Friday, 20 March 2026

Blog

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం. వైద్య కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం.. కొరముట్ల శ్రీనివాసులు

వైద్య కళాశాలల ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం. వైద్య కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గం.. కొరముట్ల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 ( నవ్యాంధ్ర వార్త పత్రిక ):మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఈరోజు సాయంత్రం బోజ్జవారిపల్లి గ్రామపంచాయతీ బంగ్లా మిట్ట ఎస్టీ కాలనీ నందు ఉప సర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికారం ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, ఉప సర్పంచ్ శివ సాయి, స్థానిక నాయకులు పురుషోత్తం, బత్తల సుబ్రహ్మణ్యం, పాలెం కోట చంద్ర,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,మాజీ వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మాదినేని వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, ఎంపీటీసీలు, ఘని(రాజా ) రౌఫ్, ఎంపీటీసీ బండారు మల్లికార్జున, పుష్పలత,మహేష్ రెడ్డి, షఫీ,జిల్లా యూత్ సెక్రటరీ డమ్ము రఘ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ,డీవీ రమణ, సిద్దయ్య,గౌసియా,తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్సింగమాల వెంకటేష్ ) ఓబులవారిపల్లి మండలం బొమ్మ వారం గ్రామ వాస్తవ్వులు బొమ్మ వరం రామచంద్రారెడ్డి దంపతుల కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి మరియు తేజస్విని వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు లోని విజయ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు

E-పేపర్

ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి. డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ.

ఓబులవారిపల్లి మండల పరిధిలో “బుల్లి ” సినిమా షూటింగ్ సందడి. డైరెక్టర్ ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15( పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలానికి చెందిన ఇసుకపాటి ఢిల్లీ శేఖర్ డైరెక్షన్లో బుల్లి అనే నూతన సినిమా షూటింగ్ అనంతరాజిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా డైరెక్టర్ మరియు తారాగణంలో అందరూ నూతన నటీనటులే కావడం విశేషం, ఈ షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి అత్యంత సినిమా షూటింగ్ తీరును గమనించడం కొసమెరుపు దర్శకునిగా ఇది మొదటి చిత్రం కావడం, అందునా ఓబులవారిపల్లి మండలానికి చెందిన యువకుడు కావడంతో శేఖర్ ను కలిసేందుకు అభిమానులు తండాలుగా ముందుకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు బుల్లి సినిమా షూటింగ్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంకా రెండు మూడు రోజులు జరుగుతుందని యూనిట్ తెలిపింది..

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిశీలన స్థలం: జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తం గా ప్రజా సేవా సంస్థల పనితీరు మెరుగుదలకు ప్రతీ నియోజక వర్గ శాసనసభ్యులు నిర్దిష్ట కాలక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు మరియు ఇతర విభాగాలను పర్యవేక్షించాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నవంబర్ 15న జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. *సందర్శన ముఖ్యాంశాలు* : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యక్షంగా పరామర్శించగా, వారి ఆరోగ్య స్థితి, అందుతున్న వైద్యసేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, పరిపాలనాధికారు లతో సమావేశమై ప్రస్తుత వనరులు, మౌలిక సదుపాయాలు, పరికరాల లభ్యత, సిబ్బంది అవసరాలపై సమగ్ర నివేదికను కోరారు. *శాసనసభ్యుల వ్యాఖ్యలు* : ప్రజలకు నాణ్యమైన, వేగవంత మైన వైద్యసేవలు అందించడం లో లోటు ఉండరూడని. అవసరమైన పరికరాలు, సిబ్బంది నియామకం, మరమ్మతులు మరియు సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహాయాన్ని అందించనున్నది. ఆసుపత్రి పరిశుభ్రత, ఔషధాల అందుబాటు, అత్యవసర విభాగ నిర్వహణ, రద్దీ నియంత్రణ అంశాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని, నియోజకవర్గ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేయ నున్నారని స్పష్టం చేశారు. *కార్యక్రమంలో పాల్గొన్న వారు* : హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు: గుడిసె నాగేశ్వరరావు వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీఉపాధ్యక్షులు: ఆదిమల్ల రమేష్, నున్న సాయి ఆసుపత్రి సిబ్బంది తదితరులు

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో బీసీ 45 కులాల ఐక్యత – 42% రిజర్వేషన్లు కోసం ఉరికిన జోరు

