Thursday, 19 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పల్లంకురు వాసి కి శైవాగమ పండితుడు అభినందనలు

కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి తాతగారు ఊరు అయినా కుండలేశ్వరం సుబ్రహ్మణ్య కళ్యాణాలు చేయించడానికి బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో మాగం టర్మింగులో కల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదురుగా గతుకులుగా ఉండడంవల్ల నా జేబులో నుండి నా మొబైల్ పడిపోయింది ఈ విషయాన్ని ఇంచుమించు పది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత జేబులో మొబైల్ లేకపోవడం వల్ల అనుమానం వచ్చి ఎక్కడైతే పడిపోయిందన్న అనుమానం వచ్చింది అక్కడికి వెనక్కి మాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వచ్చి అక్కడ నిర్వాహకుల యొక్క వారి ఫోన్ నుంచి నా మొబైల్ కి నేను ఫోన్ చేయడం వెంటనే ఆ ఫోను దొరికిన వ్యక్తి మార్గమధ్యంలో అతనికి దొరికింది అని అతను ఫోన్లో స్పందించిన తీరు చాలా మానవతా దృక్పథం సేవాగుణం తో వారు కాట్రేనికోన మెడికల్ షాప్ దగ్గర కుండలేశ్వరం మా కజిన్ ఆయన డాక్టర్ కామేశ్వరరావు గారి కి నా నా మొబైల్ బాధ్యతగా అందివ్వడం వారి రూపంలో మరోసారి కాట్రేనికోన మండలంలో మంచితనం వెల్లు విరిసింది ఇంతకీ నా మొబైల్ నాకు అందించిన వ్యక్తి పల్లంకురు కి చెందిన విత్తనాల సుధీర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు మరియూ ప్రత్యేక కృతజ్ఞతలు… ఇట్లు పోగొట్టుకుని స్వాధీన పరుచుకున్న మొబైల్ యజమాని కాళ్లకూరి సూరిపండు భట్టి విక్రమార్క ఆలయ అర్చకులు ఆలమూరు కోనసీమ జిల్లా…

అల్లూరి సీతారామరాజు

పాడేరు: హార్డ్ కోర్ ఏరియాలో నియామకాలు, పదోన్నతులు గిరిజనులకే

ప్రభుత్వ ఉత్తర్వులు 68 ప్రకారం హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, డిఎం & హెచ్ఓ కు వినతి ఇచ్చారు. హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో పని చేస్తున్న గిరిజనులకు మాత్రమే పదోన్నతి కనిపించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జానకమ్మ కోరారు.

కామారెడ్డి

ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు ఘనంగా – రామారెడ్డిలో రంగుల హరివిల్లు

కామారెడ్డి, 24 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : మహిళా శక్తికి ప్రతీకగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు రామారెడ్డి మండల కేంద్రంలో ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ వేడుక ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.గౌరవ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి శ్రీ మదన్ మోహన్ ఆదేశాల మేరకు, స్థానిక అధికారులు, గ్రామ మహిళా సంఘాల సభ్యులు, మండల కాంగ్రెస్ నేతలు, యూత్ నాయకులు సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభా ప్రాంగ ణం కళాత్మక పందిరులతో, పూల సింగారాలతో ముస్తాబై, ఆనందఝరులు వెల్లువెత్తాయి. మహి ళలకు చీరలను అందజేస్తూ పార్టీ నాయకులు సామాజిక సమానత్వం, మహిళా సాధికారత గురించి ప్రస్తావించారు. వేడుకలో పాల్గొన్న మహిళలు చిరునవ్వులతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చల్లని గాలిలో ఉత్సాహంతో చిందులేసిన ఆ క్షణాలు రామారెడ్డి ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు లేగల ప్రసాద్, మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు అంజవ్వ, సెక్రెటరీ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ మహీళలు, తదితరులు పాల్గొన్నారు

జనగాం

రిటైర్ ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:

రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బకాయి లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:ఎస్జిపిఎటి —————————————- జనగామ,నవంబర్24,పున్నమి న్యూస్: గత మార్చి 2024 నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగ పెన్షనర్లకు న్యాయంగా రావలసిన పెన్షనరీ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించబడలేదు. వెంటనే బకాయిలు చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ ( ఎస్ జి పి ఎ టి) పక్షాన 27-10-2025 రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వందలాది పెన్షనర్లతో ధర్నా/ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు పంపడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. పెన్షనర్స్ జె ఏ సి ఆధ్వర్యంలో 17-11-2025 నాడు వేలాది పెన్షనర్స్ తో హైదరాబాద్ ఇందిరాపార్క్,ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించినా ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేక పోవడాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 19 నెలలుగా నేటి వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయ,ఉద్యోగులకు వారికి సంబంధించి రావలసిన పెన్షనరీ బకాయిలు నేటివరకు జమచేయకపోవడం వలన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షనర్లు అశువులు బాసారు,ఇంకో 16 మంది పెన్షనర్లు అనారోగ్య కారణాలతో వివిధ హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ,మా తెలంగాణ రాష్ట్రం వస్తే ,మా బతుకులు మారిపోతాయి అని జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నవారే . ఇటీవల రిటైర్ అయిన పెన్షనర్ ల పరిస్థితులు చూసి చలించి ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ బక్క జడ్సన్ గత రెండు నెలలుగా అనేక వీడియో లు చేస్తూ, మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ , హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న పెన్షనర్స్ తో మాట్లాడుతూ, మా సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకు పోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.వారు ఈ రోజు పెన్షనర్లకు మద్దతుగా వారి బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేయడానికి రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు రాజ్ భవన్ వద్దకు వెళ్ళిన క్రమంలో , శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీ బక్క జడ్సన్ ను పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేయడం నీచమైన చర్య అని, పోలీస్ ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీ బక్క జడ్సన్ ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర శాఖ పక్షాన ఎ.రాజేంద్ర బాబు,అధ్యక్షులు ఎం వి నర్సింగరావు,ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామ మనోహర్,అదనపు ప్రధాన కార్యదర్శి బి నర్సయ్య,ఆర్థిక కార్యదర్శి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఎ టి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఎన్ టి ఆర్ జిల్లా

చందర్లపాడు: కోనాయపాలెం వద్ద స్కూల్ బస్సు కాలువలో పడిన ఘటనలో విద్యార్థులు సురక్షితం

చందర్లపాడు మండలం, కోనాయపాలెం ప్రాంతంలో నందిగామ నుంచి కొనయపాలెం వైపు నారాయణ ఆంగ్లవేది స్కూల్ బస్సు సడలడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి పడింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు ముందు భాగం పైకి ఎగిరింది, కానీ అదృష్టవశాత్తు విద్యార్థులు కింద పడలేదు. బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే పరుగెత్తి వారిని కిందకు దింపి రక్షించారు. స్థానికులు, వాహనదారులు ఆర్ & బి (Roads & Buildings) అధికారులు రోడ్డుమరమ్మత్తులు చేయకపోవడం, రోడ్డు మార్జిన్ కోసం మట్టి లేకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. వాహనదారుల ప్రకారం, రోడ్డు పరిస్థితి మిగతా వాహనాల కోసం కూడా ప్రమాదం కలిగిస్తున్నదని వారు హెచ్చరించారు.

విశాఖపట్నం

అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్న 90వ వార్డు – సమస్యలకు చోటు లేకుండా త్వరితగతిన పరిష్కారాలు

విశాఖపట్నం, సోమవారం: 90వ వార్డు అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా స్థానిక కార్పొరేటర్ బొమ్మిడి రమణ స్వయంగా రంగంలోకి దిగారు. లక్ష్మీనగర్ “ఎఫ్” బ్లాక్‌లో జరుగుతున్న రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ఆయన సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో శంకుస్థాపన చేసిన 37 లక్షలు మరియు 17 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మింపబడుతున్న రిటైనింగ్ వాల్ పనుల పురోగతిని పబ్లిక్ వర్క్స్ అధికారులతో కలిసి సమీక్షించారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, పని వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలనే దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు లేకుండా అన్ని కాలువలను బలపర్చడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. “ప్రజల నమ్మకానికి అనుగుణంగా 90వ వార్డును శుభ్రంగా, శ్రేయస్సుతో నిండిన వార్డుగా మార్చేందుకు ప్రతి రోజూ కృషి చేస్తున్నాం” అని రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు కరిమిజ్జి జ్యోతి, గాడు వెంకటలక్ష్మి, పోతల సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కూడా现场కి వచ్చి జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. 90వ వార్డులో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుండడంతో, ప్రజలకు సమస్యలకు ఆస్కారం లేకుండా పరిష్కారాలు వెంటనే లభిస్తున్నాయి.

