Wednesday, 6 May 2026

Blog

కామారెడ్డి

కామారెడ్డి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలు: మొదటి విడతలో కలెక్టర్ కఠిన చర్య

కామారెడ్డి, 10 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచా యతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు (10.12. 2025) 10 మండలాల్లో PO/OPO డ్యూటీ అలాట్ అయిన 53 మంది అధికారులు రిపోర్ట్ చేయకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణ సడంబరంగా జరగా లంటే అధికారులు సమయానికి హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధి నిర్లక్ష్యం ఎన్నికల పారదర్శకతకు, నాణ్యతకు ఆటంకం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ చర్య జిల్లా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ రికార్డు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో 10 మండలాల్లో ఎన్నికలు సజగా జరిగేలా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షోకాజ్ నోటీసులు ఎన్నికల బాధ్యులందరికీ సమయానికి హాజరు కావాలని గట్టి సందేశం.

నిర్మల్

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది.

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, సీ పీ డీ సీ అద్యక్షులు డాక్టర్ నాగేష్, కార్యదర్శి మనోజ్ కమార్, నిఖిల్ చెంద్రా భవన నిర్మాణ బాద్యతలు స్వికరించి ఈఈ బార్గవొ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘు నాథ్ద్య అధ్యాపకులు డా పవన్ సార్, పిజి రెడ్డి సార్, భీమ్రావు సార్ ,శంకర్ సార్ , ఆరే రాజు సార్, డాక్టర్ సంతోష్ కుమార్ , రామ్మోహన్, కిషన్, ఇర్ఫాన్, వహీద్ అద్యాపకులు పాల్గొన్నారు..

నిర్మల్

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది.

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, సీ పీ డీ సీ అద్యక్షులు డాక్టర్ నాగేష్, కార్యదర్శి మనోజ్ కమార్, నిఖిల్ చెంద్రా భవన నిర్మాణ బాద్యతలు స్వికరించి ఈఈ బార్గవొ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘు నాథ్ద్య అధ్యాపకులు డా పవన్ సార్, పిజి రెడ్డి సార్, భీమ్రావు సార్ ,శంకర్ సార్ , ఆరే రాజు సార్, డాక్టర్ సంతోష్ కుమార్ , రామ్మోహన్, కిషన్, ఇర్ఫాన్, వహీద్ అద్యాపకులు పాల్గొన్నారు..

ఎన్ టి ఆర్ జిల్లా

SDMSM కళాశాలకు విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాక ……

విజయవాడ లబ్బీపేట న్యూస్…. పున్నమి….. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ………. 10. 12 .2025 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గోల్డెన్ జూబ్లీ (1975- 2025) వేడుకల సందర్భంగా *భౌతిక శాస్త్ర విభాగం *వారు జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .VVS కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు నెల్లూరు , విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు *NEED OF TRUE LEADERS IN CONTEMPORARY SOCIETY*….. అనే అంశంపై ప్రసంగించారు. సమకాలీన సమాజానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ ,నాయకత్వం అంటే అధికారమే కాదు ,బాధ్యతతో కూడిన సేవా భావం అని స్పష్టం చేశారు . అలాగే ఎలక్ట్రానిక్స్ ,క్వాంటం టెక్నాలజీ వంటి శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు వివరించారు . అది కాక అబ్రహం లింకన్ యొక్క విలువ ఆధారిత నాయకత్వాన్ని ,హిట్లర్ యొక్క దుర్వినియోగ నాయకత్వాన్ని ఉదాహరణగా తీసుకుని సమాజానికి కావలసిన నాయకత్వ లక్షణాలను వివరిస్తూ విలువైన సందేశం అందించారు . ఆ తర్వాత వారు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ విద్య మనిషిని శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ గారు… భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎమ్ గీతామాధురి , సభ్యులు S.N .సునీత D. నీరజ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు .

తిరుపతి

ఏడు గంగల జాతర సందర్భంగా గంగమ్మలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏడు గంగమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఏడు గంగమ్మల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏడు గంగమ్మల ఆశీస్సులు శ్రీకాళహస్తి ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల రాజు, సిరాజ్ భాష, బుల్లెట్ జై శ్యామ్ రాయల్,శ్రీవారి సురేష్, పులి రామచంద్ర, అట్ల రమేష్,టైలర్డ్ శ్రీను, ముని కృష్ణారెడ్డి, పాలమంగళం రవి, శివ కుమార్ యాదవ్, ఎల్ఐసి చంద్ర,కామి వెంకటేశ్వర్లు,నందా,పూడి రవి, శంకర్,కుమార్,జీవికి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