కామారెడ్డి 15 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా బీసీ కులాలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం దక్షిణ భారతంలో అందరికీ ఆదర్శ మైన ఏకాభిభావంతో శక్తివంతమైన పోరాటం పలికింది. బీసీ అక్రోశ సాధన సమితి అధినేత ఈశ్వరయ్య ఆధ్వర్యంలో, కులాల అంతర్లీన వివిధతలను దాటి 45 కులాసంఘాలు శక్తిగా ఐక్యమయ్యాయి.ఈ శక్తివంతమైన జోరు శ్రీ సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో వారి నాయకత్వంతో ఘనం గా నిర్వహించబడింది.ఈ సభలో కమిటీ సభ్యు లు, నాయకులు, బీసీ చైర్మన్ మార్కంటి భూమన్న సంభాషిస్తూ, 42% రిజర్వేషన్ల అమలు వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రతిజ్ఞ తెలిపారు. ఇది బీసీ కుల సమష్టి ముందస్తు సంకల్పానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఆ గమ్యాన్ని సాధించేందుకు ప్రజాస్వామ్యరంగంలో బలమైన పునర్ ప్రవేశం అయ్యిందని అన్నారు. 45 కులాల నాయకులు, సంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొని వారందరి ఆకాంక్షలను ఒకమాటగా చెప్పి న ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లాకు పరంపరగా ఉండే ఉద్యమ శక్తిగా కొనసాగాలని ఆశభావం వ్యక్తం చేశారు.

E-పేపర్

యాచారం మండలం నక్కర్త – మేడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 విద్యార్థులువిద్యార్థులు బెల్ట్ లు, బ్యాడ్జిలు పంపిణీ యాచారం : యాచారం మండలం నక్కర్త – మేడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు , బ్యాడ్జ్ , పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ , ఉపాధ్యాలు శ్రీకాంత్ , గిరిజారాణి , PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు బెల్టులు బ్యాచ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పి ఆర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా, పూర్వా విద్యార్థి బన్నె శ్రీశైలం ఉన్నారు.

రంగారెడ్డి

* శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కను విందు చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శాలువా మెమెంటోలతో సబితా ఇంద్రారెడ్డిని సత్కరించిన ఆలయ అర్చకులు నిర్వాహకులు ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయి..సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ గ్రౌండ్ లో అఖిల భారత సిరావి సమాజ్ భాగ్యనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరావి సమాజ్ ప్రతినిధులు, క్లబ్ సభ్యులు, క్రీడాకారులు మరియు స్థానికులు విస్తృతంగా పాల్గొన్నారు.

రంగారెడ్డి

*దేశంలో తీవ్రవాదం కొత్తదారుల్లో ప్రారంభం కావడం దురదృష్టకరం * –సామాజిక భద్రత మనందరి ప్రధమ కర్తవ్యం – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : ఢిల్లీ మరియు శ్రీనగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో శ్రీరాములు మాట్లాడుతూ దేశ భద్రత మన అందరి సామాజిక బాధ్యత అని దేశంలో తీవ్రవాదం కొత్త దారుల్లో ఆరంభం కావడం దురదృష్టకరమని, ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు కూడా ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మన పరిసరాల్లో, కాలనీలలో, గ్రామాల్లో అపరిచిత వస్తువులు, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. మన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అనాధికారికంగా విదేశీ వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో, మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు, మరియు ప్రజలంతా కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సదస్సుల్లో—భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనుమానాస్పద విషయాలను సంబంధిత అధికారులకు ఎలా తెలియజేయాలి కాలనీలు, పంచాయతీలు స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి, సమిష్టిగా చర్యలు తీసుకుంటే మన సమాజం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు.మన దేశ భద్రత మన బాధ్యత.మన మహేశ్వరం నియోజకవర్గాన్ని మన చేతులలో భద్రంగా ఉంచుకుందాం అని అన్నారు

తిరుపతి

ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థిలకు బహుమతులు ప్రధానం

తొట్టంబేడు నవంబర్ 15, పున్నమి న్యూస్: మండలంలోని పెద్ద కనపర్తి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎంపీపీ మోడల్ స్కూల్ లో బాలికల దినోత్సవంలో భాగంగా ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు మహిళా మండలి అధ్యక్షురాలు రమాదేవి చేతులమీదుగా పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై అన్ని రంగాలలో ముందుండి ఉన్నత స్థాయి అందుకోవాలని బాలికలు, మహిళలు దేశ ఉన్నత స్థాయి పదవుల నుండి గ్రామస్థాయి పదవుల వరకు అన్ని రంగాలలో ముందు ఉన్నారని బాలికలు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి , మహిళా పోలీస్ లావణ్య, సచివాలయ, అంగనవాడ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.