Friday, 20 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మంత్రి సత్యకుమార్ పేరిట టీటీడీ నకిలీ లెటర్లు

మంత్రి సత్యకుమార్ పేరిట టీటీడీ నకిలీ లెటర్ల జారీపై ఫిర్యాదు. టీటీడీ నకిలీ లెటర్ల వ్యవహారంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన మంత్రి పీఏ. టీటీడీ నకిలీ లెటర్ల విషయాన్ని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకొచ్చిన బాధితులు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్న సీపీ రాజశేఖర్ బాబు.

ఆంధ్రప్రదేశ్

వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన

➡️ *సోమవారం వైఎస్ఆర్ జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల నిమిత్తం.. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి లతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్.* *️⃣ *నవంబర్ 19న గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం లబ్ది మొత్తాన్ని రైతులకు పంపిణీ చేసి రచ్చబండ కార్యక్రమంలోపాల్గొనేందుకు స్థలఎంపిక పై పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.* ➡️ *జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. రైతుల పంట పొలాలను, ఎరువులు,పురుగు మందుల విక్రయ కేంద్రాలను పరిశీలించ నుండడంతో… సంబంధిత ప్రాంతాల ఎంపిక కోసం పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె మండలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.* *️⃣ *ముందుగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కోసం పెండ్లిమర్రి మండల పరిధిలోని చిన్నదాసరి పల్లె పంట పొలాలు, వెల్లటూరు లోని మానస ఫర్టిలైజర్, సీడ్స్, ఫెస్టిసైడ్ సెంటర్ ను, హెలిప్యాడ్ ఏర్పాటుకు వెల్లటూరు లోని పీఎం జెడ్పి హైస్కూల్ ప్రాంగణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్* . *️⃣ *రైతులతో ముఖాముఖి నిర్వహించే రచ్చబండ కార్యక్రమం నిర్వహణ కోసం.. పెండ్లిమర్రి మండల కేంద్రంలో ఒక ప్రదేశాన్ని, చిన్న దాసరి పల్లి మరో ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.* ✳️* *ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వారి తోపాటు అధిక సంఖ్య లో రైతులు వచ్చే అవకాశం ఉండడం తో.. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, సీఎంవో భద్రతా అధికారులతో చర్చించిన జిల్లా కలెక్టర్.* *️⃣ *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్న.. సీఎంఓ భద్రతాధికారి కృష్ణారావు, కడప, జమ్మలమడుగు,బద్వేలు,పులివెందుల ఆర్డీఓ లు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్ర మోహన్, చిన్నయ్య,వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్,ఉద్యాన శాఖ జిల్లా అధికారి సతీష్ కుమార్, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆదిశేషారెడ్డి, రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్ తదితర జిల్లా అధికారులు, నాయకులు పుత్తా నరసింహా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు*

కడప

పుట్టా సుధాకర్‌ను బెదిరించిన ఏడుగురు అరెస్టు.*

కడప జిల్లా… *డిజిటల్‌ అరెస్టు పేరిట మైదుకూరు ఎమ్మెల్యేని పుట్టా సుధాకర్‌ను బెదిరించిన ఏడుగురు అరెస్టు.* *ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు.* *ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.* *నిందితుల్లో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంకు మేనేజర్‌.*

అల్లూరి సీతారామరాజు

రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు : సియ్యారి దొన్నుదొర

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక విధానాలతోనే రాష్ట్రంలో భారీగా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతం పై దొన్నుదొర సోమవారం అరకులోయలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సు లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో జరిగిన 613 ఒప్పందాలతో 16 లక్షల మంది యువతకు ఉపాది పొందే అవకాశం ఉంటుందని అన్నారు

అల్లూరి సీతారామరాజు

ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గం : అరకు ఎమ్మెల్యే

హిందూపురం వైసీపీ ఆఫీసు మీద దాడి చేయడం ఖండిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించే విధంగా చేసుకున్నది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేస్తున్న ప్రజా ఉద్యమానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక దాడులు చేయడం దుర్మార్గమైన పని అని ఎమ్మెల్యే అన్నారు.