చట్టం గురించి ప్రజలు తెలుసుకోవాలని న్యాయవాదుల ర్యాలీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి పట్టణంలో హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా న్యాయవాదులు కక్షిదారులతో కలసి కోర్టు నుండి బయలుదేరి ప్రజలందరూ చట్టం గురించి తెలుసుకోవాలి అనే నినాదంతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, కమల్ కుమార్ మల్లికార్జునయ్య, లీగల్ ఎయిడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కోటి సంతకాల సేకరణ పత్రాలను జెండా ఊపి తరలించిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంలు సంయుక్తంగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి జండా ఊపి తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ కోటి సంతకాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ముఖ్యంగా పేద విద్యార్థులు, వైద్య సేవలు కోరుకునే సామాన్య ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ కోటి సంతకాలే బలమైన సాక్ష్యం. ఈ సంతకాల పత్రాలను గవర్నర్ దృష్టికి వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకులు ఓదురు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, జడ్పిటిసి సంధ్యారాణి,బర్రి సుదర్శన్ రెడ్డి, రత్నం రెడ్డి, సిరాజ్ భాష, కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,వయ్యాల మనోహర్ రెడ్డి, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జై శ్యామ్ రాయల్,గంగారి రమేష్,రేణిగుంట సర్పంచ్ నగేష్,ప్రభాకర్,మున్నా రాయల్,పటాన్ ఫరీద్,గోరా, సాగిర బి, పసల సుమతి, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, నివేత,రాణి,పర్వీన్, సరోజమ్మ,పులి రామచంద్ర, శ్రీవారి సురేష్, కొగిలి సుబ్రమణ్యం,మునిశేఖర్, పసలు కృష్ణయ్య, శివకుమార్ యాదవ్, అస్లాం, రంగయ్య, గఫూర్, ఫజల్, చింత రాజేంద్ర, చెంచయ్య నాయుడు, ఖదీర్, జీవీకే రెడ్డి,గాడిపాకుల కిరణ్, శ్రీరాముల్ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖ రాణిలు చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి యూనిట్ ఇంచార్జి సల్లా గోవిందు పుషగుచ్చము అందించి, శాలువాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో, మంత్రి లోకేష్ సహకారంతో నేతన్నల అభివృద్ధి కి కృషి చేస్తానని చేనేతల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చేనేత రంగం పునరుద్ధరణకు, ఆధునీకరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చేనేత కుటుంబాల్లో ఆశలు నింపుతున్నాయని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం, మంత్రి లోకేష్ సేవలు అద్భుతమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సదస్సులో సీనియర్ చేనేత నాయకులు కన్నా వెంకటేశ్వర్లు తానూ స్వయంగా నేసిన నాణ్యమైన చేనేత వస్త్రం తో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. 13 వ తేదీ చేనేత మంత్రి సవిత చేతులమీదుగా 192 మంది నేతన్నలకు పనిముట్లు అందజేయడం జరుగుతుందని, నేతన్న లు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపు, డిజైన్ నవీకరణ, మార్కెట్ విస్తరణ, పనిముట్ల మద్దతు వంటి కార్యక్రమాలకు ప్రభుత్వాలు చేస్తున్న సహకారం నేతన్నలకు కొత్త దిశ చూపుతోందని చేనేత రంగం మరింత బలోపేతం కావాలంటే ఈ తరహా కార్యక్రమాలు గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత రంగ వ్యాపారులు,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

AVS నెల్లూరు జిల్లాప్రధాన కార్యదర్శిగా చెరుకూరి ఖాజా

నెల్లూరు ఉదయగిరి Date 10-12-2025 ఉదయగిరి మండలం, బశినేనిపల్లి గ్రామానికి చేందిన చెరుకూరి ఖాజా గారిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం (AVS)నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అశోక్ రెడ్డి గారు ఉత్తర్వుల జారీ చేసినారు. ఈ సందర్బంగా అధ్యక్షులకు చెరుకూరు ఖాజా ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం రాష్ట్రము లో మరియు నెల్లూరు జిల్లా లో విద్యార్థుల సమస్యల పట్ల, హక్కుల పట్ల బాధ్యత గా పనిచేస్తుందని తెలిపినారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంజీవరాజు కుటుంబానికి మేకపాటి దంపతుల, పరామర్ష

ఉదయగిరి 10-12-2025 ఉదయగిరి మండలం,సంజీవరాజుపల్లి గ్రామానికి చెందిన సంజీవరాజు కుటుంబానికి మేకపాటి దంపతులను 50,000 ఆర్థిక సాయం* *మంచి వ్యక్తిని కోల్పోయాం – మేకపాటి దంపతులు* *ఉదయగిరి మండలం, సంజీవరాజుపల్లి గ్రామానికి చెందిన సంజీవ రాజు స్వర్గస్తులవడంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి సతీమణి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మేకపాటి శాంతి కుమారి సంజీవరాజు పల్లి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబానికి ధైర్యం చెప్పి, సంజీవరాజు ఆత్మకుశాంతి చేకూరాలని, మంచి అనుబంధ ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయామని అన్నారు. మేకపాటి దంపతులను చూసి కుటుంబం అంత బావోగ్వేదానికి గురి అయ్యారు. కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ధైర్యంగా ఉండాలని అండగా ఉండమని మేకపాటి దంపతులు భరోసా ఇచ్చారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.