హైదరాబాద్

కబడ్డీ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా జట్టుకు అభినందనలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పున్నమి ప్రతి నిధి కబడ్డీ వరల్డ్ కప్‌ను గెలుచుకుని దేశ గర్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన భారత మహిళా కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వారి ధైర్యం, పట్టుదల, శక్తి, జట్టు స్పూర్తి మరోసారి తిరంగాను ఎగురవేశాయన్నారు ఈ విజయం గొప్ప కలలు కనే ప్రతి బాలికకు, ఆమె ప్రయాణాన్ని పదునుగా నిలబెట్టే ప్రతి కుటుంబానికి చెందింది. భారత క్రీడారంగానికి ఇది ఒక చారిత్రక క్షణం అని సంజయ్ కూమర్ అన్నారు

నాగర్‌కర్నూల్

రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్.

*రెండు, మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్… కొడంగల్‌లో సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్* పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో వస్తుందని సీఎం రేవంత్ కొడంగల్ లో ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అభివృద్ధికి అడ్డుపడేవారిని ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కోడంగల్లోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ కిచెన్ బిల్డింగ్ కోసం రేవంత్ భూమిపూజ చేశారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తర్వాత బహిరంగసభలో పాల్గొన్నారు. *కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తాం* అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తామని.. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంని.. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. అదానీ అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించామని గుర్తు చేశారు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం .మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు. *ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు* అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నామని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం . బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోందని భరోసా ఇచ్చారు. *ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్* ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. *ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు* అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది ..రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజా సమస్య పరిష్కార వేదికలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసిపి ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చే మరల క్యాన్సిల్ చేయడం జరిగింది పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతు అప్పుల పాలవుతున్నారు కనుక మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర గడుస్తున్నా ఇంకా పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఇవ్వలేదు కాబట్టి సామాన్య ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రభుత్వం తరఫున ఇప్పించి పేద ప్రజలను ఆదుకుంటారని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు అయ్యల భాస్కరరావు ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు సీనియర్ నాయకులు అరిగెల నాని ఎస్ సి మోర్చా నాయకులు దాకే వెంకటరావు పావులూరి వెంకట్ మన్నే రామదాసు అల్లవరం మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి మండల ఉపాధ్యక్షులు కట్ట జనార్ధన్ జనం న్యూస్ నవంబర్ 24 అమలాపురం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసిపి ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చే మరల క్యాన్సిల్ చేయడం జరిగింది పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతు అప్పుల పాలవుతున్నారు కనుక మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర గడుస్తున్నా ఇంకా పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఇవ్వలేదు కాబట్టి సామాన్య ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రభుత్వం తరఫున ఇప్పించి పేద ప్రజలను ఆదుకుంటారని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు అయ్యల భాస్కరరావు ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు సీనియర్ నాయకులు అరిగెల నాని ఎస్ సి మోర్చా నాయకులు దాకే వెంకటరావు పావులూరి వెంకట్ మన్నే రామదాసు అల్లవరం మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి మండల ఉపాధ్యక్షులు కట్ట జనార్ధన్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్& లేబర్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్ & లేబర్ చైర్మన్ నియమితులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన సందర్భముగా కాకినాడలో వారి నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు, జిల్లా సోషల్ మీడియా కన్వినర్ గౌతు చిన్న, బీజేపీ సీనియర్ నాయుకులు సింగిల్దేవి సత్తిరాజు, దిలీప్ కుమార్ సాధానని, శుభాకాంక్షలు తెలియజేయడమైనది

ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్& లేబర్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్ & లేబర్ చైర్మన్ నియమితులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన సందర్భముగా కాకినాడలో వారి నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు, జిల్లా సోషల్ మీడియా కన్వినర్ గౌతు చిన్న, బీజేపీ సీనియర్ నాయుకులు సింగిల్దేవి సత్తిరాజు, దిలీప్ కుమార్ సాధానని, శుభాకాంక్షలు తెలియజేయడమైనది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.