* మోదీ చిత్రపటం తొలగింపు బడంగ్‌పేట్‌లో అలజడి! –కమిషనర్ వ్యవహారం పూర్తిగా వివక్షపూరితం – బీజేపీ నాయకుల గగ్గోలు*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని కమిషనర్ తొలగించడం, అలాగే ఆయన జన్మదిన శుభాకాంక్షల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటలు పూర్తికాకముందే తొలగించడంస్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి దారితీసింది బీజేపీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు కలిసి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసిన మోదీ చిత్రపటాన్ని అకస్మాత్తుగా తొలగించడం పూర్తిస్థాయి రాజకీయ వివాదానికి కారణమైందికమిషనర్ వ్యవహారశైలికి వివక్షాత్మక వైఖరికి తీవ్ర నిరసనగా, స్థానిక ప్రజలు మరియు బీజేపీ నాయకులు కలిసి బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మోదీ చిత్రపటాన్ని మళ్లీ ఏర్పాటు చేశారు.దేశ ప్రధానమంత్రిపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం సహనం చెరిపేసే చర్య అని అన్నారు కాంగ్రెస్స్ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్న కమిషనర్ బీజేపీ ఆరోపణ మోదీ ఫ్లెక్సీలు 24 గంటలు పూర్తికాకముందే తొలగించగా, ఇతర నాయకుల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలాగే ఉంచడం పరిపాలనలో పాక్షికతకు బహిరంగ నిదర్శనం అని బీజేపీ మండిపడింది.బీజేపీ బడంగ్‌పేట్ అధ్యక్షులు రాళ్ళగూడం రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్తంగా పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ నిష్పాక్షిక అధికారిలా కాకుండా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడులకు లోనై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ చిత్రపటం తొలగించడం, ఫ్లెక్సీలను వేగంగా తొలగించడం దేశ ప్రధానమంత్రికి చేసిన అవమానం. ఇలాంటి చర్యలను ప్రజలు సహించరు అని పేర్కొన్నారు.ఎవరి ఆదేశాలపై మోదీ చిత్రపటం తొలగించబడింది? ఫ్లెక్సీలపై సమాన నిబంధనలు ఎందుకు అమలు చేయలేదు? కమిషనర్ నిష్పాక్షికత ఎక్కడ? పరిపాలనలో నిష్పాక్షికత తప్పనిసరి బీజేపీ హెచ్చరిచింది దేశ ప్రధానమంత్రిపై ప్రజల గౌరవానికి భంగం కలిగించే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ తీవ్రంగా పేర్కొంది.భవిష్యత్తులో ఇలాంటి వివక్షాత్మక చర్యలు పునరావృతం కాకుండా అధికారులు నిష్పక్షికంగా పనిచేయాలని బీజేపీ స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్,ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, ముళ్లిధర్ రెడ్డి,సీనియర్ నాయకులు రేసు నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు క్యారాగారి అరవింద్,అగ్రిసెట్టి సైదులు ఏ. యాది రెడ్డి,రామాచారి, మురళీధర్ రెడ్డి, సతీష్ నంద, కిరణ్ రాజ్ మధుతేజ అఖిల్, కృష్ణ యాదవ్, మల్లేష్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











