Wednesday, 6 May 2026

Blog

విశాఖపట్నం

మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ ఎగ్జిబిష‌న్*

*మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ ఎగ్జిబిష‌న్* *600 మంది ఎస్.హెచ్.జి. స‌భ్యుల‌ ఆధ్వ‌ర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు *డిసెంబ‌ర్ 15 నుంచి 26 వ‌ర‌కు నిరంత‌రాయంగా కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌ *విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ఎగ్జిబిష‌న్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ స‌ర‌స్ ప్రదర్శన–2025 డిసెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో జ‌రుగుతుంద‌ని, ఈ మేర‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బుధ‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర అంశాల గురించి వివ‌రించారు. పండ‌గ‌ల స‌మయం, ప్రజల రాకపోకలు అధికంగా ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా ఉండ‌టం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఆదాయ వనరులను పెంపొందించడం, గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. *600 మంది ఎస్.హెచ్.జి. స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు* ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది ఎస్.హెచ్.జి. మహిళలు పాల్గొంటున్నార‌ని తెలిపారు. మొత్తం 250 స్టాళ్లలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, మసాలాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు తదితర నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివ‌రించారు. దీని ద్వారా విశాఖవాసులకు దేశంలోని వివిధ రాష్ట్రాల నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు ఒకేచోట లభించనున్నాయ‌న్నారు. అదనంగా ఫుడ్ స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వినోద ఆటపరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్.హెచ్.జి. మహిళలకు ఉచిత స్టాళ్లు, ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే పోలీస్ భద్రత, సీసీ కెమెరాల నిఘా, అగ్నిమాపక సదుపాయాలు, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, జనరేటర్ వంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. *మ‌ద్ద‌తుగా నిలుస్తూ.. విజ‌య‌వంతం చేయాలి…* ఈ ప్రదర్శనకు ఎన్.ఆర్.ఎల్.ఎం., సెర్ప్, నాబార్డు, మెప్మా, ఆర్.వై.ఎస్.ఎస్.తో పాటు ఎస్.బి.ఐ., యు.బి.ఐ., పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏపీ గ్రామీణ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, విశాఖ‌ప‌ట్ట‌ణం పోర్టు ట్ర‌స్ట్, ఐవోసీఎల్, గాయ‌త్రీ విద్యాప‌రిష‌త్ త‌దిత‌ర‌ సంస్థలు మద్ద‌తుగా నిలుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారతకు దోహదపడే ఈ ప్రాంతీయ సరస్ ప్రదర్శనను విశాఖ‌ప‌ట్ట‌ణం, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన‌ ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేసి స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ వారికి ప్రోత్సాహం అందించాలని, విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌ర డీఆర్డీఏ పీడీ ల‌క్ష్మీప‌తి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సంబంధిత పోస్ట‌ర్ను క‌లెక్టర్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

