Friday, 20 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి

సమస్యలు పరిష్కరిస్తు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.

విశాఖపట్నం

మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను ఖండించిన పౌర ప్రజా సంఘాలు విశాఖపట్నంలో పత్రికా సమావేశం

పోలీసులు ప్రకటించిన “హిడ్మా, రాజేలా సహా మావోయిస్టుల ఎన్‌కౌంటర్ మరణాలు” అలాగే “50 మంది అరెస్టులు” అనే వివరాలను పూర్తిగా ఖండిస్తూ పౌర, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి. సత్యనారాయణమూర్తి, పౌర ప్రజా సంఘాల వేదిక సమన్వయకర్త చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నేత విష్ణువర్ధనరావు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు నిర్మల, రామకృష్ణ, రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి చెందిన న్యాయవాది కె. పద్మ, ఐఎఫ్టియు నాయకుడు తిరుపతిరావు, న్యాయవాది అన్నపూర్ణ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ఎం ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెయ్యల నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ప్రకటనలో వైరుధ్యాలు జె.వి. సత్యనారాయణమూర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ “పోలీసుల కథనం పూర్తిగా అస్పష్టంగా ఉంది. మూడు రోజుల క్రితం ‘ఏలూరు సమీపంలోని గ్రీన్‌సిటీలో 15 రోజుల నుంచి మావోయిస్టులు ఉంటున్నారని సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశాం’ అని అధికారిక సమాచారం విడుదలైంది. కానీ అదే సమయంలో ‘నిన్న ఆరుగురు, ఇవాళ ఏడుగురిని ఎన్‌కౌంటర్ చేశాం’ అని మరో ప్రకటన ఇచ్చారు. ఇవి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు” అని చెప్పారు. “అరెస్టు చేసిన వారిలో కొందరిని ఎంచుకుని కల్పిత ఎన్‌కౌంటర్ పేరిట చంపేసారనే అనుమానం బలపడుతోంది” అని అన్నారు. కార్పొరేట్ల లాభాల కోసం మావోయిస్టులపై దాడులు ఆరోపణలు సభలోని పలువురు నేతలు మాట్లాడుతూ కార్పొరేట్ల చేతుల్లో దేశపు సహజ వనరులను కేటాయించడానికి మార్గం సుగమం చేయడానికి బిజెపి ప్రభుత్వం మావోయిస్టులపై ఆపరేషన్లను వేగవంతం చేస్తోందని కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విధానం ఆ దిశగానే సాగుతోందని తీవ్రంగా విమర్శించారు. పత్రికా సమావేశం డిమాండ్లు సమావేశం ప్రభుత్వం, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలుగా ఈ డిమాండ్లను ప్రకటించింది: 1. అరెస్టు చేసిన వారిని చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి 2. ఎన్‌కౌంటర్ పేరిట చంపిన ఘటనలను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయపరమైన విచారణ జరపాలి 3. పోలీసుల పాత్ర, సమాచారం, సంఘటనలపై జరిగిన “వైరుధ్యాలను” బహిర్గతం చేయాలి

విశాఖపట్నం

ఇందిరమ్మ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం

మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గాంధీ 108 వ జయంతి సందర్బంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి సీతమ్మదారలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ దేశ ప్రధానిగా ఉన్నపుడు తమిళనాడు,ఒడిస్సా పోటీ పడిన ఆ అవకాశం విశాఖకు వచ్చింది, వేల మంది రైతులు 22 వేల ఎకరాలు భూములు రైతులు ఇవ్వగ, స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి శాసనసభ్యుడు అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారు,పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు, స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి ఉత్తరాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసారు, చివరికి ఇందిరమ్మ విశాఖకు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. విశాఖ ఉక్కు తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్, నిలబట్టుకోవాల్సిన బాధ్యత కూడ కాంగ్రెస్ దే, ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ని తెల్ల ఏనుగుతో పోల్చడం బాధాకరం, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించడం, ప్రతిపక్షాలు సీఎం మాటలను వక్రీకరిస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక అన్నారు. ప్రపంచంలో స్టీల్ వినియోగం పెరిగిందని, చైనా స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని,తరువాత స్థానంలో భారత్ ఉందని, దేశంలో సొంత ఘనులు ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సైల్, దాంట్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని లాభాలలోకి తీసుకువచ్చి పూర్తి స్థాయి కెపాసిటీతో నడిపితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చాలా వేగంగా చేరుకోవచ్చని, దశాబ్దాలుగా కార్మికుల కష్టంతో, నిర్వాసితుల త్యాగంతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బంగారు బాతులాంటి పరిశ్రమను అధాని జేబు నింపుకోవడానికి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్కు మహిళ ఇందిరమ్మ, అమృతరావు ఆనాటి కాంగ్రెస్ నాయకుల స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం తలవంచే వరకు వివిధ మార్గాలలో ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటం కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానియమని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సైల్ లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేలా నేను కృషి చేస్తానని ప్రియాంక అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఫర్వీన్ ఖాన్, జగన్ మురారి, వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, గుర్రం కనకరాజు, వేమూరి సురేష్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామారెడ్డి

