్రం ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన దాత

మర్రిపాడు: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాడు మండలం కంపసముద్రం ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన ధాత గోపవరం కాంతారెడ్డి ఒక కంప్యూటర్ మరియు ప్రింటర్ ను బహూకరించారు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు పాఠశాల అవసరాలను గుర్తించి సహాయ సహకారాలను అందజేయడం అభినందనీయమని అన్నారు.అనంతరం పాఠశాల సిబ్బంది ధాతను ఘనంగా సత్కరించి పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

-జెండా ఊపి ప్రారంభించిన నాయకులు, ప్రజాప్రతినిధులు

అనుకూలమైన వారికి అందించేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి –నియోజకవర్గాల సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిది) రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి తమ అనుకూలమైన వారికి పీపీపీ విధానంలో కట్టబెట్టి ప్రజలను దగా చేసేందుకు సిద్దమవుతున్నారని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి దానిని అడ్డుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య. కూనం సుధాకర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర బాధ్యుడు పూనూరు రామ్మనోహర్ రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర విభాగ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ రెడ్డి, మండలాల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, పులగం శంకర్ రెడ్డిలతో కలసి బుధవారం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పేర్నాటి కోటేశ్వర రావు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ప్రజల సహకారంతోనే నియోజకవర్గంలో 60వేలకుపైగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేసేలా కూటమి పాలనలో ప్రైవేటీకరణ జీఓను ప్రవేశపెట్టడం దారుణమన్నారు. గత వైఎస్సార్ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు విద్యతోనే యువత అభివృద్ధి సాధ్యం అన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి అందులో ఏడు కళాశాలలను పూర్తి చేశారన్నారు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పనంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు పూనుకోవడం ప్రజలను దగా చేయడమేనన్నారు. జగనన్న పాలనలో రెండేళ్ల కరోనా సమయంలో వైద్యసేవలు ఇంటింటికి అందించారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇవన్నీ సాధ్యమయ్యాయని, కూటమి పాలనలో ఆ వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. పీహెచ్ సీలకు ఇద్దరు డాక్టర్ల ఏర్పాటు, జగనన్న ఆలోచనల మేరకు జరిగిందన్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రవేటీకరణ ఆలోచనను మానుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన ప్రతులను 15వ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చనున్నట్లు ఆ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలసి సంతకాల సేకరణ ప్రతులను నెల్లూరు పార్టీ కార్యాలయానికి తరలించే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతులను తీసుకెళ్లే ప్రత్యేక వాహనం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా సాగారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో ‘పేక్స్ ఇండియా’ నీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

శ్రీసిటీ, డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PETI) ఏర్పాటు చేసిన అత్యాధునిక NABL నీటి/మురుగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీసిటీని ‘క్లీన్ అండ్ గ్రీన్’ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేసే యత్నంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ల్యాబ్ పరిశ్రమలకు వేగవంతమైన, ఖచ్చితమైన మరియు విశ్వసనీయ టెస్టింగ్ సేవలను అందిస్తుందని చెప్పారు. పేక్స్ ఇండియా ఎండీ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ సదుపాయం ‘మేక్ ఇన్ ఇండియా’ భావనకు అనుగుణంగా అత్యాధునిక యూరోపియన్ ప్రమాణాలతో పనిచేస్తుందని తెలిపారు. 30కి పైగా పరామితుల్లో నీటి, మురుగునీటి టెస్టింగ్ అందుబాటులో ఉందని, బయోమెథేన్ పొటెన్షియల్ (BMP) టెస్టింగ్ ద్వారా పరిశ్రమలు బయోగ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. 2016లో ₹30 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో యూనిట్‌ను స్థాపించిన పేక్స్ ఇండియా, ఇప్పుడు టెస్టింగ్ సేవలను కూడా అందించనుంది.

జోగులాంబ గద్వాల

ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు : కలెక్టర్*

*ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు : కలెక్టర్* గద్వాల్ డిసెంబర్ 10 (పున్నమి ప్రతినిధి) తెలంగాలో *ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. యం. సంతోష్ సూచించారు*. *1) ఓటర్ కార్డు* *2) ఆధార్ కార్డు* *3) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు* *4) ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/ బ్యాంక్ పాస్ బుక్* *5) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు* *6) డ్రైవింగ్ లైసెన్స్* *7) పాన్ కార్డ్* *8) ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు* *9) ఇండియన్ పాస్పోర్ట్* *10) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్* *11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు* *12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు* *13) దివ్యాంగుల గుర్తింపు కార్డు* *14) పట్టాదార్ పాస్ పుస్తకం* *15) రేషన్ కార్డు* *16) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం* *17) ఫ్రీడం ఫైటర్ ఐ.డీ కార్డ్* *18) ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్.పీ.ఆర్ స్మార్ట్ కార్డు. పై వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ సంతోష్ కోరారు

ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చార్జీలు పెంచబోము:: సీఎం చంద్రబాబు

ఈ సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు అందరూ సోలార్ వైపు అడుగు వేయాలని సోలార్ విద్యుత్తును వాడుకోవాలని తద్వారా మిగిలిన కరెంటును విక్రయించి విద్యుత్ని ఆదా చేయాలని ఆయన తెలిపారు పక్క రాష్ట్రాలతో బార్డర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో రేపు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికలు మొదటి విడుత ఓటింగ్ ప్రారంభం

కామారెడ్డి, 10 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎలక్షన్ రేపు జరగబోతున్నది.ఈ ఎన్నిక లలో విశాల స్థాయిలో అధికారులు వరుసగా తమ స్థలాలకు చేరుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకు న్నారు.ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపం లో వ్యక్తం చేసే ఈ వేడుక కోసం అందరికీ అవగా హన తీసుకొస్తున్నారు. స్థానిక సంస్థల పటిష్టమైన పాలన కోసం సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల్లో ప్రజలు చురుకుగా పాల్గొనడం అవసరం.అంశా లపై పోటీ పడుతున్న అభ్యర్థులు కలెక్టర్ ఆదేశా లు సూచనల మేరకు వివిధ నియమపాలనలను కర్తవ్యం మార్గదర్శకత్వంలో జాగ్రత్తగా కొనసాగిస్తు న్నారు. రేపటి వైపు ఒక్కో గ్రామం వేడుక వాతావ రణమే నెలకొననుంది.ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల స్థానిక స్వ శాసన వ్యవస్థను మరింత బలో పేతం చేసే దిశగా కీలకం అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. అందుకే ప్రతి ఓటర్ తన హక్కు సద్వినియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టా ల్సిన అవసరం ఉంది.ఈ మేరకు మన కమ్యూని టీ, సోషల్ మీడియా, బ్రాడ్‌కాస్ట్ వేదికల ద్వారా ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తున్నది. ఎన్నికల్లో పాల్గొని విజయవంతం కావాలనే ప్రతీ అభ్యర్థి,ప్రతి ఓటర్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.

జగిత్యాల

వార్డ్ అభ్యర్థి – ఐదు కోట్ల పనులకు హామీ 12వ వార్డులో కోటి రూపాయల పనులకు భరోసా బుగ్గారంలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయాలు

బుగ్గారం / జగిత్యాల జిల్లా : ( డిసెంబర్ 10, పున్నమి ప్రతినిధి) : ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని 12 వ వార్డ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఐదేండ్లలో గ్రామానికి ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నారు. తాను పోటీ చేస్తున్న 12వ వార్డులో రెండేండ్ల లోపు ఒక కోటి రూపాయల అభివృద్ధి పనులు చేసి క్లిష్టమైన ప్రజా సమస్యలు తీరుస్తానని వార్డ్ ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు. గత పాలకులు పడమటి వాడపై పగ బట్టి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన ఆరోపించారు. పడమటి వాడ ప్రజల సమస్యలు వర్ణనాతీతం అన్నారు. అందుకే ఈప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితిలో తాను వార్డ్ సభ్యునిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే వార్డు ప్రజలకు, గ్రామానికి తాను చేయబోయే పనుల పూర్తి వివరాలను విలేఖరుల సమావేశంలో ఒక కరపత్రం ద్వారా ప్రకటిస్తానని చుక్క గంగారెడ్డి బుధవారం విలేఖరులకు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల శ్రేయస్సే జగన్ అజెండా అని మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు

ప్రజల శ్రేయస్సే జగన్ అజెండా అని ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఉదయగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతలకాల ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలు వాహనాలను జెండా ఊపి నెల్లూరు జిల్లా లోని వైసీపీ కేంద్రాలయానికి తరలించారు పోలీసులు ప్రభుత్వం, వైద్య ప్రజల హక్కు అని అటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కళారాస్తుందని ఆయన మండిపడ్డరూ

ఖమ్మం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మడకం స్వప్నప్రియ:

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయ ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షురాలు శ్రీమతి మడకం స్వప్నప్రియ (W/O పేర్ల మహేష్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజలందరి సంపూర్ణ మద్దతుతో ఆమెకు వచ్చిన ఈ విజయంపై స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని స్వప్నప్రియ తెలిపారు. రాష్ట్ర నాయకులు ఈవి రమేష్ పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహ రావు, జిల్లా నాయకులు పడిగల మధు ఇతర బీజేపీ నాయకులు హర్షము వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.