విశాఖపట్నం

స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు*

*స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు* _*విశాఖపట్నo డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి*_ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి రూరల్, పద్మనాభం, ఆనందపురం మండలాల ముఖ్యనేతలతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం ద్వారా ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో మూడు మండలాల్లో అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాహన మిత్ర వంటి సంక్షేమ పథకాల సొమ్ము కొంతమందికి జమ కాలేదని ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నప్పటికీ.. కొత్త పెన్షన్ల కోసం వినతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. పాత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఇళ్ల స్థలాల కోసం తమను సంప్రదించాలని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పద్మనాభం మండలం నేతలు తెలియజేశారు. సచివాలయం, రెవిన్యూ సిబ్బంది కొందరు ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమర్ధంగా పని చేసే సచివాలయం ఉద్యోగులను డిప్యుటేషన్ పై కలెక్టరేట్, జిల్లా పరిషత్ లకు తీసుకెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. జల్ జీవన్ మెషీన్ కింద రోడ్లన్నీ తవ్వేసి వదిలేయడంతో వాహన చోదకులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని 3 మండలాల నాయకులకు గంటా హామీ ఇచ్చారు. ప్రతి నెల జరిగే పార్టీ సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరైతే, ఆయా పదవులకు అనర్హులవుతారని గంటా పార్టీ కమిటీలను హెచ్చరించారు. భీమిలి జెడ్.పి.టి.సి. గాడు వెంకటప్పడు, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, కోరాడ రమణ, తాట్రాజు అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, డి.ఎ.ఎన్.రాజు, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మజ్జి నందీష్, రామరాజు, కాకర వెంకట రమణ, వై. అనిల్ ప్రసాద్, బమ్మిడి ఉమాదేవి, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, కర్రి శ్రీనివాసరావు, కాళ్ల సత్యనారాయణ, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, గండ్రెడ్డి సోమినాయుడు, ఎం.శివాజీ, సత్య వరప్రసాద్, చందవరపు కుమార్, గుడ్డాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. *గ్రీవెన్స్ నిర్వహించిన గంటా* ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ప్రతి సోమవారం తాను పి.జి.ఆర్.ఎస్.లో పాల్గొంటానని గంటా చెప్పారు. ఎప్పుడైనా కుదరని పక్షంలో మంగళవారం నుంచి శుక్రవారం మధ్యలో ఒక రోజు మండల కార్యాలయాల్లో గానీ జోనల్ కార్యాలయాల్లో గానీ నిర్వహిస్తానని ప్రకటించారు. శ్మశాన వాటిక.. డ్రెయిన్.. దివ్యాంగ పెన్షన్.. జల్ జీవన్ మెషీన్ నీటి సరఫరా, జిరాయితీ భూమిలో హౌసింగ్ చేపట్టడం తదితరాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈనెల 12 న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం.. జోన్ల పునర్వ్యవస్థీకరణపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పేదల గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి*అధికారుల‌ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరేంధిర‌ ప్రసాద్

*పేదల గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి* *అధికారుల‌ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరేంధిర‌ ప్రసాద్ *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *:- పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై హౌసింగ్ అధికారులు, స్పెషల్ అధికారులు, జోనల్ కమిషనర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలో వివిధ దశలలో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులంరూ పేదల గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజుకు 200 ఇళ్ల చొప్పున పూర్తి చేసి ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సూచించారు. మార్చినాటికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. అదన‌పు ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్ కమిషనర్లు పురోగ‌తిపై దృష్టి పెట్టాలని, ప్రతి సచివాలయంలో జియో ట్యాగింగ్ పూర్తి చేయుటకు ప్రణాళిక రూపొందించాలని, లక్ష్యసాధనలో వెనుకబడిన వారిపై తగిన చర్యలు ఉంటాయ‌ని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ స‌త్తిబాబు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అత్యంత విజయవంతంగా సాగిన *మెగా రక్తదాన శిబిరం* శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల , ఎన్ఎస్ఎస్ విభాగం…….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆధ్వర్యంలో 10 /11 / 2025 వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం , రెడ్ రిబ్బన్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .వి.వి.సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ శరీరంలో ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు అని, రక్తదానం చేయడం వల్ల ఎవరికి హాని కలగదని, రక్తదానం చేసిన వెంటనే తిరిగి శరీరానికి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ మద్దినేని . సుధాకర్ , స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ,హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ,ఏపీ సెక్రటేరియట్ గారు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చు అని 1994 నుంచి బ్లడ్ డొనేషన్ మొదలు పెట్టారని రక్తదానం చేసేవారిలో ఆడవారు ఎక్కువగా ఉన్నారని ఇప్పటివరకు వందసార్లు సుమారుగా రక్తదానం చేశారని అన్నారు. అలాగే డాక్టర్. ఎస్. మదనమోహన్ ,చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన క్యాన్సర్ హృదయ సమస్యలు రక్తపోటు రాకుండా ఉంటాయని అలాగే ఇలా రక్తదానం చేసినటువంటి రక్తం క్యాన్సర్ బాధితులకు తలసీమియా కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో చాలా అవసరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బి కళ్యాణ్ చక్రవర్తి ఎండి పెథాలజీ ల్యాబ్ డైరెక్టర్, పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,విజయవాడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో 12% రక్తం శరీరంలో ఖచ్చితంగా ఉండాలని 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయాలని లేదా కుటుంబంలో కానీ ,చుట్టాలలో కానీ, ప్రతి ఒక్కరికి 12 శాతం రక్తం ఉండేలా చూసుకోవాలని అన్నారు . తర్వాత డాక్టర్ పిన్నమనేని కళ్యాణి గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు చెక్ చేయవచ్చని ,బిపి ఆరోగ్యస్థితి గురించి ఆరా తీస్తారని, ఈ విధంగా ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవచ్చని అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ చిలుకూరి మధుసూదన్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియలో వేగం కుంటుందని, దానివల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2, 3 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ , శ్రీమతి టి. నాగరాణి ,శ్రీమతి శ్రీ భారతి మరియు ఎం. సుభాషినీ, కమిటీ సభ్యులు, విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 327 మంది మెగా రక్తదార శిబిరంలో పాల్గొని వారి యొక్క సేవ భావాన్ని వ్యక్తపరిచి రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

