పున్నమి ప్రతినిధి: గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ – 2026 విడుదల 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ *దరఖాస్తుకు కావలసినవి:* ఆధార్ కార్డు (aadhar card) సంతకంతో కూడిన పాస్ ఫోటో(pass photo with signature) స్టడీ సర్టిఫికెట్( 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్/ present study certificate) కుల ధృవీకరణ పత్రం(caste certificate) ఆన్లైన్లో 100 రూపాయలు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చును ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 11-12-2025 నుండి 21- 01-2026 వరకు* పరీక్ష తేదీ 22-02-2026 రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
తెలంగాణా డిసెంబర్ 19 (పున్నమి ప్రతినిధి) *రేషన్ కట్.. అనేది ఉండదు..* *ఆందోళన చెందాల్సిన అవసరం లేదు* *బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు* *సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు* *ఈ కేవైసీ కి ఏలాంటి తుది గడువు లేదు..* *స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర* తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. ఈ నెల 31లోగా e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయకపోతే ప్రభుత్వం పంపిణీ చేయనున్న ‘సన్నబియ్యం’ నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర స్పందిస్తూ.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బియ్యం పంపిణీని నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు. *EKYC ప్రక్రియ అనేది..* e-KYC ప్రక్రియ అనేది రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల వివరాలను ధృవీకరించుకోవడానికి చేసే ఒక ప్రామాణిక చర్య అని అధికారులు తెలిపారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణానికి వెళ్లి తమ వేలిముద్రలు (Biometric) లేదా కనుపాప గుర్తులను (Iris) నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరినీ రేషన్ కు దూరం చేసే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. *ఇబ్బందులు తలెత్తకుండా..* భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ e-KYC ప్రక్రియ పూర్తి చేయడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా అనర్హుల పేర్లను తొలగించడానికి, అలాగే కార్డులో ఉండి చనిపోయిన వారి పేర్లను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. లబ్ధిదారులు ఆందోళనతో రేషన్ షాపుల వద్ద గుమికూడకుండా, తమకు వీలైన సమయంలో వెళ్లి ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనలతో క్షేత్రస్థాయిలో ఉన్న అయోమయం తొలగిపోయినట్లయింది.
గద్వాల్ డిసెంబర్ 19 (పున్నమి ప్రతినిధి) *ప్రజల ఉపాధికి తూట్లు పొడవడమే* *దేశభక్తా?. CPM* దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, ప్రజలను దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని సీపీఏం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరాం నాయక్ కేంద్రాన్ని ప్రశ్నించారు.శుక్రవారం అలంపూర్ చౌరస్తాలో గ్రామీణ ఉపాధి హామీ పథక రద్దుకు వ్యతిరేకంగా బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ, కేంద్రం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ 2025 ను పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం వామపక్షాల పోరాటంతో సాధించుకున్న చట్టమని, కానీ నేడు ప్రభుత్వం దాన్ని ఒక పథకంగా మార్చే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.దేశంలో ప్రజల ఉపాధిని దెబ్బతీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని ప్రశ్నించారు.ప్రజల పని దినాలను,వేతనాన్ని పెంచి,ఉపాధికి గ్యారెంటీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, అందుకు భిన్నంగా పేర్లను మార్చి పని దినాల సంఖ్యను తగ్గించి, నిర్వహణ భారాన్ని రాష్ట్రాలపై మోపుతామనడం అన్యాయం అన్నారు. దేశంలో మౌళిక సదుపాయాల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠతో వ్యతిరేకించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన ప్రారంభంలో 100% నిధుల కేంద్రమే భరించాలని నిబంధన ఉండేదని, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్రాలను భరించాలని చెప్పడం అన్యాయం అన్నారు. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయిస్తున్న నిధులలో కోత విధించి కూలీలకు ఉపాధి హామీ పట్ల విరక్తి చెందే విధంగా చేస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రాల పైన భారం వేసి పూర్తిగా కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.కార్మికులు కర్షకులు ఐక్యమై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.ఉపాధి కల్పించడం ప్రభుత్వం బాధ్యత, ప్రజల హక్కని అన్నారు.గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాస్, మద్దిలేటి,జి. రాజు,వీవీ నరసింహ, ఉప్పేర్ నరసింహ,మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు నాయకులు వెంకటస్వామి, రఫీ, రవి కుమార్, మహేశ్వరమ్మ,మంచాల నరసింహ, రహీం, అలీ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు. కావలి ఉప విద్యా శాఖ అధికారీ హరి ప్రసాద్ పర్యవేక్షణలో ,క్లస్టర్ రిసోర్స్ టీచర్ ప్రసన్న నిర్వహించారు
నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు. కావలి ఉప విద్యా శాఖ అధికారీ హరి ప్రసాద్ పర్యవేక్షణలో ,క్లస్టర్ రిసోర్స్ టీచర్ ప్రసన్న నిర్వహించారు
నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు.
నందిగామ మార్కెట్ యార్డ్‌లో రేపు శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించ నున్నట్లు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో హిందువులు హాజరై విజయవంతంచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నుదుట తిలకం ధరించి రావాలని కోరారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రీయబ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిరాజు కల్పన, యువ నాయకుడు రాజా హనుమంతరావు మాట్లాడారు. హిందూ సమాజ ఐక్యతను చాటే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు శర్మ, మూర్తి, లక్ష్మి, కరుణ, జ్యోతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అయినవిల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ కే.జ్యోతి ఆధ్వర్యంలో హెల్మెట్ గూర్చి వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరించి, నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తున్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వారి చట్టపర చర్యలు తీసుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని ప్రధాన రహదారులలో ఈ తనిఖీలు నిర్వహించారు. BIS సర్టిఫైడ్ హెల్మెట్లు వాడాలని, నాణ్యమైన హెల్మెట్లు ప్రాణాలను కాపాడతాయని కూడా పోలీసులు అవగాహన కల్పించారు.
పున్నమి ప్రతినిధి: ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆలంపల్లి లావణ్య నర్సింహా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్యానల్ వార్డు సభ్యులకు, మిత్రపక్ష అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందఠరేగా మాట్లాడుతూ ఆయన “గెలుపు-ఓటములు రాజకీయాల్లో సహజం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా సావాసం ప్రజలతోనే ఉంటుంది. ప్రజలే నా దేవుళ్లు. మేడిపల్లి నక్కర్త నా కన్న తల్లిలాంటిది” అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచిన పాలకవర్గంతో కలిసి గ్రామ అభివ ృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, గెలుపు కోసం కష్టపడ్డ మిత్రపక్ష కార్యకర్తలకు, తనకు అండగా నిలిచిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని లావణ్య నర్సింహా స్పష్టం చేశారు. గ్రామ ప్రజలంతా తన హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ, ఎప్పుడూ గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. చివరగా “గెలుపు–ఓటమి సహజం ప్రజల తీర్పే అంతిమం” అని అన్నారు.
నందలూరు మండల వ్యాప్తంగా దోమల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాల చుట్టుపక్కల, కాలనీలలో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల అధికమైంది. ఫలితంగా పట్టపగలే దోమలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మండలంలోని ప్రధాన వీధులు, నివాస కాలనీలు, పాఠశాలల పరిసరాలు, అంగన్వాడీ కేంద్రాలు, డ్రైనేజీలు దోమల పుట్టిల్లుగా మారాయి. సాయంత్రం వేళ ఇళ్లలో ఉండడం కూడా కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి, దురద, జ్వరాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ సంబంధిత ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేలు, డ్రైనేజీ శుభ్రత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక దోమల నివారణ డ్రైవ్ చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.