రామారెడ్డిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

– ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కార్యక్రమం కామారెడ్డి, 19 నవంబర్, పున్నమి ప్రతినిధి : ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహ న్ రావు ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా,రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి అనారోగ్య సహాయనిధి) చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా జరిగిందని తెలిపారు.ఈ కార్యక్ర మాన్ని రామారెడ్డి మండల అధ్యక్షులు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు వేదిక ప్రాంగణంలో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుం డి ఎంపికైన లబ్ధిదారులకు మొత్తం 3 లక్షల రూపా యల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.లబ్ధిదారులు తమ అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అందించినందుకు ఆనందం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సహాయం అందజేస్తు న్న విధానం ప్రశంస నీయం అని వారు అభిప్రాయప డ్డారు.మండల అధ్యక్షులు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను గుర్తించి ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న సహాయ నిధులు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే మార్గదర్శకత్వం కీలకమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

*ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి ఉపాధ్యాయ లోకానికి విముక్తి లభింపచేయాలని రికాగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ప్రభుత్వానికి డిమాండ్

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ డిమాండ్* *(పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/11/2025)* *టీచర్లకు టెట్ తిప్పలు* *లాంగ్వేజెస్, ఇంగ్లిష్, బయోలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు* *వాళ్లకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు* *సబ్జెక్ట్ పరంగా టెట్ పెట్టాలని డిమాండ్* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షులు డిమాండ్* *రెండేండ్లలోపే క్వాలిఫై కావాల్సినోళ్లు 45 వేల మంది టీచర్లు* *పిల్లలకు పరీక్షలు పెట్టే టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ టీచర్లకూ సర్కారు ఎగ్జామ్ పెట్టబోతున్నది. పిల్లలు ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండగా, సర్కారు పెట్టే పరీక్ష రెండేండ్లలోపు పాస్ గాకపోతే వారంతా ఇంటిదారి పట్టాల్సిందే. అయితే, అభ్యర్థుల వరకూ రాసేందుకు సిద్ధంగా ఉన్నా, ఇన్ సర్వీస్ టీచర్లలో మాత్రం ఆందోళన మొదలైంది.దీనికి ప్రధాన కారణం.. ఎగ్జామ్ సిలబస్ లో వారికి సంబంధం లేని సబ్జెక్టులు ఉండటమే. 15-20 ఏండ్ల కిందే వదిలేసిన సబ్జెక్టుల్లోంచి పరీక్షల్లో ప్రశ్నలు వస్తే పరీక్ష ఎలా రాయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రస్తుతం 1.11 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2012 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రిటైర్మెంట్ కు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్ ను కొనసాగించాలంటే, ఉత్త ర్వుల తేదీ నుంచి రెండేండ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందే. మరోపక్క ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. అయితే, 2012 తర్వాత జరిగిన అన్ని టీచర్ రిక్రూట్ మెంట్లలో టెట్ క్వాలిఫై అయిన వారే టీచర్లు వచ్చారు. కానీ, అంతకు ముందే రిక్రూట్ అయిన టీచర్లకు మాత్రం టెట్ గండం మొదలైంది. సర్వీస్ లో కొనసాగాలంటే రెండేండ్లలోపు తప్పనిసరిగా 45,742 మంది టీచర్లు, ప్రమోషన్లు పొందాలంటే 60,094 మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. టెట్ కు రెండు రోజుల నుంచి దరఖా స్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్ సర్వీస్ టీచర్లలో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పేపర్ 1కు. స్కూల్ అసిసెంట్లు, లాంగ్వేజీ పండిట్లు, హెడ్మాస్టర్లు పేపర్ 2 ఎగ్జామ్ కు అటెండ్ కావాల్సి ఉంది.* *టెట్ లో సంబంధం లేని సబ్జెక్టులు* *పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు 150 క్వశ్చన్లతో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 పేపర్లలో తెలుగు, ఇంగ్లిష్, చైల్డ్ డెవలప్ మెంట్ అండ్ పెడగొజీ (సైకాలజీ) ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున 90 మార్కులు అందరికీ కామన్ గా ఉంటాయి. పేపర్ 1లో మ్యాధ్స్ కు 30 మార్కులు, ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ కు మరో 30 మార్కులున్నాయి. పేపర్ 2లో సోషల్ స్టడీస్ టీచర్లకు హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్. ఎకనామిక్స్. పెడగోజి తదితర వాటి నుంచే 60 మార్కులు రానున్నాయి. ఎస్ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, బయోలజీ టీచర్లకు 30 మార్కులు మ్యాథ్స్, సైన్స్ 30 మార్కులు ఉండ నున్నాయి. సైన్స్ లోనూ ఫిజిక్స్ లో 12 మార్కులు, బయోలజీ 12 మార్కులు, సైన్స్ పెడగోజీ నుంచి 6 మార్కులు రానున్నాయి.* . డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఇతర సబ్జె క్టుల్లో టీచర్లకు వచ్చిన వారి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. వారంతా 30 మార్కులే ఆయా సబ్జెక్టుల కు సంబంధించిన క్వశ్చన్లు రానున్నాయి. వీరంతా మ్యాథ్స్ 30 మార్కులు ఎలా చేయగలమని ప్రశ్ని స్తున్నారు. ఉదాహరణకు ఇంగ్లిష్ టీచర్లు మ్యాథ్స్, బయోలజీ, ఫిజిక్స్, తెలుగు సబ్జెక్టుల పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.* *టీచర్లకు వారి సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలి* *విద్యాహక్కు చట్టం నిబంధనల్లో టెట్ అంశాన్ని 2010లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం.. 2010 నుంచి ప్రమోషన్ కోసం ఇన్ సర్వీస్ టీచర్లకు వారు బోధిస్తున్న సబ్జెక్టుల పరంగా మాత్రమే పరీక్ష ఉండాలి. 2010 కన్నా ముందున్న వారికి అంటే.. 1995 నుంచి చట్టం అమల్లోకి రాకంటే ముందున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రమోషన్ కోసం వారి సంబంధిత సబ్జెక్టులో మాత్రమే టెట్ ఉండాలని కోరుతున్నాం.* ?దయచేసి ప్రభుత్వం ఆలోచించి, ఇన్ సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా టెట్ పెట్టాలి.