నిర్మల్

డిసెంబర్ 10. పక్షులకు జీవించే హక్కు ఉంది

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా లోని జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ కోసారి సంతోష్ కుమార్ పక్షుల.జంతుల సంరక్షణ మన బాధ్యత అని తెలియజేశారు ఈరోజు డిసెంబర్ 10 పక్షులు జీవించే హక్కుల దినోత్సవం అని వాటికి కూడా జీవించే హక్కు ఉందని వాటి వాటి పట్ల మనం మానవత్వాన్ని ప్రదర్శించాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ పక్షల పట్ల మీరు చూపిన ప్రేమ జాలి. చాలా గొప్పదని జంతు శాస్త్ర అధ్యాపకుని అభినందించారు💐💐💐💐

నిర్మల్

డిసెంబర్ 10. పక్షులకు జీవించే హక్కు ఉంది

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా లోని జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ కోసారి సంతోష్ కుమార్ పక్షుల.జంతుల సంరక్షణ మన బాధ్యత అని తెలియజేశారు ఈరోజు డిసెంబర్ 10 పక్షులు జీవించే హక్కుల దినోత్సవం అని వాటికి కూడా జీవించే హక్కు ఉందని వాటి వాటి పట్ల మనం మానవత్వాన్ని ప్రదర్శించాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ పక్షల పట్ల మీరు చూపిన ప్రేమ జాలి. చాలా గొప్పదని జంతు శాస్త్ర అధ్యాపకుని అభినందించారు💐💐💐💐

కడప

పూర్తయిన కోటి సంతకాల సేకరణ

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది. ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్నమయ్య

దేశ రక్షణ కోసం చిట్వేలి ఎన్సీసీ క్యాడెట్ల ఫ్లాగ్ డే విరాళాల సేకరణ

-సైనికుల సంక్షేమానికి కవచంగా నిలవాలి: ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు -విరాళాలు సేకరించిన ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీ చిట్వేలి, డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల సంక్షేమం కోసం చిట్వేలిలో ఎన్సీసీ క్యాడెట్లు ఫ్లాగ్ డే (ఆధునిక సైనిక దళాల పతాక దినోత్సవం) సందర్భంగా స్వచ్ఛంద విరాళాల సేకరణ చేపట్టారు.30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ అధికారి ఆదేశాల** మేరకు చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. -ప్రారంభం – సందేశం: ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కొరకు కవచంగా ఏర్పడి ఉన్న సైనికులకు ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. -సైనికుల త్యాగం: ట్రూప్ ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల సంక్షేమం కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో వివరించారు. సైనికుల త్యాగానికి గుర్తుగాఇస్తున్న ఈ విరాళం ఎంతో విలువైనదని, సేకరించిన విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు. -విరాళాల ర్యాలీ: ఈ కార్యక్రమం పాఠశాల నుండి మొదలై కొత్త బస్టాండ్, పాత బస్టాండ్‌ మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ రూపంలో కొనసాగింది. ఎన్సీసీ విద్యార్థులు ప్రజల నుండి, వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న అధికారుల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, మండల అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, వెలుగు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం లో వి ఆర్ రాసాని రచనలు ఆవిష్కరణ

