పురుగుమందులు మరియు కలుపు సంహారకాల విక్రయం మరియు వినియోగంలో భద్రత…వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్. మణి
పురుగుమందులు మరియు కలుపు సంహారకాల విక్రయం మరియు వినియోగంలో భద్రత – అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 13 పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) రైల్వే కోడూరు డివిజన్‌లోని అన్ని ఎరువులు మరియు పురుగుమందుల విక్రయశాలల యజమానులకు తెలియజేయునది ఏమనగా, వ్యవసాయంలో కలుపు మరియు పురుగుమందుల,యొక్క సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి, కీటకనాశక చట్టం, 1968 మరియు కీటకనాశక నియమాలు, 1971 ప్రకారం ఈ క్రింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్. మణి తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు *డీలర్లకు సూచనలు:* *వయస్సు ధృవీకరణ* : పురుగుమందులు లేదా కలుపు సంహారకాలు కొనుగోలు చేయడానికి వచ్చే వ్యక్తులు చట్టబద్ధమైన వయస్సు కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. కొనుగోలు దారు రైతా కాదా అని ధ్రువీకరించుకోవాలి. సంబంధిత పాస్ బుక్ మరియు ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకుని అనుమానం ఉంటే తల్లిదండ్రులను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకొని మాత్రమే పురుగుమందు సేల్ చేయాలి * *భద్రతా సూచనలు* :* ప్రతి ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న వినియోగ మోతాదు, పంట వివరాలు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొనుగోలుదారుకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. *రికార్డుల నిర్వహణ:* కొనుగోలుదారు పేరు, చిరునామా, విక్రయించిన పురుగుమందు రకం మరియు పరిమాణం, బ్యాచ్ నంబర్, మరియు గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా రికార్డు పుస్తకంలో నమోదు చేయాలి. *చట్టపరమైన చర్యలు:* ఈ ఆదేశాలను ఉల్లంఘించిన డీలర్లపై కీటకనాశక చట్టం, 1968 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి, ఇందులో లైసెన్స్ రద్దు మరియు జరిమానాలు ఉంటాయి.ఈ మార్గదర్శకాలన్నింటినీ తూచాతప్పకుండా పాటించి, వ్యవసాయ రంగంలో భద్రత మరియు బాధ్యతాయుతమైన పద్ధతులను ప్రోత్సహించాలని కోరుతున్నాము.