అల్లూరి సీతారామరాజు

ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

అల్లూరి సీతారామరాజు

హుకుంపేట: కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి

హుకుంపేట మండలం, జి. బొడ్డపుట్టు జీటీడబ్ల్యూ ఆశ్రమ (బాలికలు) పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంధర్బంగా పదవ తరగతి విద్యార్ధినిల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. చదువు ను కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని అన్నారు. వసతులు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని మోను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధి దశ నుండే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో భక్తి పరవశంగా, వైభవంగా నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగముల దివ్య దర్శనం కార్యక్రమం విశేషంగా జరిగింది. గ్రామంలోని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమాగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జ్యోతిర్లింగాల దర్శనం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారుఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, నైతికత, సానుకూలత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. “భగవంతుని సన్నిధిలో జరిగే ఈ దివ్య దర్శనం మనసుకు శాంతినివ్వడమే కాక, జీవన విధానంలో జ్ఞానాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇస్తుంది” అని అన్నారు. ప్రజలు ఆధ్యాత్మికతను జీవితంలో భాగంగా చేసుకుంటే సమాజం మరింత సుస్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల నడుమ శివభక్తి నినాదాలు మార్మోగగా, జరిగిన వేడుకలు ప్రాంతమంతా ఉత్సాహాన్ని నింపాయి.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు సోమవారం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పుస్తక పఠనం పోటీలు నిర్వహించారు. గ్రంధాలయం ఆవశ్యకతను ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ వివరించారు. జ్ఞాన సముపార్జనకు తరచుగా కళాశాల గ్రంధాలయంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలు చదవాలని లైబ్రరియన్ కామేశ్వర రావు సూచించారు. కళాశాల గ్రంధాలయం లో ఉన్న పుస్తకాలను ప్రదర్శించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:17 అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ గ్రామంలో సుమారుగా 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు సోమవారం తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ దొన్నుదొర తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపిటిసి కొర్ర పోలన్న ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన వారిలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్ని మధు, జన్ని అఖిల్, జన్ని రామచంద్ర, జన్ని అప్పారావు, వంతల సద్దు, జన్ని బొండన్న, వంతల కొండబాబు, జన్ని అంకులు, జన్ని సత్తిబాబు, కొర్ర అప్పారావు, జన్ని సోయితీ, జన్ని సుబ్బారావు, కిల్లో పవన్, జన్ని బుద్దు, జన్ని సీతారాం, వంతల కన్నయ్య, వంతల శివ, వంతల బద్దు (పెస), వంతల దొంబు, జన్ని సీతారాం, జన్ని సోమీ, మామిడి నీలమ్మ, జన్ని అంజీలు, కొర్ర సావిత్రి, కొర్ర కొండమ్మ, శిరీష, కొర్ర కల, వంతల రాధిక, జన్ని పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ.. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజానికి ఉపయోగకరమన్నారు. అటువంటి వ్యక్తి కొర్ర రత్నమ్మ అని తను బిఏ బీఈడీ చదువుకుని తమ గ్రామ అభివృద్ధి కోసం తపించిన మహిళ అన్నారు. ఆమె పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి ఎప్పుడూ కూడా గౌరవం ఉంటుందన్నారు. కాస్త ఓపిక పట్టి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. తానే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజల ఆదరించారని కానీ సిరగం పంచాయతీలో ఎక్కువమంది తాను గెలవాలని తపించి ఎలక్షన్ నిర్వహించిన వారిలో ఉండటం విశేషం అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందని అనేందుకు ఈ సమావేశమే సాక్ష్యం అన్నారు. వారిలో ఇంకా రాజకీయ సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల కోసం చేపట్టిన నూతన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు కిల్లో ఆనందరావు, కోపరేట్ బ్యాంక్ చైర్మన్ పెట్టెలి రాము, టిడిపి మండల మాజీ అధ్యక్షులు శెట్టి బాబురావు, టిడిపి సీనియర్ నాయకుడు వై సర్పంచ్ పాడి చందు నిర్మల, వంతల వెంకట్రావు, కూన నాగరాజు, సిరిగం పంచాయతీ టిడిపి అధ్యక్షుడు పూజారి మాణిక్యం, ఉప సర్పంచ్ పాంగి మిన్ను, బిజెపి నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.