———————————————— వెంకటాచలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లో తిరుపతికి చెందిన తెలుగు విశ్రాంత ఆచార్యులు డా వి ఆర్ రాసాని మూడు రచనలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభా అధ్యక్షులుగా ప్రాచీన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించి రచయిత పరిచయం చేసి పుస్తక ఆవిష్కరణలు చేయించారు. తాజా కథాసంపుటి ప్రసిద్ధ కథా రచయిత్రి వి ప్రతిమ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. తనంత తానుగా రూపాన్ని సంతరించుకున్న సహజ కథల సంపుటి మా ఊరికథలు అన్నారు. ఈ కథలు ఆట ప్రధానంగా రాసినవి అంటూ పలు కథలు పరిచయం చేశారు. డా రాసాని భాష ప్రతిభ అసామాన్యమైనదని అన్నారు. సీమకథలు పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. సీమకథలు పరిచయం చేస్తూ రాసాని చిరకాల మిత్రుడు అంటూ ఆయన ముఖ్యంగా జానపద రచనల్లో పట్టు సాధించారు అన్నారు..రాసాని కథలలో చింతచెట్టు కథతో తాను మమేక మయ్యానన్నారు .. స్థానికత ఈ కథల్లో పదునుగా నమోదు చేసారన్నారు. మతసామరస్యం ఒక కథలో ఏ మతమైతే ఏమున్నదీ మంచి చేయడానికి అని చెప్పడం బాగా విశ్లేషించారు. శ్రవ్య,దృశ్య నాటక రచన గ్రంథం సీమ యవనిక విశ్రాంత ఆచార్య నాగోలు కృష్ణా రెడ్డి అంతర్జాతీయకవి సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేసి విశ్లేషణ చేశారు. శ్రవ్య నాటక పరిచయం చేస్తూ నాగోలు కృష్ణారెడ్డి రాసాని తరిగొండ వెంగమాంబ నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేసుకుందని, దీనివల్ల వెంగమాంబ అందరికీ పరిచయం అయిందని అన్నారు. విలక్షణ వస్తువులపై రాసాని రచనలు చేయడం లో దిట్ట అన్నారు. దృశ్య రూపకాలు విశ్లేషణ చేస్తూ డా పెరుగు రామకృష్ణ రాసాని నాటకాలు చదివినప్పుడు కర్ణాటక నుండి నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తో సారూప్యత గురించి తులనాత్మక అధ్యయనం చేశారు. వీరిద్దరూ సామాజిక బాధ్యత తో దృశ్య రచన చేశారు అన్నారు..నేలతీపి, దేవర మాన్యం లాంటి గొప్ప నాటకాలు అన్నారు. చివరగా రచయిత స్పందన వినిపిస్తూ రాసాని తన శ్రీమతి కూడా వైద్యురాలు, రచయిత్రి కనుక ఆమె సహకారం వల్లే ఇంత సాహితీ జైత్ర యాత్ర చేయగలిగాను అన్నారు..పరిశోధనే నా రచనల ప్రాణం అన్నారు..ప్రాచీన కేంద్రం పరిశోధక బృందం ప్రార్థన-వందనసమర్పణ చేశారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఆత్మకూరుకు మరో వరాన్ని తీసుకొచ్చిన మంత్రి ఆనం..*

*ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* ఆత్మకూరు పట్టణానికి మరో వరాన్ని మంజూరు చేయించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటి 40 లక్షలతో మంజూరైన నగర వనంను ఆహ్లాదకరంగా ఆత్మకూర్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులతో… ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని నెల్లూరుపాలెం సెంటర్లో…. ఆహ్లాదకరమైన పార్కు కోసం కోటి 40 లక్షల అటవీశాఖ నిధులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.