Tuesday, 5 May 2026

Blog

విశాఖపట్నం

ఢిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట..పీపీపీపై జగన్ రాజకీయ నాటకం*

*ఢిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట..పీపీపీపై జగన్ రాజకీయ నాటకం* *కమీషన్లు పోతాయనే పీపీపీపై జగన్ ఉలిక్కిపాటు* *పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా? జగన్ రెడ్డి బెదిరింపులపై ఘాటు గా స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా గారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని పల్లా గారు ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా గారు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు. అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గారు గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా గారు మండిపడ్డారు. రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా గారు తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని పల్లా గారు గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.

విశాఖపట్నం

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు*

*ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు* *రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ* *విశాఖపట్నండిసెంబర్ 19పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం బిఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, .అదే విధంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నామని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నేరుగా పెన్షనర్లతో మాట్లాడి డీడీవోల సమక్షంలోనే వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశామని, డీడీవోలు, పెన్షనర్ల సమన్వయంతో తక్షణ పరిష్కారం సాధ్యపడుతుందని అన్నారు. పెన్షనర్లకు డాక్యుమెంటేషన్ ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరుకున్న పెన్షన్ పత్రాలను పరిశీలించి పదవీ విరమణ బెనిఫిట్స్ ను త్వరగా అందిస్తున్నామని ఆమె తెలిపారు*. *ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ పేజ్ ను ప్రారంభించారు. దీని ద్వారా పెన్షన్ దారులు వ్యక్తిగత ప్రయోజనాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.* *ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ దారుల ప్రయోజనాలకు సంబంధించి కొంత మేరా జాప్యం జరిగేదని, డిజిటలైజేషన్ చేయుట ద్వారా పనులను త్వరితగతిన చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని పెన్షన్దారులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*

విశాఖపట్నం

.జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 21 వినతులు.

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 21 వినతులు. – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 21 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 21 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 05, ఈస్ట్ జోన్ కు 08, సౌత్ జోన్ కు 01, నార్త్ జోన్ కు 04, గాజువాక జోన్ కు 02, పెందుర్తి జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. *విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 21 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 21 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 05, ఈస్ట్ జోన్ కు 08, సౌత్ జోన్ కు 01, నార్త్ జోన్ కు 04, గాజువాక జోన్ కు 02, పెందుర్తి జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

విశాఖపట్నం

ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి*

*ద్రోణంరాజుకి కాంగ్రెస్ శ్రేణులు నివాళి* *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* ఉత్తరాంధ్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 93 వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో జరిగాయి. సిరిపురం జంక్షన్ లో ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి ఆమె పూల మాల వేసి, మూడు రంగుల కండువా కప్పి నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాలలో స్వర్గీయ ద్రోణంరాజు చెరగని ముద్ర వేశారని, వుడా చైర్మన్ గా, ఎంపీగా అద్భుతమైన పాలన అందించారని, ఎంవీపీ లాంటి కాలనీ ఆయన హయాంలోనే రూపొందిందని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి, కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం,మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకి చాలా ఇష్టమైన నాయకుడని ప్రియాంక తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, డా. విజయ్ చంద్రా, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, సీనియర్ నాయకులు కస్తూరి వెంకటరావు, సోడాదశి సుధాకర్, ముక్క రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా *విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి* అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పార్క్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని నాయకులు పేర్కొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో నూతన కానిస్టేబుళ్లకు ఘన సన్మానం

చిట్వేల్ మండల పరిధిలో నూతనంగా ముగ్గురు కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులను చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి తిరుపతిలోని కళ్యాణ్ డ్యాంలో పోలీస్ శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్సై తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో, జాగ్రత్తగా పూర్తి చేసి ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచించారు. చట్ట పరిరక్షణలో భాగస్వాములై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని, నూతన కానిస్టేబుళ్లకు విజయవంతమైన సేవా జీవితాన్ని కోరారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ వీధి వ్యాపారులకు అండగా బీజేపీ నేతలు:

ఖమ్మం డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని టూ టౌన్ పరిధిలో గల పాత బస్టాండ్ ఎదురుగా, 44వ డివిజన్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణానికి సంబంధించిన కూరగాయల పర్చేస్ షాపుల కేటాయింపుల కోసం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు డ్రా విధానాన్ని నిర్వహించారు. జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక కేటాయింపులతో ఈ డ్రాను భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మధు, టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జ్యోతుల యుగంధర్ నాయుడు వీధి వ్యాపారులకు అండగా నిలిచారు. డ్రా ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, వ్యాపారుల హక్కులు పరిరక్షించాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

బర్మా కాలనీలో దోమలపై యుద్ధనాదం: 49వ వార్డులో జాతీయ కీటకజనిత వ్యాధి నిరోధక కార్యక్రమం విజయవంతం

49వ వార్డు బర్మా కాలనీలో శుక్రవారం జాతీయ కీటకజనిత వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందనను రాబట్టింది. సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు, సానిటరీ సూపర్వైజర్ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 49వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంగు వాసు, బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించి, దోమలు మరియు ఇతర కీటకాల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి కారణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ—ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడటం, నీటి ట్యాంకులు మూసివేయడం, డ్రమ్ములు–కుండీల్లో నీరు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు కీటకజనిత వ్యాధుల నివారణకు కీలకమని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను కట్టడి చేయడం సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీలు, సీఈవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణకు వార్డు స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అత్యవసర పేషెంట్‌కు SDAP ప్లేట్లెట్ల దానం

(నెల్లూరు — పున్నమి ప్రతినిధి) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, పొట్టిశ్రీరాములు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రక్త నిధి కేంద్రం కోఆర్డినేటర్ బయ్యా ప్రసాద్ నారాయణ హాస్పిటల్‌లో అత్యవసర పేషెంట్‌కు సింగిల్ డోనార్ ఆఫరెసిస్ (SDAP) ద్వారా ప్లేట్లెట్లను దానం చేశారు. ఈ కార్యక్రమం ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చమర్తి జనార్ధన్ రాజు సమక్షంలో జరిగింది. ప్రతి సంవత్సరం 16 వేలకుపైగా స్వచ్ఛంద రక్తదానాలు జరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్ పెరిగి రక్త కొరత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు రక్తదానంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేంద్ర ప్రసాద్, డా. యశోవర్ధన్, మోటివేటర్లు మధుసూదనరావు, భాస్కర్ రావు, సాయిరాం పాల్గొన్నారు.

E-పేపర్

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టాక్సీ యూనియన్

రైల్వేకోడూరు లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టాక్సీ యూనియన్ కు మద్దతు తెలిపిన గౌ” తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయల్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తన ఆకాంక్షను తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.