ఉక్కు మహిళకు ఘన నివాళి

– రామారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి సంబురాలు కామారెడ్డి, 19 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : దేశ ఐక్యత, పేదల అభ్యుదయానికి జీవితాన్ని అర్పించిన ఉక్కు మహిళ, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవర ణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు,కార్య కర్తలు, అభిమా నులు పాల్గొని ఆమె చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ఇం దిరా గాంధీ రాజకీ య దూరదృష్టి,కఠిన నిర్ణయా లు, బలమైన నాయకత్వం దేశపరంగా అమూల్య మని అన్నారు. పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా తీ సుకుని అనేక ఆర్థిక, సామాజిక సంస్కరణలు చే పట్టిన తీరు నేటికీ ఆదర్శమని గుర్తుచేశారు. ఇంది రమ్మ చూపిన మార్గంలో ప్రజాసేవకు అంకితం కా వాలని కాంగ్రెస్ కార్యకర్తలు తీర్మానించారు.ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువకులు,మహిళా కాంగ్రెస్ నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మా భాష మీద..మీ పెత్తనమేంటి..?

మాతృభాష రక్షణ కోసం సాగుతున్న “టిట్టిభ సత్యాగ్రహం” 10వ రోజుకు చేరుకొంది. తెలుగుదండు పిలుపు మేరకు.. పలువురు కవులు, కళాకారులు, భాషాభిమానులు దీక్షలో పాల్గొని “మాతృభాషా ప్రతిజ్ఞ” చేశారు. పది రోజులుగా.. దీక్షా నియమాలు పాటిస్తున్న తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. మన మాతృభాష మీద, ఈ దేశవాళీ పాలకుల పెత్తనమేంటి ? ప్రవేటు పాఠశాలల సంక్షేమం కోసం ఇంకెంత కాలం.. తెలుగు భాషను, తెలుగు జాతిని పణంగా పెడతారు ? ఈ దిక్కుమాలిన పాలకుల కుళ్లు రాజకీయాలకు అంతం లేదా ? అంటూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం దీక్షా వేదికకు మద్దతుగా..విశాఖ గాయనీ గాయకుల సంఘ సభ్యులు విచ్చేసి తెలుగు పాట‌లతో ‘తెలుగుతల్లి’కి నీరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో.. తిరుపతి రాజమన్నార్, డా.కొచ్చెర్లకోట, ఆచార్య సూరప్పడు, అడపా రామకృష్ణ, చేబియ్యం రవిమోహన్,ఏలూరి లక్ష్మీ, బాదం మణికుమారి, అల్లు వెంకట రమణ,విశాఖ గాయనీ గాయకుల సాంస్కృతిక సంఘ సభ్యులు.. బయ్యా శ్రీనివాసరావు, భూపతిరావు,ఎం.వి.ఆర్.నాగేశ్వరరావు, ఫణిస్వామి,కృష్ణంరాజు..తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పదవీ విరమణ చేసిన హోంగార్డు కైసర్ల కృష్ణారావుకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కైసర్ల కృష్ణారావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఉమ్మడి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించగా, ఆ నిధితో కూడిన రూ.4,03,670/- విలువైన చెక్కును జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో కైసర్ల కృష్ణారావుకి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ కైసర్ల కృష్ణారావు సేవలను ప్రశంసిస్తూ, “విధి నిర్వహణలో ఆయన నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయత అత్యంత శ్లాఘనీయాలు” అని పేర్కొన్నారు. అలాగే హోంగార్డుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహోద్యోగులకు ఆర్థిక సహాయం అందించే హోంగార్డుల స్ఫూర్తి అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి సి.హెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.